భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ తరుణంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని చాలా ఆసక్తి కనపరుస్తారు. అలాంటి వారికోసం ఈ కథనంలో ఈ వారంలో మార్కెట్లో అడుగుపెట్టిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
హోండా సీబీ300ఎఫ్ (Honda CB300F)
హోండా మోటార్‌సైకిల్ ఇండియా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అప్డేటెడ్ 'సీబీ300ఎఫ్' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి.
ఈ బైక్ 293 సీసీ ఆయిల్-కూల్డ్ SOHC ఇంజన్ కలిగి 24 హార్స్ పవర్ అండ్ 25.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 14.1 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 7.94 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది.
కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ (Kawasaki Ninja ZX-4R)
ఇప్పటికే మార్కెట్లో మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతున్న కవాసకి ఇప్పుడు ఎట్టకేలకు 'నింజా జెడ్ఎక్స్-4ఆర్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ధర ఎక్కువైనా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ 399 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 14,500 ఆర్‌పీఎమ్ వద్ద 76 బీహెచ్‌పీ పవర్ & 13,000 ఆర్‌పీఎమ్ వద్ద 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
ఇదీ చదవండి: మహిళలకు శుభవార్త! గ్యాస్ స్టవ్‌తో పాటు ఫ్రీ సిలిండర్ పొందండిలా..
న్యూ కేటిఎమ్ 390 డ్యూక్ (New KTM 390 Duke)
యువ రైడర్లకు ఎంతగానో ఇష్టమైన కేటిఎమ్ ఇప్పుడు మరో కొత్త బైక్ రూపంలో (న్యూ కేటిఎమ్ 390 డ్యూక్) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ ధర రూ. 3,10,520 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కావున ఇందులో 399 సీసీ ఉంటుంది. ఇది 45 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment