KTM
-
కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు
న్యూఢిల్లీ: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న ఆస్ట్రియన్ కంపెనీ కేటీఎం పూర్తి స్థాయిలో ఉత్పత్తులను అందించడం ద్వారా భారత్‌లో తన మార్కెట్ ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. నాలుగు విభాగాల్లో అంతర్జాతీయంగా లభించే 10 కొత్త బైక్స్‌ను భారత మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.4.75 లక్షలతో మొదలై రూ.22.96 లక్షల వరకు ఉంది.‘అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా కేటీఎం అమ్మకాలను పెంచుకోగలిగింది. ప్రత్యేకించి బజాజ్ ఆటోతో భాగస్వామ్యం తర్వాత ఎగుమతులు అధికం అయ్యాయి. మహారాష్ట్ర చకన్లోని బజాజ్ ప్లాంటులో తయారైన బైక్స్‌ను 120కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ఏడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3.7 లక్షల మోటార్‌సైకిళ్లను విక్రయించింది’ అని కేటీఎం–స్పోర్ట్మోటార్సైకిల్ జీఎంబీహెచ్ ఆసియా, పసిఫిక్, మిడిల్–ఈస్ట్, ఆఫ్రికా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ పెర్బెర్స్లాగర్ తెలిపారు.ఇదీ చదవండి: మూడు ‘హీరో’ బైక్‌లు లాంచ్‌కు రెడీఅమ్మకాలలో భారత్ వాటా 40 శాతమని, ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ పూర్తి ఉత్పత్తి శ్రేణిని దేశీయంగా అందించలేదని వివరించారు. చకన్ ప్లాంటు నుంచి 500 సీసీలోపు సామర్థ్యంగల 12 లక్షల యూనిట్ల కేటీఎం బైక్‌లు ఎగుమతి అయ్యాయి.కొత్త బైక్‌లు ఇవే..అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్ (రూ. 22.74 లక్షలు), 890 అడ్వెంచర్ ఆర్ (రూ. 15.80 లక్షలు), ఎండ్యూరో మోటార్‌సైకిల్ శ్రేణిలో 350 EXC-F (రూ. 12.96 లక్షలు), మోటోక్రాస్ విభాగంలో 450 SX-F (రూ. 10.25 లక్షలు), 250 SX-F (రూ. 9.58 లక్షలు), 85 SX (రూ. 6.69 లక్షలు), 65 SX (రూ. 5.47 లక్షలు), 50 SX (రూ. 4.75 లక్షలు). -
మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ తరుణంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని చాలా ఆసక్తి కనపరుస్తారు. అలాంటి వారికోసం ఈ కథనంలో ఈ వారంలో మార్కెట్లో అడుగుపెట్టిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హోండా సీబీ300ఎఫ్ (Honda CB300F) హోండా మోటార్‌సైకిల్ ఇండియా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అప్డేటెడ్ 'సీబీ300ఎఫ్' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ 293 సీసీ ఆయిల్-కూల్డ్ SOHC ఇంజన్ కలిగి 24 హార్స్ పవర్ అండ్ 25.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 14.1 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 7.94 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ (Kawasaki Ninja ZX-4R) ఇప్పటికే మార్కెట్లో మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతున్న కవాసకి ఇప్పుడు ఎట్టకేలకు 'నింజా జెడ్ఎక్స్-4ఆర్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ధర ఎక్కువైనా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ 399 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 14,500 ఆర్పీఎమ్ వద్ద 76 బీహెచ్పీ పవర్ & 13,000 ఆర్పీఎమ్ వద్ద 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇదీ చదవండి: మహిళలకు శుభవార్త! గ్యాస్ స్టవ్‌తో పాటు ఫ్రీ సిలిండర్ పొందండిలా.. న్యూ కేటిఎమ్ 390 డ్యూక్ (New KTM 390 Duke) యువ రైడర్లకు ఎంతగానో ఇష్టమైన కేటిఎమ్ ఇప్పుడు మరో కొత్త బైక్ రూపంలో (న్యూ కేటిఎమ్ 390 డ్యూక్) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ ధర రూ. 3,10,520 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కావున ఇందులో 399 సీసీ ఉంటుంది. ఇది 45 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
విడుదలకు సిద్దమవుతున్న కొత్త బైకులు, ఇవే!
Upcoming Bikes: 2023 ఆగష్టు నెల ముగిసింది.. గత నెలలో హీరో కరీజ్మా ఎక్స్ఎమ్ఆర్, టీవీఎస్ ఎక్స్ ఈ-స్కూటర్, హోండా SP160, ఓలా ఎస్1 వంటివి విడుదలయ్యాయి. కాగా ఈ నెలలో మరి కొన్ని విడుదలకావడానికి సన్నద్ధమవుతున్న బైకులు ఏవి? ఎప్పుడు లాంచ్ అవుతాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్స్ ఈ నెలలో అపాచీ ఆర్ఆర్310 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇది కేవలం రీబ్యాడ్జ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ మాత్రమే కాదు.. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉండే అవకాశం ఉండనై ఆశిస్తున్నాము. ఇది 2023 సెప్టెంబర్ 06న విడుదలకానున్నట్లు సమాచారం. 2024 కేటీఎమ్ 390 డ్యూక్.. యువతరానికి ఇష్టమైన కెటిఎమ్ బ్రాండ్ త్వరలో 2024 కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల చేయనుంది. ఈ బైక్ 399 సీసీ ఇంజిన్ కలిగి 44.8 హార్స్ పవర్ & 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము. సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ.. సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ఈ నెలలో తన వీ-స్ట్రోమ్ 800 డీఈ బైక్ లాంచ్ చేయనుంది. ఇది 776 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించనుంది. ఈ కొత్త 800DE ఒక ఆధునిక ఎలక్ట్రానిక్స్ సూట్ అండ్ 21 ఇంచెస్ ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంది. ఈ కొత్త బైకుకి సంబంధించిన ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుదలవుతాయి. -
10 Best KTM Bikes: టాప్ 10 బెస్ట్ కేటీఎమ్ మోటార్ సైకిల్స్
-
కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!
ఆటోమొబైల్ దిగ్గజం కేటీఎం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ర్యాలీలో దూసుకొస్తోంది. త్వరలోనే ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకు రానుంది. బజాజ్ సహకారంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది చివర్లో ఇటలీ మిలాన్‌లో జరగనున్న ఈఐసీఎంఏ షోలో దీన్ని ఆవిష్కరించనుందదని భావిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన టెస్ట్ మ్యూల్‌లో ఎటువంటి బ్రాండింగ్ లేనప్పటికీ, కేటీఎం లివరీతో కూడిన జాకెట్‌తో రైడర్ ఉండటంతో ఈ స్కూటర్‌ను విదేశాలలో పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. (మహీంద్రా థార్ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్? వైరల్ వీడియో) కేటీఎం ఈ-స్కూటర్ సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే కొంచెం పెద్దదిగా ఉండనుంది. విండ్‌స్క్రీన్ కూడా పెద్దగా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లాయ్ వీల్స్, TFT డిస్ప్లే , ట్విన్ ప్రొజెక్టర్ హెడ్లైట్లు, ఎయిర్ డక్ట్, ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ ముఖ్య ఫీచర్లుగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో తేలికపాటి అల్యూమినియం స్వింగార్మ్ , సింగిల్/ డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టెంతో లాచ్కానుందని అంచనా. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) 2025 ప్రారంభంలో లాంచ్ కానున్న ఈ కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బజాజ్ చకాన్ ప్లాంట్‌లో చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ధరలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. -
రైడింగ్‌కి సిద్ధమైపోండి.. మరిన్ని హంగులతో 390 అడ్వెంచర్ వచ్చేసింది!
2023 KTM 390 Adventure Spoke Wheels: కుర్రకారుకు ఎంతో ఇష్టమైన 'కెటిఎమ్ 390 అడ్వెంచర్' KTM 390 Adventure) ఇప్పుడు కొన్ని ఆధునిక హంగులతో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఈ బైక్ ప్రైస్, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'కెటిఎమ్ 390అడ్వెంచర్' ధర రూ. 3.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు మరింత ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వైర్-స్పోక్ రిమ్‌లను కలిగి ఉండటం వల్ల మరింత రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కొత్త మార్పులు.. గతంలో చాలామంది కెటిఎమ్ బైక్ రైడర్లు ఈ వైర్-స్పోక్ రిమ్ ఫీచర్ ఉంటే మరింత గొప్ప రైడింగ్ అనుభూతిని పొందవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల చివరకు కంపెనీ ఆ ఫీచర్ తీసుకువచ్చింది. ఇందులో అల్యూమినియం వైర్-స్పోక్ రిమ్‌లు ఉన్నాయి. ఇవి కూడా ట్యూబ్-టైప్ మెట్జెలర్ టూరెన్స్ టైర్లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్‌లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!) లేటెస్ట్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఇప్పుడు అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా కలిగి ఉంటుంది. అయితే ఫోర్క్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ కోసం మాత్రమే అడ్జస్టబుల్ ఉంటుంది. కానీ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ లేదు. అదే సమయంలో 10 స్టెప్ ఫ్రీలోడ్ & 20 స్టెప్ రీబౌండ్ అడ్జస్ట్ పొందుతుంది. ఈ కొత్త మార్పులు మాతర్మే కాకుండా ఈ బైక్ ఇప్పుడు కొత్త ర్యాలీ ఆరెంజ్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) డిజైన్, ఫీచర్స్ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఇంజిన్ విషయానికి ఇందులో 373 సిసి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 42.9 bhp పవర్, 37 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి -
తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ కావాలా? ఇదిగో ఈ కొత్త బైక్ బెస్ట్ ఆప్షన్!
యువ రైడర్లను ఎంతగానో మెప్పించిన కెటిఎమ్ (KTM) దేశీయ మార్కెట్లో మరో కొత్త చేసింది. 'కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్' (KTM 390 Adventure X) పేరుతో విడుదలైన ఈ బైక్ మునుపటి అడ్వెంచర్ బైక్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ బైక్ ప్రారంభ ధర రూ. 2.8 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్‌తో (రూ. 3.38 లక్షలు) పోలిస్తే దాదాపు యాభై వేలు తక్కువ ధరకే లభిస్తుంది. కావున తక్కువ ధరకు కెటిఎమ్ కావాలనుకునే వారు ఈ లేటెస్ట్ బైక్ ఎంచుకోవచ్చు. డిజైన్ & ఫీచర్స్: నిజానికి కెటిఎమ్ విడుదల చేసిన ఈ కొత్త బైక్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఫీచర్స్ అందుబాటులో లేదు. కానీ ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సెటప్ కలిగి, వెనుక చక్రం వద్ద ABS స్విచ్ ఆఫ్ చేసే సదుపాయం ఉంటుంది. కావున ఇది ఆఫ్-రోడ్లో ప్రయాణించేటప్పుడు బైక్‌ను స్లైడ్ చేయడంలో సహాయపడుతుంది. కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ బైకులో కలర్-TFT డిస్ప్లే ఉంటుందా లేదా LCD డిస్ప్లే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ కొత్త బైక్ కొన్ని ఫీచర్స్ కాకుండా మిగిలిన డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అదే ఎల్ఈడీ లైట్స్, ఇంజిన్ మొదలైనవన్నీ అలాగే ఉన్నాయి. (ఇదీ చదవండి: లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన టీవీఎస్ కొత్త బైక్ - మరిన్ని వివరాలు) ఇంజిన్ & పర్ఫామెన్స్: కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ 373.27 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్తో కూడిన ఫోర్ వాల్వ్ ఇంజిన్ కలిగి 9000 ఆర్‌పిఎమ్ వద్ద 42.9 బీహెచ్‌పి పవర్, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? ట్విటర్ బంపరాఫర్) ప్రత్యర్థులు: కెటిఎమ్ నుంచి విడుదలైన ఈ సరసమైన బైక్ రూ. 3 లక్షల కంటే తక్కువ కావున మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఇది దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకుకి ప్రత్యక్ష ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. -
పవర్ ఫుల్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 బెస్ట్ బైక్స్!
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు నుంచి అత్యంత ఖరీదైన బైకుల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య లభించే టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం. కెటిఎమ్ 390 డ్యూక్: ఎక్కువ మంది యువతకు ఇష్టమైన బైకులలో కెటిఎమ్ 390 డ్యూక్ ఒకటి. దీని ధర రూ. 2.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 2017 నుంచి చిన్న చిన్న అప్డేట్లను పొందుతూనే ఉంది. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ 373సీసీ ఇంజిన్ కలిగి 9000 ఆర్‌పిఎమ్ వద్ద 43.5 పిఎస్ పవర్, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310: ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ టీవీఎస్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్ఆర్ 310 కూడా ఎక్కువమంది ఇష్టపడే బైకుల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 2.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్పోర్ట్‌బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 312.2 సీసీ ఇంజిన్ 33.5 బిహెచ్పి పవర్, 27.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హోండా సిబి300ఆర్: హోండా కంపెనీకి చెందిన సిబి300ఆర్ బైక్ ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో 286 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30.7 బిహెచ్పి పవర్, 27.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా రైడర్ కు సులువైన క్లచ్ ఆపరేటింగ్ కోసం అసిస్ట్ అండ్ స్లిప్లర్ క్లచ్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి. సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్: మన జాబితాలో మూడు లక్షలకంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ఒకటి సుజుకీ వీ స్ట్రోమ్ ఎస్ఎక్స్. దీని ధర రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 249 సీసీ, 4 స్ట్రోక్,సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ క్లాసిక్ 350. ఈ బైక్ ధర రూ. 1.90 లక్షల నుంచి రూ. 2.21 లక్షల వరకు ఉంటుంది (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. -
మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయి దాటిన కేటీఎం
హైదరాబాద్: ప్రపంచంలో నెంబర్ 1 ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ కేటీఎం భారతదేశంలో మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయిని అధిగమించింది. పుణేలోని బజాజ్ చకన్ ప్లాంట్ నుండి 1 మిలియన్ కేటీఎం మోటార్ సైకిల్– కేటీఎం అడ్వెంచర్ 390 విడుదలైంది. రికార్డు బైక్ ఆవిష్కరణ కార్యక్రమంలో బజాజ్ ఆటో ఎండీ, సీఈఓ రాజీవ్ బజాజ్, పియరర్ మొబిలిటీ ఏజీ (కేటీఎం మాతృ సంస్థ) సీఈఓ స్టీఫన్ పీరర్ (ఫొటోలో ఎడమ నుంచి కుడికి) తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రియన్ బ్రాండ్ కేటీఎం తన సబ్–400 సీసీ మోటార్‌సైకిళ్ల దేశీయ, ఎగుమతి యూనిట్ల తయారీకి బజాజ్ ఆటోతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కేటీఎం ఇండియా 2014లో 1,00,000వ మోటార్‌సైకిల్‌ను, 2020లో 5,00,000వ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కేవలం మరో మూడేళ్ల వ్యవధిలోనే కీలక మిలియన్ మైలురాయికి చేరుకోవడం గమనార్హం. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
మార్కెట్లోకి కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇక కుర్రకారు తగ్గేదె లే!
ప్రముఖ ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కేటీఎమ్ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ బైక్‌లో 10kW పవర్ గల మోటార్, 5.5kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుందని కూడా వెల్లడించింది. ఈ బైక్ నమూనాకు కేటీఎమ్ 125 డ్యూక్ లాగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టోర్క్ క్రాటోస్ ఆర్ (4కెడబ్ల్యుహెచ్), సింపుల్ వన్ (4.8కెడబ్ల్యుహెచ్), ఓలా ఎస్1 ప్రో(3.97కెడబ్ల్యుహెచ్) వంటి వాహనాలతో పోలిస్తే ఈ-డ్యూక్ ఫిక్సిడ్ బ్యాటరీ సామర్థ్యం అధికంగా ఉంది. కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్ విడుదల తేదీని కంపెనీ ఇంకా పేర్కొనలేదు. బజాజ్, కేటిఎమ్ కలిసి ఎలక్ట్రిక్ వాహనలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంలో 3కెడబ్ల్యు నుంచి 10కెడబ్ల్యు వరకు అవుట్ పుట్ గల ద్విచక్ర వాహనాలను లాంచ్ చేయాలని చూస్తున్నట్లు తెలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ-డ్యూక్ ఎలక్ట్రిక్ బైక్ ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ సుమారు రూ.200 కిమీ పైగానే ఉండే అవకాశం ఉంది. కేటీఎమ్ 2022 ఏడాదిలో కొత్త ‘KTM 890 Duke R’ బైక్‌ను ఆవిష్కరించింది. ఈ మిడిల్ వెయిట్ రోడ్‌స్టర్ కొత్త వేరియంట్లో స్టాండర్డ్ మోడల్‌కు అనేక స్టైలింగ్, మెకానికల్ అప్‌గ్రేడ్స్‌తో రానుంది. 890 డ్యూక్ ఆర్ భారత్‌లో లాంచ్ అయ్యే వివరాలు ఇంకా అందుబాటులో లేవు. (చదవండి: ఫాస్ట్ ట్యాగ్ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లు..!) -
కేటీఎమ్ నుంచి మరో కిర్రాక్ బైక్..!
ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ తయారీదారు కేటీఎం 2022 గాను కొత్త ‘KTM 890 Duke R’ బైక్‌ను ఆవిష్కరించింది. ఈ మిడిల్ వెయిట్ రోడ్‌స్టర్ కొత్త వేరియంట్లో స్టాండర్డ్ మోడల్‌కు అనేక స్టైలింగ్, మెకానికల్ అప్‌గ్రేడ్స్‌తో రానుంది. 890 డ్యూక్ ఆర్ భారత్‌లో లాంచ్ అయ్యే వివరాలు ఇంకా అందుబాటులో లేవు. స్టైలింగ్ అప్‌గ్రేడ్ లూక్స్‌తో..! న్యూ KTM 890 Duke R స్టాండర్డ్ 890 డ్యూక్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఈ బైక్‌లో రైడర్-ఓన్లీ సెటప్‌తో రానుంది. పిలియన్ సీటు వెనుక కౌల్ ద్వారా భర్తీ చేశారు. ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్ అసెంబ్లీ పూర్తిగా తొలగించారు. KTM 890 Duke R వేరియంట్ బైక్‌లో కూడా KTM RC16 GP రేసర్, 1290 సూపర్ డ్యూక్ R పై ఉపయోగించిన పెయింట్‌ను పోలి ఉండే కొత్త, అట్లాంటిక్ బ్లూ కలర్‌తో రానుంది. పెయింట్ బాడీవర్క్ అంతటా ఆరెంజ్ గ్రాఫిక్స్‌తో వచ్చింది. అన్ని KTM 'R' మోడల్స్ మాదిరిగానే KTM 890 Duke R కూడా, సిగ్నేచర్ ఆరెంజ్ ఫ్రేమ్, అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. ఇంజిన్ విషయానికి వస్తే..! KTM 890 Duke R అద్భుతమైన పనితీరుతో ఇంజిన్ రానుంది. 890 డ్యూక్ Rలో 889cc సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 121bhp గరిష్ట శక్తిని, 99Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ప్రైమరీ స్లిప్పర్ క్లచ్ మెకానిజంను పొందుతుంది. మరిన్నీ ఫీచర్స్..! సిక్స్-యాక్సిస్ లీన్ యాంగిల్ సెన్సార్‌తో పనిచేసే ఎలక్ట్రానిక్ రైడర్లో ఏబీఎస్, కార్నరింగ్ ఏబీఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. 890 డ్యూక్ R రెయిన్, స్ట్రీట్, స్పోర్ట్ మూడు రైడ్ మోడ్లతో స్టాండర్డ్‌గా వస్తుంది. సర్దుబాటు చేయగల ట్రాక్షన్ కంట్రోల్ స్లిప్, యాంటీ-వీలీ ఆన్/ఆఫ్, ఎక్స్ట్రా థ్రోటెల్ కంట్రోల్ సెట్టింగ్‌లతో రానుంది. ఇక బేస్ మోడల్ మాదిరిగానే, పూర్తి-LED లైటింగ్‌ను ప్రామాణికంగా కలిగి ఉంటుంది. ఇది స్ప్లిట్-స్టైల్ LED హెడ్‌లైట్‌తో పాటు ముందు భాగంలో LED DRLలు, సొగసైన LED టర్న్ ఇండికేటర్లు, వెనుక-స్టాక్-మౌంటెడ్ LED టైల్‌లైట్‌ని కలిగి ఉంటుంది. కాక్‌పిట్ పరిసర కాంతిపై ఆధారపడిన అడాప్టివ్ ఇల్యూమినేషన్‌తో కూడిన రిచ్ TFT డిస్ప్లేతో రానుంది. చదవండి: కిలోమీటర్‌కు కేవలం 14 పైసల ఖర్చు..! తక్కువ ధరలో మరో ఎలక్ట్రిక్ బైక్..! -
2022లో విడుదలయ్యే సూపర్ బైక్స్ ఇవే..!
Top Upcoming Bikes To Rock The Indian Two Wheeler Market In 2022: టూవీలర్స్‌లో రాయల్‌ఎన్‌ఫీల్డ్, యెజ్దీ, కేటీఎమ్ బైక్స్ అంటే యువతకు ఎక్కువగా మోజు. యువతను లక్ష్యంగా చేసుకొని పలు టూవీలర్ ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది పలు సూపర్ బైక్స్‌తో ముందుకురానున్నాయి. రాబోయే సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్, యెజ్దీ, కేటీఎమ్ బ్రాండ్స్ సరికొత్త బైక్స్‌ను విడుదల చేయనున్నాయి. 2022లో విడుదలయ్యే సూపర్ బైక్స్ పై ఓ లూక్కేద్దాం..! న్యూ-జెన్ కేటీఎమ్ ఆర్సీ390: కేటీఎమ్ బైక్స్ కుర్రకారును ఇట్టే కట్టిపడేసింది. కేటీఎమ్ ఆర్సీ 390 మోడల్‌కు అప్డేట్ వెర్షన్‌గా న్యూజెన్ కేటీఎమ్ ఆర్సీ 390 ముందుకురానుంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ బైక్‌ను కంపెనీ లాంచ్ చేయనున్నుట్లుగా తెలుస్తోంది. యెజ్డీ రోడ్కింగ్ ఏడీవీ: రెట్రో బైక్స్‌లో రాయల్‌ఎన్‌ఫీల్డ్ బైక్స్ తరువాత యెజ్డీ బైక్స్‌కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. త్వరలోనే యెజ్డీ బైక్‌లను రిలీజ్ చేయనున్నుట్లు జావా ఆటోమొబైల్స్ తన సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350: బుల్లెట్ బైక్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ను లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మెటియోర్ 350తో దగ్గరి పోలికలు ఉన్న విభిన్న స్టైలింగ్, డిజైన్, సెటప్‌లను హంటర్ 350లో రానుంది. ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రోడ్-బేస్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్: ఆఫ్ రోడ్ ప్రయాణాలకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్‌కు ఏ బైక్ సరిలేదు. రోడ్ బేస్డ్ హిమాలయన్ బైక్‌ను వచ్చే ఏడాది రాయల్ ఎన్ఫీల్డ్ రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్ గన్ లేదా క్లాసిక్ 650: రాయల్ ఎన్ఫీల్డ్ లాంచ్ చేస్తున్న బైక్స్‌లో షాట్‌గన్650 మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 650సీసీ ఇంజిన్ సామర్థ్యంతో వచ్చే క్యూయిజర్ మోడల్‌గా ఈ బైక్ నిలవనుంది. చదవండి: షాకిచ్చిన ఫోక్స్‌వ్యాగన్! సైలెంట్‌గా ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత? -
బంపర్ ఆఫర్.. కొత్త ఉద్యోగులకు బిఎమ్‌డబ్ల్యూ బైక్స్, ఆపిల్ ఐప్యాడ్స్
దేశంలోని కంపెనీలు వారి వ్యాపారాన్ని విస్తరించడం కోసం కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. అధిక జీతంతో పాటు ఉద్యోగులకు వివిధ ప్రయోజనాలు కూడా అందిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు టెక్ కంపెనీలు మంచి ప్రతిభ కనబరిచిన పాత ఉద్యోగులకు బోనస్, స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తుంటాయి. కానీ, ఒక టెక్ కంపెనీ మాత్రం విచిత్రంగా కొత్తగా ఉద్యోగంలో చేరేబోయే వారికి కూడా విలువైన బహుమతులను అందిస్తుంది. భారత్ పే ఫిన్‌టెక్ సంస్థ "టెకీల"ను ఆకర్షించడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. స్టార్టప్ ఉద్యోగాలు చేపట్టాలని చూస్తున్న ఉద్యోగులకు జాయినింగ్ అండ్ రిఫెరల్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. భారత్ పే "బైక్ ప్యాకేజీ" ప్రణాళికలో భాగంగా అనేక రకాల ప్రీమియం బైక్‌లను అందిస్తోంది. అంతేగాకుండా బైక్‌లను ఇష్టపడని వారికి టెక్నాలజి పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం "గాడ్జెట్ ప్యాకేజీ" పథకం కూడా ఉంది. ఉద్యోగంలో చేరిన ఉద్యోగి ఏదైనా ప్యాకేజీని ఎంచుకోవచ్చు. భారత్ పే వ్యవస్థాపకుడు సీఈఓ అష్నీర్ గ్రోవర్ లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. "ఇది నిజం, ఇక్కడ ఉంది, ఇది మీ కోసమే. టెక్ బృందంలో చేరిన మా కొత్త జాయినర్‌లకు మొదటి బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు బయలుదేరుతున్నాయి. అలాగే, మేము ఇప్పుడు బైక్ & గాడ్జెట్ ప్యాకేజీని ప్రొడక్ట్ మేనేజర్స్ కోసం విస్తరించామని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది" అని పోస్టు చేశారు. భారత్ పే తన రెఫరల్ & జాయినింగ్ పాలసీలో భాగంగా ఈ ఆఫర్స్ ప్రకటించింది. వంద మంది కొత్త జాయినీల కోసం బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు, జావా పెరాక్, కెటిఎం డ్యూక్ 390, ఎయిర్‌పాడ్స్, శామ్సంగ్ గెలాక్సీ వాచ్, ఇతర అనేక ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే సంస్థలో ఉన్న ఉద్యోగులుసంతోషంగా ఉన్నారని కంపెనీ నిర్ధారించింది. టెక్ బృందంలో కొత్తగా చేరిన వారికి సంస్థ రెండు వేర్వేరు ప్యాకేజీలను అందిస్తోంది. అలాగే, ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్స్ కోసం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. రెండు బృందాలలో కొత్తగా చేరిన వారందరికీ బైక్ ప్యాకేజీ లేదా గాడ్జెట్ ప్యాకేజీలో ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఉచితంగా ఐసీసీ టి20 మ్యాచ్ బైక్ ప్యాకేజీలో 5 సూపర్ బైక్‌లు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జావా పెరాక్, కెటిఎం డ్యూక్ 390, కెటిఎం ఆర్సి 390, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. గాడ్జెట్ ప్యాకేజీలో ఆపిల్ ఐప్యాడ్ ప్రో(పెన్సిల్‌తో), బోస్ హెడ్‌ఫోన్, హర్మాన్ కార్డాన్ స్పీకర్, శామ్సంగ్ గెలాక్సీ వాచ్, డబ్ల్యూఎఫ్‌హెచ్ డెస్క్ & కుర్చీ, ఫైర్ఫాక్స్ టైఫూన్ 27.5 డీ సైకిల్ ఉన్నాయి. ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ కోసం భారతదేశ మొత్తం టెక్ టీంకి దుబాయ్‌లో అక్టోబర్ 17 నుండి 2021 నవంబర్ 14 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. టెక్ టీం సభ్యులకు ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు చూసే అవకాశం లభిస్తుంది. -
కేటీఎం బంపర్ ఆఫర్... ఈ బైక్‌పై భారీ తగ్గింపు
రైడర్స్‌కి గుడ్‌న్యూస్ కేటీఎం సంస్థ తన బైకులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కేటీఎంలో ఎంట్రీ లెవల్ లైట్‌వెయిట్ బైక్ 250 అడ్వెంచర్ ధరను తగ్గించింది. బైక్ ప్రమోషన్లో భాగంగా కేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ అవసరాలతో పాటు లాండ్రైడ్కి కూడా వెళ్లగలిగేలా అడ్వెంచర్ 250 బైక్‌ని కేటీఎం మార్కెట్లోకి తెచ్చింది. 250 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఈ బైకుపై రూ. 25,000 డిస్కౌంట్ని సంస్థ అందిస్తోంది. ఆఫర్ వర్తింపుతో హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర రూ. 2,28,480గా ఉంది. అడ్వెంచర్ 250 బైకుపై అందిస్తోన్న డిస్కౌంట్ 2020 జులై 14 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కేటీఎం తెలిపింది. ధర తగ్గింపుతో కేటీఎంలో పాపులర్ మోడల్ డ్యూక్‌కి అడ్వెంచర్‌కి మధ్య ధరల వత్యాసం బాగా తగ్గిపోయింది. రోజువారి రవాణా అవసరాలు తీర్చడంతో పాటు వీకెండ్లో లాంగ్ టూర్ వేసేందుకు వీలుగా బైకర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడ్వెంచర్‌ను డిజైన్ చేసినట్టు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సుమిత్ నారంగ్ తెలిపారు. అడ్వెంచర్ బైకు 248 సీసీ ఫోర్ వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పాటు డబ్ల్యూపీ అపెక్స్ సస్పెన్షన్, ఏబీఎస్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. -
కేటీఎం,హుస్కవర్ణ బైకులు మరింత ప్రియం
బజాజ్‌కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్ధాల ధరలు పెరుగడంతో ధరలను పెంచాల్సి వచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో కేటీఎం, హుస్కావర్ణ బైకులు రూ.10 వేల వరకు ప్రియం కానున్నాయి. వివిధ మోడళ్ళను బట్టి ధరల పెరుగుదలలో మార్పులు ఉంటాయి. దీంట్లో కేటీఎం బైకులు రూ.8,812, హుస్కవర్ణ బైకులు రూ.9,730 వరకు పెరగనున్నాయి. కేటీఎం, హుస్కావర్ణ బైక్ ధరలు: కేటీఎం 125 డ్యూక్: రూ.1,60,319 కేటీఎం 200 డ్యూక్: రూ.1,83,328 కేటీఎం 390 డ్యూక్: రూ.2,75,925 కేటీఎం ఆర్సీ 125 : రూ.1,70,214 కేటీఎం ఆర్సీ 390: రూ.2,65,897 కేటీఎం 250 ఏడివి: రూ.2,54,483 కేటీఎం 390 ఏడివి: రూ.3,16,601 హుస్కవర్ణ స్వర్ట్ పిలెన్: రూ.1,99,296 హుస్కవర్ణ విట్ పిలెన్: రూ.1,98,669 -
కేటీఎం అడ్వెంచర్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రీమియం మోటర్‌సైకిళ్ల బ్రాండ్ కేటీఎం శుక్రవారం కొత్త మోడల్ ‘‘కేటీఎం 250 అడ్వెంజర్’’ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద బైక్ ధర రూ.2,48,256 గా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని షోరూంల్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో అమర్చిన 248 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 30 హార్స్పవర్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ స్లిప్పర్ క్లచ్ సాయంతో సిక్స్–స్పీడ్ గేర్ బాక్స్(6–గేర్లు) వ్యవస్థతో పనిచేస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ బైక్‌కు పోటీగా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్‌పల్స్ మోడళ్లు ఉన్నాయి. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల విభాగాన్ని విస్తరించే లక్ష్యంతో ఈ మోడల్‌ను ఆవిష్కరించినట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచస్థాయి ఫీచర్లతో రూపకల్పన చేసిన ఈ మోడల్‌ను కస్టమర్లు ఆదరిస్తారని కంపెనీ ఆశిస్తోంది. అడ్వెంజర్ టూరింగ్, అవుట్డోర్ ప్రయాణాలు పట్ల ఆసక్తి చూపుతున్న యువతకు ఇది సరైన ఎంపిక అని బజాజ్ ఆటో బైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ తెలిపారు. (చదవండి: కొత్త రికార్డు సృష్టించిన షియోమి) -
కేటీఎం 390 బైక్ : కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ ఆటో బైక్ లవర్స్ కోసం కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. తన అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌పై ఈ కొత్త ఫైనాన్స్ పథకాన్ని అందిస్తోంది. కేటీఎం 390 బైక్ కేటీఎం 390 అడ్వెంచర్ బైక్‌ను సులువైన ఈఎంఐల ద్వారా కొనుగోలుచేసే అవకాశాన్ని తాజాగా కల్పిస్తోంది. ఆన్-రోడ్ ధర మీద 80 శాతం ఫైనాన్స్ సదుపాయాన్నిఅందిస్తోంది. తద్వారా మరింతమంది వినియోగదారులకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నట్టు బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు భాగస్వామ్యంతో ఈ ఫైనాన్స్ పథకాన్ని అందస్తున్నట్టు తెలిపింది. తాజా నిర్ణయంతో ఈ బైక్‌ను 6,999 రూపాయల సులభ వాయిదాలతో కొనుగోలు దారులు ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా చాలామంది కస్టమర్లు అప్గ్రేడయ్యే అవకాశం కల్పిస్తున్నామని బజాజ్ ఆటోలిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ అన్నారు. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా వినియోగదారులు 95 శాతం వరకు ఫైనాన్స్ కవరేజ్, తక్కువ వడ్డీరేట్లు, హెచ్ఢీఎఫ్సీనుంచి ఇతర ఫైనాన్స్ ఆఫర్లను కూడా పొందవచ్చని తెలిపారు. అలాగే ఆసక్తికరమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను కేటీఎం డీలర్ల వద్ద లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో ప్రారంభించిన కేటీఎం 390 ధర (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) 3.04 లక్షల రూపాయలు. ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్‌లో బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉంది. కాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 38,267 యూనిట్లతో పోలిస్తే ఏప్రిల్-జూన్ నెలల్లో 33,220 కేటీఎం బైక్‌ల అమ్మకాలను నమోదు చేసింది. -
భారత్‌లోకి హస్వానా ప్రీమియం బైక్స్
న్యూఢిల్లీ: ఆ్రస్టియా మోటార్ సైకిల్ కంపెనీ కేటీఎమ్ ఉత్పత్తి చేస్తున్న హస్వానా ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్‌ను.. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో భారత్‌లో ప్రవేశ పెట్టింది. ఈ బ్రాండ్‌లోని విట్పిలెన్ 250, స్వార్ట్పిలెన్ 250 మోడళ్లను ఇక్కడి మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. అత్యంత శక్తివంతమైన ఈ రెండు మోడళ్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కేటీఎం షోరూంల ద్వారా కొనుగోలు చేయవచ్చని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ వెల్లడించారు. ఇక కేటీఎం ఏజీలో బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే కాగా, 1903 నుంచి మార్కెట్లో ఉన్న స్వీడిష్ మోటార్ సైకిల్ బ్రాండ్‌ను తాజాగా భారత బైక్ ప్రియులకు ఇక్కడ పరిచయం చేసింది. -
డ్యూక్ 790 స్పోర్ట్స్ బైక్.. ధరెంతో తెలుసా..!!
న్యూఢిల్లీ : ఆస్ట్రియా దేశానికి చెందిన స్పోర్ట్స్ బైక్స్ తయారీ సంస్థ కేటీఎమ్.. అధునాతన ‘డ్యూక్ 790’ బైక్‌ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 799 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.8.64 లక్షలుగా కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో.. బెంగుళూరు, ముంబై, పుణె, హైదరాబాద్, సూరత్, ఢిల్లీ, కోల్‌కత, చెన్నై, గువాహటిల్లో డ్యూక్ 790 బైక్‌ను ఈ రోజు నుంచే బుక్ చేసుకోవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. క్రోమియం మాలిబ్డినం స్టీల్ ఫ్రేమ్‌తో మిరుమిట్లు గొలుపుతున్న ఈ బైక్‌పై ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్టు బజాజ్ ఆటో ఫిన్‌కార్ప్ తెలిపింది. 1.70 లక్షల డౌన్‌పేమెంట్‌తో, నెలకు రూ.19 వేలు ఈఎంఐతో బైక్‌ను సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. గతేడాది డ్యూక్ 200 బైక్‌ను కేటీఎమ్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
మార్కెట్లోకి కేటీఎమ్ ‘ఆర్సీ 125 ఏబీఎస్’
న్యూఢిల్లీ: ఆస్ట్రియా దేశానికి చెందిన స్పోర్ట్స్ బైక్స్ తయారీ సంస్థ కేటీఎమ్.. ‘ఆర్సీ 125 ఏబీఎస్’ పేరుతో అధునాతన బైక్‌ను బుధవారం ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేసింది. 124.7 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.47 లక్షలుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 470 కేటీఎమ్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లలో బుధవారం నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని, నెలాఖరు నుంచి డెలివరీలు చేస్తామని వెల్లడించింది. పనితీరు పరంగా కేటీఎమ్ బైక్‌లు ఉత్తమ ప్రదర్శన చూపుతున్నట్లు ఈ సంస్థకు భారత భాగస్వామి అయిన బజాజ్ ఆటో పేర్కొంది. -
కేటీఎం బైక్స్ లవర్స్‌కి బంపర్ ఆఫర్
స్పోర్ట్స్ బైక్స్ అంటే ప్రాణం పెట్టే యూత్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్. జీఎస్టీ కొత్త పన్నుల విధానం అమల్లోకిరావడంతో భారత్‌లో టాప్ గేర్‌లో దూసుకెళుతున్న కేటీఎం బ్రాండ్ బైక్‌ల ధరలు కూడా తగ్గాయి. ఆస్ట్రియా కంపెనీ కెటిఎం కంపెనీ భారత్‌లో బైక్‌ల ధరలను భారీగా తగ్గించిందని బజాజ్ ఆటో గురువారం ప్రకటించింది. సుమారు రూ.8,600 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. 350 సీసీ ఎటిఎఫ్ కెటిఎమ్ పరిధిలో 200 డ్యూక్, ఆర్సీ 200, 250 డ్యూక్ ఎక్స్ షోరూమ్ ధరలపై రూ.8,600ల మేరకు తగ్గాయని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అదనపు సెస్ కారణంగా 350 సీసీ పరిధిలోని 390 డ్యూక్ , ఆర్సి 390 ల ఎక్స్-షోరూమ్ ధరల్లో రూ. 5,900 మేర తగ్గించింది.ఆయా ప్రాంతాలల్ లోవర్తించే వ్యాట్ రేట్ల ఆధారంగా తగ్గింపు రేటు వేర్వేరుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ముంబైలో 200 డ్యూక్ ఎక్స్-షోరూమ్ లో దీని అసలు ధర రూ.1,44,751గా ఉంది. మరోవైపు ఇటీవలే దేశంలో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ప్రవేశపెట్టిన కేటీఎం తన ఔట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇండియలో నెం.1 స్థానంపై కన్నేసిన కంపెనీ ఈఏడాది దాదాపు 50వేల బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటు కేటీఎం బ్రాండ్‌లో బజాజ్ ఆటో కంపెనీకి 49 శాతం వాటా ఉంది. కాగా ఇప్పటికే ద్విచక్ర వాహన తయారీదారులైన టీవీఎస్ మోటార్ , హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, సుజుకి కంపెనీలు తమ బైక్‌ల ధరలను తగ్గించాయి. -
భారత్‌లో కేటీఎం టాప్ గేర్
⇒ బైక్స్ విక్రయాల్లో భారీ వృద్ధి ⇒ టాప్–1 మార్కెట్‌గా ఇండియా ⇒ చిన్న పట్టణాల్లోనే అధిక సేల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో స్పోర్ట్స్ బైక్స్ బ్రాండ్ కేటీఎం భారత్‌లో టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల పరంగా రెండో స్థానంలో ఉన్న భారత్.. 2017లో తొలి స్థానానికి ఎగబాకేంత పనితీ రును కనబరుస్తోంది. మొదటి స్థానంలో ఉన్న యూఎస్ మార్కెట్‌తో పోలిస్తే భారత్ ప్రస్తుతం 1,000 యూనిట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఈ ఏడాది 50,000 బైక్‌లను విక్రయించాలని కేటీఎం ఇండియా టార్గెట్ విధించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరితే ప్రపంచంలో కేటీఎంకు భారత మార్కెట్ టాప్–1గా నిలుస్తుంది. ఇటీవలే దేశంలో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ప్రవేశపెట్టిన ఈ సంస్థ ఔట్లెట్లను సైతం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. ప్రస్తుతం 350 కేంద్రాలుండగా, 2018 డిసెంబరు నాటికి మరో 150 స్టోర్లు ప్రారంభించనుంది. అమ్మకాల్లో అగ్రస్థానం డ్యూక్ 200దే కేటీఎం భారత్‌లో డ్యూక్ 200, డ్యూక్ 250, డ్యూక్ 390, ఆర్సీ 200, ఆర్సీ 390 మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రూ.1.4 లక్షల నుంచి రూ.2.3 లక్షల వరకూ ఉంది. డ్యూక్ 200 ఎక్కువగా అమ్ముడవుతున్న మోడల్. మొత్తం విక్రయాల్లో ఈ మోడల్ వాటా 45 శాతముంది. కంపెనీ 2011–12లో దేశంలో 2,200 బైక్స్‌ను మాత్రమే అమ్మింది. 2016–17లో ఈ సంఖ్య అనూహ్యంగా 36,000 యూనిట్లకు చేరింది. ఈ వేగం చూస్తుంటే దేశ మార్కెట్ తొలి స్థానానికి చేరడం ఖాయంగా కనపడుతోంది. తమ లక్ష్యమూ ఇదేనని బజాజ్ ఆటో ప్రోబైకింగ్ అంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 320 బైక్‌లు రోడ్డెక్కుతున్నాయి. లక్ష మార్కును దాటి.. ఇప్పటి వరకు భారత్‌లో 1,00,000 పైగా బైక్స్ అమ్ముడయ్యాయని ప్రోబైకింగ్ డివిజన్ సౌత్ హెడ్ గౌరవ్ రాథోర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. తాము పోటీపడుతున్న ప్రీమియం బైక్స్ విభాగంలో దేశంలో నెలకు అన్ని కంపెనీలవి కలిపి 10–15 వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయని గుర్తు చేశారు. ‘మూడేళ్ల క్రితం ఈ విభాగంలో నెలకు 5,000 యూనిట్ల లోపే విక్రయాలు జరిగాయి. 30 ఏళ్లలోపు యువకులే ఎక్కువగా కేటీఎంపై రైడ్ చేస్తున్నారు. యువతులకూ మా బైక్స్ అంటే మక్కువే. ఖరీదైన బైక్స్‌లో ఉండే ఫీచర్లను కేటీఎం మోడళ్లలో పొందుపరుస్తున్నాం. బైక్స్ డిజైన్ సైతం కుర్రకారు సై అనేలా ఉంటుంది. అందుకే సూపర్ బైక్స్ వాడేవారు ఇప్పుడు కేటీఎంకు మళ్లుతున్నారు’ అని వివరించారు. భారత్ నుంచి 84 దేశాలకు... దేశవ్యాప్తంగా జరుగుతున్న కంపెనీ విక్రయాల్లో మెట్రో నగరాల వాటా 40 శాతం మాత్రమే. చిన్న పట్టణాల్లోనూ కేటీఎం బైక్స్ పరుగెడుతున్నాయని శ్రీ వినాయక మోబైక్స్ డీలర్ ప్రిన్సిపల్ కె.వి.బాబుల్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ప్రతి నెల గుంటూరులోని తమ షోరూంలో 12, తెనాలి ఔట్లెట్లో 3 బైక్స్ అమ్ముడవడం ఇందుకు నిదర్శనమన్నారు. చిన్న నగరాల కోసం కంపెనీ 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఔట్లెట్లను తెరుస్తోంది. మొత్తం 280 నగరాలు, పట్టణాల్లో కంపెనీ షోరూంలను నిర్వహించడం విశేషం. కేటీఎం ఇండియాలో బజాజ్‌కు 48 శాతం వాటా ఉంది. బజాజ్‌కు చెందిన చకన్ ప్లాంటులో కేటీఎం బైక్స్ తయారవుతున్నాయి. 84 దేశాలకు ఈ ప్లాంటు నుంచే బైక్స్ ఎగుమతి చేస్తున్నారు. -
కేటీఎం టార్గెట్ @50,000 బైక్స్
♦ 2018కల్లా 500 షోరూంలు ♦ ప్రోబైకింగ్ సౌత్ హెడ్ గౌరవ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కేటీఎం ఈ ఏడాది భారత్‌లో 50,000 బైక్‌లను విక్రయించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. 2016లో కంపెనీ దేశవ్యాప్తంగా 36,000 బైకులు విక్రయించింది. కేటీఎంలో ప్రస్తుతం అయిదు మోడళ్లను రూ.1.4 లక్షల నుంచి రూ.2.3 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉంచామని ప్రోబైకింగ్ డివిజన్ సౌత్ హెడ్ గౌరవ్ రాథోర్ గురువారం తెలిపారు. మార్కెట్ తీరుకు అనుగుణంగా మరిన్ని మోడళ్లను ప్రవేశపెడతామన్నారు. గురువారమిక్కడి కూకట్‌పల్లిలో శ్రీ వినాయక మోబైక్స్ ఏర్పాటు చేసిన కేటీఎం షోరూంను ప్రారంభించిన అనంతరం డీలర్ కె.వి.బాబుల్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రూ.8 లక్షలు ఆపైన ధర గల మోడళ్లలో ఉండే ఫీచర్లను కేటీఎం బైక్స్‌లో పొందుపరచడం వల్లే కస్టమర్ల నుంచి ఆదరణ ఉందని తెలియజేశారు. ‘‘భారత్‌లో 350కిపైగా షోరూంలను నిర్వహిస్తున్నాం. 2018 డిసెంబరుకల్లా మరో 150 ఔట్లెట్లు తెరుస్తాం’’ అని చెప్పారు. శ్రీ వినాయక మోబైక్స్ 9వ కేటీఎం షోరూం బహదూర్‌పురలో మే నాటికి రానుందని బాబుల్ రెడ్డి తెలిపారు. నెలకు 110 కేటీఎం బైక్‌లను విక్రయిస్తున్నామని, ఈ ఏడాది నుంచి నెలకు 150 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేవారు. శ్రీ వినాయక బజాజ్ ఇప్పటికే 6 బైక్స్ షోరూంలను నిర్వహిస్తోంది. జూన్‌కల్లా కొత్తగా రెండు ఔట్లెట్లు ఏర్పాటు చేస్తోంది. -
కేటీఎం డ్యూక్ బైక్‌ల్లో బీఎస్–ఫోర్ రకాలు
⇒ డ్యూక్ 390 బైక్ ధర రూ.2,25,730 ⇒ డ్యూక్ 250 బైక్ ధర రూ.1,73,000 ⇒ డ్యూక్ 200 బైక్ ధర రూ.1,43,500 ముంబై: ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కేటీఎం... డ్యూక్ మోడళ్లలో భారత్ స్టేజ్ ఫోర్(బీఎస్–ఫోర్) వేరియంట్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కేటీఎం బ్రాండ్‌లో బజాజ్ ఆటో కంపెనీకి 49 శాతం వాటా ఉంది. డ్యూక్ 390, డ్యూక్ 250, డ్యూక్ 200 మోడళ్లలో ఈ బీఎస్–ఫోర్ వేరియంట్లను ప్రవేశపెడుతున్నామని ప్రోబైకింగ్ (బజాజ్ ఆటో స్పోర్ట్స్ బైక్స్ డివిజన్) ప్రెసిడెంట్ అమిత్ నంది చెప్పారు. అయితే వీటి ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. డ్యూక్ 390 బైక్ ధర రూ.2,25,730 అని, డ్యూక్ 250 బైక్ ధర రూ.1,73,000 అని, డ్యూక్ 200 బైక్ ధర రూ.1,43,500 (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)అని వివరించారు. డ్యూక్ 200 బైక్ ఇప్పటికే డీలర్ల వద్ద లభ్యమవుతోందని, మరో రెండు వారాల్లో మిగిలిన బైక్‌లు మార్కెట్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 325గా ఉన్న షోరూమ్‌ల సంఖ్యను విస్తరించనున్నట్లు వివరించారు. -
కేటీఎం సూపర్ స్పోర్ట్స్ బైక్స్ లాంచ్
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్ 2017 సంవత్సరంలో అప్ గ్రేడ్ చేసిన సూపర్ స్పోర్ట్స్ బైక్స్ ను భారత మార్కెట్లో గురువారం ప్రవేశపెట్టింది. ఆర్సి200 , ఆర్సి390 అప్ గ్రేటెడ్ వెర్షన్ మోటార్ బైక్స్ ను బజాజ్ ఆటో లాంచ్ చేసింది. ఆర్సి200 ధరను 1.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఆర్సి390 రూ.2.25 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది. 2017 కు చెందిన ఆర్సి390 మోడల్ లో మెకానికల్‌గా మార్పులు చేయగా, ఆర్సి200 వేరియంట్ ఎలాంటి మార్పులు లేకుండా మునుపటి సాంకేతిక అంశాలతో విడుదల చేసింది. ఈ రెండు వాహనాలను యూరో-4 ఉద్గార నియమాలను పాటిస్తూ లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజీన్, 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది. సాంకేతికంగా 2017 కెటిఎమ్ ఆర్సి390 మోటార్ బైక్ లో వైర్ థొరెటల్, స్లిప్పర్ క్లచ్ , 320ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ద్వారా రైడ్ వంటి కొత్త ఫీచర్స్ ను జత చేసింది. ఇంజిన్ టార్క్ ను 44బీహెచ్ పీ, 35ఎన్ ఎం, గత సంవత్సరం నమూనా మోటార్ బైక్ లాగే ఉంచింది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ప్లేస్ మెంట్ లో మార్పులు చేసింది. ఆఫ్ ఆన్ చేసుకునే యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రైడ్ బై వైర్ టెక్నాలజీతోపాటు ముందు వైపున 320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ అమర్చింది. దీంతోపాటు న్యూ గ్రాఫిక్స్ తో కొత్తగా డిజైన్ చేసింది. ఆర్సి200 లో కాస్మోటిక్ మార్పులు తప్ప అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సహా మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేవు. 199సీసీ లో యూనిట్ లో మాత్రం 25బిహెచ్పి ,19.2 టార్క్ కలిగి ఉంది.