భారతీయ మార్కెట్లో ప్రస్తుతం లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు నుంచి అత్యంత ఖరీదైన బైకుల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య లభించే టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం.
కెటిఎమ్ 390 డ్యూక్:
ఎక్కువ మంది యువతకు ఇష్టమైన బైకులలో కెటిఎమ్ 390 డ్యూక్ ఒకటి. దీని ధర రూ. 2.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 2017 నుంచి చిన్న చిన్న అప్‌డేట్‌లను పొందుతూనే ఉంది. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ 373సీసీ ఇంజిన్ కలిగి 9000 ఆర్‌పిఎమ్ వద్ద 43.5 పిఎస్ పవర్, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310:
ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ టీవీఎస్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్ఆర్ 310 కూడా ఎక్కువమంది ఇష్టపడే బైకుల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 2.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్పోర్ట్‌బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 312.2 సీసీ ఇంజిన్ 33.5 బిహెచ్‌పి పవర్, 27.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
హోండా సిబి300ఆర్:
హోండా కంపెనీకి చెందిన సిబి300ఆర్ బైక్ ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో 286 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30.7 బిహెచ్‌పి పవర్, 27.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా రైడర్ కు సులువైన క్లచ్ ఆపరేటింగ్ కోసం అసిస్ట్ అండ్ స్లిప్లర్ క్లచ్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి.
సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్:
మన జాబితాలో మూడు లక్షలకంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ఒకటి సుజుకీ వీ స్ట్రోమ్ ఎస్ఎక్స్. దీని ధర రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 249 సీసీ, 4 స్ట్రోక్,సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350:
భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ క్లాసిక్ 350. ఈ బైక్ ధర రూ. 1.90 లక్షల నుంచి రూ. 2.21 లక్షల వరకు ఉంటుంది (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment