మార్కెట్లో సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. క్రూయిజర్ మోటార్‌సైకిళ్లకు కూడా జనాదరణ లభిస్తోంది. దీంతో చాలామంది ఈ బైకులను కొనొగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో భారతదేశంలో అమ్మకానికి ఉన్న టాప్ 5 బెస్ట్ క్రూయిజర్ బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.
కవాసకి డబ్ల్యు175 (Kawasaki W175)
భారతదేశంలో అత్యంత సరసమైన క్రూయిజర్ బైకులలో కవాసకి డబ్ల్యు175 ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 1.22 లక్షలు. ఈ బైకులోని 177 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 12.8 హార్స్ పవర్, 12.2 ఏంఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 45 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, స్పోక్డ్ రిమ్స్.. అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ బైక్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.
టీవీఎస్ రోనిన్ (TVS Ronin)
చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన టీవీఎస్ రోనిన్ ధరలు రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.72 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులోని 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 20.1 హార్స్ పవర్, 19.93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 42.95 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైకులో లేటెస్ట్ ఫీచర్స్.. సస్పెన్షన్ సిస్టమ్ వంటివన్నీ ఉన్నాయి. ఇది నగరంలో, హైవేపై రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
బజాజ్ అవెంజర్ 220 (Bajaj Avenger 220)
మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్రూయిజర్ బైకులలో బజాజ్ అవెంజర్ 220 కూడా ఒకటి. దీని ధర రూ. 1.45 లక్షలు. ఇందులో 18.76 హార్స్ పవర్, 17.55 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 40 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ రెట్రో డిజైన్ కలిగి ట్విన్ షాక్ రియర్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
క్యూజే ఎస్ఆర్సీ 250 (QJ SRC 250)
మార్కెట్లో అందుబాటులో ఉన్న క్యూజే ఎస్ఆర్సీ 250 బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ 249 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 17.4 హార్స్ పవర్, 17 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇది
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన సరసమైన బైక్ ఈ హంటర్ 350. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 36 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన క్రూయిజర్ బైకులలో ఒకటైన హంటర్ 350 మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment