Cruiser Bike
-
హల్చల్ చేస్తోన్న భారత తొలి క్రూజర్ ఎలక్ట్రిక్ బైక్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 220కిమీ..
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంది. పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకువస్తున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లే ఎక్కువగా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లే కాకుండా ఇతర బైక్ మోడల్స్‌పై కూడా పలు కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్‌ను కొమాకి ఎలక్ట్రిక్ సంస్థ లాంచ్ చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 220 కిమీ ప్రయాణం..! ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కొమాకీ దేశవ్యాప్తంగా స్మార్ట్ స్కూటర్స్, హై స్పీడ్ స్కూటర్స్ , ఈజీ రిక్షా పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను జరుపుతోంది. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ ‘ కొమాకీ రేంజర్’ను గత ఏడాది డిసెంబర్లో టీజ్ చేసింది. అప్పట్లో కొమాకి రేంజర్ క్రూజర్ బైక్ టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 220 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ పేర్కొంది. ధర ఎంతంటే..! కొమాకీ రేంజర్ క్రూజర్ బైక్ సంప్రదాయ క్రూజర్ బైక్స్ ధరల కంటే కాస్త తక్కువగా ఉంది. కొమాకి రేంజర్ బైక్ ధర రూ. 1.68 లక్షలు(ఎక్స్‌షోరూమ్ ధర). ఈ క్రూజర్ ఎలక్ట్రిక్ బైక్ జనవరి 26 నుంచి కంపెనీకి చెందిన డీలర్‌షిప్‌లన్నింటిలో అందుబాటులోకి రానుంది. ఇది గార్నెట్ రెడ్, డీప్ బ్లూ, జెట్ బ్లాక్ అనే మూడు విభిన్న రంగులతో రానుంది. కొమాకి రేంజర్ ఫీచర్స్ అంచనా..! కొమాకి రేంజర్ క్రూజర్ బైక్‌లో ముఖ్యమైన ఫీచర్లుగా క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌తో రానుంది. కొమాకి రేంజర్లో 4-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. 4000-వాట్ల మోటారుతో పనిచేయనుంది. లగ్జరీ కార్లకు ఉండే ఫాక్స్ ఎగ్జాస్ట్‌ను ఏర్పాటుచేశారు. లెగ్గార్డ్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరింత ఆకర్షణీయంగా కన్పించనుంది. బ్లూటూత్ సౌండ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, డ్యూయల్ స్టోరేజ్ బాక్స్‌తో కూడిన రేంజర్‌ను అమర్చింది. చదవండి: పది నిమిషాల్లో హోం డెలివరీ.. అలా చేస్తే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం -
ఇండియా తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే..!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కొమాకి ఈవీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించడం కోసం ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు కేవలం ఈ-స్కూటర్ల తయారీకి మాత్రమే పరిమితం అయితే, కొమాకి కంపెనీ మాత్రం అన్నింటి కంటే భిన్నంగా క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకొనివచ్చేందుకు సిద్దం అవుతుంది. భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ "కోమాకి రేంజర్" వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ఈ బైక్ వచ్చే ఏడాది రానున్నప్పటికి, బయటకు విడుదల అయిన బైక్ డిజైన్ చూస్తే బైక్ లవర్స్ వావ్ అనకుండా ఉండలేరు. 250 కిలోమీటర్ల రేంజ్ ఈ కోమాకి రేంజర్ క్రూయిజర్ ఇదే డిజైన్ లో గనుక వస్తే మాత్రం రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ నాలుగు కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని, 5,000 వాట్ మోటార్ శక్తిని అందిస్తుందని కొమాకి ఇప్పటికే దృవీకరించింది. ఈ రేంజర్ ని ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 250 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ చెప్పినట్లుగా కొమాకీ రేంజర్ క్రూయిజర్ బైక్ 250 కిమీ రేంజ్ ఇస్తే ఎలక్ట్రిక్ బైక్‌లలో ఒక సంచలనంగా నిలిచే అవకాశం ఉంది. ధర ఎంతంటే..! కొమాకీ రేంజర్ క్రూయిజర్ బైక్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఈ బైక్ ధర ఉంటుందని కంపెనీ పేర్కొంది. నిపుణుల అంచనా మేరకు ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ ధర దాదాపు రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) ఉండనున్నట్లు సమాచారం. ఈ ధరలో గనుక పైన చెప్పిన డిజైన్, ఫీచర్స్ తో గనుక వస్తే మాత్రం బైక్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం మాత్రం ఖాయం. "సరసమైన ధరలో భారతదేశంలో తయారు చేసిన నాణ్యమైన క్రూయిజర్ వాహనాన్ని ముఖ్యంగా సామాన్యుడికి అందుబాటులో ఉంచాలని మేము కోరుకుంటున్నాము" అని కోమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా గతంలో చెప్పారు. (చదవండి: బిజీఎమ్ఐ మొనగాళ్లకు భారీ షాక్ ఇచ్చిన క్రాఫ్టన్..!) -
మార్కెట్లోకి సుజుకీ ‘ఇన్ట్రూడర్’ 2019 ఎడిషన్
ముంబై: వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా.. తన ‘ఇన్ట్రూడర్’ క్రూయిజర్ బైక్‌లో నూతన ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన గేర్ షిఫ్ట్ డిజైన్, అభివృద్ధిపరిచిన బ్రేక్ పెడల్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ధర రూ.1.08 లక్షలుగా కంపెనీ తెలిపింది. ‘స్టాండర్డ్ ఏబీఎస్, 155సీసీ ఇంజిన్, పూర్తి డిజిటల్ ఉపకరణాలతో ఈ బైక్ విడుదలైంది. క్రూయిజర్‌ను ఇష్టపడే యువతకు ఈ అడ్వాన్స్డ్ వెర్షన్ సరిగ్గా సరిపడే మోటార్‌సైకిల్‌గా భావిస్తున్నాం’ అని ఎస్ఎంఐపీఎల్ వైస్ ప్రెసిడెంట్ దేవశిష్ హన్డా అన్నారు. -
డుకాటి.. ‘ఎక్స్డీవెల్’ క్రూజర్
ధర రూ.15.87 లక్షలు న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ ‘డుకాటి’ తాజాగా తన క్రూజర్ బైక్ ‘ఎక్స్డీవెల్’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.15.87 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ‘క్రూజర్ అనేది భారత్‌లో అతిపెద్ద లగ్జరీ మోటర్‌సైకిల్ విభాగం. మేం సరికొత్త ప్రొడక్ట్‌తో ఇందులోకి అడుగుపెడుతున్నాం’ అని డుకాటి ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ రవి ఆవలూరు తెలిపారు. డిజైన్, స్టైల్, ఇంజిన్ వంటి అంశాలు ఈ బైక్‌ను ప్రత్యేకంగా నిలుపుతాయని పేర్కొన్నారు. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్, డీవీటీ 1262 ఇంజిన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. ఇక ఎక్స్డీవెల్ ఎస్ వేరియంట్ ధర రూ.18.47 లక్షలుగా ఉంది.