భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంది. పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకువస్తున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లే ఎక్కువగా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లే కాకుండా ఇతర బైక్ మోడల్స్‌పై కూడా పలు కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్‌ను కొమాకి ఎలక్ట్రిక్ సంస్థ లాంచ్ చేసింది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 220 కిమీ ప్రయాణం..!
ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కొమాకీ దేశవ్యాప్తంగా స్మార్ట్ స్కూటర్స్, హై స్పీడ్ స్కూటర్స్ , ఈజీ రిక్షా పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను జరుపుతోంది. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ ‘ కొమాకీ రేంజర్’ను గత ఏడాది డిసెంబర్‌లో టీజ్ చేసింది. అప్పట్లో కొమాకి రేంజర్ క్రూజర్ బైక్ టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 220 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ పేర్కొంది.
ధర ఎంతంటే..!
కొమాకీ రేంజర్ క్రూజర్ బైక్ సంప్రదాయ క్రూజర్ బైక్స్ ధరల కంటే కాస్త తక్కువగా ఉంది. కొమాకి రేంజర్ బైక్ ధర రూ. 1.68 లక్షలు(ఎక్స్‌షోరూమ్ ధర). ఈ క్రూజర్ ఎలక్ట్రిక్ బైక్ జనవరి 26 నుంచి కంపెనీకి చెందిన డీలర్‌షిప్‌లన్నింటిలో అందుబాటులోకి రానుంది. ఇది గార్నెట్ రెడ్, డీప్ బ్లూ, జెట్ బ్లాక్ అనే మూడు విభిన్న రంగులతో రానుంది.
కొమాకి రేంజర్ ఫీచర్స్ అంచనా..!
కొమాకి రేంజర్ క్రూజర్ బైక్‌లో ముఖ్యమైన ఫీచర్లుగా క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌తో రానుంది. కొమాకి రేంజర్‌లో 4-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. 4000-వాట్ల మోటారుతో పనిచేయనుంది. లగ్జరీ కార్లకు ఉండే ఫాక్స్ ఎగ్జాస్ట్‌ను ఏర్పాటుచేశారు. లెగ్‌గార్డ్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరింత ఆకర్షణీయంగా కన్పించనుంది. బ్లూటూత్ సౌండ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, డ్యూయల్ స్టోరేజ్ బాక్స్‌తో కూడిన రేంజర్‌ను అమర్చింది.
చదవండి: పది నిమిషాల్లో హోం డెలివరీ.. అలా చేస్తే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment