ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కొమాకి ఈవీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించడం కోసం ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు కేవలం ఈ-స్కూటర్ల తయారీకి మాత్రమే పరిమితం అయితే, కొమాకి కంపెనీ మాత్రం అన్నింటి కంటే భిన్నంగా క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకొనివచ్చేందుకు సిద్దం అవుతుంది. భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ "కోమాకి రేంజర్" వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ఈ బైక్ వచ్చే ఏడాది రానున్నప్పటికి, బయటకు విడుదల అయిన బైక్ డిజైన్ చూస్తే బైక్ లవర్స్ వావ్ అనకుండా ఉండలేరు.
250 కిలోమీటర్ల రేంజ్
ఈ కోమాకి రేంజర్ క్రూయిజర్ ఇదే డిజైన్ లో గనుక వస్తే మాత్రం రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ నాలుగు కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని, 5,000 వాట్ మోటార్ శక్తిని అందిస్తుందని కొమాకి ఇప్పటికే దృవీకరించింది. ఈ రేంజర్ ని ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 250 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ చెప్పినట్లుగా కొమాకీ రేంజర్ క్రూయిజర్ బైక్ 250 కిమీ రేంజ్ ఇస్తే ఎలక్ట్రిక్ బైక్లలో ఒక సంచలనంగా నిలిచే అవకాశం ఉంది.
ధర ఎంతంటే..!
కొమాకీ రేంజర్ క్రూయిజర్ బైక్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఈ బైక్ ధర ఉంటుందని కంపెనీ పేర్కొంది. నిపుణుల అంచనా మేరకు ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ ధర దాదాపు రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) ఉండనున్నట్లు సమాచారం. ఈ ధరలో గనుక పైన చెప్పిన డిజైన్, ఫీచర్స్ తో గనుక వస్తే మాత్రం బైక్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం మాత్రం ఖాయం. "సరసమైన ధరలో భారతదేశంలో తయారు చేసిన నాణ్యమైన క్రూయిజర్ వాహనాన్ని ముఖ్యంగా సామాన్యుడికి అందుబాటులో ఉంచాలని మేము కోరుకుంటున్నాము" అని కోమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా గతంలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment