సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామునే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్(KTR) విచారణ జరుగుతున్న వేళ బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఈరోజు ఉదయం 5:30కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు ఉదయం 5:30 కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది. @BRSparty pic.twitter.com/bFtbUFGYt0
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 6, 2025
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race) కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్‌ఎస్(BRS Party) ఎమ్మెల్యే కేటీఆర్ ఈకేసులో నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరుకున్నారు. దీంతో, కేటీఆర్ విచారణకు వెళ్తారా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కేటీఆర్ విచారణకు వెళ్తున్న సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు పోలీసులను అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment