సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మద్దతుదారులు.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
కాగా, అరికెపూడి అనుచరుల దాడి ఘటనపై కేటీఆర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం?. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భందంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా?.
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా?. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదిరేది లేదు. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదు’ అంటూ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి.. అరికెపూడి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment