arikepudi gandhi
-
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యే గాంధీ వ్యవహారం
-
‘హరీష్ నామినేషన్ ఏమైంది?’.. పీఏసీ భేటీలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. అనంతరం, బీఆర్ఎస్ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.కాగా, పీఏసీ చైర్మన్ గాంధీ అధ్యక్షతన నేడు మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, ఎంఐఎం నుంచి బలాల, బీజేపీ నుంచి రామరావు పవార్, బీఆర్ఎస్ నుంచి పశ్రాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, భాను ప్రసాద్ రావు, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ హాజరయ్యారు.ఈ సమావేశం సందర్భంగా పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని ఎలా నియమిస్తారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ అన్నారు. అలాగే, పీఏసీకి ఎన్ని నామినేషన్లను వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం, సమావేశం నుంచి వాకౌట్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మా ప్రశ్నలకు పీఏసీలో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు.. అందుకే వాకౌట్ చేశాం. స్పీకర్ స్పందించడం లేదు.. అన్ని శ్రీధర్ బాబే మాట్లాడుతున్నాడు. వాళ్ల తప్పుడు పనులు మేము బయటపెడతామని భయపడుతున్నారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే మా ఎల్పీ ఆఫీసుకు ఎందుకు రావడం లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తికి పీఏసీ చైర్మన్ ఇచ్చారు.గాంధీకి మా పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వలేదు. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైంది. గాంధీ నామినేషన్ ఎలా వచ్చింది. ఆయన ఎంపిక ఎలక్షన్ ప్రకారం జరిగిందా.. సెలక్షన్ ప్రకారం జరిగిందా అనేది మాకు తెలియాలి. పీఏసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనది. ప్రతీ రూపాయిని ప్రజల పక్షాన పీఏసీ ఆడిట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మా సభ్యుల సంఖ్య ప్రకారం ఐదుగురి పేర్లు ఇవ్వమన్నారు. ఐదుగురి పేర్లు ఇచ్చాం. కానీ, అందులో గాంధీ పేరు లేదు. అయినప్పటికీ గాంధీకి ఎలా పదవి ఇచ్చారు.2014లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేదు.. అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పార్లమెంట్ పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌ను చేశారు. రాహుల్ గాంధీ సూచన మేరకే ఇది జరిగింది. 2014లో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కే పీఏసీ పదవి ఇచ్చాం. 2018లో కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంఐఎంకు ఉన్నారు. 2018లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎంఐఎం కాబట్టి అక్బరుద్దీన్‌కు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చాం. 2018లో పీఏసీ చైర్మన్ శ్రీధర్ బాబు అడిగారనేది అవాస్తవం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘నామినేషన్ వేయకుండానే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారనేది మా వాదన. ఎజెండా ఏంటో ఇంకా చూడలేదు.. ఆలోపే వాకౌట్ చేశాం. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం తీసుకోవాలి. మొదట పార్టీ మారిన ముగ్గురిపై కేసు వేశాం. మిగతా వారిని ఇంప్లీడ్ చేస్తాం. స్పీకర్ తీర్పును న్యాయ సమీక్ష చేస్తామని హైకోర్టు చెప్పింది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి: కేటీఆర్ -
ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద హైటెన్షన్
సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం(సెప్టెంబర్15) పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. డీసీపీ, ఏసీపీలతో పాటు భారీగా పోలీసులు గాంధీ నివాసం వద్ద మోహరించారు. గాంధీ నివాసానికి రావాలని బీఆర్ఎస్ నాయకులు పార్టీ శ్రేణులకు ఫోన్లు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. గాంధీ ఇంటి వద్ద దాదాపు 300 మంది ఫోర్స్ ను అందుబాటులో ఉంచారు. బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా రావొచ్చని ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే భద్రత పెంచినట్లు తెలుస్తోంది. గాంధీ నివాసం పరిసరాల్లో గత నాలుగు రోజులుగా పోలీసుల ఆంక్షలతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. గాంధీకి ఇంటి వెళ్లే దారిలో మొత్తం మూడు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో సవాళ్లు, ప్రతిసవాళ్ల తర్వాత గాంధీ అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. తర్వాత బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంట్లో భేటీ అవుతామని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. దీంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు అనిపించినప్పటికీ తాజాగా బీఆర్ఎస్ నాయకులు మళ్లీ గాంధీ ఇంటికి రావొచ్చనే సమాచారంతో పోలీసులు మళ్లీ అప్రమత్తమయ్యారు. ఇదీ చదవండి.. ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత -
డీసీపీ ఫిర్యాదు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు
సాక్షి,హైదరాబాద్:హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో శనివారం(సెప్టెంబర్14) కేసు నమోదైంది. అడిషనల్ డీసీపీ హరిచందద్రారెడ్డి ఫిర్యాదుతో బీఎన్ఎస్ఎస్ 132 కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.గురువారం తన ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి తర్వాత కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తనను బెదిరించారని డీసీపీ ఫిర్యాదు చేశారు. కాగా, కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య వాగ్యుద్ధం ముదిరి దాడులు, కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ పగ: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.శనివారం కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. పోలీస్ ఎస్కార్ట్‌తో వచ్చి కౌశిక్‌రెడ్డి ఇంటిపై గాంధీ దాడి చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను రేవంత్ కాపాడలేకపోయారన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, ఇక్కడి ప్రజలను రేవంత్ పగబట్టారని విమర్శించారు. ఇందుకే హైడ్రా తీసుకు వచ్చారన్నారు. నగరంలోప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు.‘మా పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి రేవంత్‌రెడ్డి కండువా కప్పారు. రేవంత్‌రెడ్డి ఆయన తొత్తులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ స్వయంగా కండువా కప్పారు. కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గడగడ వణికి పోతున్నారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉరి తీయాలని గతంలో రేవంత్ అన్నారు.మరి ఇప్పుడెందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటనా. పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరీ కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయించిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. దాడికి సహకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలి. రాజకీయాలను కాంగ్రెస్ దిగజార్చుతోంది’అని కేటీఆర్ మండిపడ్డారు. విదేశీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయమే కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం తొలుత కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపై దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కౌశిక్ రెడ్డిని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు. కాగా, పార్టీ ఫిరాయింపుల విషయమై రెండు రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. ఇవి కాస్తా ముదిరి ఎమ్మెల్యే గాంధీ తన అనుచరుతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.దీంతో పోలీసులు హైదరాబాద్ నగరంలోని బీఆర్స్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో శుక్రవారం పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు
సాక్షి,హైదరాబాద్:శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి మీద గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన ఘటనపై ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితమే ఒక కేసు నమోదవగా ఆ కేసులో గాంధీ ఇప్పటికే బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు పెట్టారు.కాగా, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఇవి కాస్తా హద్దు మీరి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద గాంధీ దాడి చేసే దాకా వెళ్లింది. ఈ దాడిపై బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ నిరసన ఉద్రిక్తంగా మారడంతో హరీశ్‌రావు సహా ముఖ్యనేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టారు. ఇదీ చదవండి.. ఎమర్జెన్సీ కన్నా దారుణం: హరీశ్‌రావు -
నేను మాట్లాడింది తప్పే..: అరికెపూడి
హైదరాబాద్, సాక్షి: కౌశిక్ రెడ్డికి, తనకు మధ్య జరిగిన సంవాదం ద్వారా ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరిగాయని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తాజా పరిణామాల అనంతరం.. శుక్రవారం తన నివాసంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ప్రాంతీయ విబేధాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని ఎవరు ప్రొత్సహించారు?. నన్ను నాలుగైదుసార్లు రెచ్చగొట్టేలా మాట్లాడాడు. అసలు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి... నేను మాట్లాడింది తప్పే.. కానీ రెచ్చగొట్టడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చింది. మహిళలను కూడా కించపరిచేలా మాట్లాడారు. హరీష్ నన్ను భాష మార్చుకోవాలని సూచించారు. కానీ, ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్‌లపై హరీష్ ఎలాంటి భాష వాడారో మనం చూడలేదా? అని అరికెపూడి గాంధీ ప్రశ్నించారు.ఇదీ చదవండి: తెలంగాణ కోసం చావడానికి సిద్ధం! -
తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులను 4 వారాల్లో డిస్క్వాలిఫై చేయాలన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని అన్నారు. అరికెపూడి గాంధీ తన సంగతి చూస్తామంటున్నారని.. తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధమని తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారన్న కౌశిక్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారన్నారు కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్దామని తాను,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు బయలుదేరగా.. హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. తన ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటిపై దాడి చేయాలని చెప్పారని ఆరోపించారు.తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి.. తానుచేసిన తప్పు ఏంటని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..అరికెపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి.స్వయంగా అరికెపూడి గాంధీ నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు.అరికేపూడి గాంధీ భాషను సమాజం అంగీకరిస్తుందా?నేను ఉండేడే విల్లాలో మొత్తం 69 కుటుంబాలు ఉంటాయి.అదే విల్లాలో ఏపీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ఉంటారు.నేను వ్యక్తిగతంగా అరికెపూడి గాంధీని అన్నాను.ఆంధ్రా వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది.చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా,తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారు.హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారు.రేవంత్ రెడ్డి కుట్రతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నారు.రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారురేవంత్ రెడ్డికి ఇక నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అవసరం లేదుకౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు.బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కొట్లాడుతాను.కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా?కేసీఆర్,తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా?రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు బంద్ చేయాలి.మీ రౌడీయిజాన్ని ప్రజలు చూశారు.నిన్న హరీష్ రావును అరెస్టు చేసి షాద్ నగర్‌కు తీసుకువెళ్లారు.బిఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది.పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు.ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు.నాకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తలకు ధన్యవాదాలు.హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు.పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా.కేసీఆర్ పెట్టిన భిక్షతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు.ఇప్పటికైనా సిగ్గు, శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి.నేను అడిగిన ప్రశ్నలకు అరికేపూడి గాంధీకి ఎందుకు భయంపీఏసీ చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పేరును ఇచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకునేందుకు మేము దాడులు చేయడం లేదు.దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ ఉంది.దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు.నేను ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు గాంధీకి వ్యక్తిగతం మాత్రమే.కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్ ను మంచిగా చూసుకున్నారు.ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు.సెటిలర్స్‌ను మా నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.కాగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శంభీపూర్ రాజు నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరిన ఇద్దరిని అడ్డుకున్నారు. వారిద్దరిని గృహనిర్భంధంలో ఉంచారు. ఈ సందర్భంగా పోలీసులతో కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ వాళ్లకు ఓ చట్టం.. తమకో చట్టమా అని నిలదీశారు. గాంధీ ఇంటికి పోతామంటే ఎందుకు ఆపుతున్నారని అడిగారు.మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. దానం నాగేందర్‌కు అనుమతించి తమను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, కంచెల పాలన అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు శంభీపూర్ రాజు ఇంట్లో గృహనిర్భందం చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం వరకు కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్టు చేస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. -
మీడియా కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు: బొంతు రామ్మోహన్
సాక్షి,హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ ఇంట్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీ పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. శుక్రవారం(సెప్టెంబర్13) ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించేందుకు సిద్ధమైన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్ అరెస్టులు చేశారు. ఎమ్మెల్యేలు తలసాని, కౌశిక్ రెడ్డి, మాగంటి గోపినాథ్, వివేకానంద, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను ఆయా ప్రాంతాల్లో వారి ఇళ్లలోనుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి మద్ధతు పలకడానికి అయన నివాసానికి వచ్చిన బొంతు రామ్మోహన్మీడియాలో వార్తల కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడు: బొంతు రామ్మోహన్ సీనియర్ నేత గాంధీ పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తుంది.హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవటమే బీఆర్ఎస్ లక్ష్యం.సెటిలర్ల పట్ల కౌశిక్ రెడ్డి కామెంట్స్ సరైనవి కావు.సీనియర్ నేత గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది.రాజా సింగ్, బీజేపీ ఎమ్మెల్యేమాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోవడంతో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటందని మంచి సూచన చేశారు.దాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.పనిపాట లేక కేంద్రంపై ఏదో ఒక ఆరోపణ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ పైన మంచిగా ఫైట్ చేస్తున్నారు..కేటీఆర్‌తోపాటు వారి ఎమ్మెల్యేలు మంచిగా ఫైట్ చేస్తున్నారు ఆ దారిలో వెళ్లండి.కానీ మధ్యలో మంచి పనులపై ఇలాంటి కామెంట్స్ చేస్తే పిచివాళ్లని జనాలు అంటారు..నేను చేసిన తప్పు ఏంటి?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారు.ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్దామని నేను, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు బయలుదేరాము.మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు.నాపై ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు.స్వయంగా రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయండని చెప్పారు.నాపై హత్యాయత్నం చేశారు.తెలంగాణలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఎట్లానేను చేసిన తప్పు ఏంటి.?అరికేపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి.స్వయంగా అరికేపూడి గాంధీ నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు.అరికేపూడి గాంధీ భాషను సమాజం అంగీకరిస్తుందా?నేను వుండే విల్లాలో మొత్తం 69 కుటుంబాలు ఉంటాయి.అదే విల్లాలో ఏపీ మంత్రి నారాయణ,ఎమ్మెల్యేలు ఉంటారు.నేను వ్యక్తిగతంగా అరికేపూడి గాంధీని అన్నాను.ఆంధ్రా వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది.చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారు.హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారు.రేవంత్ రెడ్డి కుట్రతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నారు.రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారుకాంగ్రెస్ మంత్రులు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారురేవంత్ రెడ్డికి ఇక నుంచి కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు అవసరం లేదుకౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు.బిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కొట్లాడుతాను.కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా...?కేసీఆర్,తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా...?రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు బంద్ చేయాలి మీ రౌడీయిజాన్ని ప్రజలు చూశారునిన్న హరీష్ రావును అరెస్టు చేసి షాద్ నగర్ కు తీసుకువెళ్లారుబీఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది.పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు.ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదునాకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తలకు ధన్యవాదాలుహైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు.పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా.కేసీఆర్ పెట్టిన భిక్షతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు.ఇప్పటికైనా సిగ్గు,శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి.నేను అడిగిన ప్రశ్నలకు అరికేపూడి గాంధీకి ఎందుకు భయం?పీఏసీ చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పేరును ఇచ్చింది.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు మేము దాడులు చేయడం లేదు.దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ ఉందిదానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు.నేను ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు గాంధీకి వ్యక్తిగతం మాత్రమే.కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్ ను మంచిగా చూసుకున్నారు.ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్స్ బిఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు.సెటిలర్స్ ను మా నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అల్లర్లు సృష్టించాలని కుట్ర చేస్తున్నారు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంసీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక హై డ్రామా చేస్తున్నారు.కౌశి క్ రెడ్డి అనే షికండిని పెట్టి హరీష్ రావు డ్రామా అడుతున్నాడు.కౌశిక్ రెడ్డికి మహిళల పట్ల గౌరవం లేదు.మహిళ గౌర్నర్ ని కూడా అవమానించాడు.కరీంనగర్ జెడ్పీ మీటింగ్‌లో మహిళా కలెక్టర్ పై కూడా అమర్యాదగా మాట్లాడారు.రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కుట్ర చేస్తున్నారు.ఈ కుట్రలను పసిగట్టాలని డిజిపికి విజ్ఞప్తి.కేసీఆర్ పామ్ హౌస్ లో పడుకున్నాడు.కేటీఆర్ విదేశాల్లో ఉండి కుట్రలకు తెర లేపారు.గ్యాప్‌ను ఉపయోగించుకోవాలని హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు.కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి.లేదంటే తెలంగాణ ప్రజలు కౌశిక్ రెడ్డిని తిరగనియ్యరు.ఏఐజీ ఆస్పత్రిలో హరీశ్‌రావుకు వైద్య పరీక్షలుకుడి భుజానికి చికిత్స తీసుకునేందుకు హరీశ్‌రావుకు అనుమతిచ్చిన పోలీసులుగురువారం గొడవల్లో హరీశ్‌రావు భుజానికి గాయంతొలుత హౌస్ అరెస్టు కారణంగా ఇంట్లోనుంచి బయటికి రావడానికి అనుమతించని పోలీసులు తర్వాత అనుమతిచ్చి ఏఐజీ ఆస్పత్రికి హరీశ్‌రావు వెంట వచ్చిన పోలీసులుఆస్పత్రిలో హరీశ్‌రావును ఎవరితో కలవనివ్వని పోలీసులుహరీశ్రావును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్ కవిత అరెస్టుకౌశిక్రెడ్డి, శంభీపూర్ రాజు హౌస్ అరెస్టుపీఏసీ చైర్మన్ గా ఎమ్మెల్యే గాంధీ ఎన్నికైనందునే శాలువా కప్పడానికి వెళ్తామంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.గాంధే స్వయంగా రమ్మని ఆహ్వానించినా పోలీసులు అడ్డుకుంటున్నారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ అరికెపూడి గాంధీ ఇంటికి ఎలా వెళ్లారు వారికి ఎలా పర్మిషన్ ఇస్తారు. ఎమ్మెల్యే గాంధీ ఇంటికి బయల్దేరిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ శంభీపూర్ రాజులను పోలీసులు బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి హౌస్ అరెస్టు చేశారు. హరీశ్‌రావు అంటే గౌరవం.. ఆయన స్థాయి తగ్గించుకుంటున్నారు: దానం నాగేందర్ కౌశిక్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. కౌశిక్ రెడ్డికి మహిళలంటే లెక్కలేదు.ఆయన ఒక బచ్చా. మహిళల ప్రతాపం అతనికి పూర్తిస్థాయిలో తెలియదు.మా ఎమ్మెల్యే గాంధీ టిఫిన్‌కి పిలిచాడు. అందుకోసమే గాంధీ ఇంటికి వచ్చాను.హారతులిచ్చి స్వాగతం పలుకుతామంటేనే గాంధీ, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు.ప్రాంతీయ విభేదాలను కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం సరికాదు.హరీష్ రావు అంటే నాకు గౌరవం. ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారుమాజీ మంత్రి హరీశ్‌రావు హౌజ్ అరెస్ట్.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో భేటీ అవుతామని మేడ్చల్ జిల్లా నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ఇంటి వద్ద భారీగా మోహరించారు. కోకాపేటలోని ఇంట్లోనే హరీశ్‌రావును హౌస్ అరెస్ట్ చేశారు. హరీశ్‌రావు ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు హరీశ్‌రావు బయటికి వెళ్లకుండా అటు ఇంట్లోకి ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్ కవితను హరీశ్‌రావు నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గురువారం నిరసనలు, పోలీసుల అరెస్టు సందర్భంగా హరీశ్‌రావు చేతి గాయమైంది. ఈ గాయానికి చికిత్స తీసకోవడానికి ఆస్పత్రికి వెళ్తానని చెప్పినా తొలుత అనుమతించని పోలీసులు తర్వాత అనుమతిచ్చి ఆయన వెంట ఆస్పత్రికి వెళ్లారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కౌశిక్‌రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ వివాదంలో సైబరాబాద్ కమిషనరేట్ ముందు ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిపి నిరసన తెలిపిన హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రి 11 గంటలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హరీశ్‌రావు చేతికి గాయమైంది. బీఆర్ఎస్తో యుద్ధం కాదు.. కౌశిక్‌రెడ్డితోనే యుద్ధం: ఎమ్మెల్యే గాంధీ ఇది బీఆర్ఎస్,గాంధీకి యుద్ధం కాదని, కౌశిక్‌రెడ్డికి తనకు మధ్య యుద్ధమని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్13) ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. గురువారం ఉదయం నా ఇంటికి వస్తానని కౌశిక్‌రెడ్డి అన్నారు.ఆయన రానందున వాళ్ల ఇంటికి నేనే వెళ్లా. ఇది బీఆర్ఎస్, గాంధీకి యుద్ధం కాదు.కౌశిక్‌రెడ్డితో యుద్ధం. కౌశిక్ బీఆర్ఎస్లోకి వచ్చి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు.ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. పార్టీలో ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు.ఇలాంటి వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయే ప్రమాదముంది.ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలి. బీఆర్ఎస్, కేసీఆర్ అంటే నాకు గౌరవం.వ్యక్తిగతంగా మాత్రమే కౌశిక్‌రెడ్డితోనే నాకు యుద్ధం. సమఉజ్జీ కూడా కాని కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నాగాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు.. గాంధీ ఇంట్లో భేటీకి బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి గాంధీ నివాసానికి ఎవరు వచ్చినా అడ్డుకుంటున్నారు. శుక్రవారం ఉదయం గాంధీ ఇంటికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి ఇప్పటికే అక్కడినుంచి తరలించారు. కౌశిక్‌రెడ్డి డౌన్‌డౌన్ నినాదాలు.. గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తతఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో ముగిసిన కార్యకర్తల సమావేశం.కౌశిక్ రెడ్డిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం.కౌశిక్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు ఎవరు గాంధీ వచ్చినా సానుకూలంగా స్వాగతిస్తాం.ఒకవేళ దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని గాంధీ అనుచరులు స్పష్టం చేశారు.కౌశిక్‌రెడ్డి డౌన్‌డౌన్ నినాదాలతో గాంధీ నివాసప్రాంగణం మార్మోగుతోంది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మేడ్చల్ బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు..మరోవైపు గాంధీ ఇంట్లో భేటీకి సిద్ధమవుతున్న పలువురు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ఉదయం నుంచే అరెస్టు చేస్తున్నారు. పలువురిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. భేటీ కోసం బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళితే ఉద్రిక్తతలకు దారి తీస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మా ఎమ్మెల్యే ఇంటికి మేం వెళితే తప్పేంటి: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ చీఫ్ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే గాంధీ ఇంట్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీకి పిలుపునిచ్చిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధినేత శంభీపూర్‌రాజు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై రాజు స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి తాము వెళితే తప్పేంటి అని రాజు ప్రశ్నించారు. ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పిన మాటలను ఈ సందర్భంగా రాజు గుర్తు చేశారు. ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి రావాలని రాజు ఆహ్వానించారు. మరోపక్క గాంధీ ఇంటికి బయలుదేరిన మేడ్చల్ బీఆర్ఎస్ నేతలను, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గులాబీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు.. కేసు నమోదు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఫిర్యాదుతో కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి పట్ల చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగిన హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర తదితర బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అక్కడినుంచి తరలించి కేశంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సివచ్చింది. అనంతరం రాత్రి 11 గంటలకు హరీశ్‌రావు సహా ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు కేశంపేట పోలీస్‌స్టేషన్ నుంచి విడుదల చేశారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్లోనే గాంధీ.. ప్రతిపక్షానికే పీఏసీ: సీఎం రేవంత్ -
బీఆర్ఎస్లోనే గాంధీ.. ప్రతిపక్షానికే పీఏసీ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌గా ఎన్నికైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముమ్మాటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్షానికి పీఏసీ పదవి కట్టబెట్టామని తేల్చిచెప్పారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అడ్డగోలు నియామకాలు చేసింది బీఆర్ఎస్ కాదా అని విరుచుకుపడ్డారు. ‘అసెంబ్లీ చివరి రోజు పార్టీ బలాబలాలను స్పీకర్ ప్రకటించారు. బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబితే ఆరోజు బీఆర్ఎస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మా సంఖ్య 38 కాదు.. 28 మాత్రమే అని వాళ్లు అనలేదు. అలాంటప్పుడు అనర్హత అనే అంశమే ఇక్కడ తలెత్తదు’ అని స్పష్టం చేశారు. పార్టీ పరిస్థితులపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్.. తన అధికార నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా అరికెపూడి గాందీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వివాదంతోపాటు పలు అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో పీఏసీ ఎంపిక తీరును తప్పుపట్టారు. ‘కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2018 నుంచి 2023 వరకు అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్ ఎలా ఉన్నారు. అప్పుడు సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌కు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని అంటే... అది స్పీకర్ విచక్షణాధికారమని బీఆర్ఎస్ నేతలన్నారు. 2014లో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు బీఏసీ సభ్యులుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్‌రెడ్డి పేర్లు ఇస్తే... రేవంత్‌రెడ్డి పేరుకు ప్రత్యామ్నాయం సూచించాలని స్పీకర్ ఎందుకు అన్నారు? ఎర్రబెల్లి పార్టీ మారినప్పుడు నన్ను ఫ్లోర్ లీడర్‌గా గుర్తించాలని చెబితే ఎందుకు గుర్తించలేదు? 2014, 2018లో ఈ విధానాన్ని ప్రారంభించింది మీరే కదా’ అని అన్నారు. పీఏసీలో 13 మంది సభ్యులుంటే బీఆర్ఎస్ నుంచి ఆరుగురికి, సీపీఐ, ఎంఐఎం, బీజేపీ నుంచి ఒక్కక్కరికి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ నుంచి నలుగురికి మాత్రమే అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిక కోరలేదు కాబట్టే స్పీకర్ నామినేషన్లను పరిశీలించి గాందీకి అవకాశం కల్పించారని తెలిపారు. కౌశిక్ వ్యాఖ్యలపై వారంతా క్షమాపణ కోరాలి కౌశిక్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్‌రెడ్డి, ‘బతకడానికి వచ్చినోళ్లు అంటూ గాం«దీని ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి వాళ్ల బాస్ చెప్పిందే మాట్లాడారు. కౌశిక్ అలా మాట్లాడొచ్చా లేదా అనేది కేసీఆరే చెప్పాలి. కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సమాధానం చెప్పాలి’ అని అన్నారు. బతకడానికి వచ్చిన వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లు వద్దా? అని నిలదీసిన ముఖ్యమంత్రి.. వాళ్లు ఓట్లేస్తేనే కదా గ్రేటర్లో గెలిచిందని గుర్తుచేశారు. ‘బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడమంటే కౌశిక్ మాట్లాడాడా, లేక ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలా అనేది స్పష్టం చేయాలి. వీళ్లు మాట్లాడమంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కౌశిక్ వ్యక్తిగతంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ది సైకలాజికల్ గేమ్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు తీర్పును ప్రస్తావించగా, ‘తీర్పును నేను అధ్యయనం చేయలేదు. అది చూస్తేనే దీనిపై మాట్లాడగలను’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారనగా.. ‘బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. మా పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ 66 మంది ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులేం ఉండవు. ప్రభుత్వాన్ని పడగొడతామన్నందుకే ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఈ చర్చలన్నీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నందుకే చర్చ జరుగుతోంది. ఆ రెండు పార్టీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి లేదని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం మరింత పటిష్టంగా ఉన్నట్లే కదా. ఏ ఎమ్మెల్యే అయినా అటూఇటూ దిక్కులు చూస్తే అనర్హత వేటు పడుతుందంటే ఇక ప్రభుత్వానికి ఢోకా ఎక్కడుంది’ అని అన్నారు. ఇదే అంశంపై మరింత స్పష్టతనిస్తూ ‘కోర్టుకెళ్లి అనర్హతలపై ఆర్డర్ తెచ్చామంటున్నారు. బీఆర్ఎస్ నేతలు ఏ ఆర్డర్ తెచ్చినా.. ప్రభుత్వంలోని పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కునే అవకాశమే లేదని చట్ట ప్రకారం నిర్ణయం వస్తే, ప్రతిపక్ష పార్టీలకన్నా, మా పార్టీ వాళ్లమే ఎక్కువ సంతోషిస్తాం. ఎమ్మెల్యేలు ఎక్కడివారక్కడే ఉండాలని బీఆర్ఎస్ వాళ్లంటున్నారు. మేమూ అదే కోరుకుంటున్నాం. ఎక్కడివారు అక్కడే ఉంటే నా 66 మంది నాతో ఉంటారు. కేసీఆర్ లక్కీ నంబర్ నా వద్దే ఉంది కదా’ అని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొడతామని తిరిగేకంటే పథకాల అమలు గురించి ప్రశ్నిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రివర్గం విస్తరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన తర్వాతే ఎవరిని తీసుకోవాలనే విషయంలో సీఎం పాత్ర వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో అడ్డగోలుగా 14 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులిచ్చారని, వీటిని ఫిల్టర్ చేసేలా జర్నలిస్టు సంఘాలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
కౌశిక్ ఇంటిపై దాడి.. సీపీ ఆఫీసుకు హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాందీ, ఆయన అనుచరులు దాడికి దిగారు. గాంధీ స్వయంగా కౌశిక్‌రెడ్డి నివాసంవైపు దూసుకురాగా.. అనుచరులు ఇంట్లోకి వెళ్లి అద్దాలు, పూల కుండీలు పగలకొట్టడంతోపాటు రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, కుర్చీలు విసురుతూ విధ్వంసానికి పాల్పడ్డారు. పాడి కౌశిక్‌రెడ్డి, ఆయన భార్య, కూతురు, కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే.. సుమారు గంట పాటు వీరంగం సృష్టించారు. అరికెపూడి ఈ సమయంలో కౌశిక్‌రెడ్డి ఇంటి ముందే కుర్చీ వేసుకుని ‘నీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటికి రా..నా కొడకా’ అంటూ తీవ్ర పదజాలంలో సవాల్ చేశారు. దీనితో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. ఇది తెలిసి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కౌశిక్ నివాసానికి చేరుకోవడంతో.. పోలీసులు ఎమ్మె ల్యే గాం«దీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. గాందీపై, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేయడానికి కౌశిక్‌రెడ్డి, హరీశ్, ఇతర నేతలు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు వెళ్లగా.. హరీశ్‌రావును, ఇతర ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. మరోవైపు ఇటీవలే అనారోగ్యానికి గురై కోలుకుంటున్న కౌశిక్‌రెడ్డి మామ కృష్ణారెడ్డి.. ఈ దాడితో ఆందోళన చెంది, అస్వస్థతకు లోనయ్యారు. అసలు ఎలా మొదలైంది? అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీని నియమించడంతో వివాదం రేగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు పీఏసీ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని బుధవారం అరికెపూడి గాంధీ చెప్పడం.. ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న పక్షంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పి, ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించడం.. అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే హైదరాబాద్ కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం ఉన్న ‘కొల్లూరు లక్సూరియా’ నివాస సముదాయం వద్ద పోలీసులు మోహరించారు. గాంధీ ఇంటికి వెళ్లేందుకంటూ బయటికి వచ్చిన కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు వాహనం కూడా సిద్ధం చేశారు. ఈ సమయంలో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న పక్షంలో ఆయనను శుక్రవారం కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానని ప్రకటించారు. మరోవైపు కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అరికెపూడి.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తానే కౌశిక్ ఇంటికి వెళతానని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే గాంధీ తన ఇంటికి వస్తే పార్టీ కండువా, మంగళ హారతులతో స్వాగతం పలుకుతానని కౌశిక్ ప్రకటించారు. బీఆర్ఎస్ మహిళా విభాగం నేత పావని గౌడ్, మరికొందరు మహిళలు మంగళహారతులతో సిద్ధమయ్యారు. భారీగా అనుచరులను వెంటబెట్టుకుని వచ్చి.. ఇక ఎమ్మెల్యే గాంధీ నివాసానికి వస్తానని కౌశిక్‌రెడ్డి చేసిన ప్రకటనతో గురువారం ఉదయం నుంచే కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని గాంధీ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పలువురు కార్పొరేటర్లు, అనుచరులు గాంధీ నివాసానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలలోపు కౌశిక్‌రెడ్డి తన రాకపోతే.. తానే కౌశిక్ నివాసానికి వెళ్తానని అరికెపూడి గాంధీ ప్రకటించారు. 12 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో అనుచరులతో భారీ కాన్వాయ్‌గా కౌశిక్ నివాసానికి బయలుదేరారు. పోలీసులు కౌశిక్‌రెడ్డి ఉంటున్న నివాస సముదాయం గేట్లు మూసేసినా.. గాంధీ అనుచరులు పైనుంచి లోనికి దూకారు. గేట్లు తెరుచుకుని కౌశిక్ ఇంటివైపు దూసుకెళ్లారు. అప్పటికే కౌశిక్‌రెడ్డి అనుచరులు కూడా అక్కడ ఉండటంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో గాంధీ అనుచరులు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కౌశిక్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి విషయం తెలిసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో కౌశిక్ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బిగాల గణేశ్‌గుప్తా, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజీవ్ సాగర్, కొలన్ బాల్‌రెడ్డి తదితరులు కౌశిక్‌రెడ్డిని పరామర్శించారు. కౌశిక్ నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడి ఘటన తీరును వివరించారు. కౌశిక్ కుటుంబ సభ్యులను కేసీఆర్ ఫోన్లో పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను. ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డమీద కూర్చొని నువ్వు సవాల్ చేస్తే భయపడతామనుకున్నవా.. బిడ్డా! నన్ను హత్య చేసే ప్రయత్నం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావాలి. నీకు 65 ఏండ్లు, నాకు 35 ఏళ్లు.. నా ఇంటిపై దాడి చేయిస్తవా. సరే చూసుకుందాం. రేపు నా తడాఖా ఏంటో చూపిస్తా. గాంధీ చర్యకు ప్రతి చర్య ఉండటం ఖాయం. – హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పార్టీని భ్రషు్టపట్టించిన బ్రోకర్ నా కొడుకు కౌశిక్‌రెడ్డి. చీటర్, బ్రోకర్, కోవర్టు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గౌరవిస్తా. కౌశిక్ లాంటివారే కేసీఆర్ చుట్టూ చేరి పార్టీకి తీవ్ర నష్టం చేశారు. ఇలాంటి బ్రోకర్లను దూరం పెట్టినపుడే బీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తారు. కౌశిక్ నా ఇంటికి వస్తానని చెప్పి దాక్కున్నాడు. కొడకా నీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటకు రా.. – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ -
సీపీ ఆఫీసు వద్ద టెన్షన్.. పోలీసులకు కౌశిక్ రెడ్డి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల ఎపిసోడ్ రాజకీయంగా ఘర్షణలకు దారి తీసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ ఆఫీసు వద్ద కౌశిక్ రెడ్డి, పోలీసులకు మధ్య వాదన జరిగింది.సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కొండాపూర్‌లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హరీష్ రావుతో కలిసి కౌశిక్ రెడ్డి.. సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సీపీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పోలీసులు, కౌశిక్ రెడ్డి మధ్య వాదనలు జరిగాయి. పాడి కౌశిరెడ్డి.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి వెలెత్తి చూపిస్తూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వెంటనే కలుగుజేసుకున్న హరీశ్ రావు.. పాడి కౌశిక్ రెడ్డికి సముదాయించి పక్కకు పంపించారు. అనంతరం ఆయన పోలీసులతో మాట్లాడారు. దీంతో సీపీ ఆఫీసు వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, సీపీ ఆఫీసు వద్ద హరీష్ రావు మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటాం. అరికెపూడి గాంధీ అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలి. దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుంటే కోర్టుకు వెళ్తాం. ఈ ఘటనపై డీజీపీ ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి వద్ద ధర్నా చేస్తాం. నార్సింగి పీఎస్‌లో గూండాలకు బిర్యానీలు పెడుతున్నారు. సీఎం డైరెక్షన్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సీపీ ఆఫీసు వద్ద ఆందోళనలు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: త్వరలో మరిన్ని చేరికలు.. టీపీసీసీ చీఫ్ కామెంట్స్ -
ఇది కచ్చితంగా రేవంత్ చేయించిన దాడే: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మద్దతుదారులు.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.కాగా, అరికెపూడి అనుచరుల దాడి ఘటనపై కేటీఆర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం?. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భందంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా?.ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా?. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదిరేది లేదు. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదు’ అంటూ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి.. అరికెపూడి అరెస్ట్ -
పక్కా ప్రణాళికతోనే కౌశిక్‌రెడ్డిపై దాడి, ప్రభుత్వానిదే బాధ్యత: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆయన అనుచరుల దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. పక్కా ప్రణాళికతోనే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హరీష్ రావు మాట్లాడుతూ.. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదే ప్రజా పాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడమే కాకుండా.. వారిని ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ విద్రోహా, వికృత, అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. వెంటనే కౌశిక్ రెడ్డికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో కౌశిక్‌పై గాంధీ అనుచరుల దాడి హేయమని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు.కాంగ్రెస్ గుండాలు మా ఎమ్మెల్యేపై దాడి చేశారు.వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తే దాడి చేశారుఎమ్మెల్యే అరికెపైడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.ప్రశ్నిస్తే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు.సీఎం రేవంత్ ప్రోద్భలంతోనే మా ఎమ్మెల్యేపై దాడి చేశారుఏసీపీ, సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలిహైదరాబాద్లో పట్టపగలే ఎమ్మెల్యేకు రక్షణ లేదుఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఏం ఉంటుందిఇది రేవంత్ ప్రభుత్వ వైఫల్యంమీరు ఒకటి చేస్తే.. మేము రెండు చేయగలుగుతాంఅధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదుమా సహనాన్ని అసమర్థతగా భావించొద్దురేవంత్ బాధ్యత లేని మనిషిశాసన సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాద్యత స్పీకర్దికౌశిక్పై దాడి చేసిన వారిని జైలుకు పంపేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందిపార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాహుల్ రాజీనామా చేయించాలికాంగ్రెస్ మోసాలను దేశం మొత్తం గమనిస్తోంది’ అని హరీష్ రావు పేర్కొన్నారు.కాగా పీఏసీ కమిటీ చైర్మన్‌గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో మొదలైన విమర్శల పర్వం.. ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పరస్పర సవాల్-ప్రతిసవాల్ ఎపిసోడ్లో అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లనివ్వకుండా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటికే అరికెపూడి వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అరికెపూడి వర్గీయులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. ఈ క్రమంలో.. అరికెపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి వర్గీయులు ప్రతిఘటనకు దిగడంతో.. ఇరువర్గాలు కుర్చీలతో బాహాబాహీకి దిగాయి. అక్కడితో ఆగకుండా అరికెపూడి వర్గీయులు రాళ్లు, టమాటాలను కౌశిక్‌రెడ్డి ఇంటిపైకి విసిరారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి.ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్పరిస్థితి చేజారుతున్న క్రమంలో.. ఎమ్మెల్యే అరికెపూడిని, నలుగురు కార్పొరేటర్ల పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు. -
‘అలాంటి పార్టీలో ఎవరైనా ఉంటారా?’.. అరికెపూడి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ పార్టీపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను పీఏసీ చైర్మన్‌గా నియమించింది. ఈ నియామకంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది.ఇది చిలికి చిలికి గాలివానగా మారి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేసేదాకా వెళ్లింది. గాంధీ ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతోనే కౌశిక్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్‌కు రావాలి. ఆయన ఇంటికి వెళ్లి మా పార్టీ కండువా కప్పుతా’’ అంటూ కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ క్రమంలో తాజాగా అరికెపూడి గాంధీ కౌంటర్ గా తీవ్ర పదజాలమే ఉపయోగించారు.‘‘కౌశిక్ రెడ్డి ఊరు మీద పడ్డ ఆంబోతు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో నాకు ఎలాంటి విబేధాలు లేవు. అయినా కూడా ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లేది లేదు. ఆ పార్టీలో బ్రోకర్లు ఉన్నారు. బ్రోకర్లతో సంసారం చేయగలుగుతామా?’’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.అంతకు ముందు.. కౌశిక్ రెడ్డికి కౌంటర్‌గా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. నా ఇంటికి పోలీసుల బందోబస్తు అవసరం లేదు. ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’’ అంటూ ప్రతిసవాల్ విసిరారు. చదవండి: సవాళ్ల పర్వం.. కౌశిక్‌రెడ్డి, అరికెపూడి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు -
సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: పీఏసీ కమిటీ చైర్మన్‌గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో మొదలైన విమర్శల పర్వం.. ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పరస్పర సవాల్-ప్రతిసవాల్ ఎపిసోడ్లో అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లనివ్వకుండా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటికే అరికెపూడి వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అరికెపూడి వర్గీయులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. ఈ క్రమంలో.. అరికెపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి వర్గీయులు ప్రతిఘటనకు దిగడంతో.. ఇరువర్గాలు కుర్చీలతో బాహాబాహీకి దిగాయి. అక్కడితో ఆగకుండా అరికెపూడి వర్గీయులు రాళ్లు, టమాటాలను కౌశిక్‌రెడ్డి ఇంటిపైకి విసిరారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి.సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతసైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్ట్హరీష్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులురెండు గంటలుగా సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతఅరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో కేసు నమోదు19 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుRS ప్రవీణ్ కుమార్‌తోపాటు హరీష్ రావుకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించిన పోలీసులుసైబరాబాద్ సీపీ ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని కోరిన పోలీసులుహత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడంపై అభ్యంతరంసీపీ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న బీఆర్ఎస్ నేతల ఆందోళనఒక వీధి రౌడీలాగి ఇంటికి వస్తా అని రెచ్చగొట్టాడు: అరికెపూడి గాంధీవిద్వేషా రెచ్చగొట్టిన బీఆర్ఎస్ పార్టీ.. ఆ సభ్యుడిని తక్షణమే సస్పెండ్ చేయాలిప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టిన కౌశిక్‌రెడ్డిని సస్పెండ్ చేయాలి పదేళ్లలో ఇలాంటి ఘటనలు జరగలేదు: హరీష్ రావుత్వరలో రాహుల్ గాంధీ నివాసం వద్ద ధర్నా చేస్తాంగాంధీతోపాటు కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలిఅరెస్ట్ చేయకుంటే కోర్టుకు వెళ్తాంఘటన పై వెంటనే డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష వేయాలి సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తతబీఆర్ఎస్ నేతలను ఆఫీస్‌లోకి అనుమంతించని పోలీసులుపోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదంకౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేదాకా సీపీ ఆఫీస్‌లోనే ఉంటామన్న బీఆర్ఎస్ నేతలుసీపీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నేతల ఆందోళనకౌశిక్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలుముగ్గురు ఎమ్మెల్యేలకు అనుమతిసీపీ లేకపోవడంతో జాయింట్ సీపీ జోయెల్ డెవిస్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలి: హరీష్ రావుఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతాం: హరీష్ రావుకౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులుఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యేను కోరిన పోలీసులుదాడి చేయడానికి వచ్చిన వాళ్లను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిడీసీపీ, ఏసీపీలను సస్పెండ్ చేసిన తరువాతే ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే వెల్లడిపట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? కేటీఆర్శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మద్దతుదారులు.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం?. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భందంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా?ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదిరేది లేదు. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని.. సిద్దిపేట నుండి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్పరిస్థితి చేజారుతున్న క్రమంలో.. ఎమ్మెల్యే అరికెపూడిని, నలుగురు కార్పొరేటర్ల పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు. సాక్షితో మాదాపూర్ డీసీపీకొండాపూర్లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తతఅరికెపూడి గాంధీ వర్గం రాకతో వేడెక్కిన పరిస్థితికౌశిక్ రెడ్డి ఇంటిపైకి రాళ్లు విసిరిన దుండగలుఅరికెపూడిని, ఇరువర్గాల అనుచరుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులుప్రస్తుతం పరిస్థితి కంట్రోల్ అయ్యింది: మాదాపూర్ డీసీపీచట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం: మాదాపూర్ డీసీపీగాంధీ ఆయన అనుచరులపై చర్యలుంటాయి: మాదాపూర్ డీసీపీనేరం చేశారు కాబట్టే చర్యలు తీసుకుంటాం: మాదాపూర్ డీసీపీనా ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి రాలేదు: అరికెపూడి గాంధీ అందుకే నేనేచ్చా: అరికెపూడి గాంధీనాకు దమ్ముంది ఉంది కాబట్టే వచ్చా: అరికెపూడి గాంధీకౌశిక్ రెడ్డికి దమ్ముంటే బయటకు రావాలి: అరికెపూడి గాంధీనన్ను హత్య చేయాలని చూశారు: పాడి కౌశిక్ రెడ్డిగుండాలు వచ్చి దాడి చేయడం కరెక్టేనా: పాడి కౌశిక్ రెడ్డిముందస్తు ప్లాన్‌తో వచ్చి దాడి చేశారు: పాడి కౌశిక్ రెడ్డితెలంగాణ లా అండ్ ఆర్డర్ ఉందా? లేదా?: పాడి కౌశిక్ రెడ్డిఒక ఎమ్మెల్యేకే రక్షణ ఇవ్వలేకపోతే ఎలా?: పాడి కౌశిక్ రెడ్డిపోలీసులు ఏం చేస్తున్నారు?: పాడి కౌశిక్ రెడ్డిదాడికి ప్రతిదాడి ఉంటుంది: పాడి కౌశిక్ రెడ్డి భారీ కాన్వాయ్‌తో కౌశిక్‌రెడ్డి నివాసానికి అరికెపూడికొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న అరికెపూడి గాంధీకౌశిక్రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు అరికెపూడి అనుచరుల యత్నం అరికెపూడి రాకపై పాడి కౌశిక్ రెడ్డిఅరికెపూడి గాంధీని నా ఇంటికి ఆహ్వానిస్తున్నకండువా కప్పి భోజనం పెట్టి తెలంగాణ భవన్ కి తీసుకెళ్తాసాయంత్రం కెసిఆర్ దగ్గరికి తీసుకెళ్తాపోలీసులు నా ఇంటి గేట్ వద్ద ఆపితే .. స్వయంగా గేట్ వద్దకి వెళ్లి పోలీసులకు చెప్పి మరి లోపలికి తీసుకెళ్తా కౌశిక్ రెడ్డి ఇంటికి బయల్దేరిన అరికెపూడి గాంధీనేడు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానేను స్థానికుడిని కాదని చెప్పడానికి కౌశిక్ ఎవడు?ఎవరు అడ్డుకున్నా కౌశిక్ ఇంటికి వెళ్తా!నియోజకవర్గం కోసమే సీఎం రేవంత్‌ను కలిశా మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతే తప్పేంటి?: పాడి కౌశిక్ రెడ్డి11గం. గాంధీగారి ఇంటికి వెళ్తానని చెప్పాఉదయం నుంచే నా ఇంటి ముందు కంచెలేసి పోలీసులు మోహరించారునన్ను వెళ్లకుండా ప్రివెంటివ్ అరెస్ట్ చేశారుకాంగ్రెస్లో చేరలేదని మీరే(అరికెపూడి) అన్నారు కదా!అప్పుడు నేను మీ ఇంటికి వస్తా అంటే ఎందుకు భయం? ఎందుకంత ఉలిక్కిపాటు?తన్నుకుందాం అని నేను అనలేదు కదా?ఎవరు బ్రోకర్?గాంధీలాగా.. పూటకో పార్టీ మారేటోడు బ్రోకరా?. ఒక బీఫామ్ మీద గెలిచిన పార్టీ అండగా ఉండేటోడు బ్రోకరా?గాంధీ.. నేను వయసులో ఉన్నా.. నేను రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూస్కోరేపు బీఆర్ఎస్ ఉనన్న కార్యకర్తలంతా గాంధీ ఇంటికి వెళ్దాంఅక్కడే బ్రేక్‌ఫాస్ట్ తిందా.. లంచ్ చేస్తాంగాంధీగారిని తీసుకుని తెలంగాణ భవన్‌కు తీసుకెళ్తాంఅక్కడి నుంచి కేసీఆర్ దగ్గరకు వెళ్తాంగ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నాఆయన బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్ దగ్గరకు వెళ్లడానికి ఎందుకు భయంబీఆర్ఎస్ కాదట.. పంచాయితీ నాతోనేనట!భూతగాదాలు, అన్నదమ్ముల పంచాయితీ ఉందా?నీ స్వార్థం కోసమే పార్టీ మారారుయావత్ తెలంగాణ సమాజం ఇదంతా చూస్తోంది.దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికకు వెళ్లురేపు కచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్లి తీరతాంగాంధీ మా ఇంటికి వస్తానంటే వెల్కమ్.. సాదరణంగా కండువా కప్పి ఇంట్లోకి తీసుకెళ్తాహుజురాబాద్లో ఈటలలాంటివాడిని ఓడించి గెలిచన వాడిని నేనుఅలాంటి నాపై కోవర్టు అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంరేపు వస్తాం.. కలిసి తెలంగాణ భవన్, కేసీఆర్ దగ్గరకు పోదాంగాంధీగారికి ఇదే ఆహ్వానంలేదు తన్నుకుందాం అంటే ఐ యామ్ రెడీతన్నుకోవడం ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదుఆయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు వస్తే మాకూ సంతోషమే కదా! కౌశిక్‌రెడ్డికి సినిమా చూపిస్తా: అరికెపూడినా ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నా.పది నిమిషాల్లో రాకపోతే నేనే కౌశిక్ ఇంటికి వెళ్తా.కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్.. నాపై సవాల్ చేస్తా. నా దగ్గరకు వస్తాడని ఎదురు చూస్తా. ఆయన రాకపోతే నేనే ఆయన ఇంటికి వెళ్తాఓ దుర్మార్గుడు నా ఇంటి మీద జెండా ఎగరేస్తానంటే ఊరుకుంటానా?12 గం. నేనే కౌశిక్ ఇంటికి వెళ్తాకౌశిక్ రెడ్డి లాంటి దుర్మార్గుడ్ని కేసీఆర్ పదేళ్లపాటు పక్కన పెట్టుకున్నారుగతంలో కౌశిక్‌రెడ్డి కోవర్టుగా పని చేశాడుకౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు దూరం అవుతున్నారుఇజ్జత్ లేనివాళ్ల సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదునేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అని అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారుకౌశిక్ లాంటోడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదుకేసీఆర్కే నా సమాధానం చెబుతాఅంతకు ముందు ఉదయం కూడా ఆయన మాట్లాడుతూ.. ‘‘నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. నా ఇంటికి పోలీసుల బందోబస్తు అవసరం లేదు. ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్ విసిరారు. మరోవైపు.. అరికెపూడి ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పుతానన్న పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కౌశిక్డ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. పీఏసీ కమిటీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై కౌశిక్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్‌కు రావాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పాలి. గురువారం అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా. ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నాడు కాబట్టి రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా.. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగరేసి, BRS భవన్ లో ప్రెస్ మీట్ పెడదాం’’ అని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే దీనికి అరికెపూడి గాంధీ అంతేతీవ్రంగా ప్రతిస్పందించారు. ఇదీ చదవండి: చీర, గాజులు వర్సెస్ చెప్పులు!! -
పీఏసీపై అక్కడో న్యాయం.. ఇక్కడో న్యాయమా?
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీని నియమిస్తూ శాసనసభ కార్యదర్శి సోమవారం విడుదల చేసిన బులెటిన్‌పై రాజకీయ వివాదం రాజుకుంటోంది. రాష్ట్ర శాసనసభ నిర్వహణ నియమావళి ప్రకారం బీఆర్ఎస్ నుంచి ముగ్గురు సభ్యులను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)కి ఎన్నుకోవాల్సి ఉండగా, కేవలం ఇద్దరికి మాత్రమే చోటు దక్కిందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత సూచనలను పరిగణనలోకి తీసుకొని పీఏసీ చైర్మన్‌ను నియమించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అసెంబ్లీ నియమావళిలోని రూల్ 250 ప్రకారం పీఏసీలో అధికార, విపక్ష సభ్యుల నుంచి తొమ్మిది మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం పీఏసీ ఏర్పాటు చేసే నాటికి 38. ఈ లెక్కన బీఆర్ఎస్ తరపున ముగ్గురు ఎమ్మెల్యేలకు పీఏసీలో చోటు కలి్పంచాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆగస్టులో మొదటివారంలో ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం ముగ్గురు సభ్యుల పేర్లను పీఏసీకి ప్రతిపాదించింది. ఈ మేరకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి తమ పత్రాలను సమరి్పంచారు.అయితే కాంగ్రెస్ నుంచి ఎన్నుకోవాల్సిన ఆరుగురు సభ్యుల పేర్లపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని ఆ పార్టీ శాసనసభాపక్షం వ్యవధి కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమను సంప్రదించకుండానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీని తాజాగా పీఏసీ చైర్మన్‌గా నియమించిన తీరును బీఆర్ఎస్ తప్పు పడుతోంది. గాం«దీని నియమించడం అసెంబ్లీ నియమావళి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఎవరి ప్రాధాన్యత ఓటుతో ఎంపిక చేశారంటూ. ప్రాధాన్యత ఓటు ద్వారా ఒక్కో పీఏసీ సభ్యుడిని ఎన్నుకునేందుకు 13 మంది పార్టీ ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినవారు పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరి ప్రాధాన్యత ఓటుతో అరికెపూడి గాం«దీని ఎంపిక చేశారని బీఆర్ఎస్ ప్రశి్నస్తోంది. 1958–59 నుంచి ప్రతిపక్ష సభ్యుడిని చైర్మన్‌గా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలంగాణ శాసనసభ హ్యాండ్‌బుక్ పేజీ 65లో ఉంది. పీఏసీ సభ్యుడిగా తాము ప్రతిపాదించిన హరీశ్‌రావు పేరును జాబితా నుంచి తప్పించడం, గాంధీ పేరును చేర్చడం, చైర్మన్ ఎంపికలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను సంప్రదించకపోవడం తదితరాలు అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అక్కడ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా... పీఏసీ చైర్మన్ నియామకంలో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చేయని దుశ్చర్యను తెలంగాణలో కాంగ్రెస్ చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కాంగ్రెస్‌కు లోక్‌సభలో అతితక్కువ మంది ఎంపీలు ఉన్నా కేవీ థామస్, మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌధురి, కేసీవేణుగోపాల్ను పీఏసీ చైర్మన్‌గా కేబినెట్ హోదా ఇచ్చిన విషయాన్ని బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. రాజ్యాంగాన్ని కాపాడతామంటూ రాహుల్‌గాంధీ ప్రగల్భాలు పలుకుతుండగా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియమాలను తుంగలో తొక్కిందని మండిపడింది.ప్రజాస్వామ్యం ఖూనీ పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. చేతిలో రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌గాంధీ చెప్పే నీతి వాక్యాలు నీటిమూటలు. ఆయనకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎంను ఆదేశించాలి. అరికెపూడి గాం«దీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం రాజ్యాంగాన్ని నిట్టనిలువునా పట్టపగలు ఖూనీ చేయడమే. రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాహుల్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికహక్కు లేదు. – హరీశ్‌రావు, మాజీ మంత్రి ఫిరాయింపు ఎమ్మెల్యేకు పదవి సిగ్గు సిగ్గు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుసిగ్గు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి. పార్లమెంట్లో పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, తెలంగాణ చట్టసభలో మాత్రం అన్యాయమా. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
-
టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు గోపీనాథ్, గాంధీ
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ అధికార టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ పార్టీలో చేరారు. కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి గోపీనాథ్, గాంధీలను పార్టీలోకి ఆహ్వానించారు. అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ గురువారం సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. వీరు రెండుసార్లు సీఎంను కలవడం, పార్టీ మారుతున్నట్లు స్పష్టం కావడంతో టీటీడీపీ నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేశారు. గోపీనాథ్, గాంధీతో సహా టీఆర్ఎస్లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసినట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. టీటీడీపీలో ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. -
కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ సమావేశమయ్యారు. గురువారం మధ్యాహ్నం వీరిద్దరూ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. గోపీనాథ్, గాంధీ టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తమను అధికార టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ ఎస్ మధుసూదనాచారికి లేఖ కూడా రాశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాంధీ, గోపీనాథ్‌లను టీడీపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా తెలంగాణ టీడీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. టీడీపీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. ఇంతకుముందు పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు.