టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు గోపీనాథ్, గాంధీ | tdp mlas Maganti Gopinath, Arikepudi Gandhi join into trs | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు గోపీనాథ్, గాంధీ

Published Fri, Mar 11 2016 2:28 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు గోపీనాథ్, గాంధీ - Sakshi

టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు గోపీనాథ్, గాంధీ

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ అధికార టీఆర్ఎస్లో చేరారు.  టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ పార్టీలో చేరారు. కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి గోపీనాథ్, గాంధీలను పార్టీలోకి ఆహ్వానించారు.

అధికార టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ గురువారం సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. వీరు రెండుసార్లు సీఎంను కలవడం, పార్టీ మారుతున్నట్లు స్పష్టం కావడంతో టీటీడీపీ నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేశారు. గోపీనాథ్, గాంధీతో సహా టీఆర్ఎస్లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసినట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. టీటీడీపీలో ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement