maganti gopinath
-
అజహరుద్దీన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు మాగంటి గోపీనాథ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక అంశం కోర్టుకు చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో, అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అజారుద్దీన్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి ఆరో తేదీ వరకు రిజయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. -
BRS Party: మాగంటి Vs రావుల.. వేదికపైనే తిట్టుకున్నఇరువురు నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వేదికగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు వేదికపైనే తిట్టుకున్నారు. మాగంటి మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్ను ఎవడ్రా పిలిచింది’ అంటూ మాగంటి గోపి ఫైర్ అయ్యారు. దీనికి శ్రీధర్ రెడ్డి బదులిస్తూ ‘నువ్వేవడివి.. నాకు చెప్పడానికి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ జోక్యం చేసుకొని ఇరువురి నేతలకు సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే స్టేజీ కింద ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కొంత అసంతృప్తికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్.. రేవంత్, కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్ -
HYD: బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్య రావుపై కొందరు మహిళలు దాడి చేశారు. వారి దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై దేదీప్య రావు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కొందరు మహిళలు దాడి చేశారు. ఆమె కారులో వెళ్తుండగా అడ్డుకున్న సదరు మహిళలు దేదీప్య రావుపై దాడికి దిగారు. దీంతో, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, తన భర్త విజయ ముదిరాజ్తో కలిసి దేదీప్య రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మాగంటి గోపినాథ్ అరాచకాలు ఎక్కువయ్యాయంటూ స్థానిక మహిళలు ఆరోపలు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. #Hyderabad: Jubilee Hills BRS Corporator Attacked Over Flex Controversy Dedeepya Rao, #BRSParty corporator from Vengala Rao Nagar, faced assault by women amid a dispute over flexes. She & her husband Vijay Mudiraj filed a complaint with the Jubilee Hills police. pic.twitter.com/dE7nLpd5cr — Informed Alerts (@InformedAlerts) March 13, 2024 -
TS Election 2023: దోస్త్ వర్సెస్ దోస్త్..!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు పాత మిత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీపడుతున్నారు. టీడీపీలో ఇరువురు సుదీర్ఘకాలం పని చేశారు. గ్రేటర్లో పలు పదవులు చేపట్టారు. టీడీపీలో పనిచేసిన వీరిరువురు ఇప్పుడు ఒకరు బీఆర్ఎస్, మరొకరు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. వారే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, లంకల దీపక్‌రెడ్డి. టీడీపీలో మూడు దశాబ్దాలకు పైగా గ్రేటర్లో పనిచేసిన మాగంటి గోపీనాథ్ 2014లో టీడీపీ తరఫున గెలిచి తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రెండు దశాబ్దాలుగా టీడీపీలో గ్రేటర్‌తో పాటు రాష్ట్ర పదవులు చేపట్టిన లంకల దీపక్‌రెడ్డి తర్వాత పరిణామాలతో బీజేపీలో చేరారు. రాజకీయ అనుభవం కలిగిన లంకలకు బీజేపీ పార్టీ టికెట్‌ను ఖరారు చేసింది. ఇద్దరూ టీడీపీలో కలిసి గ్రేటర్లో పనిచేశారు. ఇద్దరు పాత మిత్రులు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లంకల తన అనుభవాన్ని జోడించి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తారా.. లేదంటే మాగంటి హ్యాట్రిక్ కొడతారా? అనేది ఓటర్లే నిర్ణయిస్తారు. – శ్రీనగర్‌కాలనీ -
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఈసారి ఈ అభ్యర్థి గెలిస్తే హ్యాట్రిక్ ఖాయం...
జూబ్లిహిల్స్ నియోజకవర్గం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ ఈసారి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. 2014లో ఆయన టిడిపి పక్షాన పోటీచేసి గెలుపొందారు. కాని తరుపరి పరిణామాలలో ఆయన టిఆర్ఎస్లో చేరి పోయారు. 2018లో టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 8385 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గోపీనాద్కు 42430 ఓట్లు రాగా, విష్ణువర్దన్ రెడ్డికి 34045 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అబ్యర్ది నవీన్ యాదవ్ సుమారు 17 వేల ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో 2014లో మాగంటి గోపినాధ్ తన సమీప ప్రత్యర్ధి, ఎమ్.ఐ.ఎమ్. నేత నవీన్ యాదవ్‌పై 9242 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. అంతకుముందు 2009లో గెలిచిన విష్ణువర్ధనరెడ్డి 2014లో 33642 ఓట్లు తెచ్చుకున మూడో స్థానానికి పరిమితం అయ్యారు. విష్ణు దివంగత నేత, మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమారుడు. 2004లో ఖైరతాబాద్‌లో గెలుపొందిన జనార్ధనరెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించగా, 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో విష్ణు విజయం సాధించారు. 2009లో ఏర్పడిన జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి 2014లో ఓటమి చెందారు. జూబ్లిహిల్స్‌లో ఒకసారి రెడ్డి, రెండుసార్లు కమ్మ నేత గెలుపొందారు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే... -
వెంగళరావునగర్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం
హైదరాబాద్: బోనాల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం సృష్టించారు.వెంగళరావునగర్‌లో బోనాల వేడుకలు జరుగుతుండగా అక్కడకొచ్చిన ఎమ్మెల్యే గోపీనాథ్ ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆ బోనాల వేడుకల్లో భాగమైన సామాన్య వ్యక్తి గణేష్ ఇంటిపై దాడి చేశారు. తన అనుచరులతో కలిసి గణేష్ ఇంట్లోకి చొచ్చుకువెళ్లి దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడగా.. వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. చదవండి: లాల్‌దర్వాజ బోనాలు: ఆలయం వద్ద చికోటీ ప్రవీణ్ ఓవరాక్షన్! -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: త్రివర్ణ పతాకాన్ని గౌరవించని వారు ఈ దేశాన్ని పాలిస్తున్నారని భారత్ బచావో కో–ఆర్డినేటర్ డాక్టర్ మాగంటి గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత్ బచావో ఆధ్వర్యంలో జరిగిన మేధోమధన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశం నేడు అన్ని రంగాల్లోనూ సమస్యలను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలను భష్ట్రు పట్టిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేరు వింటేనే వణికిపోతోందని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సంపదను కొన్ని కులాలకే దోచిపెడుతున్నారని, రూ.10లక్షల కోట్లకు సంబంధించిన బకాయిలు ఒకటి, రెండు కులాలకు చెందిన వారివి మాత్రమే ఎగవేశారని, ఈ మొ త్తాన్ని దేశంలో 10 లక్షల స్కూళ్లపై పెట్టుబడి పెడితే మంచి విద్య అందేదని అన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్కు సిద్ధాంతపరమైన భావజాలం ఉందనుకోవటం పొరపాటేనని,. దేశ మౌలిక విలువలు, సూత్రాలను ఆర్ఎస్ఎస్ ధ్వంసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నేడు జై శ్రీరాం అంటే వెన్నులో వణుకు పుడుతుందే తప్ప భక్తిభావం రావటం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మంత్రి కవాసి లక్మ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు ఈ దేశ సంపదను కట్టబెడుతోందని విమర్శించారు. కార్యక్రమంలో బహుజన ముక్తి మోర్చ జాతీయ అధ్యక్షుడు వామన్ మెశ్రమ్, ప్రొఫెసర్ పిఎల్.విశ్వేశ్వర్రావు, సామాజికవేత్త మూల్‌చంద్ రాణా, ప్రొఫెసర్లు సూరేపల్లి సుజాత, తిరుమలి, మురళీ మనోహర్, బౌద్ధపీఠ అధిపతి భగవతి మహారాజ స్వామి, భారత్ బచావో ప్రతినిధి గాదె ఇన్నయ్య తదితరులు ప్రసంగించారు. -
ఎమ్మెల్యే పీఏ అరాచకం.. ఫ్రెండ్స్ అంటూ మహిళకు కాల్స్ చేసి చివరకు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు వీరంగం సృష్టించాడు. ఓ మహిళపై కత్తితో దాడి చేశాడు. దీంతో, మహిళ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్ సింహ ఓ మహిళపై దాడి చేశాడు. కత్తిలో మహిళను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో, ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సదరు మహిళ భర్త మాట్లాడుతూ.. ప్రస్తుతం నా భార్య మాట్లాడలేని స్థితిలో ఉంది. ఎమ్మెల్యే పీఏ విజయ్ సింహా నా భార్యతో మాట్లడేవాడు. ఆమెతో అనుచితంగా కూడా ప్రవర్తించాడు. ఆమెకు ఫోన్లో న్యూడ్ వీడియో కాల్స్, ఫోన్‌కాల్స్ కూడా చేసేవాడు. కాల్స్‌కు సంబంధించిన ఫోన్ రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఆమెతో ఫ్రెండ్లీగానే ఉన్నాడు. కానీ, ఇలా ఈరోజు మా ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చి అటాక్ చేస్తాడని అనుకోలేదు. నా భయం నాకు ఉంది. ఆయనకు రౌడీ షీటర్లు తెలుసంటా.. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో నాకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందని భయపడుతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
గ్రేటర్ జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీరే.. ముగ్గురూ ముగ్గురే..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు టీఆర్ఎస్ జిల్లా శాఖలకు అధ్యక్షులొచ్చారు. సుదీర్ఘకాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న అధ్యక్షుల పేర్లను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరో రెండేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలకు అనుగుణంగా గులాబీ బాస్ కొత్త సారథులను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. పార్టీ సారథ్య బాధ్యతలను నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నవారికి అప్పగిస్తారని భావించినా.. అంచనాలు తలకిందులు చేస్తూ మూడు జిల్లాలకు ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలనే ఖరారు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రెండు ఎమ్మెల్యేలకు, ఒకటి ఎమ్మెల్సీకి దక్కాయి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నియమితులయ్యారు. ఇక త్వరలోనే జిల్లా, డివిజన్ల పూర్తిస్థాయి కమిటీలు పూర్తి చేయనున్నట్లు భావిస్తున్నారు. (క్లిక్: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే) ముగ్గురూ ముగ్గురే.. ► అధ్యక్షులుగా నియమితులైనవారు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నవారే. గోపీనాథ్, కిషన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మాగంటి గోపీనాథ్ 1985లో తెలుగుయువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1987లో హుడా డైరెక్టర్‌గా, 1988 వినియోగదారుల ఫోరం తొలి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్ఎస్లోకి రాకముందు టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ► మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రెండు పర్యాయాలు టీడీపీ నుంచి, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేసిన మంచిరెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా.. నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ తదితర హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ► కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శంభీపూర్ రాజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న ఆయనకు గులాబీ దళపతికి సన్నిహితుడిగా పేరుంది. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ పదవి లభించింది. అదృష్టంగా భావిస్తున్నా పార్టీ సభ్యత్వ నమోదు నుంచి అధిష్టానం అప్పగించిన ఏపనైనా నిబద్ధతతో, సిస్టమేటిక్‌గా చేస్తున్నా. ఎంతో కీలకమైన, రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. హైకమాండ్ ఆదేశాలకనుగుణంగా.. అందరినీ కలుపుకొని నడుచుకుంటాను. – మాగంటి గోపీనాథ్ సమన్వయంతో పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం ఎమ్మెల్యేలు, క్యాడర్‌తో సమన్వయంతో పనిచేస్తా. గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవముంది. నాపై నమ్మకముంచి బాధ్యతలప్పగించిన అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా. మరింత కష్టపడి పనిచేస్తా. పార్టీ బలోపేతానికి పాటు పడతా. – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తిరుగులేని మెజార్టీకి కృషి కేసీఆర్, కేటీఆర్‌ల ఆశయాలకనుగుణంగా పని చేస్తా. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతా. వార్డు, డివిజన్, పట్టణ, మండల, జిల్లాస్థాయిలో పార్టీకోసం పనిచేసే వారికి తగిన పదవులు లభించేలా చూస్తా. అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అభ్యర్థులు తిరుగులేని మెజార్జీతో గెలిచేలా కృషి చేస్తా. – శంభీపూర్ రాజు -
ప్రచారంలో మాగంటీ గోపినాథ్‌కు చేదు అనుభవం
-
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగుతున్నావ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్ఎస్ నేతలకు ప్రజల నుంచి ఊహించని నిరసనలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే నుంచి మంత్రులు వరకు ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొక తప్పడం లేదు. తాజాగా నగరంలోని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌పై ఓటర్లు తిరగబడ్డారు. ప్రచారంలో భాగంగా శనివారం తన నియోజకవర్గంలో పర్యటించిన గోపినాథ్‌కు ఊహించని షాక్ తగిలింది. గతంలో ఇచ్చిన హామీలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు నిలదీశారు. ఏముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చావని ఓ మహిళ ఆయనను ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి టీడీపీ నుంచి గెలిచిన గోపినాథ్‌కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వదని ఇంద్రసేనా అనే ఉద్యమకారుడు పెట్రోల్ బాటిల్‌తో ఆందోళకు దిగాడు. ప్రజల తీరుతో గోపినాథ్ తీవ్ర నిరసనతో వెనుదిరిగారు. -
ప్రజాస్వామ్యం చచ్చిపోయింది
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ నేతగా పుట్టినప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అన్నా రు. చంద్రబాబు విలువలు, వ్యవస్థలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ప్రచారంలో భాగంగా శనివారం ఎల్లారెడ్డిగూడలోని పోసాని నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ చంద్రబాబు వెన్నుపోటుదారుడని, మోసగాడని, ఆయన స్వలా భం కోసం ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉంటాడని విమర్శించారు. ఒకప్పుడు కాంగ్రెస్ గురించి నీచంగా మాట్లాడిన చంద్రబాబు తన కేసుల కోసం తెలంగాణలో కాంగ్రెస్‌తో కలి శారని, ఓటర్లు ఈ విషయా న్ని గమనించాలన్నారు. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగితే ఓ పత్రిక(చంద్రబాబుకు కొమ్ముకాసే) కోడి కత్తి కేసు అని రాయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇదే చంద్రబాబు కొడుకు లోకేశ్‌కో, సదరు పత్రిక అధినేత కొడుక్కో జరిగితే రాష్ట్రం దద్దరిల్లేలా ధర్నాలు చేసేవారని ఆరోపించారు. బాబుకు అలిపిరి లో దాడి జరిగితే హత్యాయత్నం, జగన్ మీద కత్తితో దాడి జరిగితే కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజలు గమనిస్తున్నారు... ఆంధ్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఓటుతో తమ వైఖరిని తెలుపుతారని పోసాని అన్నారు. జగన్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని, రానున్న ఎన్నికల్లో అలాంటి వ్యక్తి వస్తేనే ప్రజాస్వామ్యం ఊపిరిపోసుకుంటుందన్నారు. నిజాలు మాట్లాడితే తన తల వేయి ముక్కలవుతుందనే శాపం చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్వలాభం కోసం ఏ పార్టీతోనైనా పొత్తుకు వెనుకాడరన్నారు. కేసీఆర్ మంచి పరిపాలన చేస్తున్నారని, దేశంలోనే నంబర్‌వన్ సీఎం అని కితాబిచ్చారు. కేసీఆర్ పాలనలో ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉన్నారని చెప్పారు. -
40 ఏళ్ల నుంచే హైదరాబాద్‌లో డ్రగ్స్ ఉన్నాయి
-
ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసు?
► రేవంత్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ► పార్టీ మారినప్పుడు ఎన్టీఆర్‌కు మొక్కి వెళ్లావా?: రేవంత్ సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మధ్య అసెంబ్లీ లాబీల్లో మంగళ వారం ఆసక్తికరమైన సంవాదం జరిగింది. లాబీల్లో ఎదురైన సందర్భంగా ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని టీటీడీపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసని రేవంత్‌రెడ్డిని గోపీనాథ్ ప్రశ్నించారు. వారి మధ్య సంవాదం ఇలా.. రేవంత్: ఎన్టీఆర్ గురించి నాకు తెలియదు. కనీసం ఆయనను దగ్గర నుంచి కూడా చూడలేదు. గోపీ: పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కొత్త చాంబర్లోకి పెద్దమ్మ గుడి దగ్గర నుంచి వెళ్లావు. అభిమానముంటే ఎన్టీఆర్ ఘాట్ నుంచి వెళ్లేవాడివి కదా. రేవంత్: టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచావు. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరేముందు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి మొక్కి వెళ్లావా? గోపీ: నేను నేరుగా అసెంబ్లీకే వచ్చాను. రేవంత్: పెద్దమ్మ గుడి నుంచి బయలుదేరినా ఎన్టీఆర్ భవన్ కే వెళ్లాను. గోపీ: ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లే పార్టీ మారారు. నాకు 8 నెలలపాటు గన్ మన్లను ఇవ్వలేదు. అయినా పార్టీ పట్టించుకోలేదు. రేవంత్: అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంటు, టీటీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నాడు. టీఆర్ఎస్లో చేరిన నువ్వు కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఎట్లా, నియోజక వర్గంలోని ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఉన్న టీడీపీ దిమ్మెకు గులాబీ రంగు పూయించావు. గోపీ: స్థానిక నేతలు రంగు మారిస్తే నేను బాధ్యుడినా? రేవంత్: ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే ఆ దిమ్మెను వదిలేసి, మరొకటి కట్టుకోవచ్చుకదా. ఈ సంవాదంపై ఆసక్తితో లాబీల్లోని వారంతా గుంపుగా చేరుతుండటంతో ఇద్దరూ తమ వాదనను ఆపివేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మాకింత విషమిచ్చి చంపేయండి
ఆ తర్వాతే మా పిల్లలను అనాధలుగా భావించండి కనీసం మాకు ఓ మాటా కూడా చెప్పకుండా తరలిస్తారా? మేము బతికుండగానే తమ పిల్లలను అనాధలను చేశారు దేవుడిపై భారమేసి..ఆపరేషన్ చేయండిః అవిభక్త కవలలు వీణావాణి తండ్రి ఆవేదన సాక్షి, సిటీబ్యూరో: ‘మాకు ఇంత విషమిచ్చి చంపేయండి. ఆ తర్వాతే వీణవాణిలను అనాధలుగా భావించండి. కనీసం మాకు ఓ మాట కూడా చెప్పకుండా అనాధాశ్రమానికి తరలిస్తారా? మా పిల్లలను మేం చూసుకోవడానికి ఇతరుల అనుమతి తీసుకోవాలా?’ అని అవిభక్త కవలలు వీణావాణి తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మిలు ఆవేదన వ్యక్తం చేశారు. అవిభక్తకవలలు వీణావాణిలను నిలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్‌హోం తరలించిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం వారి వద్దకు వచ్చారు. పిల్లలను చూసేందుకు అనుమతించాల్సిందిగా పీడీని కోరగా నిమిషం వ్యవధి మాత్రమే ఇచ్చారన్నారు. తమ పిల్లలను చూసుకోవడానికి తాము అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ పిల్లలకు న్యాయం జరుగుతుందని భావించాం. స్వరాష్ట్రంలో కూడా తమకు తీరని మనోవేదనే మిగిలిందని ఆరోపించారు. వారికి చికిత్స చేసి వేరు చేయాల్సిందిగా ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని చెప్పారు. తమకు తగిన జీవనభృతిని కల్పిస్తే తమ పిల్లల బాగోగులు చూసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేవుడిపై భారం వేసి పిల్లలకు చికిత్స చేయాల్సిందిగా కోరారు. (గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలింపు) వీణా వాణీలకు సకల సౌకర్యాలు వెంగళరావునగర్ : వీణావాణీలకు సకల సౌకర్యాలను కల్పించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనథ్ చెప్పారు. సోమవారం స్టేట్‌హోం కార్యాలయంలో వీణావాణీలను ఎమ్మెల్యే మాగంటి కలిసి దాదాపు గంటసేపు వారితో ముచ్చటించారు. అక్కడున్న చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు, సిబ్బందికి బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ వీణవాణిల చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ప్రపంచస్థాయి వైద్యులకు చూపించి వారి సలహా మేరకు వారి పోషణను, సంరక్షించే బాధ్యతను మహిళా శిశుసంక్షేమశాఖకు అప్పగించారని అన్నారు. -
టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు గోపీనాథ్, గాంధీ
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ అధికార టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ పార్టీలో చేరారు. కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి గోపీనాథ్, గాంధీలను పార్టీలోకి ఆహ్వానించారు. అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ గురువారం సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. వీరు రెండుసార్లు సీఎంను కలవడం, పార్టీ మారుతున్నట్లు స్పష్టం కావడంతో టీటీడీపీ నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేశారు. గోపీనాథ్, గాంధీతో సహా టీఆర్ఎస్లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసినట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. టీటీడీపీలో ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. -
కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ సమావేశమయ్యారు. గురువారం మధ్యాహ్నం వీరిద్దరూ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. గోపీనాథ్, గాంధీ టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తమను అధికార టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ ఎస్ మధుసూదనాచారికి లేఖ కూడా రాశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాంధీ, గోపీనాథ్‌లను టీడీపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా తెలంగాణ టీడీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. టీడీపీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. ఇంతకుముందు పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. -
'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని గుర్తించండి'
హైదరాబాద్: టీటీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. తమను టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో చేర్చుకోవాలని తమ లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయినట్టుగా గుర్తించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. టీటీడీపీలో ఇక ముగ్గురే..! మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయమే సీఎం కేసీఆర్‌ను కలసి తమ చేరిక గురించి చర్చించారు. మంగళవారం అరికెపూడి గాంధీతో కలసి మరోసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ పార్టీ మారితే.. ఇక తెలంగాణ టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కావడం గమనార్హం. టీడీపీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రమే మిగిలారు. -
11న టీఆర్ఎస్లోకి గాంధీ, గోపీనాథ్!!
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: టీటీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడానికి ముహూర్తం కుదిరింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈనెల 11వ తేదీన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం రాత్రి తిరిగి వచ్చాక దాదాపు ఏడున్నర గంటల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనను కలసి చర్చించారు. తమ చేరికకు గ్రీన్‌సిగ్నల్ తీసుకుని... ఇందుకు 11వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ టీఆర్ఎస్లో చేరనున్నారు. అయితే మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయమే సీఎం కేసీఆర్‌ను కలసి తమ చేరిక గురించి చర్చించారు. మంగళవారం అరికెపూడి గాంధీతో కలసి మరోసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ పార్టీ మారితే.. ఇక తెలంగాణ టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కావడం గమనార్హం. కాగా, టీడీఎల్పీని టీఆర్ఎస్లో చేర్చాలంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చిన ఎర్రబెల్లికి మాగంటి, అరికెపూడి మద్దతు తెలిపారని సమాచారం. విలీనానికి తాము కూడా అంగీకారం తెలుపుతున్నామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. -
ఎర్రబెల్లి నిర్ణయంపై మాగంటి ఆశ్చర్యం
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఏసీబీ నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని మీడియాతో చెప్పారు. ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఎర్రబెల్లి తనకు మంచి మిత్రుడని, తామంతా కలిసి పోరాటం చేశామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ లో చేరుతున్నారని వచ్చిన వార్తలపై ఆయన ఆచితూచి స్పందించారు. టీఆర్ఎస్ నుంచి తనకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. తనతో టీఆర్ఎస్ నాయకులు ఎవరూ చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. టీడీపీలోనే కొనసాగుతానని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌కు రంగం సిద్ధం?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం కోసం ఏసీబీ కొంతకాలంగా ఆరాతీస్తున్న విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి, గోపీనాథ్ నుంచే ఆ నగదు తీసుకుని స్టీఫెన్సన్ వద్దకు వెళ్లారని ఏసీబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. తాజా ఆధారాలతో గోపీనాథ్‌కు వారెంటు జారీ చేసి, నేడో, రేపో అరెస్టు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడం, ఆయన షరతులతో కూడిన బెయిలుపై బయటికి రావడం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న అంశంపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ఈ కేసును ఒక కొలిక్కి తేవాలని ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు గోపీనాథ్ రేవంత్‌రెడ్డికి నగదు సమకూర్చినట్టు భావిస్తున్నారు. గోపీనాథ్‌ను అరెస్టు చేసి విచారణ జరిపితే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. -
టీడీపీకి ‘పొత్తు’ పోటు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు టీడీపీకి తలనొప్పిగా మారాయి. 150 డివిజన్లలో 63 డివిజన్లను బీజేపీకి కేటాయించి, 87 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీకి ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తుల గొడవ ఎక్కువైంది. టీఆర్ఎస్తో కుమ్ముక్కై బీజేపీకి గెలిచే సీట్లను కేటాయించారని పలు డివిజన్ల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో టికెట్లు ఇప్పిస్తామని అడ్వాన్సుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న ఒకరిద్దరు నాయకులను టిక్కెట్ల కోసం నిలదీస్తున్నారు. శనివారం రాత్రి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలోనే శేరిలింగంపల్లిలోని ఓ డివిజన్ టికెట్ ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకున్న ఓ ముఖ్యనేతను నిలదీసినట్లు సమాచారం. సదరు సీటు బీజేపీకి కేటాయించడంతో తరువాత అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన నేతను బూతులు తిడుతూ తన సొమ్ము తనకు ఇమ్మని గొడవ పెట్టుకున్నట్లు సమాచారం. చివరికి ఆ డివిజన్‌కు బదులు వేరే చోట టికెట్ కేటాయించిన పరిస్థితి. అలాగే ఖైరతాబాద్, మలక్‌పేట నియోజకవర్గాల్లో కూడా కొన్ని సీట్లను బేరం చేసుకుని అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, మల్కాజిగిరి వంటి శివార్లలో బీజేపీకి సీట్లు కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ భవన్ వద్ద శని, ఆదివారాల్లో గొడవలకు దిగారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌లను టిక్కెట్లు దక్కని నాయకులు తీవ్ర పదజాలంతో విమర్శలకు దిగడం రెండు రోజులుగా సర్వసాధారణమైంది. ఒక్కో నియోజకవర్గంలో రెండేనా? అంబర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్‌నగర్, మలక్‌పేట, ఎల్బీ నగర్, మల్కాజిగిరి వంటి నియోజవకర్గాలు ఒకప్పుడు టీడీపీకి బలమైన స్థానాలు. అయితే వీటిలో బీజేపీ మెజారిటీ సీట్లను తీసుకొని టీడీపీ ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే తీసుకోవడంపై తమ్ముళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అంబర్‌పేటలో కేవలం నల్లకుంట, ముషీరాబాద్‌లో ముషీరాబాద్, కవాడిగూడ, ఖైరతాబాద్‌లో ఖైరతాబాద్, సోమాజీగూడ, సికింద్రాబాద్‌లో మూడు, సనత్‌నగర్‌లో రెండు సీట్లలో మాత్రమే పోటీ చేయడంపై టీడీపీ కార్యకర్తలు కత్తులు దూస్తున్నారు. మజ్లిస్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో 25 నుంచి 30 సీట్ల వరకు టీడీపీ పోటీ చేస్తుండటం, గెలిచే అవకాశాలున్న స్థానాలను బీజేపీకి కేటాయించడం నాయకత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్లలో బీజేపీకి అడిగినన్ని సీట్లు కేటాయించడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీ స్థానాల్లో రెబల్స్ 150 డివిజన్లలో 60 సీట్లు బీజేపీకి అని మొదట భావించినప్పటికీ, తరువాత గెలుపు అవకాశాలున్న సీట్లతో పాటు మరో మూడింటిని అదనంగా ఇచ్చారని తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ సిట్టింగ్ సీట్లు హిమాయత్‌నగర్, అమీర్‌పేట, గాంధీనగర్ వంటి డివిజన్లను కూడా బీజేపీకి కేటాయించడంపై గరంతో ఉన్న నేతలు టీడీపీ అభ్యర్థులుగానే నామినేషన్లు వేశారు. స్నేహపూర్వకపోటీలో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని, బీ-ఫారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బీజేపీ పోటీ చేసిన దాదాపు అన్ని డివిజన్లలో టీడీపీ తరఫున ఒకటికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీ-ఫారాలు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా కొనసాగుతామని వారు హెచ్చరిస్తున్నారు. -
తలసాని వ్యవహారంపై సీఎస్‌కు రాజ్‌భవన్ లేఖ
గవర్నర్‌కు ఫిర్యాదుచేసిన ఎమ్మెల్యే గోపీనాథ్ ఫిర్యాదుతో పాటు లేఖను సీఎస్‌కు పంపిన రాజ్‌భవన్ వర్గాలు హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలంగాణరాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ భవన్లో కదలిక ప్రాంభమైంది. పార్టీ ఫిరాయింపుల కింద తలసాని పై చర్యలు తీసుకోవాలని శనివారం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మాగంటి ఫిర్యాదు పై రాజ్ భవన్ వర్గాలు సీఎస్ రాజీవ్ శర్మకు సమాచారం పంపాయి. తలసానిని మంత్రిగా కొనసాగించడంపై తరచు ఫిర్యాదులు వస్తున్నాయని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
కేటీఆర్ పై టీటీడీపీ ఎమ్మెల్యేల నోటీసులు
హైదరాబాద్: సభా హక్కులు ఉల్లంఘించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీలు నోటీసులిచ్చారు. తెలంగాణ మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదని వారు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ మంత్రులు ప్రోటోకాల్ ను పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీ తెలిపారు. -
అవిశ్వాసం నోటీసు తుస్!
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు టీడీపీ యత్నం అసెంబ్లీకి వెళ్లేందుకు యత్నించిన నేతలను అడ్డుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని టీ టీడీపీ పన్నిన ఆఖరి వ్యూహాన్ని కూడా సర్కారు విజయవంతంగా అడ్డుకుంది. సస్పెండైన టీడీపీ సభ్యులు అసలు శాసనసభ ఆవరణలోకే రాకుండా పకడ్బం దీగా వ్యవహరించింది. సభ ప్రారంభం కావడానికి గంట ముందే అవిశ్వాస తీర్మానం నోటీసును శాసనసభా వ్యవహారాల కార్యదర్శి రాజా సదారామ్‌కు అందజేసి.. మరోసారి వార్తల్లోకి ఎక్కాలని టీ టీడీపీ భావించినప్పటికీ సాధ్యం కాలేదు. ‘సస్పెన్షన్‌కు గురైన సభ్యులు అసెంబ్లీలోకి రాకూడదు’ అని స్పీకర్ ఆదేశాల పేరుతో అసెంబ్లీ వెలుపలే ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, రాజేందర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో వారు టీడీఎల్పీ కార్యాలయం ఆవరణ ముందు ధర్నా చేపట్టగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు తరలించారు. ఇదే సమయంలో కారులో అసెంబ్లీకి వస్తున్న రేవంత్‌రెడ్డిని మూడో గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన కారును గేటుకు అడ్డంగానే నిలిపి, అందులోనే కూర్చున్నారు. దీంతో అసెంబ్లీలోకి వెళ్లాల్సిన వాహనాలన్నీ రోడ్డుపైనే నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే వాహనా న్ని తెప్పించి, కారును వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించి, రేవంత్‌ను పార్టీ కార్యాలయానికి పంపించారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు వివేక్, గాంధీలను, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి తదితరులనూ అరెస్టు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు తరలించారు. ఇక చివరికి టీడీఎల్పీ కార్యాలయ సిబ్బందితో అవిశ్వాస తీర్మానం నోటీసును అసెంబ్లీ కార్యదర్శికి పంపగా... అప్పటికే సమయం ముగియడంతో ఆయన తిరస్కరించారు. కాగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతిపక్షం అంటేనే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల గౌరవానికి సాక్షాత్తుస్పీకరే భంగం కలిగించడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా జరగలేదని ఆరోపించారు. ప్రభుత్వం, స్పీకర్ వైఖరిని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి తీవ్రంగా ఖండించారు. -
‘దేశం’లో తిరుగు‘బావుటా’!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. తెలంగాణ ఏర్పాటుపై ద్వంద్వ విధానాలతో ఉన్న పార్టీ అధ్యక్షుని వైఖరితో ఇప్పటికే విసిగిపోయిన తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జి పదవులు, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు లభించకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామం టూ వారు ఏకంగా చంద్రబాబుకే సవాల్ విసురుతున్నా రు. బుధవారం సనత్‌నగర్ నియోజకవర్గ నాయకుడు కూన వెంకటేశ్‌గౌడ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాయకులు సదాశివయాదవ్ తదితరులు బాబు నివాసం ఎదుటే ఆందోళనలకు దిగడం తదితర పరిణామాలు ఈ క్రమంలోనే జరిగాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు లభిస్తాయనే ఆశతో ఎంతోకాలంగా ఆయా నియోజకవర్గాలను అంటిపెట్టుకొని ఉన్న నగర నాయకులు తమకు టిక్కెట్లు రాని పక్షంలో అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధమవుతున్నారు. సనత్‌నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు బుధవారం చంద్రబాబు నివాసం ఎదుటే ఆందోళనలకు దిగగా.. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అంబర్‌పేట నియోజవర్గం నుంచి అవకాశం కల్పించాలంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం రమేశ్ ఇప్పటికే తన డిమాండ్ అధ్యక్షుడికి వినిపించారు. ఈ నియోజకవర్గం టికెట్‌ను కృష్ణయాదవ్‌కు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉండగా, ఇదే నియోజకవర్గం నుంచి వనంతో పాటు దుర్గాప్రసాదరెడ్డి మరికొందరు ఆశలు పెట్టుకున్నారు. అన్ని చోట్లా అదే పరిస్థితి... ముషీరాబాద్ నియోజవర్గంలో పార్టీ మాజీ అధ్యక్షుడు ముఠాగోపాల్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెన్ శ్రీనివాస్‌లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు తలసాని వీరిలో ఎమ్మెన్‌కు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. టికెట్ రానివారు అసమ్మతి బావుటా ఎగురవేయడం.. అవసరమైతే వేరే పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గోషామహల్‌లోనూ ఇదే పరిస్థితి. జిల్లా నాయకులు ప్రేంకుమార్ధూత్, ఆనంద్‌కుమార్‌గౌడ్, బుగ్గారావులు ఆ సీటును ఆశిస్తున్నారు. ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగతా ఇద్దరు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్వైపు మొగ్గుచూపుతుండగా, మిగతావారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానికేతరుడైన మాగంటికి బదులు స్థానికంగా ఉన్న ముగ్గురు కార్పొరేటర్లు మురళిగౌడ్, సదాశివయాదవ్, విజయలక్ష్మిలలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, లేని పక్షంలో మాత్రం సహించేది లేదని బాహటంగానే చెబుతున్నారు. ఇప్పటికే వారు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మలక్‌పేట నియోజకవర్గం నుంచి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితోపాటు నియోజకవర్గ ఇన్ ఛార్జి ముజఫర్ అలీ తదితరులు టికెట్‌ను ఆశిస్తున్నారు. కార్వాన్, నాంపల్లి, తదితర నియోజకవర్గాల్లోనూ పోటీ ఉన్నప్పటికీ, వాటిపై గెలుపు ఆశలు లేకపోవడంతో అసమ్మతులు బయటకు రావడం లేదు. ఏకంగా పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ, ఆందోళనలకు దిగడం నగరపార్టీలో గతంలో లే దు. ఇటీవలి కాలంలోనే ఈ తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. ఎంతోకాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమను కాదని వేరేవారికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే నగరంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. పార్టీ కార్యాలయం వైపు వస్తున్నవారే లేరు. ఈ నేపథ్యంలో.. రగులుతున్న వ్యతిరేకతతో పార్టీ తీవ్ర ఇరకాటంలో పడింది. ఇదిలా ఉండగా, సనత్‌నగర్ ఇన్చార్జి బాధ్యతల్ని పార్టీ అధ్యక్షుడు తలసానికే ఇవ్వడంతో పాటు. అసెంబ్లీ టికెట్‌ను కూడా ఆయనకే ఖాయం చేసినట్లు తెలుస్తోంది.