సాక్షి, హైదరాబాద్ : ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్‌ఎస్ నేతలకు ప్రజల నుంచి ఊహించని నిరసనలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే నుంచి మంత్రులు వరకు ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొక తప్పడం లేదు. తాజాగా నగరంలోని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌పై ఓటర్లు తిరగబడ్డారు. ప్రచారంలో భాగంగా శనివారం తన నియోజకవర్గంలో పర్యటించిన గోపినాథ్‌కు ఊహించని షాక్ తగిలింది. గతంలో ఇచ్చిన హామీలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు నిలదీశారు.
ఏముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చావని ఓ మహిళ ఆయనను ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి టీడీపీ నుంచి గెలిచిన గోపినాథ్‌కు టీఆర్‌ఎస్ టిక్కెట్ ఇవ్వదని ఇంద్రసేనా అనే ఉద్యమకారుడు పెట్రోల్ బాటిల్‌తో ఆందోళకు దిగాడు. ప్రజల తీరుతో గోపినాథ్ తీవ్ర నిరసనతో వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment