Jubli hills
-
ట్రాఫిక్ ట్రయల్ రన్ తో వాహనదారులకు కొత్త చిక్కులు
-
పవన్ పై ఎలాంటి రెక్కీ జరగలేదని తేల్చిన పోలీసులు
-
‘పవన్‌పై రెక్కీ కేసు.. తాగిన మైకంలో న్యూసెన్స్ వల్లే ఇదంతా జరిగింది’
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పవన్‌పై ఎలాంటి రెక్కీగానీ, దాడికి కుట్రగానీ లేదని పోలీసులు తేల్చారు. ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణ న్యూసెన్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, వీరంతా పబ్‌కు వెళ్లి తప్పతాగి తిరిగివస్తూ పవన్ ఇంటి ముందు కారు ఆపారు. ఈ క్రమంలో కారు తీయాలని చెప్పిన పవన్ సెక్యూరిటీ సిబ్బందితలో యువకులు గొడవపడినట్టు తెలిపారు. ఇక, జూబ్లీహిల్స్ పోలీసులు.. ముగ్గురు యువకులను విచారించి నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. తాగిన మైకంలోనే న్యూసెన్స్ చేసినట్టు యువకులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, పవన్ ఇంటి ముందు ఆపిన కారుకు గుజరాత్ రిజిస్ట్రేషన్ ఉండగా.. సాయికృష్ణకు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. -
విద్యాబుద్ధులు నేర్పే బడుల్లో దారుణాలు
-
ఎమ్మెల్యే పీఏ అరాచకం.. ఫ్రెండ్స్ అంటూ మహిళకు కాల్స్ చేసి చివరకు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు వీరంగం సృష్టించాడు. ఓ మహిళపై కత్తితో దాడి చేశాడు. దీంతో, మహిళ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్ సింహ ఓ మహిళపై దాడి చేశాడు. కత్తిలో మహిళను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో, ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సదరు మహిళ భర్త మాట్లాడుతూ.. ప్రస్తుతం నా భార్య మాట్లాడలేని స్థితిలో ఉంది. ఎమ్మెల్యే పీఏ విజయ్ సింహా నా భార్యతో మాట్లడేవాడు. ఆమెతో అనుచితంగా కూడా ప్రవర్తించాడు. ఆమెకు ఫోన్లో న్యూడ్ వీడియో కాల్స్, ఫోన్‌కాల్స్ కూడా చేసేవాడు. కాల్స్‌కు సంబంధించిన ఫోన్ రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఆమెతో ఫ్రెండ్లీగానే ఉన్నాడు. కానీ, ఇలా ఈరోజు మా ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చి అటాక్ చేస్తాడని అనుకోలేదు. నా భయం నాకు ఉంది. ఆయనకు రౌడీ షీటర్లు తెలుసంటా.. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో నాకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందని భయపడుతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
సాఫీ జర్నీకి సై... మరో మూడు లింక్ రోడ్లు
సాక్షి హైదరాబాద్/బంజారాహిల్స్: నగర ప్రజలకు ప్రయాణ సదుపాయాన్ని సౌలభ్యంగా మారుస్తున్న లింక్రోడ్లలో మరో మూడింటికి, అభివృద్ధిపర్చిన మల్కంచెరువుకు సోమవారం మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ పనుల విలువ దాదాపు రూ.100 కోట్లు. ఎస్సార్డీపీలో భాగంగా ప్రధాన రహదారుల్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లతో ప్రయాణ సదుపాయం పెరుగుతుండగా, ఆయా ప్రాంతాలను చేరుకునేందుకు లింక్‌రోడ్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. నందిహిల్స్ అండర్‌పాస్.. జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 51 నందిహిల్స్ కాలనీలో అండర్‌పాస్‌గా నిర్మించిన లింక్ రోడ్డు వ్యయం రూ. 30 .30 కోట్లు. ఓల్డ్బాంబే హైవే (లెదర్‌పార్క్) నుంచి సైలెంట్ వ్యాలీ మీదుగా రోడ్‌నెంబర్ 45 వరకు నిర్మించిన ఈ లింక్ రోడ్డుతో షేక్‌పేట నుంచి రోడ్ నెంబర్ 45కు వెళ్లేవారికి ప్రస్తుతమున్న 5 కి.మీ దూరం 3.5 కి.మీలకు తగ్గుతుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. సర్వీస్ రోడ్ల వల్ల షేక్‌పేట–జూబ్లీహిల్స్‌ల మధ్య సాఫీ ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు. ఓల్డ్ బాంబే హైవే– ఖాజాగూడ రోడ్డు ఓల్డ్ బాంబే హైవే నుంచి వయా మల్కంచెరువు, చిత్రపురి కాలనీల మీదుగా ఖాజాగూడ రోడ్డు వరకు నిర్మించిన లింక్‌రోడ్డు పొడవు దాదాపు కిలోమీటరు. ఖాజాగూడ రోడ్డుకు వెళ్లాల్సినవారు ఖాజాగూడ జంక్షన్‌కు వెళ్లనవసరం లేకుండా గమ్యస్థానం చేరుకోవచ్చు. పోచమ్మబస్తీ, చిత్రపురి కాలనీ తదితర పరిసరాల వారికి ఎంతో ప్రయోజనం. అర కిలోమీటరు దూరం తగ్గుతుంది. దీని వ్యయం రూ. 15.07 కోట్లు. ఖాజాగూడ లేక్ – ఓఆర్ఆర్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌కు సమాంతరంగా ఖాజాగూడ లేక్ నుంచి ఖాజాగూడ– నానక్‌రామ్‌గూడ రోడ్డు వరకు నిర్మించిన ఈ లింక్ రోడ్డు పొడవు కిలోమీటరు. ఓల్డ్బాంబే హైవే నుంచి (కేర్ హాస్పిటల్ దగ్గర) ఖాజాగూడ రోడ్డుకు చేరుకోవాల్సిన వారికి ఇది ప్రత్యామ్నాయ మార్గం. దీని వ్యయం రూ. 47.66 కోట్లు. సీఎస్సార్‌లో భాగంగా మల్కం చెరువును అభివృద్ధి పరిచారు. పరిసరాలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు (చదవండి: స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్ ) -
బ్లాక్ ఫిల్మ్.. అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు జరిమానా
బంజారాహిల్స్: కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న సినీనటులు అల్లు అర్జున్ ,కల్యాణ్‌రామ్‌కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. శనివారం ఉదయం మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ మీదుగా రేంజ్ రోవర్ కారులో వెళ్తున్న అల్లు అర్జున్ను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నీరూస్ చౌరస్తాలో ఆపారు. కారు అద్దాలకున్న నలుపు రంగు తెరలను తొలగించి, మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ.700 జరిమానా విధించారు. ఇదే చౌరస్తా నుంచి వస్తున్న నటుడు కల్యాణ్‌రామ్ రేంజ్ రోవర్ కారును సైతం ఆపి, అద్దాలకున్న నలుపు రంగు తెరల్ని తొలగించి రూ.700 జరిమానా విధించారు. -
జూనియర్ ఎన్టీఆర్ కారును అడ్డుకున్న పోలీసులు, ఏం జరిగిందంటే?
నందమూరి హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ కారును ఆపి సోదాలు నిర్వహించారు. అంతేగాక అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను పోలీసులు తొలగించారు. కాగా వై కాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: జీవితమంతా అంధకారమే: ప్రణీత షాకింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని అడ్డుకుని అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు. అంతేకాదు ఎన్టీఆర్ కారుకు రూ. 700 జరిమాన కూడా వేసినట్లు తెలుస్తోంది. తనిఖీ సమయంలో కారులో డ్రైవర్‌తోపాటు.. ఎన్టీఆర్ తనయుడు.. మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. చదవండి: కీరవాణి కంపోజ్ చేసిన ఆ పాట అంటే ఇరిటేషన్: ఎన్టీఆర్ శుక్రవారం జూబ్లీహిల్స్ కారు ప్రమాదం ఘటన నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ తన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ఎన్టీఆర్ కోమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ సీతారామారాజుగా కనిపించనున్నాడు. తారక్ సరసన ఒలీవియా మోరిస్, చెర్రీకి జోడిగా ఆలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. -
Hyderabad: పలు ఏరియాల్లో స్థలాల మార్కెట్ విలువ ఎంత పెరిగిందంటే..!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్: 1 నుంచి రామానాయుడు స్టూడియో వరకు, మహారాజా అగ్రసేన్ చౌరస్తా వరకు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్: 10, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్: 36, రోడ్ నంబర్: 45, రోడ్ నంబర్: 71, రోడ్ నంబర్: 78, రోడ్ నంబర్: 82, రోడ్ నంబర్: 92లలో కమర్షియల్ స్థలం గజానికి రూ. 93 వేలుగా నిర్ధారించారు. అంతకుముందు ఈ ధర గజానికి రూ. 84,500 ఉండేది. తాజాగా రూ. 7600 ఈ ఫీజు పెరిగింది. జూబ్లీహిల్స్‌లో నివాసిత స్థలాల మార్కెట్ విలువ కూడా పెంచారు. గతంలో ఇక్కడ గజానికి రూ. 58,500 ఉండగా.. తాజాగా పెరిగిన ఫీజు రూ. 64,400కు చేరింది. ఇక ప్రశాసన్‌నగర్‌లో మొన్నటి వరకు గజం స్థలం మార్కెట్ విలువ రూ. 58,500 ఉండగా.. ఇది రూ. 64,400కు పెరిగింది. పంజగుట్ట, శ్రీనగర్ కాలనీ సత్యసాయి రోడ్డులో మార్కెట్ విలువ గజానికి రూ. 78 వేల నుంచి రూ. 85,800లకు పెరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 12లోని ఎమ్మెల్యే కాలనీలో గజం రూ. 58,500 నుంచి రూ. 64,400కు పెరిగింది. జూబ్లీహిల్స్‌లోని నందిహిల్స్, నందగిరిహిల్స్‌లో మార్కెట్ విలువ గజానికి రూ. 58,500 నుంచి రూ. 64,400కు పెరిగింది. జర్నలిస్ట్ కాలనీ సర్కిల్ నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు మార్కెట్ విలువ గజానికి రూ. 93 వేలకు పెరిగింది. హుడాహైట్స్‌లో గజం రూ. 64,400కు పెంచారు. శ్రీనగర్‌కాలనీలో గజం మార్కెట్ విలువ రూ. 85,800కు పెరిగింది. జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో మార్కెట్ విలువ గజానికి రూ. 64,600కు పెంచారు. జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో మార్కెట్ విలువ గజానికి రూ. 64,400కు పెరిగింది. ఓయూకాలనీలో మార్కెట్ విలువ గజానికి రూ. 27,600కు పెరిగింది. గతంలో రూ. 24 వేలు ఉండేది. ఫిలింనగర్లో గజం రూ. 64,400కు పెరిగింది. గతంలో ఇక్కడ రూ. 58,500 ఉండేది. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 12లోని ఎన్బీటీనగర్లో గతంలో మార్కెట్ విలువ గజానికి రూ. 54,750 ఉండగా.. తాజాగా పెరిగిన రేటుతో రూ. 60,300కు చేరింది. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్: 14లోని నందినగర్‌లో గజం రూ. 54,750 నుంచి రూ. 60,300లకు పెంచారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 1 పంజగుట్ట చౌరస్తా నుంచి మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వరకు గజం మార్కెట్ విలువ రూ. 93 వేలకు పెరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 10లో మార్కెట్ విలువ రూ. 93 వేలకు పెంచారు. రోడ్ నంబర్ 11లో రూ. 60,300, రోడ్ నంబర్: 12లో రూ. 93 వేలు, రోడ్ నంబర్: 13లో రూ. 63,300కు పెంచారు. రోడ్ నంబర్: 14 అగ్రసేన్ చౌరస్తాలో రూ. 93 వేలకు పెరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 4, 5, 6, 7, 8, 9లలో గజం మార్కెట్ విలువ రూ. 60,300 పెంచారు. షౌకత్నగర్, జహీరానగర్, శ్రీరాంనగర్ సింగాడికుంటలో రూ. 60,300కు పెరిగింది. -
సూపర్‌స్టార్ మహేశ్.. హైదరాబాద్‌లో ప్లాటు కొనుగోలు.. ఎక్కడంటే ?
Mahesh Babu buys plot in Jubilee Hills : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు జూబ్లీహిల్స్‌లో కొత్త ప్లాటు కొనుగోలు చేశారు. నగరంలోనే రెసిడెన్షియల్ ఏరియాలకు సంబంధించి అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లో ఇటీవల మహేశ్‌బాబు ప్లాటును కొన్నారు. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ వెబ్సైట్ మనీ కంట్రోల్ కథనం ప్రచురించింది. ప్లాటు ధర ఎంతంటే మహేశ్‌బాబు కొనుగోలు చేసిన ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వివరాల ప్రకారం... యర్రం విక్రాంత్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్‌బాబు 1442 గజాల ప్లాటును కొనుగోలు చేశారు. ఇందుకు గాను మహేశ్‌బాబు రూ.26 కోట్ల రూపాయలను వెచ్చించారు. ఇందులో స్టాంప్‌డ్యూటీ కింద రూ.1.43 కోట్లు ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించారు. 2021 నవంబరు 17న ఈ సేల్‌డీడ్ జరిగినట్టు సమాచారం. ఇక్కడే రేట్లు అధికం జూబ్లీహిల్స్‌లో నివాస స్థలాకు సంబంధించి సగటున ఒక్కో ప్లాటు వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటాయి. ఇక్కడ గజం భూమి ధర రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకుగా ఉంది. ఇక మహేశ్‌బాబు కొనుగోలు చేసిన స్థలం విషయానికి వస్తే.. గత యజమాని అయిన యర్రం విక్రాంత్ రెడ్డి.. ఈ స్థలంలో ఉన్న పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇళ్లు కట్టాలని ముందుగా అనుకున్నారు... అయితే కొత్త నిర్మాణ పనులు చేపట్టకుండా.. ఈ ఇంటి స్థలాన్ని మహేశ్‌బాబుకు అమ్మేశారు. ఇంటి స్థలం కొనుగోలుపై ప్రిన్స్ నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. హైదరాబాద్‌లో రియల్ పికప్ కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒడిదుడుకులకు లోనైంది. అయితే ఐటీ కంపెనీలు ఎక్కువగా విస్తరించి, స్టార్టప్‌లు ఎక్కువగా వెలుస్తున్న బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రియల్టీ పరిస్థితులు త్వరగా చక్కబడ్డాయి. కోవిడ్ తర్వాత ఇక్కడ భూముల ధరలు 2 నుంచి 6 శాతం వరకు పెరిగాయి. చదవండి: అమితాబ్ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్.. రెంట్ వింటే షాకవుతారు? -
ప్రేమించి పెళ్లి, భార్య వేలు కట్‌చేసి పారిపోయిన భర్త
బంజారాహిల్స్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైలో నివసించే హసి (22), జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్ ఫేస్బుక్లో పరిచయమయ్యారు. రవి నాయక్ ఇటీవల ఆమెను పెళ్లి చేసుకొని నగరానికి తీసుకొచ్చాడు. హసి బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా రవినాయక్ ఖాళీగా ఉన్నాడు. ఈ నెల 10వ తేదీన తనకు రూ. 50 వేలు కావాలంటూ రవి నాయక్ భార్యను అడగగా లేదనడంతో తీవ్రంగా కొట్టి కత్తితో ఓ వేలిని కట్ చేసి పారిపోయాడు. మరోసటి రోజు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రవి నాయక్‌పై కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసై ఆత్మహత్య సినీ పరిశ్రమలో క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని సింధు టిఫిన్ సెంటర్ సమీపంలో అద్దెకుంటున్న తారకేశ్వర్రావు (42), సినీ క్యాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై డబ్బుల కోసం భార్యతో గొడవ పడుతుండేవాడు రెండ్రోజుల క్రితం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కర్కశ తల్లి లక్ష్మీ అనూష అరెస్టు.. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే -
బిర్యానీ సెంటర్లో కేథరిన్ సందడి
సాక్షి, రాజేంద్రనగర్: అత్తాపూర్‌లో చిక్‌పెట్ డోనీ బిర్యానీ సెంటర్‌ను సోమవారం సినీనటి కేథరిన్ ప్రారంభించారు. వంటకాలను టేస్ట్ చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ప్రముఖ వ్యాపారవేత డి.రమేష్ హైదర్‌గూడ పిల్లర్ నంబర్–143 వద్ద ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్: రోడ్ నంబర్-36లోని చందూభాయ్ గ్రూప్‌నకు చెందిన ది డైమండ్ స్టోర్‌లో వెడ్డింగ్ సీజన్‌ను పురస్కరించుకొని సరికొత్త బ్రైడల్ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అరుదైన ఆభరణాలను సోమవారం మోడల్స్ ప్రదర్శించారు. కోవిడ్ కారణంగా అందరి క్షేమం కోసం మా స్టోర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు వర్చువల్‌గా కూడా ఆభరణాలు ఎంపిక చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తోందన్నారు. -
టీవీ కార్యాలయంపై రాళ్ల దాడి
జూబ్లీహిల్స్ : గుర్తు తెలియని వ్యక్తులు బంజారాహిల్స్‌లోని ఓ టీవీ కార్యాలయంపై శుక్రవారం అర్ధరాత్రి రాళ్లతో దాడిచేసినట్లు సంస్థ సీఈవో రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేవారు. వివరాల్లోకి వెళితే.. మూడు ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు రాళ్లతో పలు ఫ్లోర్లపై దాడి చేశారని, ఈ దాడిలో పలు అంతస్తుల అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న దాదాపు 50 మంది ఉద్యోగులు భయాందోళనకు గురవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 100కు ఫోన్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన వెనుక పెద్దకుట్ర ఉందని, దర్యాప్తు చేసి దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీ వర్షం : తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. వర్షం ధాటికి పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లపై పడటం తీవ్ర భయాందోళన కలిగించింది. స్థానికుల సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 ఓ కాంట్రాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా 20 అడుగులు ఉన్న కొండను తవ్వాడు. ఈ క్రమంలోనే భారీ వర్షం సంభవించడంతో ఒక్కసారిగా పెద్ద బండలతో ఉన్న కొండ కూలి పక్కనే ఉన్న నాలుగు అంతస్థుల భవనంపై పడింది. ఇంట్లోని సామగ్రి ధ్వంసమవ్వగా.. నాలుగు అంతస్థుల భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఒక్కసారిగా పెద్దగా శబ్ధం రావడంతో భవనంలో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. భవనం బలంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడున్న వారు వాపోతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని.. బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విద్యాశాఖ అధికారుల విచారణ
-
నిజాం వారసుడి అద్భుత సృష్టి
సాక్షి, బంజారాహిల్స్: ఆయన అందరిలా ఉండాలనుకోలేదు.. ఏదో ఒక ప్రత్యేకతతో పది మందిలో నిలవాలనుకున్నాడు.. అందుకోసం కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కూడా లెక్క చేయలేదు.. ఏళ్ల తరబడి కష్టపడి ఓ కొండనే నిర్మించుకున్నాడు. హైదరాబాద్ మొత్తాన్ని వీక్షిస్తూ టీ తాగాలన్న ఒకే ఒక్క కోరికతో ఆ కొండను మలిచాడు. ఆయనే 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ (గ్రేట్ గ్రాండ్ ఫాదర్) ముని ముని మనవడు రౌనక్ యార్ఖాన్. ఆయన ప్రత్యేకతలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లోని ఎంసీఆర్హెచ్ఆర్డీని ఆనుకొని రౌనక్ యార్‌ఖాన్‌కు 75 ఎకరాల స్థలం ఉంది. దీన్ని బూత్ బంగ్లా స్థలమని కూడా పిలుస్తుంటారు. తరచూ ఈ స్థలంలో సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి. పదేళ్ల క్రితం రౌనక్‌కు ఓ ఆలోచన వచ్చింది. అత్యంత ఎత్తైన కొండ మీద కూర్చొని చాయ్ తాగుతూ హైదరాబాద్‌ను చూడాలని ఆ కోరిక. దాన్ని అమల్లో పెట్టేందుకు సుమారుగా రూ.5 కోట్లు ఖర్చు చేశాడు. ఆ స్థలంలోనే ఏడు ఎకరాల్లో 8 ఏళ్ల పాటు శ్రమించి లారీలతో ప్రొక్లెయిన్లతో మట్టి, రాళ్లను పేర్చుకుంటూ 180 అడుగుల ఎత్తులో కొండను మలిచాడు. ఆ కొండపైన ఎకరం విస్తీర్ణంలో లాన్, షెడ్డు, చిన్నచిన్న పార్టీలు చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాడు. ఆ కొండపై కూర్చొని చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. చార్మినార్, గోల్కొండ నుంచి హుస్సేన్‌సాగర్, మౌలాలి గుట్ట కూడా కనిపించాల్సిందే. 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్‌గా తాను ఈ కొండను మలుచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రౌనక్ యార్ఖాన్ తెలిపాడు. జూబ్లీహిల్స్ అంటేనే కొండలు. ఆ కొండల్లోనే ఆయన ఇంకో కొండను మలిచాడు. వర్షం పడ్డప్పుడు ఈ కొండపైన కూర్చుంటే కశ్మీర్‌ను తలపిస్తుందని ఈ సందర్భంగా రౌనక్ వెల్లడించాడు. రాత్రి పూట చూస్తే విద్యుత్ దీపాల కాంతుల్లో నగర ధగధగలు కనువిందు చేస్తాయన్నారు. దీనిపైన ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం హాలును కూడా నిర్మించానని, ఔత్సాహికులు ఈ కొండపైన తమ చిత్రకళా ప్రదర్శనను ప్రత్యేకతతో ఏర్పాటు చేసుకుంటారన్నారు. ఇక గత 35 సంవత్సరాలుగా బూత్ బంగ్లా ప్రాంతంలో కులమతాలకు అతీతంగా హోలీ వేడుకలు నిర్వహిస్తున్నానని, గత 6 ఏళ్లుగా ఈ హోలీ వేడుకల్ని తాను నిర్మించిన గుట్టపైనే చేస్తున్నానని తెలిపాడు. 105 ఏళ్లుగా ఈ స్థలం తమ ఆధీనంలోనే ఉందని ఇక్కడ ప్లాట్లు చేసి విక్రయిస్తే కోట్లాది రూపాయలు వస్తాయని, అది తనకు ఇష్టం లేదన్నారు. ఈ కొండనే తనకు పూర్తి సంతృప్తిని ఇస్తున్నదన్నారు. ప్రతిరోజూ సాయంత్రం పూట ఇక్కడకు వస్తుంటానని ఒంటరిగా కుర్చీలో కూర్చొని నగరాన్ని చూస్తుంటే ఎన్ని కోట్లు వెచ్చించినా ఆ ఆనందం రాదన్నారు. ఇదిలా ఉండగా నిజాం హయాంలో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఈ స్థలంలోనే ఒక బంకర్ నిర్మించారని ఎయిర్ రైడ్ షెల్టర్ కూడా నిర్మించారని అవి ఇప్పటికీ ఈ స్థలంలో ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లో తనకున్న 75 ఎకరాల స్థలాన్ని ఎప్పటికీ అమ్మేది లేదని, ఇలా ఉండటమే తనకు ఇష్టమన్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని తెలిపాడు. కొండ, దాని చుట్టూ అడవి ఉంటే ఆ ఆనందమే వేరన్నారు. దీన్ని ఇలాగే కాపాడుకుంటానన్నారు. కొండపైన ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించే యోచన ఉందన్నారు. తనకున్న ఈ ఖాళీ స్థలంలో రంగస్థలంతో పాటు ఎన్నో సినిమా షూటింగ్‌లు జరిగాయన్నారు. -
చేపల వ్యాపారి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని జవహర్‌నగర్‌లో చేపల వ్యాపారి రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితం రమేష్‌ను దుండగులు కిడ్నాప్ చేసి రూ. 90 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులని ఆశ్రయించారు. ఇంతలోనే రమేష్‌ను దుండగులు హత్య చేసి మూటకట్టారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారు
సాక్షి, హైదరాబాద్: ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని వెనుకనుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్2లో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులకు చెందిన పెట్రో వాహనం రోడ్డు పక్కకు ఆగి ఉన్న సమయంలో వెనుకనుంచి వచ్చని బలంగా ఢీకొట్టడంతో పోలీసుల వాహనం భారీగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో హోంగార్డ్ రాజు తీవ్రంగా గాయపడ్డారు. అతనికి దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా వచ్చిన వాహనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అందుబాటులోకి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రోరైల్ స్టేషన్
-
తల్లి, కొడుకు అనుమానాస్పద మృతి
-
జూబ్లీహిల్స్‌లో విషాదం
సాక్షి, హైదరాబాద్: జూబ్లిహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో తల్లి, కొడుకు మృతి చెందారు. చలి వేస్తుందని ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్న తల్లీకుమారుడు ఇళ్లంతా పొగ నిండుకుని ఊపిరాడక మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన సత్యబాబు, అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ప్లాట్ నెంబర్ 306లో కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పెథాయ్ తుపాను కారణంగా బాగా చలి గాలులు వీస్తుండటంతో వారు ఉండే గదిలో బుచ్చివేణి ఆమె కుమారుడు పద్మరాజు బొగ్గుల కుంపటి ఏర్పాటు పెట్టుకున్నారు. వేడిగా ఉండటానికి తలుపులు, కిటికీలు కూడా మూసేశారు. వారిద్దరూ నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత ఇంట్లో పొగ కమ్ముకుని పడుకున్న చోటే మృతి చెందారు. బయటి నుంచి సత్యబాబు ఎంతసేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా బుచ్చివేణి, పద్మరాజు నిర్జీవంగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. యజమాని ఇంట్లో కుక్క కూడా బుధవారమే చనిపోయింది. ఈ విషయంపై ఏదైనా గొడవ జరిగి వారేమైనా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బొగ్గుల కుంపటి కారణంగానే చనిపోయారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు. మృతుడు పద్మరాజు మృతురాలు బుచ్చివేణి -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగుతున్నావ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్ఎస్ నేతలకు ప్రజల నుంచి ఊహించని నిరసనలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే నుంచి మంత్రులు వరకు ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొక తప్పడం లేదు. తాజాగా నగరంలోని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌పై ఓటర్లు తిరగబడ్డారు. ప్రచారంలో భాగంగా శనివారం తన నియోజకవర్గంలో పర్యటించిన గోపినాథ్‌కు ఊహించని షాక్ తగిలింది. గతంలో ఇచ్చిన హామీలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు నిలదీశారు. ఏముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చావని ఓ మహిళ ఆయనను ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి టీడీపీ నుంచి గెలిచిన గోపినాథ్‌కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వదని ఇంద్రసేనా అనే ఉద్యమకారుడు పెట్రోల్ బాటిల్‌తో ఆందోళకు దిగాడు. ప్రజల తీరుతో గోపినాథ్ తీవ్ర నిరసనతో వెనుదిరిగారు. -
రేవంత్‌కు జూబ్లీహిల్స్ పోలీసుల నోటిసులు
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సింగర్ రాహుల్
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రముఖ సింగర్
సాక్షి, హైదరాబాద్ : జూబ్లిహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగoజ్ డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేస్తే 175 ఎంజీ వచ్చింది. అయితే తాను తాగలేదని ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో యాంకర్, నటుడు లోబో కూడా రాహుల్‌తో ఉన్నారు. లైసెన్స్ కూడా లేకుండానే రాహుల్ సిప్లిగంజ్ కారు నడిపినట్టు తెలుస్తోంది. పూర్ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్ వంటి ప్రైవేట్ ఆల్బమ్‌లతో రాహుల్ మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. ఇటీవలే రంగస్థలం టైటిల్ సాంగ్ కూడా రాహుల్ సిప్లిగంజ్ పాడారు.