The Market Value Of Land In Jubilee Hills 93 Thousand - Sakshi
Sakshi News home page

Hyderabad: పలు ఏరియాల్లో స్థలాల మార్కెట్‌ విలువ ఎంత పెరిగిందంటే..!

Published Thu, Feb 3 2022 11:34 AM | Last Updated on Thu, Feb 3 2022 1:02 PM

The Market Value Of Land In Jubilee Hills 93 Thousand - Sakshi

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌: 1 నుంచి రామానాయుడు స్టూడియో వరకు, మహారాజా అగ్రసేన్‌ చౌరస్తా వరకు, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌: 10, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌: 36, రోడ్‌ నంబర్‌: 45, రోడ్‌ నంబర్‌: 71, రోడ్‌ నంబర్‌: 78, రోడ్‌ నంబర్‌: 82, రోడ్‌ నంబర్‌: 92లలో కమర్షియల్‌ స్థలం గజానికి రూ. 93 వేలుగా నిర్ధారించారు. అంతకుముందు ఈ ధర గజానికి రూ. 84,500 ఉండేది. తాజాగా రూ. 7600 ఈ ఫీజు పెరిగింది.  

జూబ్లీహిల్స్‌లో నివాసిత స్థలాల మార్కెట్‌ విలువ కూడా పెంచారు. గతంలో ఇక్కడ గజానికి రూ. 58,500 ఉండగా.. తాజాగా పెరిగిన ఫీజు రూ. 64,400కు చేరింది. ఇక ప్రశాసన్‌నగర్‌లో మొన్నటి వరకు గజం స్థలం మార్కెట్‌ విలువ రూ. 58,500 ఉండగా.. ఇది రూ. 64,400కు పెరిగింది. పంజగుట్ట, శ్రీనగర్‌ కాలనీ సత్యసాయి రోడ్డులో మార్కెట్‌ విలువ గజానికి రూ. 78 వేల నుంచి రూ. 85,800లకు పెరిగింది.  

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌: 12లోని ఎమ్మెల్యే కాలనీలో గజం రూ. 58,500 నుంచి రూ. 64,400కు పెరిగింది. జూబ్లీహిల్స్‌లోని నందిహిల్స్, నందగిరిహిల్స్‌లో మార్కెట్‌ విలువ గజానికి రూ. 58,500 నుంచి రూ. 64,400కు పెరిగింది.  జర్నలిస్ట్‌ కాలనీ సర్కిల్‌ నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు మార్కెట్‌ విలువ గజానికి రూ. 93 వేలకు పెరిగింది. హుడాహైట్స్‌లో గజం రూ. 64,400కు పెంచారు.  శ్రీనగర్‌కాలనీలో గజం మార్కెట్‌ విలువ రూ. 85,800కు పెరిగింది.  జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో మార్కెట్‌ విలువ గజానికి రూ. 64,600కు పెంచారు. 

జూబ్లీహిల్స్‌ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో మార్కెట్‌ విలువ గజానికి రూ. 64,400కు పెరిగింది. ఓయూకాలనీలో మార్కెట్‌ విలువ గజానికి రూ. 27,600కు పెరిగింది. గతంలో రూ. 24 వేలు ఉండేది. ఫిలింనగర్‌లో గజం రూ. 64,400కు పెరిగింది. గతంలో ఇక్కడ రూ. 58,500 ఉండేది.  బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌: 12లోని ఎన్‌బీటీనగర్‌లో గతంలో మార్కెట్‌ విలువ గజానికి రూ. 54,750 ఉండగా.. తాజాగా పెరిగిన రేటుతో రూ. 60,300కు చేరింది.  

అలాగే బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌: 14లోని నందినగర్‌లో గజం రూ. 54,750 నుంచి రూ. 60,300లకు పెంచారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌: 1 పంజగుట్ట చౌరస్తా నుంచి మాసబ్‌ట్యాంక్‌ చౌరస్తా వరకు గజం మార్కెట్‌ విలువ రూ. 93 వేలకు పెరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌: 10లో మార్కెట్‌ విలువ రూ. 93 వేలకు పెంచారు.  రోడ్‌ నంబర్‌ 11లో రూ. 60,300, రోడ్‌ నంబర్‌: 12లో రూ. 93 వేలు, రోడ్‌ నంబర్‌: 13లో రూ. 63,300కు పెంచారు. రోడ్‌ నంబర్‌: 14 అగ్రసేన్‌ చౌరస్తాలో రూ. 93 వేలకు పెరిగింది.  బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌: 4, 5, 6, 7, 8, 9లలో గజం మార్కెట్‌ విలువ రూ. 60,300 పెంచారు.  షౌకత్‌నగర్, జహీరానగర్, శ్రీరాంనగర్‌ సింగాడికుంటలో రూ. 60,300కు పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement