
బంజారాహిల్స్: కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న సినీనటులు అల్లు అర్జున్ ,కల్యాణ్‌రామ్‌కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. శనివారం ఉదయం మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ మీదుగా రేంజ్ రోవర్ కారులో వెళ్తున్న అల్లు అర్జున్‌ను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నీరూస్ చౌరస్తాలో ఆపారు.
కారు అద్దాలకున్న నలుపు రంగు తెరలను తొలగించి, మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ.700 జరిమానా విధించారు. ఇదే చౌరస్తా నుంచి వస్తున్న నటుడు కల్యాణ్‌రామ్ రేంజ్ రోవర్ కారును సైతం ఆపి, అద్దాలకున్న నలుపు రంగు తెరల్ని తొలగించి రూ.700 జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment