Traffic Police Hyderabad
-
కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కుమారి ఆంటీ.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. హైరాబాద్లోని మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే కుమారి ఆంటీ.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఆమె మాటలతో రీల్స్ కూడా క్రియెట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లో ఓ ట్వీట్ చేశారు. దీనిని చూస్తుంటే కుమారీ ఆంటీని పోలీసులు కూడా ఫాలో అవుతున్నారనిపిస్తుంది. అసలేం పోస్టు చేశారంటే.. ‘ మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా’ అంటూ బుల్లెట్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఫొటోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు..ట్రాఫిక్ నియమాలు పాటించండి.. క్షేమంగా ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు. Midhi motham 1000 ayindhi, user charges extra...#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov— Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024 ఇది చూసిన నెటిజన్లు.. కుమారి ఆంటీ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నారు. కుమారి ఆంటీని బాగానే ఫాలో అవుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఎమోజీలు, కుమారి ఆంటీ డైలాగ్ వీడియోలు పోస్టు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఇదొక్కడే కాదు సమయం, సందర్భాన్ని బట్టి సినిమా డైలాగ్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగ్స్‌ను ఉపయోగిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటారు. చదవండి: ఆర్టీసీ ప్రయాణికుల అసౌకర్యంపై ఎండీ సజ్జనార్ స్పందన -
ప్రధాని మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు తెలిపారు. మోనప్ప జంక్షన్– టివోలి జంక్షన్–సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్ రోడ్–చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్, ఆర్పీరోడ్-ఎస్పీ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ నేపథ్యంలో పలు జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోనప్ప (రాజీవ్ గాంధీ విగ్రహం) – గ్రీన్లాండ్స్–ప్రకాశ్‌నగర్–రసూల్‌పురా–సీటీ–ప్లాజా–ఎస్బీహెచ్–వైఎంసీఏ–సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్‌రోడ్–ఆలుగడ్డ బావి–మెట్టుగూడ– చిలకలగూడ–బ్రూక్ బాండ్–టివోలి–బాలమ్రాయ్–స్వీకర్ ఉపకార్–సికింద్రాబాద్ క్లబ్–తిరుమలగిరి–తాడ్‌బండ్–సెంట్రల్ పాయింట్ మార్గాల్లో ప్రయాణించొద్దని సూచించారు. టివోలి క్రాస్‌రోడ్ నుంచి ప్లాజా క్రాస్రోడ్ల మధ్య ఉన్న రోడ్డును మూసివేయనున్నట్లు తెలిపారు. ఎస్బీఎస్ క్రాస్రోడ్ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డును మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు సకాలంలో రైల్వేస్టేషన్‌కు ముందుగానే చేరుకోవాలని సూచించారు. చిలకలగూడ జంక్షన్ వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశాలను పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులు, వాహనాలు చిలకలగూడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాలని చెప్పారు. సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్ జంక్షన్-రేతిఫైల్ టీ జంక్షన్-చిలకలగూడ జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, ప్రయాణికులు క్లాక్ టవర్-పాస్‌పోర్ట్ ఆఫీస్-రెజిమెంటల్ బజార్ మెయిన్ రోడ్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవచ్చని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ ప్రయాణానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన ఇలా శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోనున్న మోదీ.. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో పలు అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు రైల్వేకు సంబంధించిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు పీఎంవో పేర్కొంది. మొత్తం రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పండగ సందర్భంగా ఈనెల 30న హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకుహైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని తెలిపారు. పండగ రోజు రాములవారి శోభాయాత్ర ఉండనున్న నేపథ్యంలో ప్రధానంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. 30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకుయాత్ర చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగనున్న మార్గాల్లో వాహనాల దారిమళ్లింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు .పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ వాహనదారులు తమ తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. -
Hyderabad: పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై టూ వీలర్ ప్రవేశానికి చెక్..
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు వ్యతిరేకంగా పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే పై ద్విచక్ర వాహనదారులు ప్రయాణించకుండా ఉండేందుకు హెచ్ఎండీఏతో కలిసి తగు చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. సరోజినీదేవి ఆసుపత్రి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు 11 కిలో మీటర్ల మేర నిర్మించిన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కేవలం కార్లకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ద్విచక్ర వాహనాదారులు, భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. కానీ కొందరు ద్విచక్ర వాహనాదారులు ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. ► గతంలో ఈ వంతెనపై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు సైతం జరిగాయన్నారు. ►ఈ నేపథ్యంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ద్విచక్ర వాహనదారుల ప్రవేశాన్ని అరికట్టేందుకు హెచ్ఎండీఏతో పలుమార్లు సంప్రదింపులు జరిపి తగు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ►ఎక్స్‌ప్రెస్‌వే వంతెనపై ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ► ఈ నెల చివరి నాటికి ఈ పనులు పూర్తి అవుతాయన్నారు. సీసీ కెమెరాల ద్వారా వాహనాదారులను గుర్తించి అపరాధ రుసుం వేస్తామన్నారు. ►సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు పోలీస్‌స్టేషన్‌లోనే తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫ్లై ఓవర్ ర్యాంపుల వద్ద సీసీ కెమెరా వాహనాన్ని గుర్తించి అపరాధ రుసుం విధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. -
బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం
-
బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సైని కాలుతో తన్ని
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కారులో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే యువకుడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 94 పాయింట్లు నమోదు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువకుడు రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ ఎస్సైతో దుర్భాషలాడాడు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ఎసైను కాలితో తన్నాడు. యువకుడి పక్కన ఉన్న యువతి సైతం రెచ్చిపోయి ప్రవర్తించింది. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ మాట్లాడింది. దీంతో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులపై హద్దుమీరి ప్రవర్తించిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్గా గుర్తించారు. -
పొద్దు పొద్దున్నే పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్! ట్వీట్ వైరల్
నటుడు కమల్ కామరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆవకాయ్ బిర్యానీ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమైన ఆయన గోదావరి వంటి చిత్రాల్లో సహానటుడి పాత్రలు పోషించాడు. ఆయన ఎక్కువగా బయట కనిపించరనే విషయం తెలిసిందే. వెండితెరపై తప్పా మూవీ ఈవెంట్స్‌లో, ప్రిరిలీజ్ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించడు. సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాన్ని మీడియాకు దూరంగా గడుపుతాడు కమల్. చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైంది. పోలీసులకు దొరికపోయానంటు ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. దీంతో నెటిజన్లు ఆయన పోలీసులకు దొరకడం ఏంటీ! ఏం చేశాడు! ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే. తాజాగా కమల్ రాజు బైకి వెళ్తున్న ఫొటో షేర్ చేశాడు తన ట్విటర్లో షేర్ చేశాడు. తాజాగా కమల్ కామరాజు తాను పోలీసులకు దొరికిపోయానంటూ ట్వీట్ చేసి షాకిచ్చాడు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం ‘‘అందరికీ చెప్తాను. ఇవాళ నా బైక్ స్పీడు పెంచి దొరికిపోయాను. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి ఆత్రుత ఆపుకోలేక 60లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్న సమయంలో కూడా నేను స్పీడుగా వెళ్లడాన్ని పట్టుకుని నాకు చలాన్ పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పని తీరు, అభివృద్ధి చేసిన పద్ధతులు చూసి నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. వారు అభివృద్ధి చేసిన పద్ధతులకు ధన్యవాదాలు’ తెలిపాడు. అంతేకాదు, తాను బైక్ మీద వేగంగా వెళ్తున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. పోలీసులు ఏర్పాటు చేసిన కెమరాలో.. ఈ ఫొటో క్యాప్చర్ అయ్యింది అని తెలిపాడు. అందరికి చెప్తా... ఇవ్వాళా నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా . పోదున్నే కాళీ రోడ్ చూసి excite అయ్యి 60 లొ వవెళ్ళాలి 80 లొ వెళ్ళా. kudos to hyderabad traffic police and their advanced methods for capturing and sending me a challan even at such early hours. @hydcitypolice @HYDTP pic.twitter.com/KSuP5rvkVM — kamal kamaraju ~k k (@kamalkamaraju) January 19, 2023 -
Hyderabad: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద రోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్ ఆక్రమణలు, రోడ్డు పక్కనే అక్రమ పార్కింగ్లు, పుట్‌పాత్‌పైనే చిరు వ్యాపారాలు జోరుగా సాగేవి.. ఇక్కడికి అంబులెన్స్ రావాలంటే నరకయాతన అయ్యేది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గత రెండు నెలలుగా ఈ అక్రమ పార్కింగ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తుండటంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొంత మేర వాహనాలు తేలికగా రాకపోకలు సాగించే విధంగా ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పదేపదే చెప్పినా పెడచెవిన పెడుతూ రోడ్లపక్కనే బండ్లు పెట్టుకొని హోటళ్లు నడిపిస్తున్న వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమే కాకుండా సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రోడ్లపక్కన అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద నో పార్కింగ్ జోన్లో వాహనాలను లిఫ్ట్ చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు ►దీంతో అపోలో పరిసరాల్లో వాహనం పెడితే పోలీసులు లిఫ్ట్ చేస్తారని చిరు వ్యాపారాలు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తారని భావించిన వీరంతా గత నాలుగు వారాల నుంచి వీటి జోలికి పోవడం లేదు. ►ఫలితంగా ఈ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయి వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలవుతోంది. ►గతంలో రోజుకు రెండు మూడుసార్లు ట్రాఫిక్ పుష్‌కాట్ వాహనాలను తిప్పిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు గంటలో నాలుగైదు సార్లు తిప్పుతుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ►ఇది కేవలం అపోలో ఆస్పత్రికే పరిమితం చేయకుండా స్టార్ ఆస్పత్రి, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, స్టార్ బక్స్, తాజ్‌మహల్ హోటల్, రియాట్ పబ్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, బంజారాహిల్స్ రోడ్ నం.1, బంజారాహిల్స్ రోడ్ నం.12, ఫిలింనగర్‌లకు విస్తరించారు. ►బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు, ఫుట్‌పాత్‌లకు అడ్డంకులు సృష్టిస్తున్న 30 మంది చిరు వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ►మరో వైపు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు ఇష్టానుసారంగా గతంలో వాహనాలు నిలిపేవారు. ► ఇప్పటికే ఈ ఆస్పత్రికి రెడ్‌నోటీసులు జారీ చేశారు. ఆస్పత్రికి వైపు మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని, రెండోవైపు వాహనాలు పార్కింగ్ చేస్తే వీల్ క్లాంప్లు వేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సైతం గత ఐదు వారాల నుంచి అక్రమ పార్కింగ్‌లపై కొరడా ఝులిపిస్తున్నారు. ►రోడ్డుకు రెండువైపులా చిరు వ్యాపారులు రోడ్డును, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఇబ్బందులు కల్గిస్తుండటంతో జరిమానాలు విధిస్తున్నారు. ఫలితంగా ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాటు అక్రమ పార్కింగ్‌లకు 80 శాతం వరకు తెరపడింది. ►నిత్యం ఇక్కడి పోలీసులు ట్రాఫిక్ పుష్‌కాట్ వాహనంతో వాహనాలు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న వ్యాపార కేంద్రాలకు ఒక్కదానికి కూడా పార్కింగ్ సౌకర్యం లేదు. ►ఈ రోడ్డులో హోటళ్లు, ఆభరణాల షోరూంలు, బొటిక్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీరందరికీ ఇప్పటికే పలుమార్లు అవగాహన కలిగించి లైన్ దాటితే జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ► వివాహ భోజనంబు, అంతేరా, స్పైసీ అవెన్యూ, వ్యాక్స్ బేకరీ, బ్రీవ్ 40, సెవన్త్ హెవన్, కేఫ్ కాఫీడే తదితర వ్యాపార సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ►జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రోడ్డు, ఫుట్‌పాత్ అడ్డంకులు న్యూసెన్స్‌కు పాల్పడుతున్న 25 మంది వ్యాపారులపై ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. భారీగా జరిమానాలు విధించారు. పంజగుట్టలో.. ►పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు అక్రమ పార్కింగ్లు అధికంగా ఉండే సోమాజిగూడ యశోదా ఆస్పత్రి రోడ్డుపై దృష్టి సారించారు. ►ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకు సుమారు 25 వాహనాలను స్టేషన్‌కు తరలిస్తున్నారు. ►అక్రమ పార్కింగ్లు చేస్తున్న బైక్‌లను తరలిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డులో చిరువ్యాపారులను మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో సహజంగానే రోడ్డు మరింత ఇరుకుగా మారుతోంది. ►ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో పాటు, పంజగుట్ట ప్రధాన రహదారిలోని మెరీడియన్, రెడ్‌రోజ్ హోటల్, రాజ్‌భవన్ రోడ్డులో నిత్యం వాహనాలను సీజ్ చేస్తున్నారు. -
Hyderabad: కోర్ సిటీలోకార్ రేసా?.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నగరవాసులకు చుక్కలు చూపింది. తొలిసారిగా ఐఆర్‌ఎల్‌కు హైదరాబాద్ వేదిక కావటం గర్వకారణమే కానీ రేసింగ్ నిర్వహణకు ఎంపిక చేసిన ప్రాంతమే “సిటీ’జనులను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేసింది. నగరం నడిబొడ్డున నిర్వహించిన రేసింగ్.. రెండు రోజులుగా వాహనదారులకు చమటలు పట్టిస్తోంది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గతంలో ఫార్ములా రేసులు జరిగిన నగరాలను, అక్కడి ఏర్పాట్లను అధ్యయనం చేయకుండా నిర్ణయం తీసుకోవటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోడ్ల నిండా వాహనాలే.. ఐఆర్ఎల్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెక్లెస్ రోడ్, ఐమ్యాక్స్, సెక్రటేరియట్ చుట్టూ రహదారులను పూర్తిగా మూసివేశారు. సమాంతర రోడ్లు లేకపోవటంతో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ రహదారులైన ఖైరతాబాద్, బుద్ధభవన్, రసూల్‌పురా, మినిస్టర్ రోడ్, బీఆర్కే భవన్ వైపు మళ్లించారు. దీంతో ఆయా మార్గాలలోని నివాస, వాణిజ్య సముదాయాలవాసులు, ఉద్యోగస్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్, ట్యాంక్‌బండ్‌లలో ట్రాఫిక్ స్తంభించింది. అఫ్జల్‌గంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్ మార్గం కాకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్, కవాడిగూడ మీదుగా ప్రయాణించడంతో రోడ్లన్నీ బ్లాకయ్యాయి. దీంతో ఆయా రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కి.మీ. ప్రయాణానికే గంటల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చేయాలంటే.. రేసింగ్ అనేవి కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమైనవి. పైగా ఐఆర్ఎల్ పోటీలకు ఉచిత ప్రవేశం కాదు అలాంటప్పుడు ప్రధాన నగరంలో కాకుండా శివారు ప్రాంతాలలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు లేదా లింకు రోడ్లలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయ పడ్డారు. కొన్ని దేశాలలో విమానాశ్రయాలలోనూ రేసింగ్‌లు నిర్వహిస్తున్న నేపథ్యంలో శంషాబాద్, బేగంపేట విమానాశ్రయంలలో నిర్వహిస్తే బాగుండేదనే పలువురు తెలిపారు. పైగా రేసింగ్ కోసం కొత్తగా రోడ్లను నిర్మించే అవసరం కూడా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి, ఉప్పల్ స్టేడియంలలో ట్రాక్స్‌ను నిర్మించి రేసింగ్‌లను నిర్వహిస్తే వీక్షకులకు సైతం ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. చైనా, చెన్నైలలో ఎలాగంటే.. చైనా, మన దేశంలోని చెన్నైలో ఫార్ములా రేసింగ్‌లను సాధారణ ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా శివారులలో నిర్వహిస్తుంటారు. మన దగ్గర మాత్రం సిటీ సెంటర్లో నిర్వహించడంపై నగరవాసులు విమర్శిస్తున్నారు. పోటీ లేకుండానే రేసింగ్ ముగిసింది ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం మరోసారి నిరాశపర్చింది. ఎలాంటి పోటీలు లేకుండా ట్రయల్స్‌కే పరిమితమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ట్రయల్స్ గంట ఆలస్యంగా మొదలయ్యాయి. రేసర్లు రెండు, మూడు రౌండ్లు తిరిగిన తర్వాత ఆఖరికి పోటీ ఉంటుందని మొదట ప్రచారం చేశారు. కానీ వాతావరణం అనుకూలంగా లేదనే కారణంగా లీగ్‌ను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో నవంబర్ నెలలో జరిగినట్లుగా ఉదయం 11 గంటల నుంచే పోటీ ఉండవచ్చని భావించి వీక్షించేందుకు వచ్చిన మోటారుస్పోర్ట్స్ ప్రియులు సాయంత్రం 4 గంటల వరకు పడిగాపులు కాశారు. గంట పాటు ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ సమయంలోనూ కొన్ని వాహనాలు బ్రేక్‌డౌన్‌కు గురయ్యాయి. ట్రాక్ పై నిలిచిపోయిన వాటిని అక్కడి నుంచి తరలించారు. ఎంతో ఉత్కంఠ రేపుతుందనుకొన్న లీగ్ ఎలాంటి హడావుడి లేకుండానే మొదటి రోజు ముగిసింది. ఈసారి పోటీలపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీ సీట్లతో కనిపించాయి. నరకప్రాయంగా మారుతోంది.. సిటీలో వాహనాల రద్దీ ఎక్కువ. దీనికి తోడు ఇలా ట్రాఫిక్ మళ్లింపు, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా మూనేసి వేరు దారుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాయంత్రం ఇళ్లకు వెళ్లడానికి నరకప్రాయంగా మారుతోంది. – రామ్, ప్రైవేటు ఉద్యోగి వైఫల్యానికి నిదర్శనం.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురయ్యే ఇబ్బందులను భరించగలం. కానీ ఇలాంటి పరిణామాలు తరచుగా జరగడమే సంబంధిత శాఖల వైఫల్యానికి నిదర్శనం. నగరం కేంద్రంగా జరిగే కొన్ని కార్యక్రమాలు సిటీ ప్రతిష్టను పెంచేవే అయినప్పటికి వాటిని నిర్వహించే ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. – ప్రవీణ్ రెడ్డి, సాఫ్ట్వేర్ రెట్టింపు సమయం.. సాధారణ రోజుల్లో బంజారాహిల్స్ నుంచి రామ్‌నగర్ రావడానికి గంట సమయం పడితే గత రెండు రోజులుగా రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. నగరం మధ్యలో రోడ్లు మూసేసి, ట్రాఫిక్ మళ్లింపులతో ఈవెంట్లు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – మణికంఠ, నగరవాసి జనాల్ని బాధపెట్టే పోటీలు.. ఇండియన్ రేసింగ్ లీగ్‌తో రోడ్లపై నరకాన్ని చూడాల్సి వస్తోంది. చివరకు అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జనాల్ని బాధపెట్టి కార్లను పరుగులు పెట్టించడమేంటి? – వంగీపురం రాఘవ, నాగారం -
హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ బదిలీ..
సాక్షి, హైదరాబాద్/వరంగల్: హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఆయనను వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ ఎస్పీగా పని చేస్తూ డీఐజీగా పదోన్నతి పొందిన రంగనాథ్ గతేడాది డిసెంబర్ 29న సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండకు వెళ్లే ముందూ ఆయన సిటీ ట్రాఫిక్ డీసీపీగా పని చేశారు. రోడ్డు ఆక్రమణల నిరోధం కోసం నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు అమలులోకి వచ్చిన ఆపరేషన్ రోప్లో రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు, తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, మలక్‌పేట్ వద్ద మూడో మార్గం పనుల వేగవంతం... ఇలా నగర ట్రాఫిక్‌పై రంగనాథ్ తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ లోక్ అదాలత్‌ను ఆన్లైన్లో నిర్వహించేలా చేశారు. ట్రాఫిక్ విభాగంలోనూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణ, జంక్షన్లలో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా సంచరిస్తున్న అంబులెన్స్‌ల క్రమబద్దీకరణ, జంక్షన్లలో గ్రీన్ లైట్ వినియోగం పెంపు, కార్ల అద్దాల నల్ల ఫిల్మ్ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగంపై ఆంక్షలు.. ఇలా ఎన్నో సంస్కరణలు రంగనాథ్ తీసుకువచ్చారు. ఆయన అమలు చేసిన జూబ్లీహిల్స్ రోడ్ నెం.45తో పాటు ఇతర మార్గాల్లో మళ్లింపులు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ట్రాఫిక్ విభాగానికి కొత్త చీఫ్ వచ్చే వరకు మరో అధికారి ఇన్చార్జిగా ఉండనున్నారు. 19నెలలు పనిచేసిన తరుణ్‌జోషి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న డాక్టర్ తరుణ్జోషిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తరుణ్‌జోషి 2021 ఏప్రిల్ 4న వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీస్ వర్టికల్స్, వెల్ఫేర్ విషయంలో నిజాయితీగల అధికారిగా పేరున్న ఆయన సుమారు 19 నెలల పాటు తన మార్కు వేసుకున్నారు. ఐజీగా పదోన్నతి పొందిన తరుణ్‌జోషి సెంట్రల్ సర్వీసెస్‌కు వెళ్తున్నారన్న ప్రచారం కొంతకాలంగా జరిగింది. ఇదే సమయంలో గురువారం ఆయనను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్‌ను నియమించింది. చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. పోలీస్‌శాఖలో రంగనాథ్ తనదైన మార్క్ ఏవీ రంగనాథ్ 1970 అక్టోబర్‌లో నల్లగొండలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం హుజూర్నగర్ తదితర ప్రాంతాల్లో చేసిన ఆయన తర్వాత గుంటూరులో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఐడీబీఐ బ్యాంకు అధికారిగా కొంతకాలం పనిచేసి పోలీస్ బాస్ కావాలన్న లక్ష్యంతో గ్రూప్–1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ –1 లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. పోలీస్ బాస్ కావాలన్న ఏకైక లక్ష్యంతో డీఎస్పీ ఆప్షన్ ఖరారు చేసుకున్నారు. 1996 బ్యాచ్‌లో డీఎస్పీ ర్యాంక్‌లో స్థిరపడి 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయిన రంగనాథ్ 2003 వరకు కొత్తగూడెంలో పనిచేసి, ఆ తర్వాత సంవత్సరంపాటు వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా పనిచేశారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం, నక్సల్స్ చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు. అనంతరం తూర్పు గోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో బలిమెల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహౌండ్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత రంగనాథ్‌ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న ఏవీఆర్.. 2012 చివరివరకు అక్కడ పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి, అక్కడినుంచి నల్లగొండకు బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు పనిచేసి తన మార్కు వేసుకున్నారు. నల్లగొండలో ఉన్నసమయంలోనే డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తించిన ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా, నల్ల గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు. నర్సంపేటలో పనిచేసినప్పుడు నక్సల్స్ సమస్యపై కీలకంగా పనిచేశారు. కాగా, ఆయన సీపీగా రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. ప్రొఫైల్ పూర్తి పేరు : ఆవుల వెంకట రంగనాథ్ పుట్టిన తేదీ : అక్టోబర్ 22, 1970 పుట్టిన ప్రదేశం : నల్లగొండ తల్లిదండ్రులు : సుబ్బయ్య, విజయలక్ష్మి భార్య : లక్ష్మీలావణ్య పిల్లలు : రుషిత, కౌశిక్ గ్రూప్ –1 : 1996 డీఎస్పీ, 2006లో ఐపీఎస్ మొదటి పోస్టింగ్ : గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ ఇష్టమైన ఆట : టెన్నిస్ ప్రదేశం : కశ్మీర్ చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. -
రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్‌లపై నిబంధనలు కఠినతరం
-
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా.. కచ్చితంగా దొరికిపోతారు..
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం సైరన్లు పోలీసు, అగ్నిమాపక శాఖ తప్ప మరెవరూ వినియోగించకూడదు. ప్రస్తుతం అనేక మంది తేలికపాటి వాహన చోదకులు వీటిని బిగించుకున్నారు. మోగిస్తే తప్ప ఈ ఉల్లంఘన విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియదు. మరి ఇలాంటి వారికి చెక్ చెప్పడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగానే నగర ట్రాఫిక్ విభాగం అధికారులు విజిలెన్స్ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది, కెమెరాల కంటికి కనిపించని ఉల్లంఘనలకు సైతం ఆస్కారం ఇవ్వద్దంటూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ఈ బృందాలకు రూపమిస్తున్నారు. ప్రస్తుతం విధి విధానాల రూపకల్పన, సభ్యుల ఎంపిక దశలో ఉన్న ఈ టీమ్స్ త్వరలో క్షేత్ర స్థాయిలో పని ప్రారంభించనున్నాయి. ఇలాంటి విధులకు వినియోగం.. ► ఈ విజిలెన్స్ బృందాలను ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్ని రకాలైన ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి రంగంలోకి దింపుతున్నారు. సైరన్ల వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లు, మల్టీ టోన్డ్ హారన్లు, ఎయిర్ హారన్ల వినియోగం, అనధికారికమైన బుగ్గ కార్లు, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ తదితర ఉల్లంఘనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►వీటిలో కొన్ని ఉల్లంఘనల్ని చౌరస్తాలు దాటేసిన తర్వాత, లేదా వాహనచోదకులు వినియోగించినప్పుడు మాత్రమే గుర్తించడం సాధ్యమవుతోంది. ఈ కారణంగానే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఈ వాహనచోదకులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి ఉల్లంఘనుల కారణంగా ఇతర వాహనచోదకులకు ఇబ్బందులు కలగడంతో పాటు శబ్ధ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. ఈ విషయం గమనించిన ఉన్నతాధికారులు విజిలెన్స్ టీమ్స్‌కు రూపమిస్తున్నారు. మొత్తం 48 మంది కానిస్టేబుళ్లు.. నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఆరు జోన్లు ఉన్నాయి. ప్రాథమికంగా జోన్‌కు రెండేసి బృందాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టీమ్‌కు ప్రత్యేక వాహనం, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. పని ఒత్తిడికి తావు లేకుండా రెండు షిఫ్టుల్లో వినియోగించడానికి మొత్తం 48 మందిని ఎంపిక చేస్తున్నారు. వీరికి అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు మెలకువలు నేర్పించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయా జంక్షన్ల వద్ద మాటు వేసి ఉండే ఈ బృందాల పని తీరును స్వయంగా ఉన్నతాధికారులే పర్యవేక్షించనున్నారు. స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిలో యువతే ఎక్కువగా ఉంటాయి. వీరిని వెంబడించి, అడ్డుకోవడానికి ఈ టీమ్స్ ప్రయత్నిస్తే వాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది కొన్నిసార్లు ప్రమాద హేవుతుగానూ మారుతుంది. టీటీఐలో ప్రత్యేక శిక్షణ.. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు విజిలెన్స్ టీమ్స్ కారణంగా ఎలాంటి అపశ్రుతులు, వాహన చోదకులతో పాటు ఉల్లంఘనులకూ ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో (టీటీఐ) వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా ఉల్లంఘనులకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ చెక్ చెప్పాలి? వారితో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న, నడుస్తున్న వారికి ఎలాంటి హాని లేకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలు ఈ శిక్షణలో వారికి నేర్పుతున్నారు. ఈ విజిలెన్స్ టీమ్స్‌ను ప్రథమ చికిత్స, సీపీఆర్ తదితరాల్లోనూ నిష్ణాతులను చేయాలని నిర్ణయించారు. కేవలం ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికే కాకుండా వర్షాలు, నిరసనలతో పాటు ఇతర కారణాల వల్ల హఠాత్తుగా తలెత్తే తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ క్లియరెన్స్ కోసమూ వినియోగిస్తారు. (క్లిక్ చేయండి: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్‌గా ఐసీసీసీ) -
బస్టాప్‌లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..
హైదరాబాద్: బస్టాప్‌లు ఏర్పాటు చేసేదే బస్సులు ఆపేందుకు.. కానీ బస్టాప్‌లో బస్సులు ఆగడం వల్ల వెనక ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ ట్రాఫిక్ పోలీసులు ఆ బస్టాప్‌లో బస్సులు ఆగొద్దంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం వల్ల ప్రయాణికులు, వాహనదారుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే రోడ్డులో బస్టాప్ ఉంది. ఈ బస్టాప్‌లో గత కొన్ని సంవత్సరాలుగా బస్సులు ఆగుతుంటాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాప్‌లో బస్సులు ఆగడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ బస్టాప్‌లో బస్సులు, ఆటోలు నిలపవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో బస్సులు ఎక్కడ ఆపాలంటూ ఒక వైపు ఆర్టీసీ డ్రైవర్లు, మరోవైపు బస్సులు ఎక్కేందుకు వస్తున్న ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కొరవడిన సమన్వయం... జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో సిగ్నళ్లకు దగ్గరగా ఉన్న బస్టాప్‌ల వద్ద సమస్య ఎదురైతే ట్రాఫిక్ పోలీసులు ముందుగా ఆయా బస్టాప్‌లను తొలగించి మరికొంత దూరంలో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకి సూచించాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ప్రతిపాదన చేయకుండా సంబంధిత అధికారులు బస్టాప్‌లో బస్సులు ఆపొద్దంటూ బోర్డులు పెట్టడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఇంకాస్త దూరం వెళ్లాక బస్సులు ఆపేందుకు అనువైన స్థలం కూడా లేదు. ఇక్కడ ఇరుకైన రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. నిత్యం ఫిలింనగర్, అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే వందలాది మంది ఇక్కడ బస్సు సేవలను వినియోగించుకుంటుంటారు. రెండు శాఖల అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే వీటిని ఇక్కడి నుంచి తొలగించి ప్రయాణికులకు అనువైన స్థలంలో బస్టాప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ) -
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుల షాక్.. ఫైన్ కట్టకుంటే మళ్లీ ఫైన్!
సాక్షి, సిటీబ్యూరో: అనునిత్యం ఉల్లంఘనలకు పాల్పడటం, జారీ అయిన ఈ–చలాన్లు పట్టించుకోకుండా వ్యవహరించడం... ఈ పంథాలో రెచ్చిపోతున్న వాహనచోదకులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. మూడు నెలల వ్యవధిలో పదేపదే వైలేషన్స్‌కు పాల్పడి, జరిమానాలు చెల్లించని వారికి భారీగా వడ్డించనున్నారు. కేవలం తీవ్రమైన ఉల్లంఘనలకు మాత్రమే ఈ విధానం అమలుకానుంది. దీనికి సంబంధించి నగర ట్రాఫిక్ విభాగం ప్రాథమిక కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే ద్విచక్ర వాహనచోదకులకు రూ.100 జరిమానా పడుతోంది. ఇలా జారీ అవుతున్న ఈ–చలాన్లను అనేక మంది చెల్లించట్లేదు. ఇకపై ఒకసారి చలాన్ జారీ అయిన నాటి నుంచి మూడు నెలల వ్యవధిలో ఆ ఈ–చలాన్ చెల్లించకుండా మరో ఉల్లంఘనకు పాల్పడితే అప్పుడు విధించే జరిమానా పెరుగుతుంది. రెండోసారికి రూ.200, మూడోసారికి రూ.600 చొప్పున విధిస్తారు. ఎప్పటి జరిమానాలు అప్పుడు చెల్లించేస్తే మాత్రం రూ.100 చొప్పునే పడుతుంది. ఇదొక్కటే కాదు.. మరికొన్ని తీవ్రమైన ఉల్లంఘనల విషయంలోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. ► రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే ద్వికచ్ర వాహనాలు, ఆటోలకు రూ.200, రూ.600, రూ.800 చొప్పున, ► తేలిక పాటి వాహనాలకు, భారీ వాహనాలకు రూ.1000, రూ.1500, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేస్తారు. ► అలాగే ఎక్కడపడితే అక్కడ అక్రమంగా పార్కింగ్ చేస్తే ద్విచక్ర వాహనాలు, ఆటోలకు రూ.200 (అక్కడ నుంచి ఠాణాకు తరలిస్తే మాత్రం రూ.350), రూ.700, రూ.1000 చొప్పున, తేలికపాటి, భారీ వాహనాలకు రూ.1000, రూ.1200, రూ.1700 చొప్పున విధిస్తారు. ► ఈ విధానం కోసం ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు పెంచట్లేదు. మోటారు వాహనాల చట్టంలో (ఎంవీ యాక్ట్) ఉన్న కీలక సెక్షన్లు వినియోగిస్తున్నారు. దీని కోసం పెద్ద అధ్యయనమే నిర్వహించారు. అందులో రాంగ్ సైడ్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ ఇలా వేర్వేరు సెక్షన్లకు వేర్వేరుగా జరిమానాలు ఉన్నాయి. మరోపక్క ఒకసారి జారీ చేసిన చలాన్‌ను నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే అది ఉత్తర్వుల ధిక్కరణ కిందికి వస్తుందని, దీనికి రూ.500 జరిమానా విధించవచ్చని ఎంవీ యాక్ట్ చెప్తుంది. ఇలాంటి అనేక కీలక సెక్షన్లు ఇప్పటి వరకు వాడలేదు. వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ట్రాఫిక్ జామ్స్, ప్రమాదాలు తగ్గించడానికి ఇకపై వినియోగించాలని నిర్ణయించారు. ► వితౌట్ హెల్మెట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్‌లతో పాటు సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్ తదితర ఉల్లంఘనకూ ఈ విధానం వర్తిస్తుంది. ఏ వైలేషన్ వల్లనైతే ప్రాణనష్టం, ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయో అలాంటి వాటికి వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ లోక్ అదాలత్‌లు ఉండవని, ప్రతి ఒక్కరూ ఈ–చలాన్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: దసరా సెలవులు కుదింపుపై క్లారిటీ వచ్చేసింది -
ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయిన మహిళ
-
బాలాపూర్ గణేష్ శోభాయాత్ర.. ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో సామూహిక గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను నిమజ్జనం చేసే పనుల్లో భక్తులు నిమగ్నమయ్యారు. నిమజ్జనోత్సవానికి మూడు కమిషనరేట్ల పోలీసులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. బాలాపూర్ గణేషుడి శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, గణనాథుడు సాగరానికి చేరేందుకు వీలుగా మార్గం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. బాలాపూర్ నుంచి సౌత్ జోన్ మీదుగా చార్మినార్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరుగుతుందని వెల్లడించారు. మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని అన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం జరగనున్నట్లు రంగనాథ్ తెలిపారు. గణేష్ నిమజ్జానానికి ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్‌లో 20 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. సెంట్రల్ జోన్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని, భక్తులు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ వినాయకుడు మద్యాహ్నం తర్వాత ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నామని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. రేపు సెలవు గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం(సెప్టెంబర్ 9) సెలవు ప్రకటించింది. తిరిగి సెప్టెంబర్ 12న వర్కింగ్ డేగా ప్రకటించింది. -
హైదరాబాద్: ఓరి వీళ్ల వేషాలు తగలెయ్య.. నంబర్ ప్లేట్ ఏదయ్యా! (ఫొటోలు)
-
ఖైరతాబాద్ ఎమ్మెల్యే కార్లపై 66 చలాన్లు.. రూ. 37, 365 చెల్లించి..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు పెండింగ్ చలాన్లను ఆదివారం క్లియర్ చేశారు. కొంత కాలంగా ఆయనకు చెందిన టీఎస్ 09 ఎఫ్ఏ 0999తోపాటు మరో నాలుగు కార్లకు 66 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఈ వాహనాలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్ చలాన్ల జాబితా గుట్టురట్టైది. దీంతో 66 చలానాలకుగాను రూ. 37365లను ఎమ్మెల్యే చెల్లించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు చెందిన చలానాలు క్లియర్ అయినట్లు తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు -
బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు హై ఎండ్ కార్ల భరతం పట్టారు. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పది వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దర్జాగా తిరుగుతున్న ఖరీదైన కార్లు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టడీ సర్కిల్, తాజ్ మహల్ హోటల్, టీవీ చౌరస్తా, కళింగ కల్చరల్ సెంటర్ చౌరస్తా, తాజ్‌కృష్ణ ఎదురుగా బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, సైఫాబాద్, నారాయణగూడ, చిక్కడపల్లి ట్రాపిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి తనఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నడుపుతున్న ఓ వ్యక్తి కారును సీజ్ చేశారు. ► నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న నాలుగు కార్లను సీజ్ చేశారు. ఈ అయిదు కార్లపై ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. ►బ్లాక్ ఫిల్మ్‌లతో తిరుగుతున్న 35 మంది కారు యజమానులకు ఒకొక్కరికి రూ. 700లు చొప్పున జరిమానా విధించారు. ఇర్రెగ్యులర్, ఇన్‌ప్రాపర్ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 32 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. ►ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 39 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న మూడు కారు యజమానులకు రూ. 2000ల ప్రకారం జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ► జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, నీరూస్ జంక్షన్, రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, రోడ్ నంబర్ 36 కళాంజలి వద్ద జూబ్లీహిల్స్ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు, మారేడుపల్లి, మహంకాళి, గోపాలపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల నుంచి అయిదు చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ► బ్లాక్ ఫిల్మ్‌లతో తిరుగుతున్న 48 టాప్ మోడల్ కార్ల యజమానులకు రూ. 700ల ప్రకారం జరిమానా విధించారు. ► ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 13 వాహనాలపై జరిమానా విధించారు. ► ఇంప్రాపర్, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లతో ప్రయాణిస్తున్న 45 కార్లకు రూ. 200ల వంతున జరిమానా విధించారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 2 వాహనాలపై చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. సర్వీసు రోడ్డులో పార్కింగ్ చేసిన ఒక వాహనంపై జరిమానా విధించారు. ► ఇద్దరు వాహనదారులపై 41(ఐ) సీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కల్గిస్తున్న ఒక వాహనదారుడిపై కేసు నమోదైంది. అక్రమ పార్కింగ్ చేసిన ఇద్దరు వాహనదారులకు జరిమానా విధించారు. -
బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్లపై నజర్; 18 నుంచి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలను నగర ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి మరో విడత స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత కూడా టీఆర్ నంబర్‌తో తిరగడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను నేర కార్యకలాపాలకు దోహదపడేవిగానూ పరిగణిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం చార్జిషీట్లు దాఖలు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని హెచ్చరించారు. సంబంధిత వాహనాలను గుర్తిస్తే 90102 03626కు ఫిర్యాదు చేయాలన్నారు. (క్లిక్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి) -
Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే!
బంజారాహిల్స్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో 85 శాతం మంది యువతే ఉంటున్నారు. జైలుకు వెళుతున్న వారిలో సైతం ఎక్కువగా యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రతిరోజు వేర్వేరు చోట్ల శ్వాస విశ్లేషణ పరీక్షలు (బ్రీత్ ఎనలైజర్) నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు. కేసు నమోదు చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిసినా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 85 శాతం మంది 18–40 ఏళ్ల వారే ఉంటున్నట్లు ఇటీవల పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పరిధిలోని ఐదు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 300 పైన నమోదైన వారికి జైలుశిక్ష విధించారు. బీఏసీ 397గా నమోదైన ఓ డ్రైవర్‌కు వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో బీఏసీ 300కు పైగా నమోదైన వాహనదారులు 9 మందికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. చదవండి👉🏻 ఖమ్మంలో వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం 485 మంది కోర్టులో హాజరు.. డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో వాహనం ఆపిన వెంటనే మద్యం తాగిన వాహనదారుడు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. శ్వాస విశ్లేషణ పరీక్షలో వచ్చిన కౌంట్‌ను జత చేసి న్యాయస్థానానికి పంపిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ బీఏసీ 300 దాటితే వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వీరికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా విధిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 2100 కేసులు నమోదు కాగా ఇందులో 485 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 9 మందికి జైలుశిక్ష పడింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండుసార్లు పట్టుబడ్డ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయింది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో నాలుగైదు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. చదవండి👉🏼 ‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు? తీరు మారడం లేదు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో విరివిగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడ్డ ప్రతి ఒక్కరి వివరాలు ట్యాబ్‌లో పొందుపరుస్తున్నారు. మందుబాబుల పేరు, వివరాలు నమోదు చేయగానే గతంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి ఉంటే ఆ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రెండుమూడు సార్లు సైతం పట్టుబడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవల జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ట్యాబ్‌లో ఫీడ్ చేయగానే అంతకుముందే పట్టుబడ్డట్లుగా తేలింది. దీంతో ఆయనున న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి డ్రైవింగ్ లైసెన్స్‌రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీని ఆధారంగా కోర్టులు రెండు రోజుల నుంచి నెల రోజుల పాటు శిక్షలు వేస్తున్నాయి. చదవండి👉 కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య -
గచ్చిబౌలి: మద్యం మత్తులో వీరంగం.. పోలీసులపై చిందులు తొక్కిన యువకులు
సాక్షి, గచ్చిబౌలి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాలో ఇంజనీరింగ్ చదివి ఇటీవలే నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును డ్రైవ్ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల పై చిందులు వేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేటకు చెందిన కే.విజయ్(30), ఘట్కేసర్కు చెందిన సూర్య(28)లు గురువారం సాయంత్రం విధులు ముగించుకొని కొండాపూర్ ప్రాంతానికి వచ్చారు. కారు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ విజయ్, సూర్యలను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరు యువకులు నిహాల్, లోహిత్‌లుగా గుర్తించారు. మత్తులో ఉన్న వీరు పోలీసులపై తిరగబడడంతో వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటకు చెందిన లోహిత్, కొండాపూర్‌కు చెందిన నిహాల్‌రెడ్డి ఇద్దరు స్నేహితులుగా గుర్తించారు. అమెరికాలో వీరిద్దరు బీటెక్ పూర్తి చేసి ఇటీవలే నగరానికి వచ్చారు. కాగా వీరు ఇరువురు గురువారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగి సాయంత్రం కొండాపూర్‌లోని నిహాల్ ఇంటికి వస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి వీరి ముందు బైక్‌పై వెళ్తున్న విజయ్, సూర్యల వాహనాన్ని ఢీకొట్టారు. వీరికి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా కారు నడుపుతున్న నిహాల్‌కు 234 ఎంజీ, లోహిత్‌కు 501ఎంజీ వచ్చింది. వీరు మద్యంతోపాటు మత్తు పదార్థాలను తీసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై పార్లమెంటు సభ్యుడి స్టిక్కర్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: సైలెంట్ జోన్స్.. నో హారన్ ప్లీజ్
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాల నేపథ్యంలో నగరంలో వాహనాల ద్వారా ఏర్పడుతున్న శబ్ధ కాలుష్యాన్ని నిరోధించడంపై సిటీ ట్రాఫిక్ విభాగం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాలను సైలెంట్ జోన్లుగా ప్రకటించనుంది. వీటిలో నో హాకింగ్ విధానాన్ని అమలు చేస్తూ హారన్లు మోగించడం నిషేధించడానికి కసరత్తు చేస్తోంది. వీటిని అతిక్రమించే ఉల్లంఘనులకు గుర్తించి, చర్యలు తీసుకోవడానికి అకోస్టిక్ కెమెరాలు వినియోగించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎకోమ్ సంస్థకు చెందిన వీటి పనితీరును బుధవారం ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ పరిజ్ఞానం దేశంలోనే తొలిసారిగా నగరంలో వాడనున్నారు. -సాక్షి, హైదరాబాద్ మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాల హారన్, సైలెన్సర్లు 80 డెసిబుల్స్ వరకు శబ్ధం చేయవచ్చు. ఈ పరిమితిని దాటి శబ్ధం చేసే ఫ్యాన్సీ హారన్లు, వాహనాల సైలెన్సర్లపై ఇప్పటికే ఆడియో మీటర్లను వినియోగించి ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కొందరు వాహన చోదకులు వినియోగిస్తున్న హారన్లు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ ఇతరులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రధానంగా జంక్షన్ల వద్ద ఆగి ఉన్నప్పుడు, సిగ్నల్ రెడ్ లైన్ నుంచి గ్రీన్ లైట్లోకి మారిన వెంటనే హారన్లు మోగిస్తుండటంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని గమనించిన మంత్రి కేటీఆర్ నిరోధానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల ట్రాఫిక్ వింగ్‌కు ఆదేశాలు ఇచ్చారు. జర్మనీ పరిజ్ఞానంతో తయారైన కెమెరాలు... హారన్లు, సైలెన్సర్ల ద్వారా శబ్ధకాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను గుర్తించే అకోస్టిక్ కెమెరాలను ప్రస్తుతం దేశంలోని ఏ పోలీసు విభాగమూ వాడట్లేదు. ఫ్రాన్స్‌కు చెందిన ఎకోమ్ కంపెనీ జర్మనీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది. ప్రస్తుతం ఇజ్రాయిల్, చైనా, మలేషియా సహా కొన్ని మూడో ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉంది. వీటి పరితీరును సంస్థ ప్రతినిధి ప్రతీక్ ట్రాఫిక్ విభాగం అధికారులతో పాటు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణులకు వివరించారు. చతురస్రాకారంలో ఉండి రెండు చేతులతోనూ పట్టుకుని వినియోగించే ఈ కెమెరా ముందు వైపు మానిటర్, వెనుక వైపు 72 మైక్రోఫోన్లు ఉంటాయి. వీటి సహాయంతో సదరు కెమెరా గరిష్టంగా 20 మీటర్ల దూరంలో ఉన్న వాహనాల నుంచి వెలువడే శబ్ధ కాలుష్యాన్ని గుర్తిస్తుంది. కనిష్టంగా 20 డెసిబుల్స్ నుంచి గరిష్టంగా 20 వేల డెసిబుల్స్ వరకు వెలువడే శబ్ధాలను గుర్తించి ఈ వాహనం వీడియో, ఫొటో తీస్తుంది. మానిటర్లో శబ్ధం వెలువరిస్తున్న వాహనం చుట్టూ ఎర్ర రంగులో వలయం కనిపిస్తుంటుంది. ఏఎన్పీఆర్ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం... ఎకోమ్ సంస్థ బుధవారం డెమో ఇచ్చిన కెమెరా ద్వారా శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న వాహనాన్ని గుర్తించడంతో పాటు అది ఏ స్థాయిలో శబ్ధాన్ని చేస్తోందో తెలుసుకోవచ్చు. ఆపై దీన్ని వాడే ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనం దగ్గరకు వెళ్లి మాన్యువల్‌గా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది కష్టసాధ్యం, ఇబ్బందికరమని ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకోస్టిక్ కెమెరాలను ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టంతో (ఏఎన్పీఆర్) అనుసంధానించాలని నిర్ణయించారు. ఇలా చేస్తే జంక్షన్లలో ట్రాఫిక్ కెమెరాలతో కలిసి ఉండే అకోస్టిక్ కెమెరాలు శబ్ధ కాలుష్యానికి కారణమైన వాహనంతో పాటు దాని నంబర్‌ను గుర్తిస్తుంది. ఆ వాహనచోదకుడికి ఈ–చలాన్ పంపడంతో పాటు న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి అవసరమైన ఆధారాలను అందిస్తుంది. ఈ విధానం ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో ఉందని, నగరంలో వాడుతున్న ఏఎన్పీఆర్ వ్యవస్థతో అనుసంధానంపై శుక్రవారం జరగబోయే రెండో దశ సమావేశంలో పూర్తి స్పష్టత ఇస్తామని ఎకోమ్ సంస్థ ప్రతినిధి ట్రాఫిక్ చీఫ్‌కు తెలిపారు. కాగా ఈ కెమెరా ఖరీదు రూ.13 లక్షలని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో 45 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి,సనత్‌నగర్: జీహెచ్ఎంసీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)–2 కింద బేగంపేట కరాచీ బేకరీ సమీపంలోని పికెట్ నాలాపై జరిగే బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో 45 రోజుల పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్ఎన్డీపీ ఈ వినతి మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఎస్పీ రోడ్డు, మినిస్టర్ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ఆ మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జూన్ 4 వరకు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు విడుదల చేసిన రూట్ మ్యాప్.. రాకపోకలు ఇలా.. సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ నుంచి రసూల్‌పురా జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్ దేవాలయం వద్ద లేన్ (యాత్రి నివాస్ దగ్గర) వద్ద ఎడమ వైపు మళ్లీ..పీజీ రోడ్డు, ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ కుడి వైపు, మినిస్టర్ రోడ్డు మీదుగా రసూల్ పురా ‘టి’ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ► కిమ్స్ ఆస్పత్రి నుంచి రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు న్యూ రాంగోపాల్‌పేట పీఎస్ ఎదురుగా సింథికాలనీ, పీజీ రోడ్డు వైపు రైట్ టర్న్ తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు. ►బేగంపేట ఫ్లైఓవర్ నుంచి వచ్చే కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్లే వాహనదారులు రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ మార్గంలో కేవలం సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. ►హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్, రసూల్‌పురా ‘టి’ జంక్షన్ మధ్య ‘వన్ వే’గా గుర్తించారు. ►సికింద్రాబాద్ నుంచి సోమాజీగూడ వైపు గూడ్స్ వాహనాలతో పాటు ప్రైవేటు, స్కూల్స్, కాలేజీ బస్సులు వంటి రవాణా వాహనాలను అనుమతించరు. అవి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: లెక్క తప్పైతే మంత్రి పదవి రాజీనామా చేస్తా: కేటీఆర్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లే మార్గాలు ఇవీ.. పంజగుట్ట వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, సీటీఓ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని, హనుమాన్ టెంపుల్ లేన్, ఫుడ్‌వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ ఎడమ మలుపు నుంచి కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాలి. ►పంజగుట్ట ఎక్స్‌రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైవర్, నెక్లెస్ రోటరీ, పీవీఎన్ఆర్ మార్గ్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►సీటీఓ జంక్షన్, ప్యారడైజ్, రాణిగంజ్ జంక్షన్ కుడి వైపు తిరిగి, మినిస్టర్ రోడ్డు మీదుగా కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. ►కోఠి, ఎంజే మార్కెట్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్, రాణిగంజ్ జంక్షన్ ఎడమ మలుపు, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ లేదా బుద్ధభవన్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. -
E Challan: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు రిబేటుతో చెల్లించడానికి అవకాశం కల్పించిన ఈ– లోక్ అదాలత్ శుక్రవారంతో ముగిసింది. మార్చి 1న మొదలైన ఈ పథకం తొలుత ప్రకటించిన దాని ప్రకారం అదే నెల 31తో ముగియాల్సి ఉంది. వాహన చోదకుల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో 15 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ– చలాన్ల బకాయిలు రూ.1,200 కోట్ల ఉండగా.. 90 నుంచి 25 శాతం వరకు రిబేట్స్ ఇవ్వడంతో ఈ– లోక్ అదాలత్ ద్వారా మొత్తం రూ.250 కోట్ల వరకు వసూలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రూ.300 కోట్లకు చేరడంతో విజయవంతమైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి 11.59 గంటల వరకు సమయం ఉండటంతో మరికొంత జమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.92 కోట్ల వాహనచోదకులు వినియోగించుకున్నారు. అత్యధికంగా ద్విచక్ర వాహనాలవే.. చెల్లింపులు జరిగిన అత్యధిక చలాన్లు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే అని అధికారులు వివరిస్తున్నారు. మొత్తం పెండింగ్ చలాన్లలో 70 శాతానికి పైగా క్లియర్ అయినట్లు స్పష్టం చేస్తున్నారు. కొన్ని వాహనాలు చేతులు మారడం, మరికొన్ని వినియోగంలో లేకపోవడం తదితర కారణాలతో 10 నుంచి 15 శాతం చలాన్లు చెల్లింపులు జరగలేదని భావిస్తున్నారు. ఈ– లోక్ అదాలత్‌లో పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై సోమవారం నుంచి చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సర్వర్‌లో పెండింగ్ చలాన్లు జాబితాను అప్డేట్ చేస్తున్నారు. ఇది క్షేత్రస్థాయి అధికారుల వద్ద ఉండే ట్యాబ్‌లకు అనుసంధానించి ఉంటుంది. రహదారులపై తనిఖీలు నిర్వహించనున్న ప్రత్యేక బృందాలు జరిమానాల బకాయి ఉన్న వారిని గుర్తించి పట్టుకుంటాయి. వీళ్లు ఎంత మొత్తం పెండింగ్‌లో ఉండే అంతా చెల్లించేలా చర్యలు తీసుకోనున్నాయి. మరోపక్క 15 చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న వారి జాబితాలను ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా రూపొందిస్తున్నారు. వారిపై ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేయనున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చలాన్ల సంఖ్య, చెల్లించాల్సిన మొత్తం ఆధారంగా టాప్ వైలేటర్స్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్ నుంచి ఆయా వాహన చోదకుల చిరునామాలు సంగ్రహిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా ఏర్పాటయ్యే ప్రత్యేక బృందాలకు ఇవి అందించనున్నారు. ఆ టీమ్స్ సదరు ఉల్లంఘనుల ఇళ్లకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న జరిమానా చెల్లించేలా ప్రయత్నాలు చేస్తాయి. ఫోన్ నంబర్ల డేటాబేస్ సమకూరింది ఈ– లోక్ అదాలత్ నేపథ్యంలో భారీ సంఖ్యలో పెండింగ్ చలాన్లు వసూలు కావడంతో పాటు వాహన చోదకులకు సంబంధించిన ఫోన్ నంబర్లతో కూడిన డేటాబేస్ సమకూరింది. కొన్ని వాహనాలు అనేక మంది చేతులు మారినా... ఆర్టీఏ డేటాబేస్‌లో అప్డేట్ కాని నేపథ్యంలో వారి చిరునామాలు, కాంటాక్ట్ నంబర్లు అందుబాటులో ఉండేవి కాదు. ఫలితంగా అనేక ఈ– చలాన్లు వాహనాల మాజీ యజమానులకు చేరేవి. ఈ– లోక్ అదాలత్ చెల్లింపుల నేపథ్యంలో ఓటీపీ తప్పనిసరి చేయడంతో వాహనచోదకులు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు తమ ఫోన్ నంబర్లను పొందుపరిచారు. ఈ వివరాలు సంగ్రహించిన సర్వర్ ప్రత్యేక డేటాబేస్ రూపొందించింది. ఈ నేపథ్యంలోనే ఈ– చలాన్‌ను వాట్సాప్ ద్వారా పంపే ప్రక్రియ కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాం. ఇలా చేస్తే ప్రతి ఉల్లంఘనుడికి కచ్చితంగా ఈ– చలాన్ చేరుతుంది. – నగర ట్రాఫిక్ ఉన్నతాధికారి