
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కారు నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని రెండు చలాన్లను విధించారు. అయితే నిబంధనల ఉల్లంఘన సమయంలో నిఖిల్ కారులో లేడని పోలీసులు తెలిపారు. కాగా కరోనా కేసులను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే నిఖిల్ ప్రస్తుతం '18 పేజీస్' సినిమా చేస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నాడు. దీనితో పాటు నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నాడు. ఇది 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా లాక్‌డౌన్ కాలంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిఖిల్.. తన భార్య పల్లవి డాక్టర్ కావడంతో రోగులకు వైద్యపరమైన సలహాలు ఇస్తూ.. ఓ వాలంటీర్‌గా పనిచేస్తోందంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment