
ఈ నెలలోనే లాక్‌డౌన్ అంటున్నారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. కానీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే... ఆమె చెబుతున్నది ‘లాక్‌డౌన్’ సినిమా గురించి. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాక్‌డౌన్’. ఏఆర్ జీవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
కాగా ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించినట్లుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి కష్టాలు పడుతున్న ఓ యువతి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. లాక్‌డౌన్ కష్టాలతోపాటు కరోనా వైరస్ గురించిన అంశాలను ఈ సినిమాలో కాస్త సీరియస్‌గానే చూపిస్తారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్‌ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు కెమెరా: వీజే సాబు జోసెఫ్.
Comments
Please login to add a commentAdd a comment