challans
-
TS: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
హైదరాబాద్, సాక్షి: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాళ్టి(జనవరి 10)తో ముగియాల్సి ఉంది. డిస్కౌంట్ ఛాన్స్ తో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని... గడువు ముగిస్తే అలాంటి అవకాశం ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతూ వచ్చారు. మొత్తం పెండింగ్ చలాన్లు 3 కోట్ల 9 లక్షల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకు కోటీ 7 లక్షల మంది మాత్రమే ఛలాన్లు చెల్లించగా.. రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో గడువును పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గడువు పొడిగించిన నేపథ్యంలో.. ఇంకా ఎవరైనా చెల్లించకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వేగానికి చెక్ పెట్టే కొత్త ఫీచర్ - ఇదెలా పనిచేస్తుందంటే?
రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. మితిమీరిన వేగం. ఈ వేగాన్ని నియంత్రిస్తే సగం ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో గూగుల్ తన మ్యాప్స్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ రోడ్డుపై ప్రయాణించే సమయంలో వాహన వినియోగదారుడు తన మొబైల్లోని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, దానికి కుడివైపున ఉన్న ప్రొఫైల్ ఐకాన్ని ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఎంచుకోవాలి, ఆ తరువాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేస్తే.. అక్కడ న్యావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి డ్రైవింగ్ సెక్షన్ ఆప్షన్లో స్పీడోమీటర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు పొందవచ్చు. వేగం పెరిగినటప్పుడు ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తుంది కూడా. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మితిమీరిన వేగం వల్ల కలిగే అనర్థాలు పరిమితిని మించిన వేగంతో వాహనదారుడు ప్రయాణించినట్లైతే.. అత్యవసర సమయంలో వాహనాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం, అలాంటి సమయంలో అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టాయి. ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్ పరిమిత వేగాన్ని మించి వాహనాన్ని డ్రైవ్ చేస్తే.. వారికి భారీ జరిమానాలు విధించడం లేదా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత వేగంలో వెళ్తున్నామని విషయాన్నీ కూడా మర్చిపోయే అవకాశం ఉంది, అలంటి వారికి గూగుల్ మ్యాప్స్‌లోని కొత్త ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. -
హెల్మెట్ లేకుంటే నా ‘తోపుడు బండి’ని ఆపేస్తారు సార్..!
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఎవరూ లేరు కదా అని హెల్మెట్ పెట్టుకోకపోయినా.. నిఘా కెమెరాల ద్వారానే చలాన్లు జారీ చేస్తున్నారు పోలీసులు. దీంతో భారీగా జారీ అవుతున్న చలాన్లతో ప్రజలు బెబెలెత్తిపోతున్నారు. కొందరు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారుకూడా. ఈ క్రమంలో తోపుడు బండిపై కూరగాయలు విక్రయించే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హెల్మెట్ లేకుంటే నా బండిని పోలీసులు ఆపేస్తారు సార్ అంటూ అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియోను షాకాస్మ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. తోపుడు బండికి హెల్మెట్ ఎందుకు ధరించావని వీడియో తీసిన వ్యక్తి అడిగాడు. దానికి,హెల్మెట్ లేకుంటే పోలీసులు అడ్డుకుంటారని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఈ నిబంధన కేవలం బైక్‌లకు మాత్రమేనని ఆ వ్యక్తికి వివరించే ప్రయత్నం చేశాడు వీడియో తీసిన వ్యక్తి. ట్విటర్లో వీడియో షేర్ చేస్తూ బ్రదర్ నీ తెలివి అమోఘం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అక్టోబర్ 9వ తేదీన వీడియో పోస్ట్ చేయగా.. 28,800వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫైన్లు వేస్తున్నారనే కారణంగా అమాయకులు భయపడుతున్నారు, చాలా బాధకరమైన విషయం, సరైన అవగాహన లేదు అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. కొందరి తప్పుడు సూచనలతో అమాయకులు భయపడుతున్నారంటూ మరొకరు పేర్కొన్నారు. Bhai apka knowledge to Kamal hai bhai 🤣🤣 pic.twitter.com/twjvQhNe6a — ShaCasm (@MehdiShadan) October 9, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
చలానా జాప్యం ప్రాణం తీసింది
జనగామ/యాదగిరిగుట్ట రూరల్: పాత చలానా చెల్లింపులో అరగంట ఆలస్యం మూడునెలల చిన్నారిని బలిగొంది. కారులో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాబును చూసినా ఖాకీల మనసు కరగలేదు. చలానా డబ్బులు చెల్లించిన తర్వాతే వదిలేస్తామన్న పోలీసుల అమానవీయవైఖరి ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం జరిగింది. జనగామ మండలం మరిగడి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతులకు మూడునెలల క్రితం బాబు జన్మించాడు. కొద్దిరోజుల క్రితం సరస్వతి తన కొడుకును తీసుకుని ఇదే మండలం వెంకిర్యాలలోని తల్లిగారింటికి వచ్చింది. ఈ క్రమంలో చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వెంటనే తల్లిదండ్రులు ఓ అద్దె కారును తీసుకుని బాబుతోసహా బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తూ ఆ కారును ఆపారు. కారుకు సంబంధించి వెయ్యి రూపాయల పెండింగ్ చలానా ఉన్నట్లు ఆన్లైన్లో గుర్తించారు. పోలీసులు వెంటనే డ్రైవర్ వద్ద ఉన్న ఒరిజినల్ లైసెన్స్ తీసుకుని, చలానా కట్టిన తర్వాత కారు తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి తీసుకెళ్తున్నామన్నా కనికరించలేదు ‘సారూ.. బాబును ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం.. ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు.. ప్లీజ్ వదిలి పెట్టండి’అని ఆ తల్లిదండ్రులు ఎంతసేపు బతిమిలాడినా పోలీసులు కనికరించలేదు. కారు ఓనర్‌కు డ్రైవర్ ఫోన్ చేసి పోలీసులతో మాట్లాడించాడు. చలానా వెంటనే చెల్లిస్తానని అతడు వేడుకోవడంతో కారును వదిలిపెట్టారు. అప్పటికే అరగంట గడిచిపోయింది. ఆ తర్వాత నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన గారాల పట్టి ఇక లేడంటూ బోరున విలపించింది. ఏడాదిన్నర క్రితం కూడా ఆమెకు ఓ బాబు పుట్టిన రెండు నెలల తర్వాత చనిపోయాడు. రెండో కుమా రుడు కూడా పోలీసుల నిర్లక్ష్యం మూలంగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో ఊరు ఊరంతా కన్నీటిపర్యంతమైంది. కాగా, ఆస్పత్రికి ఎమర్జెన్సీగా వెళ్తున్నామని మాకు ఎవరూ చెప్పలేదని, వాహనం లోపల బాబు సీరియస్‌గా ఉన్నాడని తెలిస్తే తాము అలా చేయమని ట్రాఫిక్ సీఐ సైదయ్య అన్నారు. -
చలాన్లు కట్టమన్నారని బైక్‌కు నిప్పు
ఆదిలాబాద్ టౌన్: ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలాన్లు చెల్లించలేక ఓ వ్యక్తి తన బైక్‌ను తగులబెట్టుకున్నాడు. ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌కు చెందిన ఫరీద్ మక్బుల్(ఏపీ01హెచ్8085) కిసాన్‌చౌక్ మీదుగా బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో కిసాన్‌చౌక్ వద్ద వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ పోలీ సులు అతడిని నిలిపి పెండింగ్ చలానాలు చెల్లించాలని సూచించారు. ఆవేశంతో తన బైక్ లోని పెట్రోల్ తీసి అదే బైక్‌పై పోసి నిప్పంటించాడు. అక్కడున్న పోలీసులు వాహనంపై నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు. మక్బుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బైక్‌పై రూ.1,200 మేర చలాన్లు ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే రూ.2 వేల చలానా చెల్లించినా, మళ్లీ రూ.1,200 చెల్లించాలని అడిగే సరికి ఆవేశంతో బైక్‌కు నిప్పటించుకున్నాడు. -
నకిలీ చలాన్లపై ప్రభుత్వం సీరియస్
-
కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని కదిరి సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అక్రమాలపై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రే రూ.21.50 లక్షల చలానా డబ్బును ముగ్గురు ఉద్యోగులు జమ చేశారు. దీంతో ఉన్నతాధికారులు నకిలీ చలానాలపై విచారణ చేపట్టారు. రూ.5 వేల చలానాకు రూ.50 వేలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు మార్చారు. సబ్ రిజిస్టర్ నాసీర్, సీనియర్ అసిస్టెంట్ షామిర్ బాషా, జూనియర్ అసిస్టెంట్ హరీష్ ఆరాధ్యలను అధికారులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లతో కలిసి కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడింది. -
నకిలీ చలనాల కేసు దర్యాప్తు వేగవంతం
-
నకిలీ చలానాల కేసులో అధికారుల దూకుడు
-
నకిలీ చలాన్లు గుర్తింపు
-
చలానా మాఫియా..
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖను నకిలీ చలానాల కుంభకోణం కుదిపేస్తోంది. ఈ నెల 3వ తేదీ ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెలుగుచూసిన నకిలీ చలానాల బాగోతాన్ని మరవకముందే కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మరో మోసం బయటపడింది. జిల్లావ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లతో పాటు అధికారులు, సిబ్బంది తీరుపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నకిలీ చలానాల స్కాంతో మరిన్ని అవకతవకలు చోటుచేసుకుని ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు సబర్బన్: స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన కేవలం 550 రూపాయలకు నకిలీ చలానా సృష్టించిన విషయం కందుకూరు సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో గురువారం వెలుగుచూసింది. అయితే, కందుకూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చేయించాల్సిన రిజిస్ట్రేషన్‌కు ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ పేరిట సింగరాయకొండ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంటేషన్ చేయించారు. గుడ్లూరు మండలం మొగళ్లూరుకు చెందిన సీహెచ్ హజరత్ తన స్థిరాస్తి రిజి్రస్టేషన్‌కు స్టాంప్ డ్యూటీ చెల్లించగా, అది నకిలీ చలానాగా తేలింది. సింగరాయకొండ సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో దాఖలు చేసి కందుకూరులో రిజిస్టర్ అయిన ఈ డాక్యుమెంట్ నంబర్ 2800/2021. మొక్కుబడిగా పరిశీలన... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వెలుగు చూసిన నకిలీ ఈ–చలానాల వ్యవహారంపై జిల్లాలో పరిశీలన మొక్కుబడిగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కందుకూరులో బయటపడిన సరికొత్త నకిలీ చలానా వ్యవహారమే అందుకు నిదర్శనంగా ఉంది. జిల్లావ్యాప్తంగా జరిగిన మోసాలు బయటపడకుండా ఉండేందుకు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు రిజి్రస్టార్ కార్యాలయంలో వెలుగు చూసిన నకిలీ చలానాల వ్యవహారం కూడా అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి గత నెలలోనే ఈ కుంభకోణాన్ని అధికారులు గుర్తించినప్పటికీ బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటపెట్టి తాము డబ్బు తిరిగి కట్టించామంటూ కవర్ చేశారు. ఈ విషయంలో రిజి్రస్టేషన్ శాఖ అధికారుల తీరు చూస్తే దొంగే.. దొంగ అని అరిచినట్టు తెలుస్తోంది. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్లు అయిన జాయింట్–1, జాయింట్–2 పరిధిలో నకిలీ చలానాల ద్వారా స్థిరాస్తి రిజి్రస్టేషన్లు జరిగినట్లు తేలింది. మొత్తం 71 స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 77 ఈ–చలానాలు సృష్టించారు. వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీగా కట్టాల్సిన రూ.26,74,850 మొత్తాన్ని చెల్లించకుండానే నకిలీ చలానాల ద్వారా మోసం చేశారు. సెంట్రలైజ్డ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) ద్వారా ఆన్లైన్ చెల్లింపుల్లో మోసానికి పాల్పడ్డారు. ఒంగోలులో హైడ్రామా... ఒంగోలు కేంద్రంగా రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల ద్వారా మోసానికి పాల్పడిన వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. నకిలీ ఈ–చలానాలు ముందుగా ఒంగోలులో బయటపడినా రిజి్రస్టేషన్ శాఖ అధికారులు కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అది చివరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియడంతో హైడ్రామాకు తెరతీశారు. వాస్తవానికి నకిలీ చలానాలు ఆగస్టు 16వ తేదీనే బయటపడ్డాయి. కానీ, అధికారులు ఆ విషయం బయటకు రాకుండా ప్రయత్నించి ప్రభుత్వాన్ని మోసం చేశారు. సూత్రధారి అయిన ఒంగోలుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ కాజా పవన్‌కుమార్, రిజి్రస్టేషన్ అధికారులు కలిసి ప్రభుత్వ ఖజానాకు ఆ మొత్తాన్ని జమ చేయాలని చూశారు. ఆగస్టు 24వ తేదీ వరకు సమాలోచనలు, చర్చోపచర్చలు చేసుకున్నారు. చివరకు ఆగస్టు 24వ తేదీ డాక్యుమెంట్ రైటర్ కాజా పవన్‌కుమార్‌తో మొత్తం రూ.26,74,850 బ్యాంకు చలానా కట్టించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలోనూ జాప్యం... ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన మోసాన్ని వెంటనే బయటపెట్టకపోవడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయలేదు. విషయం బయటకు పొక్కి పత్రికల్లో వార్తా కథనాలు వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2న అర్ధరాత్రి ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెప్టెంబర్ 5వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కూడా ఎక్కడా దొరక్కుండా చూడాలన్నదే వారి ఉద్దేశంగా తెలుస్తోంది. నకిలీ చలానాలకు పాల్పడిన డాక్యుమెంట్ రైటర్ పవన్‌తో పాటు ఒంగోలు రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న పెద్ద తలల పాత్రపై కూడా ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కందుకూరు సంఘటనతో జిల్లావ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. -
నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు!
-
చలానాల్లో కొత్త చిక్కులు..
ఈ చిత్రంలోని చలానాను నన్నూరుకు చెందిన రవీంద్రబాబు ఎస్బీఐ ట్రెజరీ బ్యాంకులో ఆగస్టు 24న భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.11,580 కట్టి తీసుకున్నాడు. చలానా మొత్తం ఆన్లైన్లో సక్సెస్ అయినట్లు బ్యాంకు అధికారులు రసీదు ఇచ్చి పంపారు. దాన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే చలానా వివరాలు డిస్ ప్లే కావడం లేదంటూ సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. ‘వారం రోజులవుతుంది. చలానా కాల పరిమితి సెప్టెంబర్ 5 వరకే ఇచ్చారు. ఇక రెండు రోజులే ఉంది. ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు.’ అంటు బాధితుడు వాపోతున్నాడు. రిజిస్ట్రేషన్ శాఖలో చలానాల కుంభకోణం తరువాత తీసుకున్న చర్యలతో నెలకొన్న పరిస్థితి ఇది. సాక్షి, కర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో విక్రయదారులు చెల్లించిన పలు చలానాల వివరాలు డిస్ప్లే కాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి వివరణ కోరాలని చెప్పి పంపుతున్నారు. అక్కడికి వెళ్తే చలానా మొత్తం రిజిస్ట్రేషన్ శాఖ ఖాతాలకు వెళ్లిందని, పదే పదే రావద్దని గట్టిగా చెప్పి పంపుతున్నారు. ఫలితంగా ఎవరిని అడగాలో తెలియక, ఏమి చేయాలో తోచక క్రయ, విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. చలానా కాల పరిమితి దాటిపోతే మరోసారి డబ్బు చెల్లించి చలానా తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ రెండు రోజులైతే ఏమో అనుకోవచ్చు. దాదాపు 15 రోజుల క్రితం చెల్లించిన చలానాలు సైతం యాక్టివ్ కాకపోవడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏమి జరిగిందంటే.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం తరువాత అధికారులు సర్వర్‌లో మార్పులు చేశారు. గతంలో ఆన్లైన్లో చెల్లించిన చలానాల నంబర్లను సీఎఫ్ఎంఎస్(కాంప్రెహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) లాగిన్‌లో అప్లోడ్ చేస్తే సంబంధిత చలానా మొత్తం డిస్ప్లే అయ్యేది కాదు. దీంతో కొందరు తక్కువ మొత్తంలో చలానాలను చెల్లించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద కుంభకోణం జరిగిందని ఇటీవల ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చాలా చోట్ల బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసింది. మరోసారి అక్రమాలకు చోటులేకుండా సీఎఫ్ఎంఎస్ సర్వర్‌లో కొన్ని మార్పులు చేసింది. క్రయ, విక్రయదారులు చెల్లించిన సీఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ ఎంటర్ చేయగానే లాగిన్‌లో ఎంత మొత్తం చలానా తీశారు? ఏ బ్యాంక్‌లో ఎప్పుడు చెల్లించారనే విషయాలు డిస్ప్లే అయ్యేలా మార్పులు చేశారు. సర్వర్ సమస్య.. ఆన్లైన్ చలానాల చెల్లింపులో నెలకొన్న కొత్త సమస్యలకు సీఎఫ్ఎంస్ లాగిన్ సర్వరే కారణమని అధికారులు అంటున్నారు. నెట్ స్లోగా ఉండడంతో ఈ సమస్య తలెత్తుతోందని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 2 ఎంబీ లైన్ స్పీడు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్‌ను వేసుకోవాలని చెప్పినా పనులు నిదానంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈసీలు తీసుకోవడానికి కూడా రోజుల సమయం పడుతోంది. రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది నేను కర్నూలులో సైట్ కొన్నాను. అందుకోసం రూ.11,500 చలానా తీశాను. బ్యాంకు అధికారులు దానిపై సక్సెస్ అయినట్లు సీలు వేసి ఇచ్చారు. దానిని తీసుకొచ్చి కల్లూరు సబ్ రిజిస్ట్రార్‌కు చూపితే ఆన్లైన్లో రావడంలేదని రిజిస్ట్రేషన్ నిలిపేశారు. దాదాపు 10 రోజులవుతోంది. బ్యాంకు అధికారులను అడిగితే సమస్య మావద్ద లేదంటున్నారు. డబ్బు చూపడంలేదని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. దిక్కుతోచడంలేదు. – బాషా, నందికొట్కూరు -
ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ
సాక్షి, విజయవాడ: నకిలీ చలానాల కేసులో 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు రూ.4.11 కోట్లు రివకరీ చేసినట్లు రిజిస్ట్రేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 26 మంది రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 12 మంది సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఫేక్ చలనాలు సృష్టించకుండా కొత్త సాఫ్ట్వేర్ తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ చేస్తామని తెలిపారు. క్యాష్ లెస్ వ్యవహారాల ద్వారా నకిలీలకు చెక్ పెడతామని రజత్ భార్గవ తెలిపారు. ఇవీ చదవండి: ‘ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరు’ రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ -
నకిలీ చలాన్లలో రూ.3.38 కోట్లు రికవరీ
సాక్షి, అమరావతి: నకిలీ చలాన్ల వల్ల ప్రభుత్వానికి గండిపడిన ఆదాయంలో రూ. 3,38, 11,190 రికవరీ చేశామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ) ధర్మా న కృష్ణదాస్ తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ ఎంవీ శేషగిరిబాబుతో ఈ అంశంపై సమీక్షించారు. ధర్మాన మాట్లాడుతూ అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం తప్పుడు చలాన్ల ద్వారా రూ. 7,13,76,148 ఆదాయానికి గండిపడిందని గుర్తించామన్నారు. అందుకు బాధ్యులను గుర్తించి ఇండియన్ స్టాంప్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.3.38 కోట్లు రికవరీ చేశామని, ఇంకా రూ.3.75 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. అధికారుల తనిఖీలలో 11 జిల్లాల్లోని 36 సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1,252 డాక్యుమెంట్లకు సంబంధించిన తప్పుడు చలానాలు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేసి, 9 మంది సబ్–రిజిస్ట్రార్లను విధుల నుంచి తప్పించామన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మరికొంతమంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సీఎఫ్ఎంఎస్ను సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానించామని, ఇకపై అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మాన వివరించారు. -
రిజిస్ట్రేషన్ శాఖను కుదిపేసిన నకిలీ చలానాల వ్యవహారం
-
ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అక్రమాలపై తొమ్మిది క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్ లో ఈ తరహా అక్రమాలకి చోటు లేకుండా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. మరోవైపు నకిలీ చలానాల కుంభకోణంపై రెండు రోజులలో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాదికారులు నివేదిక ఇవ్వనున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో సమారు రూ.3 కోట్ల వరకు స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించారు.ఆ తర్వాత కడప జిల్లాలో కోటి రూపాయిలకి పైగా స్కామ్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై చర్యలతో పాటు రికవరీపై దృష్టి సారించి ఇప్పటి వరకు 50 శాతం వసూలు చేశామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమీషనర్ ఎంవి శేషగిరిబాబు తెలిపారు. రాష్డ్ర వ్యాప్తంగా మొత్తం 17 రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఈ అక్రమాలు బయటపడ్డాయి...ఈ నేపధ్యంలో గత నాలుగు రోజులగా అధికారులు ఆయా కార్యాలయాలలో 65 లక్షల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లని తనిఖీ చేయగా 30 వేల డాక్యుమెంట్లలో నకిలీలని గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారులు అక్రమార్కులపై చర్యలకి ఉపక్రమించారు. ఈ అక్రమాలపై పూర్తిస్ధాయిలో దర్యాప్తుకి కమీషనర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్స్ అదనపు ఐజి ఆద్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసారు. చదవండి:రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారం.. మరో రూ.40 లక్షలు రికవరీ -
రిజిస్ట్రేషన్ల అక్రమాలపై కొరడా
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటుచేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రేషన్ల శాఖ లోతైన విచారణ జరుపుతోంది. ప్రభుత్వం నష్టపోయిన సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని, అవినీతికి ఆస్కారం లేకుండా, భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించడంతో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ముమ్మర తనిఖీలు చేయిస్తోంది. నకిలీ చలానాల వ్యవహారంలో 16 మంది సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో దస్తావేజు లేఖరులు (డాక్యుమెంట్ రైటర్లు) కీలకపాత్ర పోషించినా సబ్ రిజిస్ట్రార్ల ప్రమేయం కూడా ఉండవచ్చని ఉన్నతాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే వారి సహకారం ఉండటం వల్లే డాక్యుమెంట్ రైటర్లు ఇంత భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. మరో 10 మందిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. వారిలోనూ కొందరిని విధుల నుంచి తప్పించారు. వారిపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ అక్రమాలపై ఆయా కార్యాలయాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి 10 కేసులు నమోదు చేయించారు. మరికొంత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తం 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయి. వీటితోపాటు అనుమానం ఉన్న కార్యాలయాల్లో నాలుగు రోజుల్లో మొత్తంగా 65 లక్షల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. తనిఖీ చేసిన వాటిలో 30 వేల చలానాల విషయంలో తేడాలున్నట్టు గుర్తించారు. రికవరీపై దృష్టి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రూ.5.42 కోట్లు కోల్పోవడంతో దాన్ని తిరిగి రాబట్టడంపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే రూ.1.37 కోట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన మొత్తాన్ని రెండు, మూడు రోజుల్లో రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తేడా వచ్చిన డాక్యుమెంట్‌ను రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్ రైటర్, రిజిస్టర్ చేయించుకున్న యజమానులతో మాట్లాడి ఈ సొమ్ము తిరిగి కట్టించుకుంటున్నారు. ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్లే యజమానులకు తెలియకుండా చలానాల ద్వారా ఈ అక్రమాలు చేసినట్టు తేలింది. అందుకే వారినుంచి తిరిగి సొమ్ము రికవరీ చేయడంతోపాటు కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ అక్రమాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయనే అంశంపైనా దృష్టి సారించారు. మొదట కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇది బయటపడినా ఎక్కువగా అక్రమాలు జరిగింది మాత్రం కృష్ణా జిల్లాలో కావడంతో అక్కడ రిజిస్టరైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాలను వెలికి తీసేందుకు కమిషనర్ అండ్ ఐజీ కార్యాలయంలో అదనపు ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. విచారణ కొనసాగుతోంది: ధర్మాన రిజిస్ట్రేషన్ల శాఖలో తప్పుడు చలానాలపై విచారణ కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పు చేసినట్టు తేలిన ప్రతి ఒక్కరిపైనా చర్య తీసుకుంటామన్నారు. చలానాల చెల్లింపులపై అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. మొదట ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు జరిగిన లావాదేవీలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పామని తెలిపారు. తర్వాత 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లపై నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. ఇందుకోసం రిజిస్టేషన్ల శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. అక్రమాలు ఇక అసాధ్యం రజత్ భార్గవ చలానాలతో అక్రమాలకు పాల్పడటం ఇకపై సాధ్యం కాదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. నకిలీ చలానాల వ్యవహారం బయటపడిన వెంటనే సంబంధిత వ్యవస్థను మార్పు చేసినట్టు తెలిపారు. విజయవాడలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎఫ్ఎంఎస్కు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను అనుసంధానం చేశామని తెలిపారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల కోసం తీసిన చలానాలపై ఆధారపడకుండా అవి రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో (కార్డ్ సిస్టమ్) కనబడతాయని తెలిపారు. తద్వారా డాక్యుమెంట్ విలువ ప్రకారం చలానా ఉందో లేదో తెలుస్తుందని, అప్పుడే డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుందని వివరించారు. నకిలీ చలానాలతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోందని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లతోపాటు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారు కూడా వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎవరు తప్పు ఉంటే వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తున్నామన్నారు. -
నకిలీ చలాన్ల కలకలం.. తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం
విజయవాడ: ఏపీలో నకిలీ చలాన్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఏపీలోని 9 జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. ఈ ఘటనపై 10 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో భాగస్వాములుగా ఉన్న ప్రతి అధికారి, ఉద్యోగిపైనా చర్యలు తీసుకుంటామని కృష్ణదాస్ అన్నారు. తమ తనిఖీల్లోనే ఈ నకిలీ చలాన్ల వ్యవహారం బయటపడిందని, ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. -
‘నకిలీ చలానా’లపై ఏపీ సర్కార్ సీరియస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబుతో ఫోన్లో మాట్లాడారు. ఆయన నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నకిలీ చలానాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. జరిగిన అవకతవకలపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నష్టపోయిన సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా.. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే చర్యలు.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ల శాఖ వెంటనే రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం ముమ్మర తనిఖీలు చేసింది. మొదట కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగుచూసిన ఈ నకిలీ చలానాల వ్యవహారం మరికొన్నిచోట్ల కూడా జరిగినట్టు సమాచారం అందడంతో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏడాది కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నింటినీ పరిశీలించింది. డాక్యుమెంట్ విలువ ప్రకారం వాటికి చలానాలు కట్టారో, లేదో అధికారులు పరిశీలించారు. అనుమానం ఉన్న 20కిపైగా కార్యాలయాల్లో తనిఖీలు జరపగా 17 కార్యాలయాల్లో నకిలీ చలానాల వ్యవహారం బయటపడింది. శ్రీకాకుళం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది. మిగిలిన జిల్లాల్లో ఎక్కడో ఒక చోట అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించారు. మొత్తంగా నకిలీ చలానాల ద్వారా ఇప్పటివరకు రూ.5.42 కోట్లు పక్కదారి పట్టిందని నిర్ధారించారు. కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అత్యధికంగా 282 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.2.31 కోట్లను పక్కదారి పట్టించినట్లు తేలింది. పటమట (విజయవాడ), గజపతినగరం, నర్సీపట్నం, ఆలమూరు, భీమవరం, ఆకివీడు, గునుపూడి, ఆచంట, పెనుగొండ, గాంధీనగర్ (విజయవాడ), గుణదల (విజయవాడ), నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు. ఒక్క రోజులోనే రూ.1.37 కోట్లు రికవరీ దారిమళ్లిన సొమ్మును రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు తనిఖీల్లో రికవరీ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే రూ.1.37 కోట్లను రికవరీ చేశారు. విజయనగరం డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.21.74 లక్షలు ఆదాయం కోల్పోగా మొత్తాన్ని రికవరీ చేశారు. విశాఖపట్నం జిల్లాలో రూ.5.19 లక్షలకు రూ.4.96 లక్షలు రాబట్టారు. ఏలూరు డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.9.59 లక్షలకు రూ.4.84 లక్షలు, విజయవాడ డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.3.80 కోట్లకు రూ.71 లక్షలు, కర్నూలు డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.7.39 లక్షలకు రూ.7.39 లక్షలు, కడప డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.1.08 కోట్లకు రూ.19.59 లక్షలు రికవరీ చేశారు. మిగిలిన మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ అక్రమాల పర్వానికి డాక్యుమెంట్ రైటర్లు ప్రధాన కారణమని తేల్చారు. వారితోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కొందరు ఆపరేటర్లు, ఉద్యోగులు, ఒకటి, రెండు చోట్ల సబ్ రిజిస్ట్రార్ల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా.. తేడా ఉన్న చలానాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావని ఆ శాఖ విజయవాడ డీఐజీ రవీంద్రనాథ్ తెలిపారు. అవి చెల్లుబాటు కావాలంటే జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని ఆ డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయించుకున్న యజమానులకు సూచించారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు నకిలీ చలానాల ద్వారా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం మొత్తాన్ని తిరిగి రాబడతాం. ఇప్పటికే రూ.1.37 కోట్లు రికవరీ చేశాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నాం. అక్రమాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపడతాం. అక్రమార్కులు ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయించుకున్న యజమానులు ఎవరైనా తెలియక, పొరపాటున ఇందులో భాగస్వాములైతే తప్ప వారిని కూడా వదిలిపెట్టం. భవిష్యత్తులో చలానాల ద్వారా ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఇప్పటికే మార్పులు చేశాం. - ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ -
నకిలీ చలానాల వ్యవహారంలో బాధ్యుల సస్పెన్షన్
సాక్షి, విజయవాడ/కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లా, నంద్యాల సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్లను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. 2021 ఏప్రిల్ నుంచి జులై వరకు 54 నకిలీ చలానాలు గుర్తించారు. నకిలీ చలానాలతో రూ.7లక్షల మేర గోల్మాల్ జరిగినట్టు నిర్ధారించారు. చలానాల గోల్‌మాల్‌లో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. -
ఏపీ: వెలుగులోకి నకిలీ చలానాల వ్యవహారం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసింది. ఈ కార్యాలయాల్లో రూ.5,40,12,982 విలువైన నకిలీ చలానాలు సృష్టించినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారం నడించింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. -
దేశంలో పెరిగిపోతున్న ఉల్లం‘ఘనులు’
ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు కదా అని సిగ్నల్ జంప్ చేసినా, రోడ్డు బాగుంది కదా అని పరిమితికి మించి వేగంగా నడిపారో జాగ్రత్త. మీ కోసం ఛలానా రెడీగా ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు మీరు ఉల్లంఘించడం పోలీసులు చూడకపోయినా మెషిన్లు చూస్తున్నాయి. మీ తప్పులను అట్టే పసిగట్టి ఫైన్లు విధిస్తున్నాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ట్రాఫిక్ ఫైన్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగాయి. 7.7 కోట్ల ఛలానాలు నూతన మోటారు వాహనాల చట్టం 2019 అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఛలాన్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైన్లు కడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. 2017 ఆగస్టు 1 నుంచి 2019 ఆగస్టు 1 వరకు దేశవ్యాప్తంగా 1.9 కోట్ల జరిమానాలు విధిస్తే 2019 ఆగస్టు నుంచి 2021 జులై వరకు ఈ సంఖ్య ఏకంగా 7.7 కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి తమిళనాడులో ట్రాఫిక్ ఛలాన్ల సంఖ్య 10.50 లక్షల నుంచి ఏకంగా 2.5 కోట్లకు చేరుకుంది. దాదాపు 24 రెట్లు ఎక్కువగా ఈ రాష్ట్రంలో అధికారికంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్టుగా రికార్డయ్యింది. దేశ రాజధానిలో నేషనల్ కాపిటల్ రీజియన్‌లో ఉండి ఎల్లవేళలా వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే ఢిల్లీలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనలు తక్కువగా లేవు. కిలోమీటరకు నలుగురు కానిస్టేబుళ్లు ఉండే దేశ రాజధానిలో ఛలాన్ల సంఖ్య 49.70 లక్షల నుంచి 2.2 కోట్లకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలలో రిజిస్టరయిన వాహనాల సంఖ్య కంటే ఢిల్లీలో జారీ అయిన ట్రాఫిక్ ఛలాన్ల సంఖ్యనే ఎక్కువ. ఇక్కడ సగటున ఒక్కో వాహనంపై రెండు మూడు వరకు జరిమానాలు ఉన్నాయి. మరోవైపు గుజరాత్, హర్యానలో ఈ చలాన్ల సంఖ్య తగ్గింది. కెమెరాల వల్లే గతంలో ట్రాఫిక రూల్స్ మీరిన వారికి పోలీసులే ఫైన్లు విధించడం చేసే వారు కానీ ఇప్పుడా పనిని సీసీ కెమెరాలు చేస్తున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మనుషులు చేసే పనిని అవే చేస్తున్నాయి. దీంతో ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఇలా ప్రతీ ఒక్క సంఘటన రికార్డు అవుతోందని పోలీసులు అధికారులు అంటున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి రాకముందు ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో నిర్లక్ష్యం ఉండేదని ఇప్పుడది తగ్గిందని రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఛలాన్ల పెరిగిన తీరు (ఆగస్టు నుంచి ఆగస్టు వరకు) రాష్ట్రం 2017 నుంచి 2019 2019 నుంచి 2021 తమిళనాడు 10.5 లక్షలు 2.50 కోట్లు ఢిల్లీ 49.70 లక్షలు 2.20 కోట్లు ఉత్తర్‌ప్రదేశ్ 44.30 లక్షలు 1.50 కోట్లు హర్యాన 41.60 లక్షలు 27.30 లక్షలు గుజరాత్ 27.80 లక్షలు 11.40 లక్షలు మొత్తం 1.90 కోట్లు 7.70 కోట్లు -
కడప రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్ల స్కాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కడప రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్ల స్కాం వెలుగు చూసింది. ముగ్గురు సబ్రిజిస్ట్రార్లు, ఇద్దరు క్లర్క్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. రూ.కోటి 8లక్షలు స్వాహా జరిగినట్లు నిర్థారణ అయింది. -
లై‘సెన్సు’ తప్పనిసరి.. చాలామంది ఎల్ఎల్ఆర్ వద్దే ఆగిపోతున్నారు
సాక్షి,కర్నూలు: ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో వాహనం ఒక భాగం అయిపోయింది. పని ఎటువంటిదైనా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే వారి ఆర్థిక స్థోమత బట్టి ఏదో ఒక వాహనం చేతిలో ఉండాల్సిందే. కరోనా మహమ్మారి అధిక శాతం మంది జీవన శైలిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దీంతో జనాలు గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రజా రవాణాలైన ఆటోలు, బస్సులు ఎక్కేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. ఎవరికి వారు ఉన్నంతలో సొంత వాహనాలు సమకూర్చుకుంటున్నారు. వాహనం నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగిఉండాలి. శాశ్వత లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ముందుగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి ముందుగా లెర్నింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్(ఎల్ఎల్ఆర్) తీసుకోవాలి. తరువాత రవాణా శాఖ కార్యాలయంలో శాశ్వత లైసెన్స్ ఇస్తారు. ఎల్ఎల్ఆర్ కోసం ముందుగా కామన్ సర్వీసు కేంద్రాలు, వార్డు, సచివాలయాల్లో స్లాట్ బుక్ చేస్తారు. కుదిరిన తేదికి స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్తే పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఇది తీసుకున్న నెల రోజుల తరువాత శాశ్వత లైసెన్స్ పొందేందుకు అనుమతి వస్తుంది. కానీ అధిక శాతం మంది ఎల్ఎల్ఆర్తోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది ఎల్ఎల్ఆర్ పొందినవారిలో కనీసం 10 వేల మందికి పైగా శాశ్వత లైసెన్స్ తీసుకోవడం లేదు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి రవాణా శాఖ అధికారులు, పోలీసులకు పట్టుబడితే వేల రూపాయలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే జరిమానాలు పెరిగాయి. కావున ఎల్ఎల్ఆర్ తీసుకున్న వారు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. కరోనాకు ముందు జిల్లాలో ప్రతి రోజూ ఎల్‌ఎల్‌ఆర్‌లు 250, శాశ్విత లైసెన్స్‌లు 250, స్లాట్ బుక్కింగ్‌కు అనుమతించే వారు. కర్ఫ్యూ నిబంధనలు సడలించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండు నెలల విరామం తరువాత సేవలు పునఃప్రారంభమయ్యాయి. చలానాలు... ఎల్ఎల్ఆర్ కోసం ద్విచక్ర వాహన చోదకులు రూ. 260, ద్విచక్ర వాహనంతో పాటు కారు లైసెన్స్ కావాలనుకునే వారు రూ.420 చలానా చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎల్ఎల్ఆర్ పాసైన తర్వాత శాశ్వత లైసెన్స్ కోసం కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి. ద్విచక్ర వాహనం కోసమైతే రూ.960, ద్విచక్ర వాహనంతోపాటు కారు అయితే రూ.1260 చలానా చెల్లించాలి. పట్టుబడితే భారీగా అపరాధ రుసుం లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడితే భారీగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో సుమారు 1.30 లక్షల రవాణ వాహనాలున్నాయి. వీటి పర్యవేక్షణకు కర్నూలులో ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని, నంద్యాలలో ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. అక్కడ ఎల్ఎల్ఆర్, శాశ్విత లైసెన్స్‌లు పొందవచ్చు. – రాజ్‌గోపాల్, ఎంవీఐ -
Nikhil Siddharth: హీరో కారుకు పోలీసుల చలాన్లు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కారు నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని రెండు చలాన్లను విధించారు. అయితే నిబంధనల ఉల్లంఘన సమయంలో నిఖిల్ కారులో లేడని పోలీసులు తెలిపారు. కాగా కరోనా కేసులను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే నిఖిల్ ప్రస్తుతం '18 పేజీస్' సినిమా చేస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నాడు. దీనితో పాటు నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నాడు. ఇది 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా లాక్డౌన్ కాలంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిఖిల్.. తన భార్య పల్లవి డాక్టర్ కావడంతో రోగులకు వైద్యపరమైన సలహాలు ఇస్తూ.. ఓ వాలంటీర్‌గా పనిచేస్తోందంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: 'కార్తికేయ 2' షూటింగ్‌కు సడన్ బ్రేక్! -
మందుబాబులు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా?
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులు చిక్కిన 753 మంది మందుబాబులు గత నెలలో చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.78,94,100. ఫిబ్రవరిలో 3,261 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చిక్కారని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ మంగళవారం వెల్లడించారు. వీరిలో 768 మందిపై కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశామన్నారు. 15 మందికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన 753 మందికి రూ.78.94 లక్షలు జరిమానా విధించిందన్నారు. జైలు శిక్ష పడిన వారిలో ఒకరికి 15 రోజులు, మరొకరికి 8 రోజులు, ముగ్గురికి వారం, ఎనిమిది మందికి ఐదు రోజులు శిక్షలు పడ్డాయి. మరో ఇద్దరిని కోర్టు సమయం ముగిసే వరకు నిల్చునేలా న్యాయమూర్తి ఆదేశించారు. గత నెలలో చిక్కిన వారిలో మిగిలిన 2493 మంది పైనా త్వరలోనే చార్జ్‌షీట్స్ వేయనున్నట్లు అనిల్‌కుమార్ పేర్కొన్నారు. -
చున్నీలు చుట్టినా.. మాస్కులు కట్టినా...
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకుండా, పోలీసులకు దొరకకుండా తెలివిగా తప్పించుకునే ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై చలాన్లను తప్పించుకోవటానికి నెంబర్ ప్లేటుపై ట్రిక్కులు చేయాలనుకుంటే తిక్క కుదురుతుందని హెచ్చరిస్తున్నారు. నెంబర్ ప్లేటు సరిగా లేని బైకులకు రూ. 200, ఉద్దేశ్యపూర్వకంగా బండి వివరాలను దాయాలని చూసేవారికి రూ. 500 ఫైన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విటర్ ఖాతాలో ‘‘ అనుకున్నది ఒక్కటీ, అయినది ఒక్కటీ.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట ..’’ అంటూ ఓ ట్విట్‌ను చేశారు. చలాన్ల వివరాలను అందులో పేర్కొన్నారు. ( కంటతడి పెట్టుకున్న తెలంగాణ మంత్రి.. ) దీనిపై నెటిజన్లు కూడా తమ స్టైల్లో స్పందిస్తున్నారు..‘‘ హైదరాబాద్ పోలీసులనుంచి తప్పించుకోవటం కష్టం కాదు! అసాధ్యం.. ఇది మోసం సార్! అలాంటి వాళ్లను జైళ్లలో వేయాలి.. నగర పౌరులకు చలాన్లు విధించే డ్యూటీలో మీకు మీరే సాటి సార్!.. చున్నీలు చుట్టినా.. మాస్కులు కట్టినా ఇకపై లాభం ఉండదు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ( ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ) అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట...#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/H5gsDf3Gjv — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) November 9, 2020 -
కరోనా : ఇకపై ఆ బాధ్యత పోలీసులదే
అహ్మదాబాద్ : ఫేస్ మాస్క్ లేకుండా బయట యథేచ్ఛగా తిరిగే వాళ్ల నుంచి ఇకపై పోలీసు శాఖ జరిమానా విధించనుంది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ. 200 జరిమానా విధిస్తారు. ఈ బాధ్యతను ప్రస్తుతం పోలీసు శాఖకు అప్పజెప్పుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వేగంగా ప్రబలుతున్న రాష్ర్టాల్లో గుజరాత్ ఒకటి. వైరస్ విజృంభిస్తున్నా కొందరు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తూ నిబందనల్ని గాలికొదిలేస్తున్నారు. కొందరు మున్సిపల్ అధికారులు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ బాధ్యతను పోలీసు శాఖ పరిధిలోకి తెచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన వారికి ఇప్పటివరకు కేవలం 280 ఈ చలాన్లను మాత్రమే అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
రోజుకు 18 మంది రోడ్డు ప్రమాదాలకు బలి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల రూపంలో సంభవిస్తున్న అకాలమరణాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వాహనదారులు వాటిని పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న వాహనాలు, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడమే ప్రమాదాలకు ప్రాథమిక కారణాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 2018లో 6,603 మంది మరణించగా 21,697 మంది క్షతగాత్రులయ్యారు. 2019లో 6,806 మంది మరణించగా, 22,265 మంది గాయపడ్డారు. 2019లో రోడ్డు ప్రమాద మరణాల్లో 3 శాతం పెరగడం ఆందోళనకరమేనని రోడ్డు రవాణా నిపుణులు అంటున్నారు. ఏడాది మొత్తం మీద రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే రోజుకు 60 రోడ్డు ప్రమాదాలు, 18 మరణాలు, 61 మంది క్షతగాత్రులైన ఘటనలు నమోదయ్యాయి. తెలంగాణ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ విభాగం 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. మోటారు వాహన సవరణ చట్టం నిలిపివేయడంతోనే.. ఆగస్టు, సెప్టెంబర్‌లో మోటారు వాహన సవరణ చట్టం–2019 అమలు చేస్తారన్న ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ జరిమానాలు విధించడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీగా తగ్గాయి. ఫలితంగా అంతకుముందు నెలకు సగటున 540 మంది మరణాలు సంభవించగా.. సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య సుమారు 350కి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చాలా రాష్ట్రాలతోపాటు తెలంగాణ కూడా దీన్ని అమలు చేయమని ప్రకటించింది. దీంతో అక్టోబర్‌లో తిరిగి మరణాల సంఖ్య ఎప్పట్లాగే 500 దాటింది. ఇదే చట్టం అమలు చేస్తారన్న ప్రచారం లేకపోయి ఉంటే మరో 200 వరకు పెరిగి, మరణాల సంఖ్య 7 వేలు దాటి ఉం డేవని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. రూ.121 కోట్లు దాటిన చలానాలు.. ఏడాది మొత్తం మీద ట్రాఫిక్ ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపించారు. 25.02 లక్షల ఉల్లంఘనలకుగాను ఏకంగా రూ.121.30 కోట్ల జరిమానాలు విధించారు. నవంబర్‌లో రూ.100 కోట్లు దాటగా డిసెంబర్ నాటికి రూ.120 కోట్లకు చేరుకుంది. అంటే నెలకు రూ.10 కోట్లు చొప్పున చలానాలు విధించారు. నిమిషానికి 2 కేసులు.. రోడ్డు ప్రమాదాలకు ప్రాథమిక, ప్రధాన కారణం వేగం. ఈ విషయంలో ట్రాఫిక్ ఉల్లంఘనదారులు ఎవరూ తగ్గడం లేదు. కేసులకు వెరవడం లేదు. ఏడాది మొత్తం మీద 11.31 లక్షల ఓవర్ స్పీడ్ కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం. వీరికి రూ.92.36 కోట్లు చలానాలు విధించారు. ఈ లెక్కన రోజుకు 3,100 కేసులు, నిమిషానికి 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. -
ఒకే బైక్.. 71 కేసులు !
యశవంతపుర: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన బైక్ చోదకుడిపై 70 కేసులు నమోదు కాగా జరిమానా రూ. 15 వేలు విధించిన సంఘటన బెంగళూరులో జరిగింది. గురువారం రాజాజీనగర ట్రాఫిక్ పోలీసులు మహలక్ష్మీ లేఔట్ శంకరనగర బస్టాండ్ వద్ద హెల్మెట్ లేకుండా వెళ్తున్న బైక్ చోదకుడు మంజును పోలీసులు ఆపారు. బైక్ నంబర్ కేఏ 41–ఇజి6244 ఆధారంగా అతడికి హెల్మెట్ లేని కారణంగా జరిమానా విధించాలని పోలీసులు పరిశీలించారు. జరిమానా రశీదు ఏకంగా రెండు మీటర్ల పొడవుతో జరిమానా బిల్లు వచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఏడాదిగా అతడిపై 70 కేసులు నమోదైనట్లు పెద్ద స్లిప్ వచ్చింది. తాజా కేసులో మొత్తం 71 కేసులు అతడిపై నమోదయ్యాయి. హెల్మెట్ లేకుండా, త్రిబుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్ కేసులు ఉన్నాయి. కెమెరాలు పట్టేస్తాయి : బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎప్పటికైనా దొరకడం ఖాయమని చెబుతున్నాయి. ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్న ఓ బైక్ చోదకుడి తాజాగా దొరకడమే ఇందుకు నిదర్శనం. పోలీసులు లేరని సిగ్నల్ జంప్ చేసినా కెమెరాలో దొరికిపోతారు. ఈ కెమెరాలో ఫొటోలు తీసి కంట్రోల్ రూమ్‌కు పంపుతాయి. దీంతో పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కార్పొరేటర్‌కు రూ.5,000 జరిమానా
అమీర్‌పేట: రోడ్లపై ఫ్లెక్సీలు కట్టినందుకు జీహెచ్ఎంసీ అధికారులు అమీర్‌పేట కార్పొరేటర్ నామన శేషుకుమారికి రూ.5,000 జరిమానా విధించారు. సోమవారం మంత్రులు వేములు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్‌ఆర్‌నగర్‌కు వచ్చిన సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ కార్పొరేటర్ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫ్లెక్సీలు కట్టినందుకు గాను కార్పొరేటర్‌కు జరిమానా విధించారు. అందుకు సంబంధించిన రసీదును కార్పొరేటర్‌కు అందజేశారు. -
ట్రాక్ బాగుంటే గిఫ్ట్
బుధవారం ఉదయం 11.30.. అసెంబ్లీ సమీపంలోని కంట్రోల్‌రూమ్ చౌరస్తా...ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగర పోలీసు కమిషనర్.. అటుగా బైక్‌పై వచ్చిన వాహనచోదకుడిని ఆపారు. రోడ్డు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి అతని ‘ట్రాక్’ రికార్డును పరిశీలించారు. గతంలో, ప్రస్తుతం ఎలాంటి ఉల్లంఘనలు లేకపోవడంతో అతనికి మెక్ డొనాల్డ్స్ గిఫ్ట్ కూపన్, ఓ పువ్వు అందచేశారు. సాక్షి, హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని ‘దారి’కి తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు, చార్జ్షీట్లు, కౌన్సెలింగ్ వంటివి నిర్వహిస్తున్నారు. మరి, పక్కాగా నిబంధనలు పాటించే వారిని ఎందుకు ప్రోత్సహించకూడదనే ఆలోచనతో నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ కొన్నాళ్లుగా ఉత్తమ డ్రైవర్లకు సినిమా కూపన్లు అందిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో ఇప్పుడు మెక్ డొనాల్డ్స్ సంస్థ సాయంతో రూ.250 విలువైన గిఫ్ట్ కూపన్లను నెలకు 300 మందికి చొప్పున ఆరు నెలల పాటు అందించనున్నారు. బుధవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు 25 మంది వాహనచోదకులకు గిఫ్ట్ కూపన్లు, పువ్వులు అందించారు. గిఫ్ట్ కొట్టాలంటే.. క్లీన్ రికార్డు ఉండాలి - మెక్‌డొనాల్డ్స్ గిఫ్ట్ కూపన్ గెల్చుకోవాలంటే వాహనచోదకుడు గతంలో, తనిఖీ సమయంలో పక్కాగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉండాలి. - హెల్మెట్ పెట్టుకుని వస్తున్న ద్విచక్ర వాహనచోదకులు, సీట్‌బెల్ట్ ధరించిన తేలికపాటి వాహనాల డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు. - వాహనచోదకుల వద్ద ఉండాల్సిన ధ్రువీకరణలు తనిఖీ చేసి ఆపై గతంలో ఎప్పుడైనా చలానా చెల్లించారా? అనేది ట్యాబ్ ద్వారా పరిశీలిస్తారు (ఈ ట్యాబ్‌లో.. ఉల్లంఘనుల జాబితా డేటాబేస్ మొత్తం అనుసంధానమై ఉంటుంది). - ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ, గతంలోనూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని వారిని ఎంపిక చేసి, అక్కడికక్కడే మెక్ డొనాల్డ్స్ గిఫ్ట్‌కూపన్, పువ్వు అందజేస్తారు. ఇలా ఒక్కో జోన్‌లోనూ 50 మందిని సత్కరిస్తారు. రోల్‌మోడల్‌గా సిటీ దేశంలోని మెట్రో నగరాలకు అనేక అంశాల్లో హైదరాబాద్ రోల్ మోడల్‌గా ఉంది. రహదారి భద్రత విషయంలోనూ ఈ లక్ష్యం సాధించాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇలా చేస్తే ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తుంది. మీ కుటుంబంలో, చుట్టుపక్కల ఎక్కడైనా ఉల్లంఘన మీ దృష్టికి వస్తే వెంటనే వారిని కట్టడి చేయండి. మెక్ డొనాల్డ్స్ సంస్థ పార్ట్నర్ ఆఫ్ రోడ్సేఫ్టీగా మారింది. - అంజనీకుమార్, సిటీ కొత్వాల్ ప్రమాదాల నియంత్రణకే.. నగరంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాం. ఇంకా తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. నగరాన్ని యాక్సిడెంట్ ఫ్రీగా మార్చాలంటే రహదారి నిబంధనలు అందరూ కచ్చితంగా పాటించాలి. ఇందుకోసం వాహన చోదకులను ప్రోత్సాహించే మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తాం. - అనిల్‌కుమార్, ట్రాఫిక్ చీఫ్ ట్రాఫిక్ పోలీసుల పనితీరు అద్భుతం నగర ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అందరి సామాజిక బాధ్యత. నగరవాసులంతా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. - రితేష్‌కుమార్, మెక్ డొనాల్డ్స్ ఆపరేషన్స్ హెడ్ ఆనందంగా ఉంది నగర ట్రాఫిక్ విభాగం అధికారులు మెక్ డొనాల్డ్స్ సంస్థతో కలిసి అందిస్తున్న తొలి కూపన్ అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే నగరం సేఫ్ సిటీ అవుతుంది. అందుకోసం అందరూ కృషి చేయాలి. - రవిచంద్ర, యాడ్ ఏజెన్సీ నిర్వాహకుడు, సైదాబాద్ కాలనీ -
బైక్‌పై రూ.20 వేలకు పైగా పెండింగ్ చలాన్లు
బహదూర్‌పురా: బహదూర్‌పురా చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో బైక్‌లు నడుపుతున్న మైనర్లను పట్టుకున్నారు. బహదూర్‌పురా ట్రాఫిక్ ఎస్సైలు సత్యనారాయణ, జి.కరుణాకర్ రెడ్డి ఆదివారం బహదూర్‌పురా చౌరస్తాలో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. డ్రైవింగ్‌లో పట్టుబడిన ఓ మైనర్ ద్విచక్ర వాహనంపై రూ.20 వేల పైచిలుకు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -
పోలీసులకు రూ.40 వేల జరిమానా
తమిళనాడు,టీ.నగర్: కట్టపంచాయితీ వ్యవహారానికి సంబంధించి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కు తలా రూ.40 వేల అపరాధం విధిస్తూ మానవ హక్కుల కమిషన్ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ధర్మపురి జిల్లా పాలక్కోడు కరకదహల్లి గ్రామానికి చెందిన టి.శివషణ్ముగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను న్యాయవాదిగా పనిచేస్తున్నానని, గత 2018లో ఒక సివిల్ వివాదంలో కొందరు కట్టపంచాయితీ జరిపి తనను, తన కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేసినట్లు చెప్పారు. గాయపడిన తాము ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నట్లు వివరించారు. దీనిపై ఫిర్యాదు చేసినా సంబంధిత వ్యక్తులపై అప్పటి సీఐ సతీష్‌కుమార్, ఎస్ఐ చంద్రన్ కేసు నమోదు చేయలేదని వెల్లడించారు. కోర్టులో తప్పుడు సమాచారాన్ని అందజేసి నిందితులు బెయిలు పొందేందుకు సహకరించారని ఆరోపించారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు చిత్తరంజన్ మోహన్‌దాస్ సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌పై విచారణ జరిపిన ఆయన పోలీసులు ఇరువురూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలుపుతూ బాధితుడు శివషణ్ముగంకు రూ.40 వేలను రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎనిమిది వారాల్లోగా అందజేసి, ఈ మొత్తాన్ని పోలీసు ఇన్స్పెక్టర్ సతీష్‌కుమార్, ఎస్ఐ చంద్రన్ల వద్ద వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా వారిపై అడిషనల్ సెక్రటరీ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేశారు. -
చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్చల్
-
చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్చల్
న్యూఢిల్లీ : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ యువతి జరిమానాకు భయపడి నడిరోడ్డుపై హల్చల్ చేసింది. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగటమే కాకుండా చలానా వేస్తే ఆత్మహత్యకు పాల్పడతానంటూ బెదిరింపులకు దిగింది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఐఎస్బీటీ బస్టాండ్ వద్ద విరిగిపోయిన నెంబర్ ప్లేటుతో రోడ్డుపై వెళుతున్న యువతి పోలీసుల కంటపడింది. దీంతో వారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందన జరిమానా కట్టాలని యువతితో చెప్పారు. పెద్ద మొత్తం జరిమానా కట్టాల్సి వస్తుందని భావించిన యువతి డ్రామాకు తెరతీసింది. మొదట ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. తనను చలానా వేయకుండా వదిలిపెట్టాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇలా ఓ 20నిమిషాల పాటు హల్చల్ చేసింది. అయితే యువతి తీరుతో విసిగిపోయిన పోలీసులు చలానా వేయకుండానే ఆమెను పంపించేశారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు. చదవండి : వైరల్: ఎంత అలసిపోతే మాత్రం.. అప్పుడు నిద్రపోతారా? -
భారీ ఫైన్లతో రోడ్డు ప్రమాదాలు తగ్గేనా ?!
సాక్షి, న్యూఢిల్లీ : ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు భారీ జరిమానాలు నిర్ణయిస్తూ కేంద్ర మోటారు వాహనాల చట్టంకు చేసిన సవరణలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ చలాన్లు విధిస్తున్నారు. హరియాణా, ఒడిశా రాష్ట్రాల్లో మొదటి ఐదు రోజులు నిర్వహించిన తనిఖీల్లోనే ట్రాఫిక్ పోలీసులు 1.4 కోట్ల రూపాయలను చలాన్ల రూపంలో రాబట్టారు. కొన్ని సార్లు వాహన ఖరీదు కంటే జరిమానా ఎక్కువగా ఉండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. గురుగావ్‌లో ఓ ద్విచక్ర వాహనం దారుడికి పలు నిబంధనల ఉల్లంఘన కింద ట్రాఫిక్ పోలీసులు ఏకంగా 23 వేల రూపాయల జరిమానా విధించారు. రాజస్థాన్‌లో రిజిస్టర్ అయిన ఓ ట్రక్కుకు సెప్టెంబర్ 9వ తేదీన ఢిల్లీ పోలీసులు 1. 41 లక్షల రూపాయల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి తద్వారా పోతున్న ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జరిమానాలను భారీగా పెంచింది. అయితే దీని వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావించడం పొరపాటే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ముందుగా రోడ్డు ప్రమాదాల్లో పోతున్న మానవ ప్రాణం విలువెంతనే అంశంపైన దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ‘వరల్డ్ రిసోర్సెస్ ఇండియా’ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ అమిత్ భట్ చెప్పారు. కొన్ని సార్లు జరిమానాలు వాహనం విలువకన్నా ఎక్కువగా ఉంటున్నాయని, అది ఎంత అర్ధరహితమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అధిక రెవెన్యూ వసూళ్ల కోసమే మోదీ ప్రభుత్వం ట్రాఫిక్ జరిమానాలను పెంచిందంటూ విమర్శిస్తున్న వారూ ఉన్నారని భారీగా పెంచిన జరిమానాలను పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిరాకరించగా, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు జరిమానాల మొత్తాన్ని తగ్గించాయి. రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలు ఈ అంశాన్ని ఇంకా పరిశీలిస్తున్నాయి. ప్రమాదాల్లో పోతున్న మానవ ప్రాణాల విలువను ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా ఎలా లెక్క గడుతుందో చూడండంటూ భట్ వ్యాఖ్యానించారు. వాహనదారుల నడవడికను పరిశీలించకుండా ట్రాఫిక్ జరిమానాలను పెంచుకంటూ పోవడం హ్రస్వ దృష్టియే అవుతుందని పారిశ్రామిక పరిశోధన సంస్థ ‘కేర్ రేటింగ్స్’ డిప్యూటీ మేనేజర్ దర్శిణి కన్సారా అన్నారు. జరిమానాలు పెంచడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు కూడా దేశంలో ఎంత మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో, వారిని ఎలా అరికట్ట వచ్చో అనే అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జరిమానాలను పెంచడం వల్ల ప్రయోజనం లేదని, పైగా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలను కని పెట్టడం కూడా కష్టమేనని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ‘బిహేవియరల్ సైంటిస్ట్’ ఆనంద్ దామిని తెలిపారు. అతి వేగం వల్ల ఎక్కువ ప్రాణాలు పోతున్నాయని, ముందుగా అతి వేగాన్ని అరికట్టే విషయంపై దష్టిని కేంద్రీకరిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆయన చెప్పారు. 2018 సంవత్సరంలో జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 54 వేల మంది మరణించారని, వారిలో కేవలం 5 శాతం కేసులో తాగి నడిపిన కేసులు ఉన్నాయని, మిగతా ప్రమాదాల్లో ఎక్కువ వరకు అతి వేగం వల్ల జరిగినవేనని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించడం ఇక్కడ గమనార్హం. -
జరిమానాల జమానాకు బ్రేక్
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల (సవరణ) చట్టాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయడం ఇంకా ప్రారంభించలేదు. అమలు మొదలెట్టిన కొన్ని రాష్ట్రాలు పక్షం రోజులు గడవ కుండానే పునరాలోచనలో పడ్డాయి. జరిమానాలను గణనీయంగా తగ్గించే యోచన చేస్తున్నాయి. వాహన వినియోగదారులను చైతన్యం చేశాకే కొత్త చట్టం అమలు ప్రారంభిస్తామన్న రాష్ట్రాలు కూడా బహుశా ఇలా తగ్గించాకే అమలు చేయడం మొదలుపెట్టవచ్చు. వాహనాలు వినియోగించేవారిలో అత్యధికులు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందినవారు కనుక కొత్త చట్టం వల్ల వచ్చిపడిన ‘కష్టాల’పై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. పాలకులు కూడా బాగానే పట్టిం చుకున్నారు. మొదట్లో భారీ జరిమానాల విషయంలో తగ్గేది లేదని చెప్పిన కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ... వారం రోజులు గడిచాక రాష్ట్రాలు కావాలనుకుంటే జరిమానాలను సవరించు కోవచ్చునని అంటున్నారు. భారీ జరిమానాలు అందరిలోనూ బెంబేలెత్తించిన మాట వాస్తవం. తొలి నాడే ఒక స్కూటరిస్టుకి రూ. 23,000 జరిమానా విధించడం, బండి విలువ కూడా అంత ఉండదని అతను మొత్తుకోవడం, ఒక ట్రక్కు డ్రైవర్‌కు రూ. 1,41,000, ఒక ఆటోవాలాకు రూ. 47,500 జరి మానాలు వడ్డించడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. హర్యానా, ఒడిశాలు అత్యధికంగా జరిమా నాలు వసూలు చేసి రికార్డు సృష్టించాయి. హెల్మెట్ కొనుగోళ్లు పెరిగాయి. భారీ శబ్దం చేసే హారన్లు మార్చుకునేవారి సంఖ్య పెరిగింది. పరిమిత స్థాయిలో కాలుష్యం ఉన్నదనే ధ్రువ పత్రాల కోసం జనం పరుగులంకించుకున్నారు. ఇక భారీ జరిమానాలపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలు సరేసరి. ఈ సవరణ చట్టం హఠాత్తుగా వచ్చింది కాదు. దీనికి సంబంధించిన బిల్లు రూపకల్పనకు సుదీర్ఘకాలం పట్టింది. రాష్ట్రాల రవాణా మంత్రులున్న కమిటీ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంది. ఆ తర్వాత పార్లమెంటు స్థాయీ సంఘం అధ్యయనం చేసి మార్పులు, చేర్పులు సూచించింది. 2014లో సుప్రీంకోర్టు చొర వతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ ఆధ్వర్యాన ఏర్పడిన ముగ్గురు సభ్యుల కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని ఎత్తిచూపింది. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ మొదలు కొని కాలం చెల్లిన వాహనాల నియంత్రణలో విఫలం కావడం వరకూ జరుగుతున్న అనేకానేక లోటు పాట్లను ఎత్తిచూపింది. ఇదంతా అయిన తర్వాతే కేంద్రం సవరణ బిల్లు రూపకల్పనకు పూనుకుంది. ప్రభుత్వాలు తమ వంతుగా చేయాల్సిన పనుల్లో కొన్నయినా ఈపాటికే చేసి ఉంటే బహుశా సవరణ చట్టం అమల్లో ఇప్పుడెదురవుతున్న ప్రశ్నలు ఉండేవి కాదు. భారీ జరిమానా వాతలు పడినవారు రహదార్లు సవ్యంగా ఉంటున్నాయా... సిగ్నలింగ్ వ్యవస్థ ఎక్కడైనా పనిచేస్తోందా... వీఐపీలు నిబంధ నలు పాటిస్తున్నారా అంటూ నిలదీస్తుంటే ప్రభుత్వాల దగ్గర వాటికి జవాబు లేదు. కనుకనే అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు తగ్గాయి. కొత్త చట్టంలో నిర్దేశించిన జరిమానాలు గరిష్ట మొత్తాలని, వాటికి పరిమితులు విధించే అధికారం రాష్ట్రాలకుంటుందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ప్రకటించారు. అయితే సాధారణ ఉల్లంఘనలకు సంబంధించిన నిబం ధనల విషయంలోనే ఈ తగ్గింపు సాధ్యమవుతుంది. మొత్తం 64 నిబంధనలున్న కొత్త చట్టంలో వాటి సంఖ్య 24. అయితే ఈ నిబంధనల ప్రకారం విధించే జరిమానాలు కూడా తక్కువ లేవు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి విధించే కనీస జరిమానా ఇంతక్రితం రూ. 100 ఉంటే ఇప్పుడది రూ. 500 అయింది. గరిష్ట మొత్తం రూ. 10,000 జోలికి ప్రభుత్వాలు వెళ్లకపోవచ్చుగానీ రూ. 500 అయితే కట్టి తీరాలి. తాగి వాహనాలు నడపడం, లోపాలున్న వాహనాన్ని వినియోగిం చడం వంటివి తీవ్ర ఉల్లంఘనలకిందికొస్తాయి. అలాగే రహదారి నిర్మాణంలో, దాని నిర్వహణలో కాంట్రాక్టర్లు చేసే లోపాలు కూడా తీవ్ర ఉల్లంఘన పరిధిలోకొస్తాయి. ఈ ఉల్లంఘనల విషయంలో జరిమానాలు తగ్గించడానికి అవకాశం లేదు. మన దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పర్యవ సానంగా జరుగుతున్న ప్రమాదాలు తక్కువేమీ కాదు. మృతుల్లో 72 శాతంమంది 18–45 మధ్య వయస్కులే. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే వయస్సులో ఇలా అకాల మరణం చెంద డం వల్ల వారి కుటుంబాలతోపాటు దేశం కూడా ఎంతో నష్టపోతోంది. ప్రకృతి వైపరీత్యాల్లో మరణి స్తున్నవారితో పోల్చినా, ఉగ్రవాద ఘటనల్లో మరణించేవారితో పోల్చినా, ఎయిడ్స్‌వంటి ప్రాణాం తక వ్యాధుల్లో మరణించేవారితో పోల్చినా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. ఏటా మన దేశంలో దరిదాపు లక్షన్నరమంది కేవలం రోడ్డు ప్రమాదాల్లో అకాల మృత్యువాత పడుతున్నారు. 2001–2017 మధ్య దేశంలో 79 లక్షల ప్రమాదాలు జరిగితే దాదాపు 21 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. 82 లక్షలమంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా దాదాపు రూ. 3,80,000 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. వాహనచోదకుల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిందే. కానీ భారీగా జరిమానాలు విధించడం ఒక్కటే సర్వరోగ నివారిణిగా భావించకూడదు. రహదారుల నిర్మాణం సరిగా లేనిపక్షంలో కారకులపై చర్యలు తీసుకోవడం, రహదారులు దెబ్బతిన్నప్పుడు తక్షణం మరమ్మతులు చేయించడం, అన్ని చోట్లా సిగ్నల్ వ్యవస్థలు పకడ్బందీగా ఉండేలా చూడటం, డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో చోటుచేసు కుంటున్న అవకతవకల్ని సవరించడం, అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు వగైరా అంశాలపై కూడా దృష్టి సారించాలి. ఇప్పటికి 13 రోజులైనా దేశంలో ఒక్కచోట కూడా కాంట్రా క్టర్లపైగానీ, ప్రభుత్వాల సిబ్బందిపైగానీ చర్యలు తీసుకున్న వైనం ఎక్కడా లేదు. వాహన చోదకు లకు భారీ జరిమానాలు విధించడంలోనే అత్యుత్సాహం కనబడుతోంది. కొత్త చట్టం విషయంలో బాగా ప్రచారం చేయడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టానికి చర్యలు తీసుకోవడం అవసర మని రాష్ట్రాలు గుర్తించాలి. -
వాహనదారులు అప్రమత్తం
సాక్షి, అమరావతి బ్యూరో : ‘నేను ఐదేళ్లుగా విజయవాడ నగరంలో ఉంటున్నాను. నగరానికి వచ్చిన కొత్తలో ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాను. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా బండికి ఇన్సూ్యరెన్స్ చేయించకుండానే సంచరించాను. ఈ–చలానాల విషయంలో పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కానీ సవరించిన చట్టం అమలు చేస్తారని తెలియడంతో అప్రమత్తం కావాల్సి వచ్చింది. రెండు రోజుల కిందటే వాహనానికి ఇన్సూ్యరెన్సు చేయించాను. గతంలో వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపితే ఎవరో ఒకరితో ఫోన్ చేయించడమో.. ఏదో ఒకటి చెప్పి వెళ్లడమో జరిగేది. కొత్త చట్టం అమల్లోకి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించడంతోపాటు జేబు గుల్ల అయ్యే ప్రమాదం ఉండటంతో జాగ్రత్త పడ్డాను.’–ఓ వాహనదారుడు ..మోటారు వాహనాల చట్టం–1988కు సవరణల్ని కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమవుతున్నారనేందుకు ఇదో ఉదాహరణ. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతుండడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. జరిమానాలు భారీగా వి«ధించడంతోపాటు జైలు శిక్ష ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, ఇన్సూ్యరెన్స్ పత్రాలు లేకుండా, వాహన రిజిస్ట్రేషన్ చేయించకుండా జల్సాగా తిరుగుతున్న వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. బీమా కంపెనీలకు పరుగులు పెడుతున్నారు. మొన్నటి వరకు రోజుకు 40–50 వరకు ఉండే ఎల్ఎల్ఆర్ స్లాట్ల బుకింగ్‌లు ఒక్కసారిగా 30 శాతం పెరిగాయంటే ప్రజలు ఎంత జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతోంది. గరిష్టంగా రూ.25 వేలు జరిమానా.. గతంలో అయితే విజయవాడ కమిషనరేట్ పరిధిలో చాలా జరిమానాలు రూ.100 వరకే ఉండేవి. సేవారుసుం రూ.35 కలుపుకొని రూ.135 కడితే సరిపోయేది. మోటారు వాహన చట్టంలో తాజా సవరణల కారణంగా ఎక్కువ ఉల్లంఘనలకు రూ.5వేల వరకు విధించే అవకాశం కనిపిస్తోంది. గరిష్ఠంగా రూ.25 వేల వరకు బాదే ప్రమాదముండటం ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అంశంగా మారింది. దీనికితోడు కొన్ని ఉల్లంఘనల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు రద్దు చేసే అవకాశముండటమూ ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మైనర్లకు వాహనాలిచ్చిన యజమానికి గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష పడనుండటం వాహనదారుల్ని వణికిస్తోంది. నూతన చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ఉల్లంఘనులపై చర్యలతోపాటు జరిమానాలు పిడుగుపాటు మాదిరిగా తాకే అవకాశముండటంతో ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇన్సూ్యరెన్స్ కియోస్క్‌ల వద్ద సందడి వాహన పత్రాలంటే సాధారణంగానే రిజిస్ట్రేషన్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ గుర్తుకొస్తాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే చాలావరకు షోరూం నిర్వాహకులే రిజిస్ట్రేషన్‌తోపాటు ఇన్సూ్యరెన్స్ చేయించడం సర్వసాధారణం. ఇన్సూ్యరెన్సు కాలపరిమితి తీరిన తర్వాత పునరుద్ధరించుకోవడంలోనే చాలామంది వాహనదారులు బద్ధకిస్తుంటారు. ఇన్సూ్యరెన్‌స పునరుద్ధరించని సమయంలో వాహనదారుడు ప్రమాదానికి గురైతే జరిగే ఆర్థిక, ప్రాణనష్టం ఖాయం. వాహన ఇన్సూ్యరెన్స్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కీలక దృష్టి సారిస్తుండటంతో చాలామంది వాహనదారులు వాహన బీమా పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు. పెట్రోల్‌బంక్‌ల్లోని కియోస్క్‌ల వద్ద సందడి పెరగడమే ఇందుకు తార్కాణం. జరిమానాలు ఇలా... ♦ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ చిక్కితే మోటారు వాహనాల చట్టంలోని 181 సెక్షన్ ప్రకారం గతంలో రూ.500 జరిమానా ఉండేది. తాజా సవరణల క్రమంలో అది రూ.5 వేలు విధించే అవకాశముంది. ♦ ఇన్సూ్యరెన్స్ చేయించని వాహనాన్ని నడుపుతూ దొరికితే 196 సెక్షన్ ప్రకారం గతంలో రూ.1,000 జరిమానా విధించేవారు. సమీప భవిష్యత్తులో రూ.2వేల వరకు విధించొచ్చు. ♦ చట్టంలోని 206 సెక్షన్ ప్రకారం పోలీసు అధికారులు అవసరమైతే వాహన పత్రాల్ని స్వాధీనపరుచుకునే అధికారముంది. గతంలో ఈ నిబంధనను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇకపై పత్రాల విషయంలో అనుమానముంటే ఈ నిబంధనపై గట్టిగా దృష్టి సారించే అవకాశముంది. ♦ ఉల్లంఘనను బట్టి అవసరమైతే 183, 184, 185, 189, 190, 194సి, 194డి, 194ఇ సెక్షన్ల ప్రకారం పోలీసులు పత్రాల్ని జప్తు చేసి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయొచ్చు. ధ్రువపత్రాలు తప్పనిసరి మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారం రహదారులపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలున్నాయన్న సంగతి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లింది. డ్రైవింగ్ లైసెన్సుతో సహా బీమా, కాలుష్య పరిమితి పత్రం.. ఇలా అన్నీ ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో పట్టుపడితే భారీ జరిమానాలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు వీటిని తమ వద్ద ఉంచుకోవాలి. అలా కానీ పక్షంలో ఎం–పరివాహన్ మొబైల్ యాప్‌లో మన వివరాలు నమోదు చేసుకుంటే అవి మనతోనే ఉంటాయి. ఎం–పరివాహన్ మొబైల్ యాప్‌ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూపొందించింది. – ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ, -
భారీ చలాన్లు, నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వాహన సవరణ చట్టం-2019 వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు భారీ జరిమానాల బారిన పడుతున్నారు. దీనిపై ఒకవైపు భారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ నెలనుంచి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ ఉల్లంఘనలు,భారీ చలాన్లను సమర్థిస్తూ కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనకుగాను తన వాహనానికి కూడా జరిమానా విధించినట్లు సోమవారం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. తన పేరు మీద నమోదైన కారును అతి వేగంగా నడిపినందుకు ముంబైలోని బంద్రా-వర్లీ ప్రాంతంలో జరిమానా విధించారన్నారు. అంతేకాదు బాగా జరిమానాలు అవినీతి పెరగడానికి దారితీస్తుందనే ఆందోళనలను మంత్రి తోసి పుచ్చారు. అవినీతి పెరుగుతుందని అంటున్నారు..ఎలా జరుగుతుంది? తాము ప్రతిచోటా కెమెరాలను ఏర్పాటు చేసాము కదా అని కేంద్రమంత్రి పేర్కొనడం గమనార్హం. మోటార్ వెహికిల్ సవరణల చట్టం తీసుకురావడం పట్ల తమ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. భారీ జరిమానాల కారణంగా అవినీతి తగ్గుతుందని.. రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా చాలా వరకు నియంత్రించవచ్చన్నారు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారు జరిమానాలకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఇలా వుంటే భారీ జరిమానాలపై సామాన్యుల నుంచి రాజకీయనేతల దాకా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనికితోడు గతంలో ఎప్పుడో పెండింగ్‌లో ఉన్న చలాన్లకు కూడా డబ్బులు వసూలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ వాహనాల ఖరీదుకు మించి చలాన్ల వడ్డింపు వుండటంతో ఏం చేయాలో తెలియక వాహనదారులు ఆందోళన పడుతున్నారు. కొందరైతే ఫైన్ చెల్లించలేక తమ వాహనాలను పోలీసుల వద్దే వదిలేసి వెళుతున్నారు. వాహనానికి నిప్పు పెట్టిన ఉదంతం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్లే!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ ఉల్లంఘనులకు విధించే జరిమానాలు అతి భారీగా ఉండడంతో తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలు మాత్రం పాత చలాన్లే విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌తో సహా ఈ జాబితాలో బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రం కూడా చేరింది. అంతేకాక అనేక ఇతర రాష్ట్రాలు సవరించిన చట్టాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. భారీ జరిమానాలు విధించడం సాధ్యం కాదని, ఈ విషయమై ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులతో చర్చలు జరిపి కొత్త జరిమానాలను నిర్ణయిస్తామని గుజరాత్ ప్రభుత్వ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సోమవారం పేర్కొన్నారు. అలానే మధ్యప్రదేశ్‌లో కొత్త చట్టం అమల్లోకి రాదని, జరిమానాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత చట్టం అమలు చేయబడుతుందని ఆ రాష్ట్ర న్యాయ వ్యవహారాల మంత్రి ప్రకటించిన విషయం విదితమే. ఢిల్లీలో కొత్త చట్టం అమలు చేస్తున్నప్పటికీ చలాన్ల విషయమై ట్రాఫిక్ పోలీసులతో చర్చలు జరిపే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే మోటారు వాహనాల సవరణ బిల్లు 2019ను పార్లమెంటు జూలైలో ఆమోదించింది. ఈ చట్టంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఉల్లంఘనులకు కఠినమైన జరిమానాలు విధించారు. కొత్త చట్టం ప్రకారం.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి జరిమానా రూ .100 నుంచి అమాంతం రూ .1,000లకు పెంచడం చర్చనీయాంశంగా మారింది. కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మొదటి రోజు కేవలం 3,900 మందికి మాత్రమే చలాన్లు విధించారు. గత కొన్ని సంవత్సరాలుగా సాధారణంగా పండుగ రోజుల్లో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న వేళల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి సగటున కేవలం 6గంటల వ్యవధిలో సగటున 15,000 నుంచి 20,000 చలాన్లు విధించే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం జారీ చేసిన చలాన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే సవరించిన చట్టం అమలులో మొదటి రోజు ఆదివారం కావడం, కొత్త చట్టం ప్రకారం జరిమానాలు చాలా భారీగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్త పడడం ఒకటైతే, జారీ చేసిన మొత్తం చలాన్లు ఆదివారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే తీసుకున్నవి అని ట్రాఫిక్ విభాగపు అధికారులు ధృవీకరించారు. -
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇపుడొక లెక్క!
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ లేకపోయినా ఏం పరవాలేదు అని డ్రైవింగ్ చేస్తున్నారా.. మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. ఆ.. ఏముంది వందో రెండు వందలో జరిమానా కడితే సరిపోతుంది అని ఆలోచిస్తున్నారా?.. ఇకపై మీ పప్పులుడకవు. ఎందుకంటే వేలకు వేలు జరిమానా కట్టాల్సిందే. అంతేగాకుండా కొన్ని నిబంధనలు పాటించకుంటే ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. ఇంకా ఉంది.. ఓవర్ లోడింగ్ ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కో ప్రయాణికునికి రూ.1000 చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఈ మేరకు వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 1) నుంచి ‘మోటారు వాహనాల సవరణ చట్టం–2019’ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర రవాణాశాఖ బుధవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై నిబంధనలు పాటించకుంటే జరిమానాలు 100 నుంచి 500 శాతం పెరగనున్నాయి. ప్రధానంగా 25 ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చట్ట సవరణలో ఉన్న మరో కీలకాంశం ఏమిటంటే.. ఇకపై ట్రాఫిక్ జరిమానాల మొత్తం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ ఉంటుంది. గురువారం నోటిఫికేషన్ అందుకున్న రాష్ట్ర రవాణాశాఖ, వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. శనివారం గాని, వినాయకచవితి సెలవు ముగిసిన త ర్వాత మంగళవారం గాని ఉత్తర్వు జారీ కానుందని రవాణాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. గోల్డెన్ అవర్ నిధి.. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ‘గోల్డెన్ అవర్’ గా పరిగణించే మొదటి గంట అత్యంత కీలకం. ఈ సమయంలో వైద్యం అందితే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అందుకే ‘గోల్డెన్ అవర్’లో క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించేలా నిబంధన తీసుకొచ్చారు. దీని కోసం కేంద్రం ప్రత్యేకంగా ‘మోటారు వెహికిల్ యాక్సిడెంట్ ఫండ్’ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారానే ఆయా ఆస్పత్రులకు చికిత్సకైన ఖర్చులు చెల్లిస్తారు. దేశంలో ఉన్న ప్రతి రోడ్ యూజర్‌కు నిబంధనలకు లోబడి ఈ ఫండ్ ద్వారా బీమా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆధార్ తప్పనిసరి. అలాగే ప్రమాదాలకు సంబంధించి వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న పరిహారం భారీగా పెరగనుంది. గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ఎవరైనా చనిపోతే ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న రూ.25 వేల పరిహారం రూ.2 లక్షలకు, క్షతగాత్రులకు ఇస్తున్న రూ.12,500 నుంచి రూ.50 వేలకు పెంచారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సహకరించే వ్యక్తులు తమ వివరాలను అటు పోలీసులు, ఇటు వైద్యాధికారులకు చెప్పాల్సిన అవసరం లేకుండా నిబంధన పొందుపరిచారు. తల్లిదండ్రులూ బాధ్యులే.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలను రీకాల్ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. అలాంటి వాహనాలకు ఉత్పత్తి చేసిన కంపెనీలకు గరిష్టంగా రూ.500 కోట్ల వరకు జరిమానా విధించే ఆస్కారం లభిస్తుంది. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే ఆ చర్య తమకు తెలియకుండానో, తాను వారిస్తున్నా జరిగిందని తల్లిదండ్రులు/సంరక్షకుడు నిరూపించుకోవాలి. లేదంటే వారికీ జైలు శిక్ష, జరిమానా తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ లేదా ఉల్లంఘనలకు పాల్పడుతూ చిక్కితే వారి తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. ఆ మైనర్పైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. వాహనం రిజిస్ట్రేషన్ శాశ్వతంగా రద్దు అవుతుంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలుగా పరిగణించే ట్రాఫిక్ అధికారులు, పోలీసులు ఉల్లంఘనలకు పాల్పడితే సాధారణ వ్యక్తులకు విధించే జరిమానాకు రెట్టింపు విధిస్తారు. పెండింగ్ చలాన్లు.. చకచకా.. మరో 3 రోజుల్లో కొత్తగా పెంచిన జరిమానాలు అమల్లోకి రానుండటంతో పెండింగ్ ఈ–చలాన్లను వాహన చోదకులు భారీగా క్లియర్ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఈ–చలాన్ చెల్లింపులు రోజుకు రూ.50 లక్షల వరకు ఉంటాయి. అయితే గడిచిన 4 రోజుల చెల్లింపులు పరిశీలిస్తే రూ.65 లక్షలు, రూ.68 లక్షలు, రూ.2.08 కోట్లు, రూ.2.38 కోట్లుగా ఉండి రికార్డు సృష్టిస్తున్నాయి. -
ఆటో ఒకటి – చలాన్లు 62
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏకంగా 62 చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఓ ఆటోడ్రైవర్ దొరికిపోయాడు. టీఎస్ 07 8170 నెంబర్ ఆటో నడుపుకునే శ్రీనివాస్ ఇప్పటివరకు 62 చలాన్లు చెల్లించలేదు. మొత్తం 14,500 రూపాయలు చలాన్లు చెల్లించిన తరువాత ఆటోను విడుదలచేసారు. -
..ఐతే చలానే!
సాక్షి, సిటీబ్యూరో: నిజాంపేటలో నివసించే వేణు మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి. తనకు ఇష్టమైన ఎన్ఫీల్డ్ బైక్‌ను రూ.లక్షన్నర వెచ్చించి కొనుగోలు చేశాడు. అది అందరి దృష్టిని ఆకర్షించేందుకు బైక్ సైలెన్సర్, హారన్‌ను మోడిఫై చేయించాడు. దానిపై రోజూ ఆఫీస్‌కు వెళ్లొచ్చే సమయంలో చేసే శబ్దంతో తోటి వాహనదారులు చిరెత్తిపోయేవారు. చివరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు దొరకడంతో జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో నివసించే శ్రీకాంత్‌కు ఖరీదైన కారుంది. బిజినెస్ నిమిత్తం రోజూ మాదాపూర్ వెళ్తుంటాడు. రహదారిపై వెళ్తున్న సమయంలో చేస్తున్న మల్టీటోన్డ్ హారన్ ఇతరులకు ఇబ్బందికరంగా మారింది. శబ్ద పరిమితి దాటడంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఇలా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరిమితికి మించి శబ్దం చేస్తూ, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనచోదకులపై ట్రాఫిక్ పోలీసులు సౌండ్ లెవల్ మీటర్స్(ఎస్ఎల్ఎం) సహాయంతో ఉక్కుపాదం మోపుతున్నారు. మార్చిలో ప్రారంభించి ఇప్పటి వరకు 2,245 మంది వాహనదారులకు స్పాట్ ఈ–చలాన్లు విధించారు. మార్చిలో 9, ఏప్రిల్‌లో 54, మేలో 88, జూన్‌లో 197, జూలైలో 1,897 వాహనాలకు జరిమానా వేశారు. అయితే మొదట్లో బైకులు తొలి స్థానం లో ఉండగా... ఇప్పుడు కార్లు నిలిచాయి. శబ్ద కాలుష్యం, మల్టీటోన్డ్ హారన్, ఎయిర్ హారన్ల వారీగా స్పాట్లోనే చలాన్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఠాణాల్లో ఎస్ఎల్ఎం యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో నిర్వహిస్తున్న తనిఖీలను ఇతర ఠాణాల్లోనూ అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పరిమితిని మించి... యువత ఖరీదైన కార్లు, బైకులతో రహదారులపై దూసుకెళ్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర వాహనాలకు 75 డెసిబుల్స్ దాటితే, కార్లకు 74 డెసిబుల్స్ దాటితే జరిమానా విధిస్తున్నారు. వాహనదారులను హారన్ కొట్టమని అది మల్టీటోన్డ్, ఎయిర్ హారన్, కంపెనీ ఫిక్స్డ్ చేసిన హారనా? అని ట్రాఫిక్ పోలీసులు గుర్తిస్తున్నారు. 12 ఫీట్ల దూరం నుంచి శబ్ద తరంగాలను ఎస్ఎల్ఎంలతో గుర్తిస్తున్నారు. మోటారిస్టులు ఎక్సలేటర్ తొక్కితే కొంత దూరం నుంచి ఎస్ఎల్ఎం సౌండ్ సెన్సార్లు శబ్ద స్థాయిని పసిగడుతున్నాయి. వాహనానికి 5–6 ఫీట్ల దూరం నుంచి ఈ యంత్రాలు శబ్ద తీవ్రతను నమోదు చేస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఒక యంత్రం ఉండగా పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్‌లో 1,153 ఈ–చలాన్లు జారీ చేసినట్టు ట్రాఫిక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శబ్దం చేస్తే చర్యలే.. కంపెనీ ఫిక్స్ చేసిన హారన్ శబ్దం నచ్చకపోవడంతో చాలామంది మార్చేస్తున్నారు. అలాగే రోడ్లపై వెళ్తున్న సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సైలెన్సర్లు మోడిఫై చేస్తున్నారు. చాలా వరకు ఈ బైకులు 90–120 డెసిబుల్స్ వరకు వెళ్తున్నట్టు ఎస్ఎల్ఎం రీడింగ్‌లు చెబుతున్నాయి. ఇక కార్ల పరిస్థితి వీరి కంటే ఎక్కువగా ఉంది. అధిక శబ్దం చేసే వాహనదారులపై చర్యలు తప్పవు. – విజయ్‌కుమార్,సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
56 చలాన్లు : రూ.9675 బకాయి
హిమాయత్‌నగర్: సర్వీస్ రోడ్‌పై వాహనాల పార్కింగ్ చేస్తుండటంపై ట్రాఫిక్ పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్ ప్రధాన రోడ్ స్వాగత్ గ్రాండ్ వద్ద ఏపీ29 బిఎల్2385 ద్విచక్ర వాహనానికి 56 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకుగాను రూ.9675 బకాయిలున్నట్లు గుర్తించిన ఎస్సై కృష్ణంరాజు వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించాడు. -
బుల్లెట్ బాబు..70 చలాన్లు!
నల్లకుంట: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు సంబంధించి 77 పెండింగ్ చలానాలు ఉన్న ఓ ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సోమవారం నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు ఎస్సై రమేష్ నేతృత్వంలో ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో జుజ్జువారపు సువర్ణరాజు తన బుల్లెట్ (టీఎస్ 07ఎఫ్హెచ్ 1245) వాహనంపై శంకరమఠం నుంచి ఫీవర్ ఆస్పత్రి వైపు వెళ్తుండగా పోలీసులు ఆపారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో ఆ బండి నెంబర్‌తో చెక్ చేయగా ఆ వాహనంపై మొత్తం 77 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ చలానాలకు సంబంధించి బకాయిలు రూ.12,725 ఉండటంతో ఎస్సై రమేష్ ద్విచక్రవానహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని సీఐ రాజేంద్ర కులకర్ణికి తెలియజేయడంతో ఆయన నగర పోలీసు కమిషనరేట్‌కు సమాచారం ఇచ్చారు. పెండింగ్ చలానాలు క్లియర్ చేస్తే వాహనాన్ని అప్పగిస్తామని ఎస్సై చెప్పారు. కాగా .. పెండింగ్ చలానాల్లో ఎక్కువగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకే ఉండటం గమనార్హం. ఇంతగా ట్రాఫిక్ వాయిలెన్స్‌కు పాల్పడిన సదరు వాహనదారుడికి ఏమైనా శిక్ష విధిస్తారా, లేక లైసెన్స్ రద్దు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. -
‘కక్ష’ తీర్చుకున్న జీహెచ్ఎంసీ అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్ వినియోగించే వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.6,210 జరిమానా విధించారు. బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ గోల్కొండ ప్రాంతంలోని ప్రభుత్వ గోడలపై పోస్టర్లు అంటించిన పోలీసులకు ‘గ్రేటర్’ రూ.10 వేల ఫైన్ వేసింది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండూ వ్యవహారాలు దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉన్నాయని కొందరు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. జరిమానా విధించడంలో జీహెచ్ఎంసీ వ్యవహారశైలి కూడా ‘నిబంధనల్ని ఉల్లంఘిచినట్లే’ ఉందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వినియోగించే వాహనం సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిఘా కెమెరాలకు చిక్కింది. దీంతో గత ఏడాది ఆగస్టు 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 మధ్య ఆరు ఈ–చలాన్లు జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన జరిమానా మొత్తం రూ.6,210 పెండింగ్‌లో ఉన్నట్లు గత గురువారం మొహిత్ పటేల్ అనే నెటిజనుడు ట్వీట్ చేశాడు. ఇది సోషల్‌మీడియాతో పాటు మీడియాలోనూ హల్చల్ చేయడంతో జీహెచ్ఎంసీ స్పందించింది. కమిషనర్ దాన కిషోర్ వినియోగించే కారుపై (టీఎస్ 09 ఎఫ్ఏ 4248) ఉన్న ఆరు చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించింది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ వాహనాన్ని నడిపిన డ్రైవర్లను కమిషనర్ దానకిషోర్ తీవ్రంగా మందలించారనీ ప్రకటించింది. ఇది జరిగిన వారం రోజులకు జీహెచ్ఎంసీ అధికారులు తమ ‘కక్ష’ తీర్చుకున్నారు. తమకు రూ.6210 జరిమానా విధించిన పోలీసులకు రూ.10 వేల ఫైన్ వేశారు. గోల్కొండ బోనాల నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసు విభాగం ఆ భక్తులకు స్వాగతం పలకాలని భావించింది. దీనికోసం రాష్ట్ర డీజీపీ నుంచి స్థానిక గోల్కొండ అదనపు ఇన్స్పెక్టర్ వరకు ఆరుగురి ఫొటోలతో పోస్టర్లను ముద్రించారు. గోల్కొండ పోలీసుస్టేషన్ పేరుతో ముద్రించిన వీటి ద్వారా బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ అనేకచోట్ల అతికించారు. వీటిని చూసిన జీహెచ్ఎంసీ అధికారులు..సదరు పోస్టర్లు తమ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటయ్యాయంటూ గురువారం రూ.10 వేల చలాన్ జారీ చేశారు. ప్రభుత్వ విభాగమైన పోలీసు శాఖ ఇలాంటి అతిక్రమణలకు పాల్పడకూడదని జీహెచ్ఎంసీ అధికారులు అంటుండగా... ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోస్టర్లు ఏర్పాటు చేశామని, సదరు పోస్టర్ అంటించిన గోడ జీహెచ్ఎంసీకి చెందిన కాదని పేర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులో, వాణిజ్య అవసరాల కోసమే ఇలా చేస్తే జరిమానా విధించాలి తప్ప ప్రభుత్వం విభాగం, ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా అంటిస్తే ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు. సదరు గోడపై పోస్టర్ అతికించి పోలీసు విభాగం తప్పు చేస్తే... దానిపై తీసుకున్న చర్య ద్వారా జీహెచ్ఎంసీ కూడా తప్పు చేసిందని అధికారులు అంటున్నారు. ఆ పోస్టర్లు గోల్కొండ పోలీసులు ముద్రించినట్లు వాటిని చూస్తేనే అర్థం అవుతోంది. జీహెచ్ఎంసీ చెబుతున్నట్లు అవి నిబంధనలకు విరుద్ధమైతే నేరుగా ఠాణాకు వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన ఇన్స్పెక్టర్కు చలాన్ అందించవచ్చని, అయితే అలా చేయని జీహెచ్ఎంసీ అధికారులు ఆ పోస్టర్ పక్కనే చలాన్ అతికించారని చెబుతున్నారు. పోలీసులు పోస్టర్ అతికించడం తప్పయితే... చలాన్ అతికించడం ఒప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో ఈ–చలాన్ల జారీ మొత్తం సాంకేతికంగా వాహనం నెంబర్ ఆధారంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా సదరు వాహనం ఎవరిది అనేది ట్రాఫిక్ పోలీసులకు తెలిసే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ వాడుతున్న వాహనంపై ఈ–చలాన్లు ఉన్న విషయం ఓ నెటిజనుడు ట్వీట్ చేయడంతో బయటకు వచ్చిందని, దీనికి సంబంధించి పోలీసులపై జీహెచ్ఎంసీ ‘కక్ష’ కట్టడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఉమ్మినందుకు రూ.100 ఫైన్
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు ఇటీవలి కాలంలో వివిధ కార్యక్రమాలు చేపట్టి జరిమానాలు విధిస్తోన్న జీహెచ్ఎంసీ.. తాజాగా బుధవారం లింగంపల్లి వద్ద ఆర్టీసీ బస్‌డ్రైవర్ రోడ్డుపై ఉమ్మివేయడంతో రూ.100 జరిమానా విధించింది. కోఠి నుంచి పటాన్చెరు వెళ్తున్న కుషాయిగూడ ఆర్టీసీ డిపోబస్ (ఏపీ 28జడ్ 3676) లింగంపల్లి బస్బే వద్ద కొద్దిసేపు ఆగింది. ఈ సమయంలో బస్ డ్రైవర్ జగదీష్ రోడ్డుపై ఉమ్మివేశారు. దాంతోపాటు బస్‌లోంచి కొన్ని కాగితాలు కూడా అక్కడ వేశారు. సదరు దృశ్యాలను ఫొటోలు తీసిన జీహెచ్ఎంసీ పటాన్చెరు సర్కిల్ సిబ్బంది ఉమ్మివేశారా? అని అడగడంతో అవునని బదులివ్వడంతో రూ.100 జరిమానా వసూలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నో స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నందున ఇలాంటివి చేయరాదంటూ సదరు బస్‌బేలో ఉన్న వారందరికీ సూచించారు. తమ సిబ్బంది కొద్దిసేపటి క్రితమే శుభ్రం చేసిన ప్రాంతాన్ని ఉమ్మివేసి పాడు చేయడంతో జరిమానా విధించినట్లు శానిటరీ సూపర్వైజర్ గోపాల్‌రావు పేర్కొన్నారు. జరిమానా విధించే దృశ్యాల్ని జీహెచ్ఎంసీ పోస్ట్చే యడంతో సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్‌గా మారింది. దీంతోపాటు చదువుకోని వాడు రోడ్లు శుభ్రం చేస్తే.. చదువుకున్నవాడు పాడు చేస్తున్నాడని చెబుతూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. -
లారీపై 102 చలాన్లు
గచ్చిబౌలి: 102 చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఓ లారీని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం ఉదయం నానక్‌రాంగూడలోని క్యూసిటీ వద్ద వెళ్తున్న లారీ(ఏపీ 12 డబ్ల్యూ 1445)ని గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ఐ ఖాజాపాషా అడ్డుకుని తనికీ చేయగా 102 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ లారీని సీజ్ చేశారు. పెండింగ్ చలానాలు చెల్లిస్తేనే లారీని విడుదల చేస్తారని డ్రైవర్ జె.రాజుకు సూచించారు. -
ఒక్క కారు.. 66 చలాన్లు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం జూబ్లీహిల్స్ క్లబ్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. నల్లకుంట పద్మాకాలనీకి చెందిన కంద్రకొండ కోటేశ్వరరావుకు చెందిన కారు(ఏపీ09సీబీ3132)ను ఆపి తనిఖీలు చేయగా ఈ కారుపై 66 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. గత నాలుగేళ్లుగా పెండింగ్ చలానాలు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.75,710 పేరుకుపోయాయి. దీంతో కారును సీజ్ చేశారు. నాగేశ్వరరావుకు చెందిన ఈ కారును మరో వ్యక్తి నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. -
ఖాకీలపై కన్ను!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేవలం నగరవాసులపైనే కాదు... పోలీస్ సిబ్బంది, అధికారులపైనా కొరడా ఝళిపిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే... నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా మాత్రమే పడుతోంది. అదే పని పోలీసులు చేస్తే వారికి జరిమానా, తాఖీదులతో పాటు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే వేటు కూడా పడనుంది. పోలీసులకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్‌ను సిటీ ట్రాఫిక్ కాప్స్ సోమవారం ప్రారంభించారు. ఇది మూడు, నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనీల్‌కుమార్ ‘సాక్షి’కితెలిపారు. పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారే తప్పు చేస్తే... రహదారి భద్రతకు సంబంధించిన అంశాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఈ అధికారాలు ఉన్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్లోకి, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు ద్విచక్ర వాహనాలపై వచ్చే ప్రతి అధికారి/సిబ్బంది కచ్చితంగా దీన్ని ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయా వాహనాలను లోపలికి అనుమతించొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ తీవ్రమైన ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గడిచిన కొన్నాళ్లుగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నారు. ఉల్లంఘనల వారీగా వీటిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సాధారణ ప్రజలతో పాటు పోలీసులు చేసే వాటిపైనా దృష్టి పెట్టారు. యూనిఫామ్‌లో ఉంటే... నగర పోలీస్ విభాగంలో పని చేస్తున్న 10వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీస్ స్టేషన్/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫామ్‌లోనే ఉంటున్నారు. సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫామ్‌లో ఉన్న పోలీసులతో పాటు పోలీస్ వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి ఇప్పటికే పలుసార్లు కౌన్సెలింగ్ కార్యక్రమాలు చేపట్టిన అధికారులు ఇప్పుడు స్పెషల్‌డ్రైవ్ ద్వారా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ప్రాథమికంగా హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్ కలిగి ఉండడం, వాహనాల నంబర్ ప్లేట్లపై పోలీస్ లాంటి పదాలు రాసి ఉండడంపై దృష్టి పెట్టి స్పెషల్‌డ్రైవ్ చేస్తున్నారు. ఆధారాల సేకరణ... పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే నాలుగు రకాల సాధనాల ద్వారా పోలీస్ ఉల్లంఘనుల వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతోపాటు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెండింటితో పాటు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వాటిని, పత్రికల్లో ప్రచురితం/ప్రసారమైన ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్ధారించిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసుల నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి కొందరు అధికారులపై బదిలీ/ఎటాచ్మెంట్ వేటు కూడా వేస్తున్నారు. ఇప్పుడు స్పెషల్‌డ్రైవ్ ద్వారా ఈ చర్యలు వేగవంతం చేశామని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు పోలీసుల్లోనూ మార్పు రావాలన్న లక్ష్యంతోనే స్పెషల్‌డ్రైవ్ చేపడుతున్నామని వివరిస్తున్నారు. -
ఒకే కారుపై 64 చలాన్లు
గోల్కొండః ఒక కారు పై 64 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పెండింగ్‌లో ఉన్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బుధవారం గోల్కొండ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు కారుకు సంబందించిన పత్రాలను తనిఖీ చేయగా సదరు వాహనంపై వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన 64 ఛలాన్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ. 64 వేలు బకాయి ఉన్నట్లు తెలిపారు. -
అక్షరాల రూ.లక్ష!
సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్న ‘నిషా’చరులు సరాసరిన రోజుకు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాల రూ.లక్షకు పైనే. ఈ నెల తొలి పక్షంలో పట్టుబడిన 724 మంది మందుబాబులు కోర్టులో రూ.15,46,600 చెల్లించినట్లు ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ గురువారం వెల్లడించారు. మద్యం మత్తులో వాహనం నడపటం ఆరోపణలపై చిక్కిన వారికి జైలు శిక్ష పడిందన్నారు. వీరిలో 79 మంది జైలుకు వెళ్లగా... 56 మంది డ్రైవింగ్ లైసెన్సులను (డీఎల్స్) న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడమో, సస్పెండ్ చేయడమో జరిగిందని ఆయన వెల్లడించారు. డ్రంక్ డ్రైవింగ్ కేసుల్లో చిక్కిన వారి మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు 10 మంది డ్రైవింగ్ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా... ఒకరిది ఐదేళ్లు, పది మందివి నాలుగేళ్లు, 21 మందివి మూడేళ్లు, ముగ్గురివి రెండేళ్లు, ఐదుగురివి ఏడాది, ఆరుగురివి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అనిల్‌కుమార్ పేర్కొన్నారు. జైలుకు వెళ్లిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి రెండు నెలలు, మరొకరికి నెల, ఇద్దరికి 10 రోజులు, 15 మందికి ఐదు రోజులు, నలుగురికి నాలుగు రోజులు, 13 మందికి మూడు రోజులు, 43 మందికి రెండు రోజులు జైలు శిక్ష పడింది. డ్రంక్ డ్రైవింగ్‌తో పాటు మరో రెండు రకాలైన ఉల్లంఘనల్నీ తీవ్రంగా పరిగణిస్తూ చార్జ్షీట్లు వేస్తున్నామన్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం నేరంపై ఇద్దరికి రెండు రోజులు, ఒకరికి ఒక రోజు జైలు శిక్షలు విధించాయి. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్స్ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్తులో పాస్పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు. -
పెనాల్టీ పడుద్ది
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్ అమలులో భాగంగా రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేసే వారిపై, 50 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్ కవర్లనువినియోగించేవారికి, పారిశుద్ధ్య కార్యక్రమాలకు భంగం కలిగించే వారికి, బహిరంగ మూత్రవిసర్జన చేసేవారికి భారీఎత్తునజరిమానాలు విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించారు. స్వచ్ఛత కోసం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా, ఎన్ని నిధులు వెచ్చిస్తున్నా పరిస్థితి మూణ్నాళ్ల ముచ్చటే అవుతుండటంతో ఇక భారీ పెనాల్టీలే మార్గమని భావించిన ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2019’ పై అడిషనల్, జోనల్ , డిప్యూటీ కమిషనర్లు, తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయా ఉల్లంఘనలకుపాల్పడిన వారికి ఒక్కో సర్కిల్లో కనీసం 500 మందికి తగ్గకుండా భారీ పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. భారీగా నీటి వృథా.. నగరంలో ఉదయం పూట ఇళ్లను, వాహనాలను తరచూ కడుగుతూ ఎంతో నీటిని వృథా చేయడమే కాకుండా ఆ నీటిని రోడ్లపై వదలడం ద్వారా రోడ్లు పాడవుతున్నాయన్నారు. నగరానికి ప్రతిరోజు 400 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుండగా , అందులో పది శాతం (40 ఎంజీడీల) నీరు ఇలా వృథా అవుతోందని, తద్వారా దాదాపు రూ. 250కోట్ల విలువైన నీరు వృథా అవుతోందని, రోడ్లు దెబ్బ తింటున్నాయని కమిషనర్ దానకిశోర్ వివరించారు. ఇలా రోడ్లపై నీటిని వదిలేవారితోపాటు వివిధ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని, భారీ పెనాల్టీలు విధించాలని సూచించారు. మురికివాడల సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, బహిరంగ మూత్రవిసర్జన జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. వీటితోపాటు మురికివాడల్లో ప్రధాన మార్గాల్లోని గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేయించాలని, చెత్త నిల్వ ప్రాంతాల్లో చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. నగరంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను సుందరీకరించాలని, ప్రతి ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు గ్రీన్ టార్పాలిన్ ఫెన్సి ంగ్‌ను వేయించి ట్రాన్స్ఫర్ స్టేషన్లో ఔషధ మొక్కలు, తీగజాతి మొక్కలను నాటడంతో పాటు టాయ్లెట్లను ఏర్పాటు చేసి సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆ హోటళ్లను సీజ్ చేయండి.. నగరంలో ఆహార వ్యర్థాలు, హోటల్ వ్యర్థాలను సివరేజి, నాలాల్లో వేస్తుండటంతో పొంగిపొర్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. అలాంటి హోటళ్లను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశించారు. అధిక పరిమాణంలో వ్యర్థాలను ఉత్పత్తిచేసే హోటళ్లలో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. యాభై మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ నిషేధంపై తగినచర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా, పూల బొకేలకు ప్లాస్టిక్ కవర్లను వాడటాన్ని పూర్తిగా నిషేధించాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జనవరి 4వ తేదీ నుండి 31వ తేదీలోగా స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరంలో ఎప్పుడైనా పర్యటించే అవకాశం ఉన్నందున ఆ బృందం అడిగే ఏడు ప్రశ్నలపై పెద్ద ఎత్తున నగర ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. -
వామ్మో.. పోలీసులు
నేర నియంత్రణకు జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా వాహన తనిఖీలు, మహిళారక్షక్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వీటితో ఎంతో ఉపయోగం ఉన్నా కిందిస్థాయి అధికారులు, సిబ్బంది చర్యలతో అవి నీరుగారుతున్నాయి. ఉన్నతాధికారుల వద్ద మార్కులు పొందేందుకు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీసులను చూస్తేనే నగరవాసులు హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు(క్రైమ్): ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించే వారికి గతంలో పోలీసులు జరిమానా విధించేవారు. ఈప్రక్రియలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని గుర్తించిన జిల్లా ఎస్పీ నవంబర్ 8వ తేదీ నుంచి ఈ–చలానా విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ–చలానా విధించే సమయంలో వాహనదారుడు ఎక్కడ నిబంధన ఉల్లంఘించాడో స్పష్టంగా ఫొటో తీయాలనే నిబంధన ఉంది. వీటిని కొందరు సిబ్బంది పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులకు రోజూ ఎన్ని కేసులు నమోదు చేశామో చూపించుకునేందుకు ఇష్టానుసారంగా ఈ–చలానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. కొందరు అధికారులు వాహనాల్లో కూర్చొని కిందిస్థాయి సిబ్బందికి ఈ–చలానా పరికరాన్ని ఇచ్చేస్తున్నారని ఆరోపణలున్నాయి. నగరంలోని అనేక షాపింగ్‌మాల్స్, హోటల్స్, వాణిజ్య సముదాయాలకు పార్కింగ్ స్థలాల్లేవు. సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు అందుకు భిన్నంగా వాహనదారులపై నో పార్కింగ్ పేరిట కేసులు నమోదు చేస్తున్నారు. భిన్నంగా వ్యవహరిస్తున్నారు మహిళలు, విద్యార్థినులపై వే«ధింపులు నిరోధించి వారికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఇటీవల మహిళారక్షక్ టీమ్‌లను ఎస్పీ ఏర్పాటు చేశారు. నగరంలోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో ఆరు బృందాలు, మహిళా పోలీసు స్టేషన్ ఆధ్వర్యంలో మూడు బృందాలను నియమించారు. టీమ్‌లు మఫ్టీలో తిరుగుతూ పోకిరీలను గుర్తించి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయాల్సి ఉంది. నేరచర్రిత ఉన్నవారు పట్టుబడితే వారిపై వెంటనే కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే పలు మహిళారక్షక్ బృందాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులకు రోజువారి నివేదికను పంపేందుకు అమాయకులను స్టేషన్‌కు తరలించి మందలిస్తున్నారు. పోలీసులను ప్రశ్నిస్తే కేసు పెడతారని, కెరీర్ దెబ్బతింటుందని అనేకమంది బాధను లోలోపలే దిగమింగుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవా ల్సిన అవసరం ఉంది. కొన్ని ఉదాహరణలు ⇒ నెల్లూరు అల్లీపురానికి చెందిన సుమన్ వద్ద వాహనానికి సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయి. తనిఖీలు చేస్తున్న పోలీసులకు వాటిని చూపించాడు. అయినా ఫైన్ ఎందుకు సార్ అని అడిగినందుకు అతడికి రూ.500 జరిమానా విధించారు. ⇒ బట్వాడిపాళెంకు చెందిన ఓ వ్యక్తి ఆచారివీధికి వెళ్లి అక్కడ పనిముగించుకుని ఇంటికి వచ్చిచూడగా సెల్‌ఫోన్‌కు రూ.235 కట్టాలని మెసేజ్ వచ్చింది. మెసేజ్‌లో ఉన్న లింక్‌ను తెరచిచూడగా బైక్ నంబర్ ప్లేట్ మాత్రమే తీసి రాంగ్‌పార్కింగ్ అంటూ రాసి ఉంది. దీంతో అతను నిర్ఘాంతపోయాడు. ⇒ బీటెక్ చదువుతున్న విద్యార్థులు రోడ్డుపై నిలబడి ఉండగా మహిళారక్షక్ టీమ్ సభ్యులు వచ్చి ఏ విషయం చెప్పకుండా పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎందుకు తీసుకువచ్చారని విద్యార్థులు ప్రశ్నించగా ఈవ్‌టీజింగ్ చేస్తారా అంటూ తమదైన శైలిలో మందలించారు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ⇒ బస్సుకోసం వేచి ఉన్న డిగ్రీ విద్యార్థులను పోలీసు స్టేషన్‌కు తరలించి మందలించడంతో వారు తీవ్రమనోవేదనకు గురయ్యారు. తమను అకారణంగా స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు నెల్లూరు నగరంలో నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అమాయకులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉల్లంఘనులకే ఈ–చలానాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికే ఈ–చలానాలు ఇస్తున్నాం. మెసేజ్ నేరుగా వాహనదారుడికి చేరుతుంది. అందులో ఎక్కడ ఉల్లంఘన జరిగిందో అందుకు సంబంధించిన ఫొటో ఉంటుంది. అవకతవకలు జరిగే అవకాశం లేదు.– మల్లికార్జునరావు, ట్రాఫిక్ డీఎస్పీ -
జనసమీకరణలో నేతలు... చలాన్ల వేటలో పోలీసులు
మారేడుపల్లి: నామినేషన్ల ఘట్టం చివరిరోజు కావడంతో కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్‌లోని అంబేడ్కర్, బా బూజగ్జీవన్‌రామ్‌ల విగ్రహాల వద్ద సోమవారం ఉద యం నుంచి మధ్యాహ్నం వరకూ సందడి నెలకొంది. కంటోన్మెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడం తో ఆయా పార్టీల అభ్యర్థులు ముందుగా ఇక్కడి అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు ఇక్కడి నుంచే తరలివెళ్లారు. భారీగా జన సమీకర ణ చేసి వారిని డీసీఎంల్లో పికెట్ చౌరస్తాకు తీసుకురావడంతో కార్యకర్తలు, నాయకులతో చౌరస్తా కిక్కిరిసిపో యి వెల్లింగ్టన్ రోడ్ ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలో భారీ వాహనాలు ప్రవేశించడంతో ట్రాఫిక్ పోలీసులు తమ కెమెరాలకు పని చెప్పారు. కనిపించిన ఏ వాహనాన్ని వదిలిపెట్టకుండా ఫొటోలు తీస్తూ చలాన్లు విధించారు. -
ట్రాఫిక్ బాస్ వాహనాలపై చలాన్లు..
సాక్షి, సిటీబ్యూరో: సిటీ ట్రాఫిక్ చీఫ్‌లకూ జరిమానాలు తప్పట్లేదు. 2011లో నాటి అదనపు సీపీ (ట్రాఫిక్) సీవీ ఆనంద్... తాజాగా గురువారం ట్రాఫిక్ విభాగం ప్రస్తుత బాస్ అనిల్‌కుమార్ ఇద్దరి వాహనాలపై చలాన్లు పడ్డాయి. ఈ రెండు ఉదంతాల్లోనూ అధికారిక డ్రైవర్ల కారణంగానే అధికారులు బుక్ కావడం, రాంగ్ పార్కింగ్‌కు సంబంధించిన చలాన్లు కావడం కొసమెరుపు. రికార్డుల ప్రకారం ఆయా డ్రైవర్లే జరిమానా కట్టినట్లు ఉన్నా... ఆనక ఆ డబ్బును ట్రాఫిక్ చీఫ్‌లు తమ జేబుల్లోంచి ఇచ్చారు. ఇద్దరూ అధికారిక వాహనాల్లో, అఫీషియల్ విధుల్లో ఉన్నప్పుడే ఇలా జరగడం యాదృచ్ఛికం. పంజగుట్టలో సీవీ ఆనంద్... సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ గతంలో నగర ట్రాఫిక్ చీఫ్‌గా పని చేశారు. అప్పట్లో ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తున్న పోలీసు వాహనాలపై స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఇది ప్రారంభించిన రెండో రోజే ఆనంద్ వాహనానికి జరిమానా పడింది. పోలీసు వాహనాలపై స్పెషల్డ్రైవ్ను పర్యవేక్షించడానికి సీవీ ఆనంద్ 2011 ఆగస్టు 11 మధ్యాహ్నం 1.00 గంటల ప్రాంతంలో సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్దకు వెళ్లారు. తన స్కార్పియో వాహనాన్ని (ఏపీ 9 పీఏ 0360) దిగి జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వద్దకు చేరుకున్నారు. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఆ సమీపంలోని నో పార్కింగ్ ఏరియాలో ఆపారు. తన పని ముగించుకుని తిగిరి వచ్చిన ఆనంద్ ఈ విషయాన్ని గుర్తించారు. అక్కడే ఉన్న అప్పటి పంజగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్‌ను పిలిచి తన డ్రైవర్‌కూ రాంగ్ పార్కింగ్ నేరం కింద రూ.200 జరిమానా విధించమని ఆదేశించారు. ఆ ప్రకారం రాసిన చలానా మొత్తాన్ని మాత్రం ఆనంద్ చెల్లించి డ్రైవర్‌ను హెచ్చరించారు. మహంకాళిలో అనిల్‌కుమార్... ఆనంద్ తర్వాత దాదాపు ఏడేళ్లకు నగర ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న అనిల్‌కుమార్ ‘వంతు’ వచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ చీఫ్‌గా ఉన్న అనిల్‌కుమార్ గడిచిన కొన్ని రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. వీటిలో భాగంగా వివిధ ట్రాఫిక్ ఠాణాలతో పాటు ఏసీపీ కార్యాలయాలకూ వెళ్తున్నారు. గురువారం నార్త్‌జోన్ పరిధిలో ఉన్న మహంకాళి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు అనిల్‌కుమార్ వెళ్ళారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ సమీపంలోని భవనం మొదటి అంతస్తులో ఉన్న ఈ ఠాణాకు అనిల్‌కుమార్ తన వాహనం దిగి లోపలకు వెళ్లిపోయారు. వాహనాలను సక్రమంగా నిలపాల్సిన బాధ్యత ఆ వాహ నం డ్రైవర్‌దే. అనిల్‌కుమార్‌కు డ్రైవర్‌గా వ్యవహరించిన సిబ్బంది దాన్ని రోడ్డు పక్కగా ఆపారు. అదే ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి న నో–పార్కింగ్ బోర్డు ఉంది. ఇలా రాంగ్ పా ర్కింగ్‌లో ఉన్న వాహనం, దానికి పోలీసుల అధికారులకు చెందినది అని చెప్పే ఆనవాళ్లు ఉండ టం గమనించిన ఓ నెట్‌జనుడు ఫొటో తీశాడు. దీన్ని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగర ట్రాఫిక్ పోలీసు అధికారిక ట్విటర్ ఖాతాకు ట్వీట్ చేశాడు. తక్షణం స్పందించిన అధికారులు అదనపు సీపీ వాహనంపై రూ.235 జరిమానా విధి స్తూ ఈ–చలాన్ జారీ చేశారు. విషయం తెలుసుకు న్న అనిల్‌కుమార్ ఆరా తీయగా డ్రైవర్ చూపిన నిర్లక్ష్యం బయటపడింది. దీంతో తొలుత అతడితో రూ.235 జరిమానా కట్టించి ఈ–చలాన్ క్లోజ్ చే యించారు. ఆపై కొద్దిసేపటికి ట్రాఫిక్ చీఫ్ సదరు డ్రైవర్‌కు తన జేబు నుంచి ఆ మొత్తం ఇచ్చారు. -
జరిమానాల జమానా
కడప కార్పొరేషన్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలకు ముకుతాడు వేయాల్సిందే. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే జరిమానా వసూలు చేయాల్సిందే. మద్యం తాగి వాహనం నడిపితే మత్తు దించాల్సిందే...వీటిని ఎవరూ కాదనలేరు. అవగాహనతో కూడిన జరిమానాలు వేస్తే జనం హర్షిస్తారుగానీ జరిమానాలే పరమావధి కాకూడదు. నెలలో ఇన్ని డ్రంకన్ డ్రైవ్ కేసులు పెట్టాలి, ఇన్ని చలానాలు రాయాలని ఒత్తిడి తెస్తుంటే పోలీసులు తమ టార్గెట్లు అందుకోవడానికి వక్రమార్గాలు అన్వేషిస్తున్నారు. తమ లక్ష్యసాధన కోసం వైన్‌షాపుల వద్ద కాపుకాసి, మద్యం తాగి వాహనం ఎక్కే వారిని పట్టుకొని డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి వాటివల్లే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదులో వైఎస్ఆర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 2016లో 1701 కేసులు పెట్టి రూ.2.52కోట్లు ఆదాయంఆర్జించిపెట్టిన ఆర్టీఏ, పోలీసు అధికారులు 2017 సంవత్సరంలో 6230 కేసులు పెట్టి రూ.7.43కోట్లు జరిమానాలు వేశారు. 2018లో కేవలం మూడు మాసాల్లోనే 7,208 కేసులు పెట్టి రూ.6.43 కోట్లు ఫైన్లు వేశారంటే పోలీసుల ఉత్సాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం వద్ద, ఉన్నతాధికారుల వద్ద మెప్పు పొందడానికి ఇలా ప్రజల నడ్డి విరుస్తున్నారనేది ఈ లెక్కల ద్వారా తేటతెల్లమవుతోంది.కడప నగరానికి సిటీ కల్చర్ ఇంకా అలవాటు కాలేదు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వేలాదిమంది ప్రజలు నిత్యం కూలీ పనుల నిమిత్తం వచ్చి రాత్రికి ఇంటికెళ్లిపోతుంటారు. వారికి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన ఉండదు కాబట్టి అలాంటి వారే ఈ కేసుల్లో ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం మద్యాన్ని హెల్త్ డ్రింగ్గా ప్రచారం చేస్తూ ఏరులై పారిస్తోంది. విచ్చలవిడిగా మద్యం లైసెన్సులు ఇచ్చి ఎక్సైజ్ శాఖకు టార్గెట్(లక్ష్యం) విధించి మద్యం ద్వారా ఆదాయం సంపాదిస్తోంది. ఇదే క్రమంలో ఆర్టీఏ, పోలీసు శాఖలకు కూడా నెలకు ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ చలానాలు వేయాలని టార్గెట్లు విధిస్తున్నారు. ఇవిగాక రాంగ్ పార్కింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్టు పెట్టుకోకపోవడం వంటి వాటిపై కెమెరాలతో రికార్డు చేసి పోలీసులు చలానాలు వేస్తున్నారు. వీటి వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుండటంతో ఎక్కువ టార్గెట్లు పెట్టి నెలనెలా సమీక్షలు నిర్వహించి వాహనదారులను జేబులు ఖాళీ చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ రహదారుల్లో వాహనాలు వేగంగా Ðð వెళ్తుంటాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చలానాలు వేస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికే ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. నగరాలు, పట్టణాల్లో ఉండే ట్రాఫిక్‌కు 20–30 కిలోమీటర్లు స్పీడ్ వెళ్లలేని చోట కూడా ఫైన్లు వేయడమంటే ఆదాయం పెంచుకోవడానికిగాక మరేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సౌకర్యాలు అరకొరే... అయినా జిల్లాలోని పట్టణాల్లో ఇప్పటికీ మెరుగైన రోడ్డు సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు, ట్రాఫిక్ పో లీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ స్థలాల ఏర్పాటు వంటి వాటిని ఎప్పుడో మర్చిపోయారు. ఫైన్లు వేయడమే వారికి పరమావధిగా మారిపోయింది. విదేశాల్లో అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే వాహనం విక్రయించేందుకు అవకాశం ఉండదు. కానీ ఇక్కడ లైసెన్స్ లేకపోయినా యథేచ్ఛగా వాహనాలు విక్రయించవచ్చు. దీంతో లక్షల సం ఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.వీటికి సరిపడా రోడ్లు విస్తరణ కాలేదు సరికదా అటూ, ఇటూ గుంతలతో ఇబ్బందులు తప్పడం లేదు. మద్యాన్ని ఏరులై పారించమని ఎక్సైజ్ శాఖకు, ఫైన్లు వేయమని ఆర్టీఏ, పోలీసుశాఖకు, కేసులు రాయాలని విద్యుత్ శాఖకు, పన్నులు పెంచుకోవాలని మున్సిపాలిటీలకు లక్ష్యాలు(టార్గెట్లు) విధించి వసూళ్లు చేస్తున్న ప్రభుత్వం పెరుగుతున్న పెట్రో«ల్, గ్యాస్ «ధరలు, నిత్యావసర ధరలకు కళ్లెం వేయడంలో ఈ టార్గెట్లు పెట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లక్షల్లో్ల పేరుకుపోయిన బకాయిలు ఈ చలానా వేసిన 15 రోజుల్లోపు రుసుం చెల్లించాలి. 16వ రోజు నుంచి పెండింగ్‌లోకి వెళ్లిపోతుంది. అదే వాహనానికి రెండోసారి ఈ చలానా వస్తే.. మొదటిసారి పెండింగ్‌లో ఉన్న రుసుం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్‌లాంటి నగరాల్లో అయితే ఈ చలానా ద్వారా ఫైన్ వేసిన విషయం ఫోన్ నంబర్లకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో వాహనదారులకు తమకు ఈ చలానాలో జరిమానా వి«ధించారన్న విషయం పోలీసులు ఆపినప్పుడుగానీ తెలియడం లేదు. దీంతో ఈ చలా నా బకాయిలు లక్షల్లో పేరుకుపోయినట్లు సమాచారం. వాటిని వసూలు చేయడానికి ఒక వాహ నం, ఏఎస్ఐ, ముగ్గరు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా ఒక బృందాన్ని కేటాయించి వసూళ్లు చేస్తున్నారు. తెల్లారి లేచింది మొదలు వీరికి చలానాలు రాబట్టడమే పని. ఈ చలానాలో వారి బండినంబర్లు తనిఖీ చేయడం, వాహనం తమ వద్దనే ఉంచుకొని డబ్బులు కట్టి రసీదు తీసుకురమ్మని చెప్పడం నిత్యకృత్యంగా మారింది. సా ధారణంగా రెండు, మూడుసార్లు ఈ చలానా డబ్బు చెల్లించకపోతే ఆ వాహనం కనిపిస్తే పోలీసులు సీజ్ చేస్తారు. కానీ కడపలో పోలీసులు మా త్రం ఒకసారి చెల్లించకపోయినా వాహనం ఆపి, దాన్ని వారి వద్దనే ఉంచుకొని డబ్బు కట్టి రమ్మని చెబుతున్నారు. అతని వద్ద డబ్బు ఉందా, లేదా అప్పటికప్పుడు కట్టమంటే ఏం చేస్తాడన్న ఆలోచ న లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ చలానా వేసిన విషయం నాకు తెలీదు, రేపు చెల్లిస్తానని చెప్పినా వినిపించుకోకపోవడంతో వాహనదారులు ఇదేం న్యాయం, ఇప్పటికిప్పుడు చెల్లించమంటే ఎలా అని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అపరాధ రుసుములు ఇలా... మోటారు వెహికల్ యాక్టు కింద నిబంధనలు ఉల్లంఘించిన అన్ని రకాల వాహనాలకు కింద చూపిన విధంగా అపరాధ రుసుము విధించే అవకాశం ఉంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 500, రిజిస్ట్రేషన్ లేకుంటే రూ. 2వేలు, ఇన్సూరెన్స్ లేకపోతే రూ.1000, మైనర్ డ్రైవింగ్‌కు రూ.500, వన్‌వే, నో ఎంట్రీలో ప్రవేశిస్తే రూ.200, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.2వేలు, హెల్మెట్ ధరించకపోతే రూ.100, దివ్యాంగులు అనుమతి లేకుండా ద్విచక్రవాహనం నడిపితే రూ.200, ర్యాష్ డ్రైవింగ్‌కు రూ.1000, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.1000, హారన్ లేకపోతే రూ.100, లైన్ క్రాసింగ్‌కు రూ.100, సిగ్నల్ జంపింగ్‌కు రూ.1000, సిగరెట్ త్రాగుతూ డ్రైవింగ్ చేస్తే రూ.100, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200, వాహన యజమానికి కాకుండా ఇతర వ్యక్తులు డ్రైవింగ్ చేస్తే రూ.1000, మితిమీరిన వేగానికి, భీమా లేకపోతే వెయ్యి రూపాయల చొప్పున అపరాధ రుసుము విధించే అవకాశం ఉంది. ప్రమాదకరంగా, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే రీతిలో వాహనం నడిపినా, పర్మిట్ లేకపోయినా కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. -
ఆ లైసెన్స్‌తో చిక్కితే జైలే...
సిటీజనులు పాయింట్లతో పరేషాన్ అవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే లైసెన్స్ ఎక్కడ రద్దవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. నగర పోలీసులు ప్రవేశపెట్టిన ట్రాఫిక్ పెనాల్టీ పాయింట్ల విధానం ఫలితాలిస్తోంది. నగరవాసుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదిలో కేవలం ముగ్గురే 12 పాయింట్ల పరిమితిని దాటడంతో వారి లైసెన్స్‌లు రద్దు చేసిన పోలీసులు... 25 స్టేషన్ల పరిధిలో ఏకంగా 4.47 లక్షల పాయింట్లు విధించారు. ఈ విధానం ప్రారంభించి బుధవారం నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో: నగర రహదారులపై తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి పెనాల్టీ పాయింట్స్ విధించే ప్రక్రియ ప్రారంభమై ఏడాది పూర్తయింది. గతేడాది ఆగస్టు 1న ప్రారంభమైన ఈ విధానంలో ఇప్పటి వరకు మొత్తం 4.47 లక్షల పాయింట్లు విధించారు. ఇది పూర్తిగా సాంకేతికంగా అమలవుతోంది. ఎలాంటి అవకతవకలకు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన ఈ విధానం ప్రాథమికంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అమలులోకి వచ్చింది. వాహనచోదకులు ఎక్కువ పాయింట్లు పొందాలన్నది తమ అభిమతం కాదని, కేవలం వారిలో క్రమశిక్షణ పెంపొందించేందుకే ఆర్టీఏ సహకారంతో ఈ విధానం అమలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో 12 పాయింట్లు పూర్తి చేసుకున్న ముగ్గురి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు కాగా... మరో 21 మంది దీనికి దగ్గర్లో ఉన్నట్లు పేర్కొన్నారు. పెనాల్టీ పాయింట్స్ విధానం మొత్తం వాహనచోదకుడి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా జరుగుతుంది. పోలీసులు ఓ ఉల్లంఘనుడిని పట్టుకున్నప్పుడు అతడి లైసెన్స్ నెంబర్ సేకరించడం ద్వారా దాన్ని తమ ట్యాబ్, పీడీఏ మెషిన్లో ఎంటర్ చేస్తారు. దాని ద్వారా అతడి లైసెన్స్‌పై పెనాల్టీ పాయింట్స్ నమోదయ్యేలా చూస్తున్నారు. ఈ–చలాన్ విధానంలో వాహనచోదకుడి లైసెన్స్ నెంబర్ తెలుసుకునే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతానికి పెనాల్టీ పాయింట్స్‌ను స్పాట్ చలాన్లకే వర్తింపజేస్తున్నారు. మరోపక్క ఈ–చలాన్ విషయంలోనూ వీటిని చెల్లించేప్పుడు ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో వాహనం ఎవరు నడిపారన్నది? తెలుసుకునే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తులో వాహనం ఆధారంగా దాని యజమానికీ పాయింట్లు విధించాలని యోచిస్తున్నారు. కొన్నింటికి మినహాయింపు... గతేడాది ఆర్టీఏ విభాగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హెల్మెట్/సీట్‌బెల్ట్ ధరించకపోవడం నుంచి వాహనం నడుపుతూ ఎదుటి వ్యక్తి మృతికి కారణం కావడం వరకు మొత్తం 24 రకాలైన ఉల్లంఘనలకు కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా 5 వరకు పెనాల్టీ పాయింట్స్ విధించే ఆస్కారం ఉంది. 24 నెలల కాలంలో 12 పాయింట్స్ వస్తే సదరు వాహనచోదకుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆర్టీఏ అధికారులు సస్పెండ్ చేస్తారు. తొలినాళ్లల్లో నగర పోలీసులు అన్నింటికీ పాయింట్స్ విధించారు. అయితే ఈ 24 రకాలైన ఉల్లంఘనల్లోనూ అనేక సందర్భాల్లో కొన్నింటిలో వాహచోదకుడి ప్రమేయం ఉండనివిగా, ఎదుటి వ్యక్తికి, వాహనచోదకుడికి ఎలాంటి ముప్పు కలిగించనివిగా గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకపోవడం, వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోవడం, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడం వంటి ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్స్ విధించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రమాదకరమైన, ప్రమాదాలు/మరణాలకు కారకంగా మారే ఉల్లంఘనలకే వీటిని విధిస్తున్నారు. 24 నెలలు...12 పాయింట్లు ప్రాథమికంగా రెండేళ్ల కాలాన్ని పెనాల్టీ పాయింట్స్‌కు గడువుగా నిర్దేశించుకున్నారు. ఈ కాలంలో పెనాల్టీ పాయింట్స్ 12కు చేరితే డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది రద్దవుతుంది. మళ్లీ కొత్త లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒకవేళ అది మళ్లీ పునరావృతమైతే మూడేళ్లు లైసెన్స్ రద్దు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. లెర్నింగ్ లైసెన్స్ వారికి ఈ పాయింట్లు 5 వస్తే చాలు... లైసెన్స్‌పై వేటు పడుతుంది. గడిచిన ఏడాది కాలంలో మొత్తం 4.47 లక్షల పెనాల్టీ పాయింట్స్ విధించారు. కాచిగూడ, ఫలక్‌నుమా, ఎస్సార్‌నగర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు ద్విచక్ర వాహన చోదకులకు 12 పాయింట్స్ పూర్తయ్యాయి. దీంతో వీరి లైసెన్సుల్ని సస్పెండ్ చేయించారు. వీరిలో ఇద్దరిపై 14 పాయింట్లు, మరొకరిపై 18 పాయింట్స్ నమోదైన్నట్లు అధికారులు తెలిపారు. మరో 21 మంది వాహన చోదకులపై ఇప్పటికే 12 పాయింట్స్ నమోదయ్యాయి. వీరిలో ఎవరికైతే మరొక్క పాయింట్ పడుతుందో వారి లైసెన్స్ సస్పెండ్ అవుతుందని అధికారులు చెప్పారు. ఇలా వచ్చిన పాయింట్లను తగ్గించుకొని ఉపశమనం పొందే మార్గమూ ఉంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో రహదారి నిబంధలనలు, ప్రమాదాల నివారణ అంశాలపై నిర్వహించే తరగతులకు హాజరైతే అప్పటి వరకు లైసెన్స్ హోల్డర్ ఖాతాలో ఉన్న పాయింట్ల నుంచి మూడు తగ్గిస్తారు. అయితే 24 నెలల కాలంలో రెండుసార్లు మాత్రమే ఇలాంటి ఆస్కారం ఉంది. ఉల్లంఘనలు, పాయింట్లు ఇలా... ⇔ ఆటోలో డ్రైవర్ సీటులో అదనంగా ప్రయాణికుల్ని ఎక్కించుకుంటే: 1 ⇔ సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తే: 2 ⇔ హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుండా వాహనం నడిపితే: 1 ⇔ రాంగ్రూట్లో వాహనం నడిపితే: 2 ⇔ నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ లోపు వేగంతో వెళ్తే: 2 ⇔ నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్తే: 3 ⇔ రాష్ డ్రైవింగ్/సెల్‌ఫోన్ డ్రైవింగ్/సిగ్నల్ జంపింగ్: 2 ⇔ డ్రంకన్ డ్రైవింగ్/రేసింగ్/ఓవర్ స్పీడింగ్: 3 ⇔ మద్యం తాగి ఫోర్‌వీలర్/లారీ/సరుకు రవాణా వాహనం నడిపితే: 4 ⇔ మద్యం తాగి ప్రయాణికులుండే ఆటో/క్యాబ్/బస్సులు నడిపితే: 5 ⇔ జిగ్‌జాగ్ డ్రైవింగ్/సౌండ్, ఎయిర్ పొల్యూషన్/నో పార్కింగ్: 2 ⇔ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే: 2 ⇔ అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే: 2 ⇔ ఎదుటి వారి భద్రతకు ప్రమాదం వాటిల్లేలా/గాయపడేలా నడిపితే: 2 ⇔ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఎదుటి వారి మృతికి కారణమైతే: 5 ⇔ వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడీలకు పాల్పడితే: 5 సిటీజనుల్లో ‘12’ భయం... ఓ వాహనచోదకుడికి పెనాల్టీ పాయింట్స్ విధింపు ప్రారంభమైన తర్వాత అతడికి ఉండే గడువు కేవలం 24 నెలలు మాత్రమే. ఒకటో పాయింట్ పడిన తర్వాత రెండేళ్లలో 12 పాయింట్ల విధింపు పూర్తయితే అతడి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. ఈ భయం నగవాసుల్లో పట్టుకుంది. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడి... పెనాల్టీ పాయింట్ పడిన వారు రెండోసారి అలాంటి పొరపాటు చేయడానికి వెనకాడుతున్నారు. ఆ తర్వాత నుంచి వీలైనంత వరకు రహదారి నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు. ఏడు పెనాల్టీ పాయింట్స్ దాటితే వాహనం స్వాధీనం చేసుకొని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్‌కు హాజరు కావడాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు పక్కా చేశారు. ఇలా ఇప్పటికే 1,600 మందికి ఈ ప్రక్రియను చేపట్టారు. గడిచిన ఏడాదిలో ఉల్లంఘనల నమోదు తీరును పరిశీలిస్తే ‘అనుభవం’ తర్వాత వాహనచోదకుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అత్యధిక కేసుల్లో ఒక్క పాయింట్ పడిన తర్వాత గరిష్టంగా రెండో పాయింట్ మాత్రమే పడుతోందని, ఆపై ఉల్లంఘనులు జాగ్రత్తగా వ్యవహరిస్తూ వీలున్నంత వరకు రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఆ లైసెన్స్‌తో చిక్కితే జైలే... పెనాల్టీ పాయింట్స్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అనేక మంది ఉల్లంఘనలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. అయినప్పటికీ ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ విభాగం అధికారుల వద్ద ఉండే పీడీఏ మెషిన్లు ఆర్టీఏ సర్వర్‌తోనూ అనుసంధానించి ఉంటాయి. దీంతో ఏఏ లైసెన్సులు సస్పెన్షన్‌కు గురయ్యాయి? అనేది తక్షణం తెలుస్తుంది. వాహన చోదకుల్లో ఎవరైనా సస్పెండ్ అయిన డ్రైవింగ్ లైసెన్స్/దాని ప్రతిని వినియోగించి వాహనం నడుపుతుంటే ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే పోలీసులు పీడీఏ మెషిన్ల ద్వారా తేలిగ్గా గుర్తిస్తారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని కోర్టులో హాజరు పరుస్తారు. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వారికి గరిష్టంగా మూడు నెలల వరకు జైలు శిక్షపడే ఆస్కారం ఉంది.– ఎల్ఎస్ చౌహాన్, ట్రాఫిక్ డీసీపీ–1 -
మేమింతే..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఏటా అనూహ్యంగా పెరుగుతోంది... నియంత్రణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి ఫలితాలు దక్కడం లేదు. ఓ పక్క ఉల్లంఘనులను చలాన్లతో చావబాదుతూ దొరికినకాడికి వసూలు చేస్తున్నా మార్పు శూన్యం... నిబంధనలు మనకోసమే అన్న సామాజిక స్పృహ వాహనచోదకుల్లో, మౌలిక వసతులు కల్పించాలిన్న భావన జీహెచ్ఎంసీకి, ఎన్ఫోర్స్మెంట్కు, చైతన్యం చేయాలన్న స్ఫృహ ట్రాఫిక్ అధికారుల్లో పెరిగే వరకు ఈ పరిస్థితుల్లో మార్పు అసాధ్యం. ఇదీ పెరుగుదల స్థితి... నగరంలో వాహనాల సంఖ్యను తలదన్నే రీతిలో ఉల్లంఘనులు పెరుగుతున్నారు. సిటీలో ఏటా వాహనాల సంఖ్య రెండు లక్షల చొప్పున పెరుగుతుండగా... ఉల్లంఘనులు దీనికి రెట్టింపుస్థాయిలో పెరుగుతున్నారు. సిటీలో 106 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలాన్లు విధిస్తున్నారు. నగరంలో 2005లో 15.27 లక్షలుగా ఉన్న వాహనాల సంఖ్య 2017 నాటికి 50 లక్షలు దాటింది. ఇక ఉల్లంఘనుల విషయానికి వస్తే 2015లో వారి సంఖ్య 32.24 లక్షలు ఉండగా... 2017 నాటికి 38.82 లక్షలు దాటింది. ట్రాఫిక్ అధికారులకు ఉల్లంఘనలకు పాల్పడిన సిటిజన్లకు 2015లో రూ.61.42 కోట్లు జరిమానా విధించగా... ఇది గత ఏడాది ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో రూ.66.60 కోట్లుగా నమోదైంది. వారికి రెడ్ కూడా ‘గ్రీనే’... ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఖాతరు చేయని వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏ జంక్షన్లో చూసినా వీరు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. కొన్ని సెకన్ల వేచి చూడలేక ముందుకు ‘ఉరుకుతూ’ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి వారితో పాటు ఎదుటి వారి చావుకూ కారణమవుతున్నారు. నిబంధనలు పాటించాలన్న స్ఫృహ లేనందునే అనేక జంక్షన్లు జామ్ కావడానికీ ప్రధాన కారణమవుతోంది. వీటికితోడు స్టాప్‌లైన్ క్రాసింగ్ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ ఉల్లంఘనులకు జరిమానా విధిస్తున్నా... ఎక్కడా స్టాప్‌లైన్లు పూర్తిస్థాయిలో స్పష్టంగా కనిపించే పరిస్థితి లేదు. హెల్మెట్ కేసులే అత్యధికం ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నది ప్రాథమిక నిబంధన. రోడ్డు ప్రమాదాల బారినపడుతున్న ద్విచక్ర వాహనచోదకుల్లో 80 శాతం తలపై గాయాలతోనే మరణిస్తుంటారు. మరెందరో క్షతగాత్రులు తలలోని కీలక భాగాలు దెబ్బతిని జీవశ్ఛవాలుగా మారుతుంటారు. గత కొన్నేళ్లుగా ట్రాఫిక్ పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా అత్యధికంగా ఈ కేసులో నమోదవుతున్నాయి. సీట్ బెల్ట్ లేకుండా తేలికపాటి, భారీ వాహనాల్లో ప్రయాణమూ ప్రమాదహేతువే అయినా ఎవరికీ పట్టదు. ఈ ఉల్లంఘనులకు జరిమానా సైతం పక్కాగా ఉండటం లేదు. -
ట్రాఫిక్ పోలీసుల దందాపై లారీ డ్రైవర్ల ఆందోళన
కుషాయిగూడ (హైదరాబాద్‌సిటీ) : లారీ డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల దందాలను నిరసిస్తూ చక్రిపురం ఇసుక లారీల అడ్డా వద్ద బ్రిక్స్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రోడ్డు పక్కన నిలిపిన లారీలకు సైతం వేల రూపాయలు చలానాలు రాస్తున్నారని ఆరోపించారు. మామూళ్లు ఇవ్వకపోతే కక్ష సాధింపులకు పాల్పడుతూ వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి నెల మామూళ్లు చెల్లించగానే ట్రాఫిక్ పోలీసులు జారీ చేస్తున్న కార్డులు, వారు విధిస్తున్న జరిమానా పత్రాలను మీడియాకు చూపారు. కార్యక్రమంలో ప్రతినిధులు నాను నాయక్,బిచ్చానాయక్, ప్రశాంత్,బాలజీ, పాండు, బిక్షపతి, లింగానాయక్, మాన్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
హెల్మెట్ ధరించని మహిళలకు చలాన్లు
సాక్షి, న్యూఢిల్లీ: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం వెనుక సీటుపై కూర్చుని ప్రయాణిస్తోన్న మహిళలు బుధవారం చలాన్లు చెల్లించవలసివచ్చింది. ద్విచక్రవాహనం వెనుక సీటుపై కూర్చుని ప్రయాణించే మహిళలు కూడా హెల్మెట్లు ధరించాలన్న నియమం బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తమకు తెలియదని వారిలో పలువురు చెప్పారు. మొదటి రోజు ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు కొందరు మహిళలు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ నిబంధనను కఠినంగా అమలుచేయాలనే ఉద్దేశంతోనే ఉన్నటు లకనిపించారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులు నగర రోడ్లపై 100 పోలీసు టీములను మోహరించారు . వారు వెనుక సీటుపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను రోడ్లపై ఆపి చలాన్లు విధించారు. సిక్కు మతస్తులమని చెప్పి తప్పించుకోచూసినవారిని అందుకు రుజువు చూపించవలసిందిగా ట్రాఫిక్ పోలీసులు కోరారు. ద్విచక్ర వాహనం నడిపే మహిళలే కాక వెనుక సీటుపై ప్రయాణించే మహిళలు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రవాణా విభాగం నియమం రూపొందించింది. ఇందుకోసం మోటారు వాహన చట్టంలో ఆగస్టు 28న సవరణ చేసింది. సిక్కు మహిళలకు మాత్రం ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు. కాగా, బుధవారం నుంచి ఈ నియమాన్ని కఠినంగా అమలుచేసేందుకు పోలీసులు నిర్ణయించారు. మూడు వేల మందికి పైగానే.. పోలీసులు బుధవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో సుమారు 3,236 మంది మహిళలకు చలాన్లు రాశారు. నగరంలో ద్విచక్రవాహనాలపై వెనుక కూర్చుని వెళ్లే మహిళలు సైతం హెల్మెట్ ధరించాలనే నియమాన్ని బుధవారం నుంచి అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ నియమాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ఇంతకుముందే పోలీసులు హెచ్చరించారు. సిక్కు మతస్తులు తప్ప మిగతా ఎవరైనా మహిళలు ద్విచక్రవాహనం వెనుక కూర్చుని ప్రయాణించే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లేకుంటే జరిమానాలు తప్పవని పేర్కొంది. దీనికోసం బుధవారం తెల్లవారుజామునుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 100 టీంలు విధులు నిర్వర్తించాయి. నగరవ్యాప్తంగా సుమారు 3,236 చలాన్లు రాశామని, అంతేకాక వారికి హెల్మెట్ ధరించాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించామని పోలీసులు తెలిపారు. కాగా, వీరిలో అత్యధికంగా దక్షిణ పరిధిలో 928 చలాన్లు విధించినట్లు వారు తెలిపారు. అలాగే సెంట్రల్ నుంచి 785, తూర్పున 528, ఉత్తరాన 569 చలాన్లు రాశామని పోలీసులు పేర్కొన్నారు. ఈ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని వారు వివరించారు.