నకిలీ చలాన్ల కలకలం.. తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం | Dharmana Krishnadas Says Fake Documents Were Created In 9 Districts Of AP | Sakshi
Sakshi News home page

నకిలీ చలాన్ల కలకలం.. తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం

Published Sat, Aug 14 2021 6:36 PM | Last Updated on Sat, Aug 14 2021 6:52 PM

Dharmana Krishnadas Says Fake Documents Were Created In 9 Districts Of AP - Sakshi

ఫైల్‌ ఫోటో

విజయవాడ: ఏపీలో నకిలీ చలాన్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్  మాట్లాడుతూ.. ఏపీలోని 9 జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. ఈ ఘటనపై 10 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.

ఇందులో భాగస్వాములుగా ఉన్న ప్రతి అధికారి, ఉద్యోగిపైనా చర్యలు తీసుకుంటామని కృష్ణదాస్‌ అన్నారు. తమ తనిఖీల్లోనే ఈ నకిలీ చలాన్ల వ్యవహారం బయటపడిందని, ఆరుగురు సబ్‌ రిజిస్ట్రార్‌లను సస్పెండ్ చేశామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement