Dharmana Krishna Das
-
నాలుగు నెలల్లోనే బాబు సర్కార్ ఘోర వైఫల్యం: వైఎస్సార్సీపీ
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో లైంగికదాడికి గురైన బాలికల కుటుంబాన్ని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ. 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.అనంతరం మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ.. పలాసలో బాలికలపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. బాధిత కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయన ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి చెక్కు అందజేశామన్నారు.‘‘నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. ఐదేళ్లలో ఎప్పుడూ కరెంటు చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు నాలుగు నెలల్లో భారీగా పెంచారు. చంద్రబాబుకు అబద్దాల చెప్పడం ఎప్పుడూ అలవాటే. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైఎస్ జగన్ హయాంలోనే వచ్చింది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ నిర్మించిన, ఇక్కడ ప్రజలకు 700 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’’ అని ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. -
‘గుడ్ బుక్ రాస్తాం.. అండగా ఉంటాం’
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం, రాష్ట్ర వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా సీదిరి అప్పల రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ‘‘భవిష్యత్తు అంతా వైఎస్సార్సీపీ పార్టీదే. కూటమి పాలనలో పధకాలన్నీ కొట్టుకుపోయాయి. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని అన్నారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. ‘‘పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. పార్టీ అధికారంలో లేనప్పుడు బరువు మోయడమే అసలైన పని. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా జగన్ పనిచేయమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం. 4 నెలలో ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. నేను ఆముదాలవలసలోనే ఉంటా.. ప్రజల కోసమే పనిచేస్తా. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ అన్ని ఆగిపోయాయి. నిత్యవసరాలు ఆకాశానంటుతున్నాయి. ధరల కంట్రోల్‌కి బడ్జెట్లోనే మేం నిధులు ఇచ్చేవాళ్లం. నాలుగు నెలలో రూ. 30 వేల కోట్లు అప్పుచేశారు. మెడికల్ సీట్లు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాయడం ఎంత దారుణం?. పేదల విద్యార్దులకు సీట్లు రాకుండా చేయడానికే కదా. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వరద సహాయం పేరుతో అక్రమాలు చేశారు’’ అని అన్నారు.అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ, ‘‘ కార్యకర్తలు కసితో పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు మాయమాటలు చేబుతూనే వస్తున్నారు. బిర్యాని వస్తుందని పలావు పెట్టే వారిని ఓడించారు. ఇప్పుడు పలావు, బిర్యానీ రెండూ లేవు. వంద రోజుల్లో ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. గుడ్ బుక్ రాస్తాం.. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాడటం మొదలు పెడతాం’’ అని పేర్కొన్నారు. -
టీడీపీ దాడి.. ఎవ్వరిని వదిలేది లేదు
-
YSRCP ఆఫీస్ కూల్చివేతపై ధర్మాన ఫైర్
-
హత్య రాజకీయాలు.. బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్
-
షర్మిల కామెంట్స్ కు ధర్మాన కౌంటర్
-
నరసన్నపేటలో కొనసాగనున్న సామాజిక సాధికార యాత్ర
-
‘ఏపీ ప్రయోజనాలు కోసం మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా టెక్కలిలో కృష్ణదాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది. అండగా జగనన్న ఉన్నారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి’’ అని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. చదవండి: ‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి’ -
అలాంటి వాళ్లను చంద్రబాబు అంటాం: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్ పోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం జగన్ కోరారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతందిని సీఎం జగన్ తెలిపారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుంది. సివిల్ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ ఇస్తాం. ప్రతి కమతానికి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తాం. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లోనే దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ సర్వే చేస్తున్నాం. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించాం. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టాం. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతుల చేతుల్లో పెడతాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. మన గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎవరూ మోసం చేయడానికి వీళ్లేకుండా వ్యవస్థను మార్చుతున్నాం. లంచాలకు ఎక్కడా తావులేదు అని సీఎం జగన్ పేర్కొన్నారు. పాలనలో విప్లవాత్మక మార్పులు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. కుప్పం సహా 25 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. మూడు ప్రాంతాలు బాగుపడేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలుంటే ప్రస్తుతం మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. రైతన్నల కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ దుష్టచతుష్టయాన్ని ఏమనాలి? తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారు. కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటాం. ఎన్నికలపుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసేది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దుష్టచతుష్టయాన్ని ఏమనాలి?. మోసం చేసే చంద్రబాబులాంటి వారికి మళ్లీ అధికారం ఇవ్వొద్దు. పరాయి వాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడు అంటారు. పరాయి స్త్రీమీద కన్ను వేసి ఎత్తుకుపోతే రావణుడు అంటారు. రావణుడిని సమర్థించినవాళ్లను రాక్షసులు అంటున్నాం. దుర్యోధనుడిని సమర్థించిన వారిని దుష్టచతుష్టయం అంటాం. మామకు వెన్నుపోటుపొడిచి సీఎం కుర్చీని లాక్కుని, ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని సమర్థిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, పవన్‌ను మరి ఏమనాలి? అని సీఎం జగన్ ప్రశ్నించారు. నిర్విరామంగా మహాయజ్ఞం రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించారు. 2,797 మంది వీఆర్ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం జగన్ రైతులకు అందించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ మాటలకు చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టింది
-
నరసన్నపేట పర్యటనకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం(నరసన్నపేట): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న నరసన్నపేటకు రానున్నారని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్‌లు తెలిపారు. తొలుత 25న వస్తారని అనుకున్నా రెండు రోజులు ముందుగానే పర్యటన ఖ రారైందని వీరు తెలిపారు. ఈ మేరకు గురువారం హెలీప్యాడ్, సభాస్థలి కోసం కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ జీఆర్ రాధికలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణదాస్ స్థల పరిశీలన చేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానం వద్ద విలేకరులతో మాట్లాడారు. 23 ఉదయం 10గంటలకు జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష (రీసర్వే) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, జమ్ము వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జమ్ము కూడలి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కళాశాల మైదానం వరకూ సీఎం రోడ్ షో ఉంటుందని అన్నారు. సభా ఏర్పాట్లను గురువారం రాత్రి నుంచే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఆర్డీఓ బి.శాంతి, ఎంపీపీ ఆరంగి మురళి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు, నరసన్నపేట సర్పంచ్ బూరల్లి శంకర్ పాల్గొన్నారు. చదవండి: (హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ) -
CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్ జగన్!
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఏదో ఒక చోట జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష (రీ సర్వే) రెండో విడత పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి సీసీఎల్ఏ నుంచి కలెక్టర్ శ్రీ కేష్ బి.లాఠకర్‌కు ప్రాథమిక సమాచారం చేరింది. ఇదే అంశంపై శనివారం సాయంత్రం నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో కలెక్టర్ లాఠకర్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల విషయాన్ని ఈ సందర్భంగా చర్చించారు. తామరాపల్లిలో సభ నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సభ నిర్వహణ ఏర్పాట్లు, హెలీ పాడ్, తదితర అంశాలను సోమవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరులో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన, ఉద్దానం మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలను కూడా కలెక్టర్‌తో కలిసి చర్చించారు. ఈ భేటీలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రాజాపు అప్పన్న, ముద్దాడ బైరాగి నాయుడు, చింతు రామారావు, కణితి కృష్ణారావు, త్రినాథ్ తదితరులు ఉన్నారు. చదవండి: (పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్) -
పాదయాత్రను ఉత్తరాంధ్రవాసులు అడ్డుకుంటారు
నరసన్నపేట: అమరావతి పేరుతో ఒక సామాజిక వర్గ ఆర్థిక ప్రయోజనాలు కాపాడటానికి టీడీపీ నేత చంద్రబాబు కుత్సిత రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు తగిన బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ఆయన సోమవారం నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి–అరసవల్లి పేరుతో చేపడుతున్న పాదయాత్ర బూటకమన్నారు. ఈ పేరుతో ఉత్తరాంధ్రలోకి వచ్చి, ఇక్కడివారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధిచెప్పడం ఖాయమని హెచ్చరించారు. పాదయాత్రను ఉత్తరాంధ్ర వాసులు అడ్డుకుని తీరుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అయితే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధికి నోచుకుంటుందని, అలాగే కర్నూలు, విజయవాడ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి విడిపోయి రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. మళ్లీ విభజన నినాదాలు వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, రాష్ట్రం ఆర్థికంగా వెనకబడుతుందని చెప్పారు. -
సీఎం జగన్ పేదవాడి సొంతింటి కలను సాకారం చేశారు: ధర్మాన
-
వ్యవసాయానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
-
సీఎం జగన్‌కు మంచి పేరు వస్తోందని టీడీపీ కుట్రలు: అసెంబీల్లో మంత్రి కృష్ణదాస్
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు 29.18 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అసెంబ్లీలో గురువారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో 71,811 ఎకరాల భూ సేకరణ జరిగిందన్నారు. పేదలకు సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం అన్నారు. కుల,మతాలకు అతీతంగా అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందన్నారు. సంక్షేమ పథకాలకు టీడీపీ మోకాలడ్డుతోందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చారిత్రాత్మక పథకం. ఈ పథకానికి సహకరించకపోగా టీడీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు దక్కకుండా అడ్డుకుంటున్నారు. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తోందని టీడీపీ కుట్రలు చేస్తోంది. కోర్టులు స్టేలు తెచ్చి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని’’ మంత్రి కృష్ణదాస్ మండిపడ్డారు. -
టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న ధర్మాన
-
సంస్కారం లేని వ్యక్తి అయ్యన్న పాత్రుడు: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడి హేయమైన చర్య అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అయ్యన్న పాత్రుడికి పిచ్చి మరింత ముదిరిందని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు సంస్కారం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడికి ప్రజలే గుణపాఠం చెబుతారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తిరుపతి: దళితులను కించపరచటం టీడీపీ డీఎన్ఏలోనే ఉందని.. నిన్నటి ఘటనపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ పెయిడ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. అనంతపురం: మైనారిటీల పట్ల చంద్రబాబుది కపట ప్రేమ అని.. ఆయన ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. కోడెల శివ ప్రసాద్‌రావు మరణానికి చంద్రబాబే కారణమన్నారు. ప్రజాస్వామ్యం గురించి మట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చదవండి: అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం -
రైతులకు ఆత్మస్థయిర్యం కలిగించిన వ్యక్తి వైఎస్ఆర్ మాత్రమే
-
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు ఇప్పుడు రైతులు గుర్తుకు వచ్చారా?
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 27 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్కే పోయిందని, అయినా సీఎం జగన్ చెప్పిన ఏ మాటను వెనక్కి తీసుకోకుండా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆదాయం లేకపోయినా అప్పు చేసైనా రైతులను ఆదుకోవాలని ఆయన భావించారని, అందుకు నిదర్శనమే రైతు భరోసా కింద రూ. 17,030 కోట్లు రైతులకు చెల్లించడం, పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అయితే చంద్రబాబు కొత్తగా రైతు ఆందోళనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన హయాంలో రైతులను విస్మరించి ఈ రోజు రైతు కోసం అంటూ రావడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. రుణమాఫీ, 9 గంటల విద్యుత్ సరఫరా, 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని గతంలో రైతులకు మాయమాటలు చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు మళ్లీ రైతులు గుర్తుకు వచ్చారా అని ఎద్దేవా చేశారు. అసలు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి అధికారం పోయాక రైతు కోసం పోరాటం అనడం వింతగా ఉందని, దీన్ని ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. చదవండి: రైతుకోసం కాదు.. రైతుమోసం కోసం టీడీపీ -
పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్ చేసుకుంటే మంచిదని హితవు పలికారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, వైఎస్ జగన్‌తో పవన్ పోల్చుకోకుండా ఉంటే మంచిదన్నారు. ‘‘పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతీ గ్రామాన్నీ తిరిగిన నాయకుడు వైఎస్ జగన్. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న నేత జగన్.. ప్రజల్లో లేరంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరు. ఆయనకు పోటీ ఎవరూ లేరు. జగన్‌కు జగనే సాటి. సీఎంను విమర్శించే ముందు పవన్, లోకేష్ విజ్ఞతతో ఆలోచించాలని ధర్మాన కృష్ణదాస్ హితవు పలికారు. ఇవీ చదవండి: చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ -
రిజిస్ట్రేషన్ శాఖలో రూ.10 కోట్ల అవకతవకలు జరిగాయి: ధర్మాన
-
నకిలీ చలాన్ల కలకలం.. తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం
విజయవాడ: ఏపీలో నకిలీ చలాన్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఏపీలోని 9 జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. ఈ ఘటనపై 10 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో భాగస్వాములుగా ఉన్న ప్రతి అధికారి, ఉద్యోగిపైనా చర్యలు తీసుకుంటామని కృష్ణదాస్ అన్నారు. తమ తనిఖీల్లోనే ఈ నకిలీ చలాన్ల వ్యవహారం బయటపడిందని, ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. -
పీవీ సింధుకు విజయవాడలో గ్రాండ్ వెల్ కమ్
సాక్షి, విజయవాడ: పీవీ సింధుకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఇతర అధికారులు, క్రీడాకారులు సింధుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్ వెళ్లేముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపింది. ఒలింపిక్స్‌లో పతకం తేవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సింధు నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిన్న వయసులోనే రెండు మెడల్స్ తీసుకురావటం దేశానికి గర్వకారణమని కొనియాడారు. యువతకి సింధు రోల్ మెడల్‌గా నిలుస్తుందన్నారు. సింధును ఆదర్శంగా తీసుకొని యువత భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఇక విశాఖలో అకాడమీ కోసం సింధుకి సీఎం జగన్ రెండు ఎకరాలు భూమి ఇచ్చారని గుర్తుచేశారు. -
సమన్యాయంతో సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారు
సాక్షి, శ్రీకాకుళం: నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. చంద్రబాబు హయాంలో నోరున్న వారికే పదవులు ఇచ్చారన్నారు. సమ న్యాయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శంగా నిలిచారన్నారు. ఏ అభివృద్ధికీ నోచుకోని వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారని మంత్రి కృష్ణదాస్ కొనియాడారు. మహిళలకు సముచిత స్థానం కల్పించారు: మంత్రి అప్పలరాజు నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని మంత్రి అప్పలరాజు అన్నారు. అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించారన్నారు. సామాజిక న్యాయ సాధన దిశగా సీఎం జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50.40 శాతం పదవులు దక్కాయని మంత్రి అప్పలరాజు అన్నారు. ఏపీలో సామాజిక న్యాయం: మంత్రి శంకర్‌నారాయణ అనంతపురం: ఏపీలో సామాజిక న్యాయం జరుగుతోందని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. మహిళలకు అత్యధిక పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. సీఎం జగన్ పాలనతో బాబు బెంబేలెత్తుతున్నారని శంకర్ నారాయణ ఎద్దేవా చేశారు. -
నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత
-
ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ల సమావేశం
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. సమగ్ర భూ సర్వే, ఇళ్ల స్థలాలు, నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. అంతే కాకుండా ప్రభుత్వ విప్‌లు ఎమ్మెల్యేల వినతులు, ఫిర్యాదులను పరిశీలించారు. చదవండి: బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలి: సజ్జల -
వివాదాలు లేకుండా వైఎస్సార్ జగనన్న భూరక్ష
మంగళగిరి (దుగ్గిరాల): రాష్ట్రంలో ఎక్కడా భూవివాదాలు లేకుండా పరిష్కరించేందుకే వైఎస్సార్ జగనన్న భూరక్ష రీసర్వే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో భూరక్ష రీసర్వే పైలట్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి భూములకు సరిహద్దుల సర్వే రాయిని పాతారు. ఈ సందర్భంగా సర్వేపై రైతుల అభిప్రాయాలను తెలుసుకోగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ.. 114 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, నాటి నుంచి ఇప్పటివరకు సర్వే నిర్వహించకపోవడంతో భూముల వివాదాలు అధికమయ్యాయన్నారు. రూ.1,000 కోట్లతో మూడు విడతలుగా రాష్ట్రం మొత్తం సర్వే నిర్వహిస్తామన్నారు. తద్వారా స్పష్టమైన రికార్డులు తయారుచేయడమే భూరక్ష లక్ష్యమన్నారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి.. ఎక్కడా వివాదాలు లేకుండా సుశిక్షితులైన అధికార యంత్రాంగంతో సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా భూవివాదాల్లో సరిహద్దులే వివాదాలుగా ఉంటాయని, వాటిని పూర్తిగా పరిష్కరించడం, ప్రభుత్వ ఖర్చుతోనే వివాదాలు లేకుండా చేయడం ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), అన్నాబత్తుని శివకుమార్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, ల్యాండ్ రికార్డ్స్, సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ దినేష్‌కుమార్, ఆర్డీవో భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో మహిళా విజయగాధ పేరిట కార్యక్రమం
-
పవన్ కల్యాణ్ స్పష్టత లేని రాజకీయాలు చేస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం : జనసేన అధినేత, సినిమా హీరో పవన్ కల్యాణ్ స్పష్టత లేని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ బాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తా ఏమిటో ఈ ఎన్నికల ద్వారా తెలిసింది. గత పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం గెలుచుకుంటే ఈ ఎన్నికల్లో 98 శాతం వైఎస్సార్ సీపీ గెలిచింది. చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. పరిపాలనా రాజధానికి ప్రజలు మద్దతు తెలిపారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌పై తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. బాబు తప్పుడు ప్రచారం వలన గాజువాకలో కొంత గట్టి పోటీ ఎదుర్కొన్నాము’’ అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం : ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం : ‘‘ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం. ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు. ఎన్నికలు ఎలాంటివైనా సరే వైఎస్సార్ సీపీదే విజయం అని తేలిపోయింది. 20 నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సంక్షేమ పాలనతో గొప్ప సీఎంగా నిలిచిపోయారు. మూడు రాజధానులకి ప్రజలంతా మద్దతు పలికారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం. టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. చంద్రబాబు ఇప్పటికైనా తన ఓటమిని హుందాగా అంగీకరించాలి. కుయుక్తులతో రాజకీయాలు నడపాలి అనుకునేవారికి ప్రజలు తమ ఓటుతోనే చావు దెబ్బ కొట్టారు.’’ చదవండి : బేవర్స్ రాజకీయాలు చేసే వ్యక్తి సబ్బం హరి -
ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి :మంత్రి కన్నబాబు
-
ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదు
శ్రీకాకుళం : 'అమరావతి నీకు..నీ చుట్టూ ఉన్న కోటరికి అవసరం. అమరావతి కంటే వెనుకబడిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లా నీకు గుర్తులేదా' అని డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ చంద్రబాబుపై మండిపడ్డారు. విశాఖపట్నం రాజధాని దేనికి అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడని, ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదని ధర్మాన ఫైర్ అయ్యారు. 'ఉత్తరంధ్రాలో సాగునీరు లేక ఏండిన పొలాలను ఏనాడైనా చూశావా?నీ ఐదేళ్ళ పాలనలో వంశధార ప్రాజెక్టును పూర్తి చేయ్యగలిగావా? గిరిజన గ్రామాల్లో రహదారులు లేక వైద్యం కోసం అల్లాడిన పేదలు భాధలు ఏనైడా ఆర్ధమయ్యాయా?నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడవనే ప్రజలు నీకు 23 సీట్లకు పరిమతం చేశారు. ఆ భగవంతుడే నిన్ను శిక్షించాడు' అని డిప్యూటీ సిఎం ధర్మాన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాల సమస్యలు తెలుసుకుని... వికేంద్రీకరణ ద్వార మూడు రాజధానులు పెట్టిన గొప్ప మనసున్న నాయకుడు సిఎం జగన్ అని ప్రశంసించారు. అనంతపురం: మున్నిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం ఖాయమని ఎమ్మెల్యే అనంత వెంటరామిరెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ ఫలితాలు ఈ ఎన్నికల్లో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓటమికి కారణాలు వెతుక్కుంంటున్నారని, వరుస ఓటములతో చంద్రబాబు, లోకేష్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరిందని, జగన్ అద్భుతమైన పరిపాలనకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. 140 కోట్ల రూపాయల తో రోడ్లు నిర్మించామని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, అనంతను స్మార్ట్ సిటీగా మార్చబోతున్నామని తెలిపారు. చదవండి : (ఎంపీ కేశినేనిని దూరంపెట్టిన చంద్రబాబు..) (మహిళపై చేయిచేసుకున్న అశోక్ గజపతి రాజు) -
‘టీడీపీ నిర్వాకం వల్లే రోడ్లన్నీ గుంతలు’
సాక్షి, శ్రీకాకుళం: గతంలో టీడీపీ నిర్వాకం వల్లే రోడ్లన్నీ గుంతలతో ఉన్నాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బిల్లులను పెండింగ్‌లో పెట్టడం వల్లే ఇప్పుడు అవస్థలు పడుతున్నామని తెలిపారు. భవిష్యత్ ప్రణాళిక కోసమే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: ‘జూమ్‌లో చంద్రబాబు.. ట్విట్టర్లో లోకేష్’) విద్యుత్ వినియోగానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా రైతుల నుండి వసూలు చేయం అని మంత్రి స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియడం లేదని ధ్వజమెత్తారు. తమకు ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, ఐదేళ్లు పాలన చేసిన తర్వాత అప్పుడు విమర్శలు చేయాలన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్లో ఒక్కటైనా గతంలో మీరు ఆలోచన చేశారా అని మంత్రి కృష్ణదాస్ ప్రశ్నించారు.(చదవండి: ‘పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు’) -
భూ సర్వే: ఏ చిన్న సమస్య ఉండకూడదనే ..
సాక్షి, అమరావతి : భూముల రీ సర్వే నిర్ణయం చారిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. 2023 జూలై నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భూమి అంశంలో ఏ చిన్న సమస్య ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ పాదయాత్రలో భూ వివాదాలపై అనేక ఫిర్యాదులు అందాయని ప్రస్తావించారు. భూ సర్వే ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమమని.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించినా ప్రైవేట్ సంస్థల వలన అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. చదవండి: ‘సవరించిన అంచనాలను ఆమోదించండి’ ఈసారి మేము సర్వే ఆఫ్ ఇండియా తో కలిసి పని చేస్తున్నాం .స్థిరాస్తులు అన్ని సర్వే చేస్తాం. గ్రామ సచివాలయాల్లో ఈ భూ రికార్డులు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి రైతులకు అండగా నిలుస్తాం. చట్టబద్ధమైన, న్యాయమైన హక్కులు చేకూరుతాయి అని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ అంశం పై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. అత్యాధునిక సాంకేతికతతో సర్వే నిర్వహిస్తాం. ప్రజలతో పాటు, ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాం’ అని తెలిపారు. -
భూ తగాదాలు లేకుండా భూ హక్కు
-
అసెంబ్లీకి కీలక బిల్లులు
సాక్షి, అమరావతి: శాసనసభలో బుధవారం మంత్రులు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. ఏపీ విద్యుత్ సుంకం సవరణ (ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్) బిల్లును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నియంత్రణలో భాగంగా తెచ్చిన దిశ బిల్లు సవరణ చట్టాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ బిల్లు – 2020ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రతిపాదించారు. పలు బిల్లుల ఆమోదం: రాష్ట్రంలో 10 వేల మెగావాట్లతో ఏర్పాటు చేస్తున్న సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి కోసం ఏపీ అసైన్డ్ భూముల చట్టం సవరణ బిల్లును రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందింది. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యవసాయ మండలి బిల్లును సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను (రెండో సవరణ) బిల్లు, వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలపై పన్ను విధింపు సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను (మూడో సవరణ) బిల్లులను అబ్కారీ, వాణిజ్య పన్నులశాఖ మంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు పాస్ అయ్యాయి. పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టిన పశువుల మేత (తయారీ, నాణ్యత, అమ్మకం, పంపిణీ క్రమబద్ధీకరణ) బిల్లును సభ ఆమోదించింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించే బిల్లును మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలో రైతులు తమ భూములను ఆ ప్రాజెక్టులకు లీజుకు ఇచ్చుకునే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు. -
‘రెండేళ్లు గడవక ముందే.. ఆ ఘనత ఆయనదే..’
సాక్షి, శ్రీకాకుళం: అధికారం చేపట్టి రెండేళ్లు కూడా గడవక ముందే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 92 శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. (చదవండి: స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం) ‘‘రూ.3,000 కోట్ల వ్యయంతో 8 ఫిషింగ్ హార్బర్లు, రూ. 225 కోట్ల వ్యయంతో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్ నిర్మాణం, మొదటి విడతగా నాలుగు ఫిషింగ్ హార్బర్ లు, 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి కూడా వాటికి శంకుస్థాపన చేశారని’’ ఆయన చెప్పారు. (చదవండి: ‘సీఎం జగన్‌కు మత్స్యకారులు రుణపడి ఉంటారు’) శ్రీకాకుళం జిల్లాలో ఉన్న విశాలమైన 193 కిలోమీటర్ల సముద్ర తీరానికి కూడా అన్ని రకాలుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగానే భావనపాడు పోర్టు నిర్మాణం, మూడు మూడు చోట్ల జట్టీ ల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కృష్ణదాస్ తెలిపారు. -
'దొడ్డి దారిన పదవి పొందిన దద్దమ్మవి నువ్వు'
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా పాలన చేస్తున్నారని జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో జిల్లా నుంచి ఎన్నికైన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లకు మంగళవారం డిప్యూటీ సీఎం ధర్మాన చేతుల మీదుగా ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, వేణుగోపాల కృష్ణ.. ఎంపీలు వంగా గీతా, గొట్టేటి మాధవి.. ఎమ్మెల్యే లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి, సతీష్ కుమార్, ధనలక్ష్మి పాల్గొన్నారు. (దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి గ్రామస్తులు) ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఏడాదిన్నర పరిపాలనలోనే దేశంలోని సమర్ధవంతమైన ముఖ్యమంత్రుల్లో సీఎం వైఎస్ జగన్ మూడో స్థానాన్ని సంపాదించారు. రానున్న రోజుల్లో సీఎం జగన్ మొదటి స్థానంలోకి వెళ్తారని ఆశిస్తున్నాము' అని అన్నారు. పర్యటనలో భాగంగా మంత్రి రూ.10కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దొడ్డి దారిన పదవి అనుభవించిన దద్దమ్మవి నువ్వు జగన్‌ని విమర్శించే నైతిక విలువలు నీకు లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. -
ఫైర్ సిబ్బంది సేవలను ప్రశంసించిన హోంమంత్రి
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 12 ఫైర్ స్టేషన్లు ఉన్నాయన్నారు. శ్రీకాకుళం నగరంలో హోంమంత్రి మేకతోటి సుచరిత గురువారం ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక పరికరాలను, సిబ్బంది పనితీరును హోంమంత్రి పరిశీలించారు. నూతన ఫైర్ వెహికల్‌ను సుచరిత జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం ఫైర్ స్టేషన్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని ఆమె సన్మానించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, కంబాల జోగులు, కళావతి, గొర్లే కిరణ్ కుమార్‌లు పాల్గొన్నారు. చదవండి: అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత మీడియాతో హోంమంత్రి మాట్లాడుతూ.. వివిధ కారణాల వల్ల జిల్లాలో 200లకు పైగా అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. అగ్ని ప్రమాదాల వలన దాదాపు రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. అగ్నిప్రమాదాల బారి నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆస్తిని కాపాడటం జరిగిందని, వివిధ అగ్నిప్రమాదాల నుంచి 15 మందిని ప్రాణాలతో కాపాడినట్లు తెలిపారు. ఎక్కడ విపత్తులు జరిగినా ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి సహాయం చేస్తున్నారని, కచులూరు బోట్ ప్రమాదం, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో జరిగిన వరద ప్రమాదాల్లో ఫైర్ సిబ్బంది ఎన్నో సేవలందించారని ప్రశంసించారు. ప్రమాదాల నుంచి మనుషులతో పాటు పశువులను కూడా ప్రాణాలతో కాపాడిన ఘటనలు ఉన్నాయని, ప్రాణాలకు తెగించి విపత్తు సేవలందిస్తున్న ఫైర్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో 84 స్కోచ్ అవార్డులలో మన రాష్ట్ర పోలీస్ శాఖ 48 అవార్డులు దక్కించుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖకు అనేక అవార్డులు వచ్చాయని ప్రస్తావించారు. చదవండి: రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే హత్య! అగ్నిప్రమాదాలు చాలా వరకు తగ్గాయి ‘పోలీస్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్లు టెక్నాలజీ సహాయంతో ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా ఫైర్ డిపార్టమెంట్ సన్నాహాలు చేస్తోంది. గతంలో ఎండాకాలం వచ్చిందంటే పూరి గుడిసెల్లో ఫైర్ ఆక్సిడెంట్లు విపరీతంగా జరిగేవి. ఇప్పుడు అలాంటి అగ్నిప్రమాదాలు చాలా వరకు తగ్గాయని చెప్పొచ్చు. దీనికంతా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి ఫలితమే అని చెప్పాలి. వైఎస్సార్ పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వడం వలన అగ్నిప్రమాదాలు చాలా తగ్గాయి. భవిష్యత్తులో ఫైర్ డిపార్ట్మెంట్ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను.’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అడిషనల్ డీజీ మహమ్మద్ అసన్ రేజా, జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృప వరం, కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య, డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లు పాలవలస విక్రాంత్, పిరియా సాయిరాజ్ ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి ధర్మానతో రెవెన్యూ ఉద్యోగుల భేటీ
సాక్షి, విజయవాడ: రెవెన్యూ ఉద్యోగులు క్షేత్రస్థాయి సమస్యలపై డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో మంగళవారం భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన విషయాలను రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. 'రెవెన్యూ ఉద్యోగుల క్షేత్రస్థాయి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీ సర్వే చేపడుతోంది. అది ముగిసేవరకు రెవెన్యూ ఉద్యోగులకు వేరే విధులు కేటాయించొద్దని కోరాం. క్రమశిక్షణ చర్యలకు గురైన ఉద్యోగులపై శాఖాపరమైన విచారణ జరపకుండా కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగుల సర్వీస్ పూర్తయిన విచారణలు పూర్తికాక పెన్షన్ కూడా అందుకోలేని పరిస్థితి ఉంది. వీటిపై దృష్టిసారించి వీలైనంత త్వరగా విచారణలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరాం. తహశీల్దార్లుకు నిధులు పూర్తి స్థాయిలో రాక.. వారు పడుతున్న ఇబ్బందులను వివరించినట్లు' బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. (సీఎం జగన్‌ను కలవనున్న దివ్య పేరెంట్స్) -
‘అంతర్వేది’ రథ నిర్మాణం ప్రారంభం
మలికిపురం: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటీవల దగ్ధమైన రథం స్థానంలో నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానార్చకుడు పి.కిరణ్, అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పనులు ప్రారంభించారు. రథం తయారీకి వినియోగించే టేకు కలపకు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సుమారు రూ. కోటి వ్యయంతో ఈ రథాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే రథం తయారీకి అవసరమైన ఖరీదైన బస్తర్ టేకు కలపను రావులపాలెంలో కొనుగోలు చేసి, ఆలయం వద్దకు తరలించారు. ► రథం పనులు నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుతూ ఆలయం ఎదుట ఉన్న కల్యాణ మండపంలో తొలుత శ్రీ సుదర్శన నారసింహ మహాశాంతి హోమం వైభవంగా నిర్వహించారు. ► మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. రానున్న స్వామివారి కల్యాణోత్సవాల నాటికి ఎటువంటి ఆటంకాలూ లేకుండా రథం తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ► కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎంపీ అనురాధ, ఎమ్మెల్యేలు రాపాక, సతీష్‌కుమార్, చిట్టిబాబు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
-
కేఆర్ స్టేడియం పనులపై ఆరా
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకే తలమానికమైన కోడి రామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలెక్టర్ జె.నివాస్‌తో కలిసి మంగళవారం ఆయన స్టేడియం పనుల ను స్వయంగా పరిశీలించారు. పనుల తీరు తెన్నులను చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్‌కుమార్, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మైదానం బ్లూప్రింట్, స్టేడియం డిజైన్‌ను పరిశీలించారు. స్టేడియంలో నిర్మితమవుతున్న రెండు ఫోర్లలో పలు ఇండోర్ క్రీడాంశాల్లో ఆటలు ఆడేందుకు వీలుగా డిజైన్ చేసినట్టు చీఫ్ కోచ్ వివరించారు. ఈ స్థలానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణానికి ఎంతో ప్రత్యేకత ఉందని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. ఇక్కడే ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అద్భుతమై న ఫలితాలు సాధించారని గుర్తుచేశారు. తాను కూడా ఓ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడిని కావడంతో క్రీడల లోటుపాట్లు, క్రీడాకారుల సమస్యలు, క్రీడాసంఘాల ఇబ్బందులు తనకు తెలుసునని పేర్కొన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అ సోసియేషన్ అధ్యక్షుని హోదాలో ఎప్పటికప్పుడు క్రీడా సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నానని అన్నారు. నిధుల రాకలో జాప్యం.. కోడి రామ్మూర్తి స్టేడియం పనుల జాప్యంపై కృష్ణదాస్ ప్రతిస్పందించారు. రూ.15 కోట్ల నిధులతో స్టేడియం పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వాస్తవానికి ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే స్టేడియం రీ డిజైనింగ్, ఉడా నుంచి రావాల్సిన నిధుల జాప్యం వల్ల ప నులు ఆలస్యంగా జరుగుతున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఉడా కాస్త సుడాగా మారడంతో నిధులు జాప్యానికి కారణం అయిందన్నారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.. త్వరలో అన్ని సమస్యలను అధిగమించి, అంతర్జాతీయ హంగులతో పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా కేఆర్ స్టేడియాన్ని ప్రారంభించేందుకు యోచిస్తున్నట్టు కృష్ణదాస్ చెప్పారు. త్వరలో క్రీడా సంఘాలతో చర్చించేందుకు భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తద్వారా క్రీడల అభివృద్ధికి అన్ని క్రీడా సంఘాలను కలుపుకునిపోయేందుకు సరికొత్త కార్యాచరణకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఒలింపిక్ భవన్ కోసం రూ.లక్ష అందజేత ఒలింపిక్ భవన్ కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు వ్యక్తిగతంగా అందజేస్తానని గతంలో కృష్ణదాస్ హామీ ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన హామీ మేరకు మంగళవారం ఒలింపిక్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు మాస్టారుకి లక్ష రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో సెట్‌శ్రీ సీఈఓ జి.శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ శ్రీనివాస్‌కుమార్, పీఈ టీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమణ, హ్యాండ్‌బాల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్, జూడో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెంటాడ స్వరూప్, వైఎస్సార్ సీపీ నా యకులు ఎన్ని ధనుంజయరావు, క్రీడాసంఘాల ప్రతినిధు లు, శాప్ డీఎస్ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా వారి న్యాయపరమైన డిమాండ్లను వివరిస్తూ కోచ్‌లు డిప్యూటీ సీఎంకు కృష్ణదాస్‌కు వినతిపత్రాలు అందజేశారు. -
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు
సాక్షి, శ్రీకాకుళం : రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని ఉపమఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఏడాది పాలనలో అనేక చట్టాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే అని కొనియాడారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, తనకు ఓటు వేయకపోయినా ప్రభుత్వ పథకాలు అందించండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బాబు హయాంలో గత ఐదేళ్లలో రాష్ర్టంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా కరోనాపై విస్తృత అవగాహన కల్పిస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్నామని, కరోనా కష్టకాలంలోనూ ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీదేనని అన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనాపై ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు సమీక్షా సమావేశం ఉంటుందని ధర్మాన వెల్లడించారు. జిల్లా వెనకబాటు తనంపై జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపారని, మనందరం కలిసి సమిష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. -
సీఐ సస్పెన్షన్‌పై టీడీపీ విషప్రచారం
సాక్షి, శ్రీకాకుళం: పలాస మండలం టెక్కలి పట్నంకు చెందిన రమేష్, జగన్ అనే యువకుల మధ్య వారి గ్రామంలో మంగళవారం గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇద్దరిని మందలించి పంపడానికి పోలీసులు ప్రయత్నించారు. వారిని మందలించే క్రమంలో సీఐ వేణుగోపాల్ అదుపుతప్పి జగన్ అనే దళితుడిని బూటుకాలితో తన్నారు. దీనిని కొందరు వ్యక్తులు ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో డీజీపీ కార్యాలయానికి ఈ సమాచారం చేరడంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. మంగళవాం రాత్రే సీఐని సస్పెండ్ చేయాల్సిందిగా డీఐజీకి డీజీపీ ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తామే ఏదో ఈ ఘటనను బయటకు తీసినట్లుగా టీడీపీ ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వంపై విషప్రచారానికి పూనుకోవడం గమనార్హం. (సీఐ వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు) ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను: ధర్మాన శ్రీకాకుళం జిల్లాలో దళితుడిపై జరిగిన దాడి గురించి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితునిపై సీఐ దాడికి దిగడం బాధాకరం. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యుడైన సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చాము. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రాథమిక నివేదిక అందజేయాలని విశాఖ రేంజ్ డీఐజీ, శ్రీకాకుళం ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇచ్చాం. దళితుల రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని మంత్రి ధర్మాన తెలిపారు. -
ఇది చంద్రబాబుకు బ్లాక్ డే: ధర్మాన
సాక్షి, విజయవాడ: ఉత్తరాంధ్ర వెనుకబాటుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిష్కారం చూపారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. శనివాకరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. విశాఖ పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం జగన్ ఉత్తరాంధ్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశారన్నారు. చంద్రబాబు ఒక్కరికే ఇది బ్లాక్ డే అని ధర్మాన పేర్కొన్నారు. -
సీఎం జగన్ అధ్యక్షతన బ్యాంకర్ల కమిటీ భేటీ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ 211వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ సీజీఎం సుధీర్‌కుమార్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేశ్‌కుమార్ గార్డ్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. '2020–21 సంవత్సరంలో రుణాల లక్ష్యం 2,51,600 కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.78 శాతం అధికం. వ్యవసాయరంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.9శాతం అధికం. 2019–20 రుణప్రణాళికలో 99.42 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు)కు రూ.39,600 కోట్ల రుణాలు ఇవ్వాలని భావిస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే 10 శాతం అధికం. విద్యా రుణాల కింద రూ.1,900 కోట్లు, ఇళ్ల రుణాల కింద రూ.9,710 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.410 కోట్లు ఇవ్వాలని లక్ష్యం. పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్ ఎనర్జీ) రంగానికికి రూ.454 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణకు రూ.3,400 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొత్తం మీద ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు ఇవ్వాలని భావిస్తుండగా.. ఇది గత ఏడాదితో పోలిస్తే 10.88 శాతం అధికం. ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.75 శాతం అధికం' అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సమావేశంలోని మఖ్యంశాలు.. ►రైతులకు సున్నా వడ్డీ సకాలంలోనే ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఖరీఫ్ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును రబీ నాటికి చెల్లిస్తామని, రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును ఖరీఫ్ నాటికి చెల్లిస్తామని, దీనికి సంబంధిచిన వివరాలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కోరారు. ►అలాగే గ్రామాల్లో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ తదితర ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీని కోసం తగిన సహాయం అందించాలని కోరారు. ►ప్రతి ఆర్బీకేలో ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి మండలానికీ కోల్డ్ స్టోరేజీ, కోల్డ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ►ఆర్బీకేల ద్వారా రైతు ఉత్పత్తుల సమాచారాన్ని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేసి వారి మార్కెటింగ్‌కు సహకారం అందిస్తామని సీఎం చెప్పారు. ► రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకూ తగిన సహకారం అందించాలని ఆర్థికశాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. గోదావరిలో వరద జలాలను వినియోగించుకోవడానికి బృహత్ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనికి తగిన విధంగా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ► కౌలు రైతుల రుణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని బ్యాంకర్లను కోరారు. -
‘ఆదాయ పత్రం’ గడువు నాలుగేళ్లకు పెంపు
సాక్షి, అమరావతి: బియ్యం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పరిగణించాలని, కార్డు లేని వారికి ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్ సర్టిఫికెట్) కాలపరిమితిని ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా శనివారం బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ ఈమేరకు ఫైలుపై తొలి సంతకం చేశారు. దీంతో బియ్యం కార్డుదారులు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని ఉండదు. ప్రజల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన ధర్మాన కృష్ణదాస్ శనివారం పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవివి. ►సీఎం వైఎస్ జగన్ కీలకమైన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు. సీఎం ఆశయ సాధన కోసం పనిచేస్తా. ►భూ వివాదాల పరిష్కారానికి భూముల సమగ్ర రీసర్వే చేపడతాం. ►పేదలందరికీ సొంతిల్లు ఉండాలనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం మేరకు ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వనున్నాం. ►రెవెన్యూ శాఖలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు అధికారులు సత్వర పరిష్కారాలు చూపాలి. ►రెవెన్యూ శాఖలో సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. బియ్యం కార్డు చాలు బియ్యం కార్డు ఉన్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలేవీ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శనివారం జీఓ జారీ చేశారు. జీఓలోని ముఖ్యాంశాలివీ.. ► ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇవి బియ్యం కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ కార్డులున్న వారిని దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలుగా పరిగణించాలి. ► ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు బీపీఎల్ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు నిర్వహించే ఎంపిక కార్యక్రమాలకు బియ్యం కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అడగరాదు. ► తెల్లరేషన్ కార్డు లేని వారికి అధికారులు ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం నాలుగేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఒరిజనల్ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి నోట్ చేసుకుని తక్షణమే సంబంధితులకు వెనక్కు ఇవ్వాల్సిందే. ► స్కాలర్ షిప్‌ల మంజూరు సమయంలో మాత్రమే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలి. రెన్యువల్‌కు వీటిని అడగరాదు. ► ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం ప్రభుత్వం జారీ చేసిన నమూ నాలో ప్రజలు రూ.10 నాన్ జ్యుడీషి యల్ స్టాంపు పేపరుతోపాటు మూడు కాపీలు తహసీల్దారు కార్యాలయంలో సమర్పించాలి. -
కలలో కూడా ఊహించలేదు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఉప ముఖ్యమంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఏనాడూ పదవుల్ని ఆశించలేదు. కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే కచ్చితంగా ఒక మంచి రోజు వస్తుందని భావించే వ్యక్తిని. పార్టీ కోసం మనం చేసే ప్రతి త్యాగం కౌంట్ అవుతుంది. వాటికి మన విశ్వసనీయత, విధేయత, నిజాయితీ, నిబద్ధత తోడైతే అదనపు బలం. నాకు ఈ పదవి వచ్చిందంటే ఇవన్నీ దోహదపడ్డాయని భావిస్తున్నాను. కీలకమైన రెవెన్యూ, స్టాంపుల శాఖ బాధ్యతలు త్వరలోనే స్వీకరించనున్నాను. ఉప ముఖ్యమంత్రిగా నాకు దక్కిన గౌరవం శ్రీకాకుళానికి, ఉత్తరాంధ్రకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. కొత్త జిల్లాల విభజన, మూడు రాజధానుల ఏర్పాటు పూర్తయిన తర్వాత అన్ని ప్రాంతాలకు అభివృద్ధి, వికేంద్రీకరణ ఫలాలు సమానంగా అందుతాయ’ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తన మనసులోని భావాలను ‘సాక్షి’ ముందు ఉంచారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ‘సాక్షి’కి తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి : డిప్యూటీ సీఎం కావడాన్ని ఎలా ఫీలవుతున్నారు? కృష్ణదాస్ : ఎమ్మెల్యేగా 2004లో మొదలైన నా ప్రజా జీవితం ఈ రోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరింది. అప్పుడు నా అవసరం ఉందని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ అరంగేట్రం చేయించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను, నా కుటుంబం చివరి శ్వాస వరకూ ఆయన వెంటే నడుస్తాం. జిల్లా ప్రజలు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన నరసన్నపేట నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారితోపాటు నేను కూడా. కృష్ణదాస్ ఏనాడూ పదవి ఆశించలేదు. అయినా వ్యక్తిత్వాన్ని గౌరవించి, నా మనసు గుర్తించి నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లారు. అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి అభిమానంతోనే నాకీ ఉన్నతమైన పదవి లభించింది. సాక్షి : మీకే ఆ పదవి ఇవ్వాలని జగన్మోహన్రెడ్డికి ఎందుకు అనిపించింది? కృష్ణదాస్ : పార్టీకి నమ్మకంగా పనిచేసే వారికి కచ్చితంగా ఒక మంచి రోజు వస్తుంది. కొంచెం ముందో.. తర్వాత కచ్చితంగా ఉన్నతమైన స్థాయి దక్కుతుంది. పార్టీ కోసం మనం ఏం త్యాగం చేసామన్నది కూడా కౌంట్ అవుతుంది. వీటికి తోడు విధేయత, విశ్వసనీయత, నమ్మకం, భరోసా, నిజాయితీ ఇవన్నీ అదనపు అర్హత లు. అవన్నీ నాలో ఉన్నాయని నేను భావిస్తున్నా. ఆయ న కూడా నాలో ఇవన్నీ చూసి ఉంటారు. అందుకే నాకీ స్థానం, స్థాయి కల్పించారని భావిస్తున్నాను. సాక్షి : రోడ్లు భవనాల శాఖ మంత్రిగా మీరు సంతృప్తి చెందారా? కృష్ణదాస్: సరిగ్గా ఏడాది కాలమవుతుంది. జిల్లాలో అత్యధి క మెజార్టీతో గెలవడం, మంత్రిగా ప్రమాణం చేయ డం, అతి ముఖ్యమైన రోడ్లు, భవనాల శాఖ నాకు అప్పగించడం చకాచకా జరిగిపోయాయి. ఐదేళ్లలో రూ. 6వేల కోట్లతో నా శాఖకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాం. అవన్నీ ప్రస్తుతం వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాకు సంబంధించి నా శాఖ పరిధిలో రూ. 300 కోట్ల వరకు పనులు చేసేందుకు వచ్చే ఏడాదిని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అవన్నీ టెండర్ల ప్రక్రియ దశలో ఉన్నాయి. శాఖను సమర్థంగా నడిపించామనే సంతృప్తి ఉంది. సాక్షి : కొత్తగా నిర్వహించబోయే రెవెన్యూ శాఖపై మీ అభిప్రాయం ఏమిటి? కృష్ణదాస్: రాష్ట్రాభివృద్ధిలో రెవెన్యూ శాఖదే కీలకం. అన్ని మంత్రిత్వ శాఖల కంటే ఇది చాలెంజింగ్ జాబ్. పూర్తి నిబద్ధతతో పనిచేస్తాను. జగన్ గారి ప్రతిష్ట , ప్రభు త్వం గౌరవం పెంచేలా పనిచేస్తాను. మిగిలిన వాళ్ల కంటే దాసన్నే గొప్పగా పనిచేశారనుకునేలా శాఖను నిర్వహిస్తా. నిజంగా ఇదొక చాలెంజ్. రెవెన్యూ మంత్రిగా కృష్ణదాసే మంచి చాయిస్ అనేలా పనిచేస్తాను. శాఖలో ఉన్న సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాను. సాక్షి : చాలెంజ్‌గా తీసుకోబోయే అంశాలు ఏమిటి? కృష్ణదాస్ : ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటి కి నూరు శాతం అమలు చేయాలి. కొత్త జిల్లాల ఏర్పా టు అనేది ఇప్పుడు మా ముందు ఉన్న పెద్ద టాస్క్. 2017లోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై మా పార్టీ ఒక నిర్ణయం ప్రకటించి మేనిఫెస్టోలో చేర్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్నది లక్ష్యం. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇంకా పేదలందరికీ ఇళ్ల అంశంలో మా శాఖ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇంకా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను కూడా నా పరిధిలో వస్తుంది. రాష్ట్ర రెవెన్యూలో ఈ శాఖ వాటాయే ఎక్కువ. ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తా. ఈ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా పనిచేస్తాం. సాక్షి : కీలకమైన ఈ పోస్టు రావడంపై మీ అభిప్రాయం? కృష్ణదాస్ : రాజకీయాల్లో శిఖరాలకు చేరాలంటే మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి విశ్వసనీయత, రెండు నిజాయితీ, మూడు నిబద్ధత. అవే నాకు ఈ పదవి రావడానికి దోహదపడ్డాయని నమ్ముతున్నా. ఒక నాయకుడికి మన మీద నమ్మకం ఉండటమే విశ్వసనీయత. అది మనపై ప్రజలు కూడా ఉంచాలి. మనకిచ్చిన పనిని పూర్తి చేయడం నిబద్ధత. కలలో కూడా నేను ఉపముఖ్యమంత్రిని అవుతానని ఊహించలేదు. జగన్మోహన్రెడ్డి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. సాక్షి : రెవెన్యూ మంత్రిగా జిల్లా కోసం మీరేం చేస్తారు ? కృష్ణదాస్ : శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రా జెక్టు వంశధారను చూడాలని ఉంది. ఇప్పటికీ అక్కడ భూసేకరణతో సహా రెవెన్యూ పరిధిలో చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్న అడ్డంకులను తొలగించి త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తాము. కీలకమైన భావనపాడు పోర్టు నిర్మాణంలో ఏ ఒక్కరూ నష్టపోకుండా చూడాలి. ఏ ప్రాజెక్టుకైనా భూసేకరణ ఇతర వ్యవహారాలు రెవెన్యూ పరిధిలోకి వస్తాయి. భూమిని ఇచ్చే వారు ప్రభుత్వం ఇచ్చే పరిహారం చూసి సంతోషంగా, స్వచ్ఛందంగా ఇచ్చేలా వ్యవస్థను రూపొందిస్తాం. సాక్షి : స్పీకర్, డిప్యూటీ సీఎం, మరొక మంత్రి పదవి శ్రీకాకుళం జిల్లాకే ఇవ్వడంపై మీ కామెంట్? కృష్ణదాస్ : 80శాతానికి పైగా బీసీలు ఉన్న జిల్లా మనది. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన జిల్లాగా పేరు పడ్డది. అలాంటి జిల్లాకు ఇంతటి ముఖ్యమైన, గౌరవ ప్రదమైన పదవులు రావడం నిజంగా శ్రీకాకుళం జిల్లాకు దక్కిన గౌరవంగా భావించాలి. కీలకమైన పదవుల్లో ఉన్న మేమంతా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి మా శాఖలు దోహదపడతాయి. -
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు.(మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం) సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు. శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. కాగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. వారు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.(కొత్త మంత్రులకు జనసేన ఎమ్మెల్యే అభినందనలు) -
సంతోషంగా బీసీలు
సాక్షి, అమరావతి: బీసీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని చూసి వారంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో బీసీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ అధ్యయన కమిటీని వేశారన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో, మహిళలకు పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ను సీఎం వైఎస్ జగన్ కల్పించారు. – స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. కేబినెట్లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. – ఈ నెల 20 బీసీలకు పండుగ రోజు. బీసీల సంక్షేమానికి 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 30 వేల జనాభా మించిన బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తాం. – కొత్తవాటితో కలుపుకుని బీసీల కోసం మొత్తంగా 52 కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ల ద్వారా గతంలో 69 కులాలనే పరిగణనలోకి తీసుకోగా, ఇప్పుడు మొత్తం 139 కులాలు కవర్ అవుతున్నాయి. – వైఎస్సార్ చేయూత ద్వారా సింహభాగం లబ్ధి బీసీ మహిళలకే జరుగుతుంది. – గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పారు. – బీసీలంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు బీసీలను అన్ని విధాలా మోసం చేశారు: మంత్రి ధర్మాన కృష్ణదాస్ – 2014 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి మద్దతిచ్చి గెలిపిస్తే చంద్రబాబు బీసీలను అన్ని విధాలా మోసం చేశారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. – టీడీపీ బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌గా కాకుండా బిజినెస్ క్యాస్ట్‌గా చూసింది. – వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల లబ్ధి జరిగింది. – ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలను వాడుకున్నారు తప్ప బీసీల బాగోగులు చూడలేదని అన్నారు. – ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల అభ్యున్నతికి అనేక చట్టాలు చేసిందన్నారు. – మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ యాదవ్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
'బలహీన వర్గాలకు బలం సీఎం జగన్'
తాడేపల్లి: బీసీల అభ్యునతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం జగన్ అధ్యయన కమిటీ వేశారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో, మహిళల పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం బీసీలకు పెద్ద పీఠ వేసింది. క్యాబినెట్లో కూడా బీసీలకు పెద్ద పీఠ వేశారు. బీసీల కోసం 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీలకు నేడు పండుగ రోజు. అందులో భాగంగా 30వేల జనాభా మించిన కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మెన్ , డైరెక్టర్లను నియమిస్తారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ది చెప్పారు. బీసీలంతా వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని శంకర నారాయణ తెలిపారు. బీసీలంటే బిజినెస్ క్యాస్ట్‌గా టీడీపీ చూసింది - ధర్మాన 2014 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి సపోర్ట్ చేస్తే చంద్రబాబు బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అయితే వైఎస్ జగన్ తన పాదయత్రలో బీసీల బాధలు తెలుసుకొని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మాటప్రకారం బీసీల కోసం 28 కార్పొరేషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌గా కాకుండా బిజినెస్ క్యాస్ట్‌గా చూసింది. అందుకే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ధర్మాన పేర్కొన్నారు. (బీసీ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష) బలహీన వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డే బలం చంద్రబాబు బీసీలను వాడుకున్నారు తప్ప బీసీల బాగోగులు చూడలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బీసీల కష్టాలు చూశారు. 30వేల జనాభా దాటిన ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీనిచ్చారు. సీఎం అయిన వేంటనే బీసీల సంక్షేమంపై దృష్టి పెట్టారు. మాటలు కాకుండా చెప్పిన ప్రతి హామీని సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో సంక్షేమానికి 43వేల కోట్లు ఖర్చు పెడితే అందులో రూ. 22వేల కోట్లు బీసీలకు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. ప్రతి కులం రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలని చెప్పే వ్యక్తి జగన్ అని జంగా కృష్ణమూర్తి అన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల అభ్యున్నతికి అనేక చట్టాలు చేసింది. బలహీన వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డే బలమని అన్నారు. (‘వైజాగ్ ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా’) -
లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేత లోకేష్‌పై మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తిన్న అవినీతి సొమ్మును వడ్డీతో సహా రాబడతామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ గ్రిడ్ స్కాంలో దోషులు బయటకు వస్తారని పేర్కొన్నారు. అవినీతిపై విచారణ చేస్తుంటే లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర కీలకమైనదన్నారు. అవినీతికి పాల్పడ్డ ఎవ్వరినీ వదిలిపెట్టమని మంత్రి స్పష్టం చేశారు. (ఆయనకు చదువు అబ్బక ఇక్కడే ఉండిపోయారు : కొడాలి నాని) చదవండి: ధనికులకు బాబు.. పేదలకు జగన్ -
తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు..
-
‘చంద్రబాబు, లోకేష్ జైలుకెళ్లక తప్పదు’
సాక్షి, శ్రీకాకుళం: ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే కిడ్నాప్ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వక్రీకరిస్తున్నారని రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరం జరిగినప్పుడు అరెస్ట్ సర్వసాధారణం అన్నారు. చంద్రబాబు,లోకేష్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి బీసీలకు ఆపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో బీసీ ఓట్లతో గెలిచిన చంద్రబాబు.. వారిని గాలికొదిలేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని మంత్రి కృష్ణదాస్ స్పష్టం చేశారు. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్) అక్రమాలకు పాల్పడ్డారు: మంత్రి కన్నబాబు కాకినాడ: ఈఎస్ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ నివేదిక వచ్చిందని.. ఆ స్కాంలో అచ్చెన్నాయుడుకు ప్రమేయం ఉందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈఎస్ఐ స్కాంలో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: మంత్రి జయరాం గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగిందని.. మెడిసిన్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని మంత్రి జయరాం తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పనిని అనినీతిమయం చేశారన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు,లోకేష్ కూడా జైలుకెళ్లక తప్పదన్నారు. అవినీతిలో పాలు పంచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని మంత్రి జయరాం పేర్కొన్నారు. (అచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు కొత్త డ్రామా) గత ప్రభుత్వంలో ప్రతి పనిలో అవినీతి జరిగింది.. విశాఖపట్నం: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి అచ్చెన్నాయుడు అరెస్ట్ నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు చేసిన అవినీతి 150 కోట్ల రూపాయల పైనే ఉంటుందని, ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా వాటా ఉంటుందని ఆరోపించారు. తన నియోజకవర్గంలో పని చేస్తున్న ఒక ఎస్సీ మహిళను తన మాట వినలేదని అచ్చెన్నాయుడు సస్పెండ్ చేయించారని, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని గుర్తు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే గుంటూరు: ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్.. ఎవరైనా చట్టం ముందు సమానులే అంటూ అంబటి రాంబాబు ట్విటర్లో పేర్కొన్నారు. -
టీడీపీ ఉనికి కోల్పోయింది: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: ఏడాది పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనసులు గెలుచుకుని అందనంత ఎత్తుకు ఎదిగారని రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ పాలన దేశంలో మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. రాజకీయ విలువలు పెంచిన వ్యక్తి వైఎస్ జగన్ అని, ఆయన నాయకత్వంలో ప్రజా ప్రతినిధులుగా గర్వంగా ప్రజల మధ్య తిరగగలుగుతున్నామన్నారు. (‘ఆ ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే’) రాజకీయ నాయకులంటే ప్రజలు ద్వేషించే స్థాయి నుంచి గౌరవించే స్థాయికి ఆయన తీసుకొచ్చారని తెలిపారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా ఆయన గౌరవించారన్నారు. మేనిఫెస్టో, ఎన్నికల హామీలంటే చంద్రబాబుకి లెక్కలేనితనమని విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడికి అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన ప్రాధాన్యత రంగాలుగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రతిపక్షం టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోయిందని, ఈర్ష్యతో అభివృద్ధికి అడ్డుపడి ప్రజల వ్యతిరేకత ను మూటగట్టుకున్నారని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. (టీడీపీ కుట్రలు ఫలించవు: మల్లాది) -
‘అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలి’
సాక్షి, శ్రీకాకుళం : సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు ఉంటే త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు. ఒడిశాలో వర్షాలు పడితే మనకు ముంపు వస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ శాఖల సమన్వయంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులంతా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో మాట్లాడాలని, రైతులు సకాలంలో విత్తనాలు వేసేలా చూడాలని తెలిపారు.(వలస కార్మికులపై రాజకీయాలు ) సాగునీటి చెరువులు ప్రణాళికాబద్ధంగా నింపాలని, రైతులకు అవసరమైన సమయంలో నీటిని విడుదల చేసి ఆదుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది విత్తనాలు ముందే సరఫరా చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం అతిముఖ్యమైన విషయమని, రైతులకు అండగా ఉండాలని సూచించారు. ఏడాది అంతటా పండించే పంట చేతికి రావాలన్నారు. అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వ్యవసాయానికి ఇదే సరైన సమయమని, రైతులకు పంట యాజమాన్య పద్ధతులు తెలియజేయాలని ఆదేశించారు. ఈ ఏడాది అధిక దిగుబడులు రావాలని, మార్కెటింగ్ సదుపాయాలు తెలియజేయాలన్నారు. (సోషల్ మీడియాలో టన్నుల కొద్దీ హింస) వ్యవసాయ, జలవనరుల శాఖలు చేపడుతున్న ప్రతి చర్య రైతుల పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో వంశధార కింద 2.50 లక్షల ఎకరాలకు ప్రతి ఏడాది నీటి సరఫరా చేయాలన్నారు. గత ఏడాది జూలై రెండవ వారంలో నీరు విడుదల చేశామని, ఈ ఏడాది జూన్ 2 లేదా 3వ వారం నీటి విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నారాయణ పురం, తోటపల్లి, మడ్డువలస నుంచి జూన్ నెలలో విడుదల చేసే అవకాశముందన్నారు. విత్తనాలు పంపిణీలో చిన్న, సన్నకారు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ సహాయకుల ద్వారా రైతుల పేర్లు నమోదు చేస్తామని, రైతు భరోసా కేంద్రాలు మే 30 నాటికి సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. (ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ ) -
చంద్రబాబు ఆలోచనలు కరోనా కంటే ప్రమాదకరం
సాక్షి, పోలాకి: రాష్ట్రంలో ఇకపై చంద్రబాబు అండ్ కో కుట్రలు సాగనివ్వబోమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వారి ఆలోచనలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా కన్పిస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం మబగాం క్యాంప్ కార్యాలయం నుంచి మంత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆఖరికి టీడీపీ విమర్శలు చేయడానికి మాత్రమే పనికొచ్చే పార్టీగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రాథమిక కార్యాచరణ లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందంటూ విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటివరకూ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కనీస స్పందన లేని నాయకులుగా వారికి పదవుల్లో వుండే అర్హత లేదన్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగిస్తే రాష్ట్రంలో యాక్షన్‌ప్లాన్‌తో సిద్ధంగా వున్నామని తెలిపారు. క్షేత్రస్ధాయిలో వలంటీర్లు, వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు ఇతర వ్యవస్ధలు చేపడుతున్న చర్యలు అద్భుతమని మంత్రి కృష్ణదాస్ కొనియాడారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో వుంచి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నాలుగు కోవిడ్ ఆసుపత్రులు, పదుల సంఖ్యలో క్వారంటైన్ సెంటర్లు సిద్ధం చేసి వుంచామని తెలిపారు. -
బాబు తీరును ఎండగట్టిన మంత్రులు
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును మంత్రులు ఎండగట్టారు. చంద్రబాబు నక్కబుద్ధి, దొంగ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నట్టు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, గుమ్మనూరు జయరాం, ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు మంత్రులు మంగళవారం పత్రికా ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. ఈ అఫిడవిట్ ద్వారా బీసీ వర్గాలకు మేలు జరగకుండా చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని ముఖ్య అంశాలను మంత్రులు ప్రజలకు వివరించారు. మంత్రులు చెప్పిన అంశాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్, రూరల్‌డెవలప్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీలు చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులోని పాయింట్ నంబర్ 25లో 50శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో దాటరాదన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు, విభజన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తిస్తుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని 26వ పాయింటులో సుప్రీంకోర్టు 2016 ఫిబ్రవరి 8న ఇచ్చిన తీర్పులో ఏం చెప్పిందో కూడా రాశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయినందున 60.55శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రశ్నలకు ఇప్పుడు తాము సమాధానం చెప్పదలుచుకోలేదని, కాబట్టి పిటిషన్లు డిస్మిస్ చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆ అఫిడవిట్‌లోని 27వ పాయింటులో ఈ అంశాన్ని మరింత వివరంగా చెప్పారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రమే రిజర్వేషన్లు 50శాతం మించడాన్ని అంటే, 60.55శాతం ఉండటాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది తప్ప భవిష్యత్తులో మరే ఎన్నికలకూ దీన్ని వర్తింపచేసే అవకాశం లేదని 27వ పాయింటు చివరి వాక్యంలో చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇంగ్లిషులో చెప్పాలంటే ఇట్ కెనాట్ బీ ఎక్స్టెండెడ్ ఫ్యూచర్ ఎలక్షన్స్ అంటూ సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కాబట్టే..స్పెషల్‌ఆఫీసర్లను నియమించుకోక తప్పడంలేదంటూ ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఈ నెపాన్ని వారిచ్చిన అఫిడవిట్‌కు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వంమీద నెడుతోంది. యాభైశాతం రిజర్వేషన్లు మించడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అనుమతించడంలేదంటూ సాక్షాత్తూ మరోసారి హైకోర్టుకు తెలిపిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని 59.75శాతం రిజర్వేషన్లు కావాలని దొంగ డిమాండ్లు చేయడం ఎంతవరకూ సహేతుకం. ఈ అఫిడవిట్ చంద్రబాబు దొంగ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోంది. -
సీబీఐని వ్యతిరేకించింది అందుకేనా..?
-
నూరు గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకు..
సాక్షి, విజయవాడ : ప్రతి రోజు మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలో మంత్రి మాట్లాడుతూ.. పీఎస్‌పై సోదాలు చేస్తేనే రూ.2 వేల కోట్లు తేలిందని, చంద్రబాబు, లోకేష్‌లపై సోదాలు జరిపితే ఎన్ని లక్షల కోట్లు తెలుతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎంత దోచుకున్నారో ఐటీ సోదాలు బట్టి తేలిపోయిందని, ఆయన అవినీతి, రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు, లోకేష్ లపై కూడా ఐటీ సోదాలు జరపాలని సూచించారు. కృష్ణా: నూరు గొడ్డులు తిన్న రాబందు ఒక గాలి వానకు కూలినట్లు ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇది ఇక్కడితో ఆగదు, చంద్రబాబు అవినీతి చిట్టా బయటపడే రోజు దగ్గరలోనే ఉందని స్పష్టం చేశారు. తన పలుకుబడితో అవినీతి కేసులకు స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఇన్నాళ్లకు అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు. తిరుపతి : గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో చంద్రబాబు నాయుడు బినామీల అక్రమ ఆస్తులు వెలుగు చూశాయని పరిశ్రమల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియాకి ఐటీ దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2 వేలకోట్లు బయటపడ్డ కళ్లకు గంతలు కట్టినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు ఒక్కమాట కూడా బయట పడటం లేదని, ఆయనకు ఎలాంటి సంబంధం లేకుంటే ఎందుకు ఐటీ దాడులపై స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తామని వచ్చిన పవన్ కళ్యాణ్ ,కాంగ్రెస్ నాయకులు కూడా నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం : చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలు అయిందని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గతంలో సీబీఐ విచారణలు వద్దన్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. అవినీతి జరిగిందని అరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలని హితవు పలికారు. ప్రజలు అవినీతిని సహించడం లేదని, పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారన్నారు. నాలగైదు చోట్ల దాడులకే రెండు వేల కోట్లు బయటపడ్డాయని, ఇంకా దాడులు చేయాల్సి ఉందని అన్నారు. *చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు ఐటీ దాడుల మీద స్పందించాలని పిలుపునిచ్చారు. -
సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు : మంత్రి ధర్మాన
సాక్షి, అమరావతి : ఒక ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈ సారి సభలో మొత్తం 19 బిల్లులు ప్రవేశపెట్టగా, 16 బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. కీలకమైన దిశా బిల్లు ఆమోదం వల్ల మహిళల భద్రతకు సీఎం అత్యంత ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ దిశా బిల్లును ప్రశంసించారని వెల్లడించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాలు దిశా చట్ట అమలుకు ముందుకు వచ్చాయని వివరించారు. -
‘అలా కోరుకోవడంలో తప్పేముంది’
సాక్షి, శ్రీకాకుళం: పదవులు కోసం మనసును చంపుకునే రాజకీయాలు చేయనని.. మంచి, గౌరవం, అభిమానానికి తల వంచుతానని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులను ఉద్దేశించి తాను ఎలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలను కావాలనే ఒక వర్గం వక్రీకరించిందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు పాటు పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల యువత కృతజ్ఞతతో ఉండాలని కోరుకోవడంలో తప్పేముందని మంత్రి కృష్ణదాస్ పేర్కొన్నారు. -
‘పార్టీలకు అతీతంగా క్రీడలకు ప్రాధాన్యత’
సాక్షి, విశాఖపట్నం: విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో రాణిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ స్టేట్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 12 వరుకు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 50 సంవత్సరాల వేడుకలను విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఎవరికీ లేని గౌరవం క్రీడాకారులకు ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. క్రీడలకు సహకారం అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విశాఖలో స్పోర్ట్స్ హబ్ నిర్వహణ పూర్తిస్థాయిలో కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని మంత్రి కృష్ణదాస్ వెల్లడించారు. -
‘చంద్రబాబు సంస్కారహీనుడు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు సంస్కారహీనుడని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒళ్లంతా అహంకారం, విషం నింపుకుంటేనే ఇలాంటి మాటలు వస్తాయని దుయ్యబట్టారు. ఇకనైనా అబద్ధాల మీద రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు ఇంకా భ్రమలోనే ఉన్నారని..ప్రజలు మీ పార్టీని, మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేశారన్నారు. ఇలాంటి ప్రేలాపలను ఇంకా కొనసాగిస్తే ప్రజలు అంత కంటే కిందకి తొక్కేస్తారని మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించలేని అసహనం చంద్రబాబు మాటల ద్వారా బయటపడుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలని.. లేదంటే ఇంతకంటే దారుణ పరాభవాన్ని రుచి చూపిస్తారన్నారు. -
ఐదేళ్లలో రాష్ట్రాన్ని బీహార్‌లా తయారు చేశారు
-
‘బీసీలకు శాశ్వత కమిషన్ వేసింది ఏపీ ఒక్కటే’
సాక్షి, శ్రీకాకుళం : దేశంలోనే బీసీలకు శాశ్వత కమిషన్ వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం పేర్కొన్నారు. ఆదివారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన కృష్ణదాస్ జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాయణ సామాజిక నీతిని బోధిస్తుందని, భారత లౌక్యం నేర్పిస్తుందని అన్నారు. బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అని స్పీకర్ తెలిపారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఒక బోయవాడు పరిణితి చెంది అద్భుతమైన రామాయణ కావ్యం రాశారని గుర్తు చేశారు. బీసీల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో పథకాలను అందించారని, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యంత పాధాన్యత ఇచ్చిందని మంత్రి ధర్మాన తెలిపారు. -
‘ఎంత సాయం చేయడానికైనా సిద్ధం’
సాక్షి, శ్రీకాకుళం: తిత్లీ తుపాను బీభత్సానికి అతలాకుతలమైన ఉద్దానం ప్రాంతం త్వరగా కోలుకునేందుకు ఎంత సాయం చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం జరిగిన ఉద్దానం పునర్నిర్మాణం సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. తిత్లీ తుపానుతో ఉద్దానం రెండు తరాల వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. రైతాంగం త్వరగా కోలుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారానికి అదనంగా పరిహారం ఇచ్చామని వెల్లడించారు. -
సాక్షాత్తు నా కొడుక్కయినా..
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : సచివాలయ ఉద్యోగాల నియామకాలన్నీ అత్యంత పారదర్శకంగా జరిగాయని, సీఎం జగన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులంతా ప్రభు త్వ లక్ష్యాన్ని చాటిచెప్పేలా పనిచేశారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. సోమవారం ఆయన పలువురు అభ్యర్థులకు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన చేపట్టలేదని, అది కూడా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు, ఒత్తిళ్లకు తలొగ్గకుం డా ఉద్యోగాలను భర్తీ చేయడం ఓ చరిత్ర అని అన్నారు. ‘సాక్షాత్తు నా కొడుక్కయినా అడ్డదారిలో ఈ ఉద్యోగం వచ్చే అవకాశమే లేద’ని సభాముఖంగా చెప్పారు. ఉద్యోగాలు సాధించిన ప్రతి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేస్తూ... ‘మీకిప్పుడు సమాజంలో గౌరవంతోపాటు కొత్తగా బాధ్యతలు పెరిగాయని, అవినీతికి దూరంగా నిజాయితీగా పనిచేయాల’ని సూచించారు. సచివాలయాల వ్యవస్థతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు సద్వినియోగమవుతాయని, ఇందుకోసం ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. ‘మనం పాలకులం కాదు... సేవకులమని...’ ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు తమతో అంటుంటారని, వయస్సులో చిన్నవాడైనా... అతనిలో కార్యదక్షత, నిజాయితీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వంటి లక్షణాలు ఎంతో ఆదర్శ నీయమైనవన్నారు. రైతుల కోసం రైతు భరోసా, మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగుల కోసం స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగావకాశాలు, అమ్మఒడి, వెయ్యి రూపాయలు ఖర్చు దాటిన ప్రతి రోగానికి ఆరోగ్యశ్రీ వర్తింపు.. దశలవారీగా మద్యపాన నిషేధం ఇలా అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా ఎన్నో పథకాలను ఈ కొద్ది రోజుల్లోనే అమలు చేశారని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగాలను సాధించిన వారిలో.. 80 శాతం మందికి పైగా సామాన్య, మధ్యతరగతి స్థాయి కుటుంబాలకు చెందినవారేనని, నీతినిజాయితీలతో పనిచేస్తే వెలకట్టలేని గుర్తింపు వస్తుందని సూచించారు. ఇలా పనిచేయడమే సీఎం జగన్‌కు కృతజ్ఞతతో మీరిచ్చే గిఫ్ట్ అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎక్కడి సమస్యకు అక్కడే పరిష్కారం జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ భారీ ఉద్యోగాల నియామక ప్రక్రియను జిల్లా ఎంపిక కమిటీ సభ్యులంతా చాలా కష్టపడి రాత్రి పగలు అన్న తేడా లేకుండా పూర్తి చేశారని, పూర్తిగా మెరిట్ బేసిస్తోనే జాబితాలను తయారు చేశామని స్పష్టం చేశారు. సచివాలయాల వ్యవస్థతో స్థానిక సంస్థలు బాగా బలోపేతమవుతాయని, ఎక్కడి సమస్యకు అక్కడే పరిష్కారం దొరుకుతుందన్నారు. సొంత మండలాల్లో ఉద్యోగాలు దొరకడం అద్భుతమైన అవకాశమని, దీన్ని కొత్త ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో జి.చక్రధరరావు, డీఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, డీపీవో రవికుమార్, ఆర్డీవో ఎం.వి.రమణ, డీపీఆర్వో ఎల్.రమేష్, నగర కార్పొరేషన్ కమిషనర్ ఎం.గీతాదేవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అంధవరపు వరాహ నర్సింహం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్, తహశీల్దార్ ఐ.టి.కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి ఆధ్వర్యంలో సీఐలు లలిత, సాకేటి శంకరరావులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. -
రూ. 6500కోట్లతో ఎన్డీబీ ప్రాజెక్ట్ పనులు: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం : జిల్లా, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్డు, భవనాల మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రాష్ట్రంలో 400 వందల వంతెనల నిర్మాణానికి టెండర్లను పిలిచామని, అవినీతి రహితంగా టెండర్లతో రోడ్లు నిర్మిస్తామని అన్నారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.329కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రూ. 6500కోట్లతో ఎన్డీబీ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతాయని, రూ. 10 కోట్లు దిగువ ఉన్న పనులకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు. సీలేరు, భద్రాచలం, అరకు, రాజమండ్రిలో నిర్మాణంలో ఉన్న రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. -
కోడెల మృతి బాధాకరం: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమని ఏపీ ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కోడెల మృతిపై ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంగళవారం ధర్మాన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీకే చెందిన నేత మృతిని ఇలా రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కోడెల మరణంపై చంద్రబాబు రాజకీయం చేయడం తగదని అభిప్రాయపడ్డారు. కుటుంబంలో నెలకొన్న భేదాభిప్రాయాల కారణంగానే కోడెల బలవన్మరణం పొందారని స్వయానా అతని మేనల్లుడే పోలీసులకు ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా ధర్మాన పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించిందని, కొద్ది రోజుల్లో వాస్తవాలు వెలువడతాయని ఆయన తెలిపారు. -
అయ్యా.. మాది ఏ కులం?
సాక్షి, జలుమూరు(శ్రీకాకుళం) : ఆయ్యా మేము ఏ కులానికి చెందుతామో అధికారులు నిర్దారించలేకపోతున్నారు.. పల్స్ సర్వే(ప్రజాసాధికార సర్వే)లో కులం స్థానంలో ఇతరులుగా నమోదు చేస్తున్నారు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొంతమందికి ఎస్టీలుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా విస్మరించింది. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందలేకపోతున్నామని పలువురు ఏనేటి కొండ కులాలకు చెందిన వారు తమ ఆవేదనను మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు వివరించారు. జలుమూరులో శుక్రవారం మంత్రిని కలిసి తమ గోడు వెల్లబుచ్చారు. జిల్లాలో కోటబొమ్మాళి, మందస, జలుమూరు, సంతబొమ్మాళి, పలాస, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో ఏనేటి కొండ జాతులకు చెందిన సుమారు 3వేల కుటుంబాలు జీవిస్తున్నాయని ఆ సంఘం నాయకుడు పాలకి కిరణ్‌కుమార్ మంత్రికి వివరించారు. తమ ఆచార, వ్యవహారాలు, సాంప్రదాయాలు గిరిజనుల మాదిరిగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించి కులధ్రువీకరణ పత్రాలు జరీ చేసిందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేయడంతో తామంతా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, తమ పిల్లలకు స్కాలర్షిప్లు అందక, ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తమకు కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. మంత్రి స్పందిస్తూ జిల్లాలో ఇలా ఎంతమంది ఉన్నారో గుర్తించి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్టాఫ్‌నర్సుల సమస్యలు పరిష్కరించాలని వినతి శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా స్టాఫ్‌నర్సుల సంఘం ప్రతినిధులు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు వినతిపత్రం అందజేశారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. 500 పడకల ఆస్పత్రిని 700 పడకలకు విస్తరించారని, కానీ ఆమేరకు స్టాఫ్‌నర్సుల నియామకం చేపట్టకపోవడంతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నామన్నారు. 254 మంది నర్సులు ఉండాల్సి ఉండగా 80 మంది వరకు డిప్యుటేషన్లపై ఇతర చోట్ల పనిచేస్తున్నారని అన్నారు. డిప్యుటేషన్ల రద్దయ్యేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం అధ్యక్షురాలు ఎన్వీ లక్ష్మి, నిర్మలాదేవి, రోషినీతార తదితరులు ఉన్నారు. ఏ కులమో గుర్తించకపోవడంతో నష్టపోతున్నాం మేము ఏ కులానికి చెందిన వారిమో ప్రభుత్వం గుర్తించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. గతంలో ఏనేటి కొండగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని నిలుపుదల చేసంది. మా పిల్లల జీవితాలకు భరోసా లేకుండాపోయింది. ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలి. – సంకిలి లక్ష్మి, కస్తూరిపాడు, కోటబొమ్మాళి కులధ్రువీకరణ పత్రాలు అందించాలి కులం గుర్తింపు విషయంలో మేము ఇప్పటికే చాలా నష్టపోయాం. మా పిల్లలు మా మాదిరిగా కాకూడదు. ప్రజాసాధికార సర్వే చేయించి మాకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలి. – పి.కిరణ్‌కుమార్, ఏనేటి కొండ కులసంఘం నాయకుడు -
మరో 20 ఏళ్లు జగనే సీఎం
ప్రజలకు ఏం కావాలో అవి జగన్ చేస్తున్నారు. అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తున్నారు. అభివృద్ధి వైపుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులంతా ఆయన బాటలో సాగుతున్నారు. అందరికీ అన్నీ చేస్తున్న సీఎంగా జగన్ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నారు. యువకుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి దూకుడు చూస్తుంటే మరో 20ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్షం టీడీపీ అడ్రస్సు గల్లంతు అవుతోంది. ఆ పార్టీ పరిస్థితేంటో ఇప్పుడంతా చూస్తున్నాం. ఆ పార్టీ పని అయిపోయినట్టే. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలో కనిపిస్తోంది. స్పందించే గుణం ఉంటే ఏదైనా చేయగలమని మన యువ సీఎం నిరూపిస్తున్నారు. మానవతా దృక్పథంతో ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకే సెషన్లో 19 బిల్లులు ప్రవేశపెట్టి, ఆ మోదించడమంటే అంత సులువు కాదు. విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని, అహర్నిశలు కష్టపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రులందరికీ ఆదర్శంగా నిలిచారు. ఏ ముఖ్య మంత్రీ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో 20 ఏళ్లు సీఎంగానే కొనసాగుతారు’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర 15వ శాసనసభ రెండో సెషన్ సమావేశాలు ముగించుకుని జిల్లాకొచ్చిన మంత్రి కృష్ణదాస్ గురువారం ‘సాక్షి’ తో కాసే పు మాట్లాడారు. ఆ వివరాలివి. నిజాయితీగా ఉంటాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలన కోసం పరితపిస్తున్నారు. నిజాయితీగా పనిచేయాలని అందరికీ సూచిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు నిజాయితీగా ఉన్నప్పుడే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడుతున్నా రు. నేను కూడా నిజాయితీగా పనిచేస్తాను. ఎక్కడా ఎలాంటి అవినీతికి అవకాశమివ్వను, నేనే కాకుండా మా నాయకులు కూడా అవినీతికి దూరంగా ఉంటారు. ఎక్కడైనా అవినీతి జరిగితే వేలెత్తి చూపించవచ్చు. పాలనా పరంగా లోపాలుంటే సరిచేసుకుంటాం. సీఎం మానవతావాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలో మానవతా దృక్పథం ఎక్కువ. అవతలి వ్యక్తులు ఆపదలో ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఆదుకుంటారు. ఆ కోణంలోనే పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేల జీతం ప్రకటించారు. గ్రామాల్లో నిజాయితీగా సేవలందిస్తున్న ఆశ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు ఊహించని విధంగా జీతాన్ని రూ. 10వేలకు పెంచారు. సంక్షేమంలో దూకుడు వైఎస్ కుటుంబానికి ప్రజలకు సాయపడే గుణం ఉంది. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి కంటే రెండింతలు ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించారు. మరికొన్ని ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. పేదల కన్నీళ్లు తుడిచే బిల్లులవి ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒకే అసెంబ్లీ సెషన్లో 19 బిల్లులు ప్రవేశపెట్టారు. వాటికి ఆమోదం పొందా రు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిపుష్టి కల్పిస్తూ చరిత్ర సృష్టించారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించే బిల్లులను ప్రవేశపెట్టారు. మహిళలను రాజకీయ, ఆర్థిక అందలమెక్కించే విధంగా బిల్లులు రూపొందించారు. భూ యజమానులకు నష్టం లేకుండా, వారి హక్కులకు భంగం కలగకుండా, వారికి రక్షణ కల్పిస్తూ సాగు రైతులకు(కౌలు రైతులకు) మేలు చేసేలా విధంగా బిల్లు పెట్టారు. ఈ బిల్లు నాకెంతో ఇష్టమైనది. ఎక్కడా లేని విధంగా బిల్లు పెట్టి కౌలు రైతులను ఆదుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం వ్యవసాయ ఉత్పత్తులు, పశు సంపద మార్కెట్ల సవరణ బిల్లు, స్థానిక యువతకు ఉపాధే లక్ష్యంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాల బిల్లు, నామినేటేడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్, నామినేటేడ్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 50 శాతం కేటాయింపులు, శాశ్వత బీసీ కమిషన్, మద్య నియంత్రణ చట్టానికి సవరణ, పాఠశాలల విద్య నియంత్ర, పర్యవేక్షణ కమిషన్, ఉన్నత విద్య కమిషన్, ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇలా అనేక బిల్లులు పెట్టి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజామోదం పొందారు. ఈ బిల్లులన్నీ పేదల కన్నీళ్లు తుడవనున్నాయి. జిల్లాలో ఇకపై ప్రగతి పరుగులు జిల్లా ప్రగతి పథంలో పయనించబోతున్నది. అన్ని రంగాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యా«ధిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రోగులకు రూ.10వేల పెన్షన్ అందజేస్తున్న సీఎం కిడ్నీ వ్యాధిపై యుద్ధం చేసేందుకు పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేశారు. త్వరలో ప్రారంభం కానుంది. జిల్లాలో సంక్షే మ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువ చేసేం దుకు వాలంటీర్ల వ్యవస్థ అమల్లోకి వస్తున్నది. ప్రజల చెంతకే పథకాలు వెళ్తాయి. గ్రామ పరిపాలన గాడిలో పెట్టేందుకు, గ్రామంలోనే అన్నీ సేవలు పొందేందుకు గ్రామ సచివాలయాలు వస్తున్నాయి. దీనివల్ల జిల్లాలో వేలాది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందనున్నారు. మున్ముందు అన్నీ మంచి రోజులే. -
స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్లు రద్దు చేయండి
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలకు విశాఖపట్నం నుంచి బదిలీపై వచ్చి తిరిగి డిప్యుటేషన్‌పై విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లిన స్టాఫ్ నర్సుల వ్యవహారంపై రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెల్సుకున్న ఆయన వైద్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో, డీటీహెచ్ఎస్, రిమ్స్ అధికారులతో సోమవారం ఈ అంశపై చర్చించారు. తక్షణం డిప్యుటేషన్లు రద్దుచేయాలని ఆదేశించారు. 250 మందికిపైగా స్టాఫ్ నర్సులు ఉండగా, 88 మందికి డిప్యుటేషన్ల అమలుపై అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడనున్నట్లు చెప్పారు. టీచింగ్, రిఫరల్ వైద్యశాల కావడంతో కేజీహెచ్‌కు అదనపు స్టాఫ్ నర్సులు అవసరంగా స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్లు రద్దు చేయండి. కొందరు అధికారులు చెప్పుకొచ్చారు. ఈ వాదన పట్ల మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమ్స్ టీచింగ్ ఆస్పత్రి కాదా అంటూ ప్రశ్నించారు. మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందితే కేజీహెచ్‌కు రోగులను రిఫర్ చేయవల్సిన అవసరం ఏముందన్నారు. నర్సుల డిప్యుటేషన్లను రద్దు చేయాలని మంత్రి కృష్ణదాసు నుంచి ఆదేశాలు అందడం నిజమేనని రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణవేణి తెలిపారు. ఆదేశాల కాపీని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తికి పంపించామన్నారు. ఎవరెక్కడ పనిచేస్తున్నారు? అన్ని శాఖలకు కలెక్టర్ లేఖజిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఎవరైనా డిప్యుటేషన్లపై ఉన్నా, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నా వెంటనే తెలియజేయాలని కలెక్టర్ అన్ని శాఖలకు లేఖ రాశారు. ఇటీవల రిమ్స్ స్టాఫ్ నర్సుల వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో కొన్ని శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లపై వెళ్లడం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన ఉద్యోగుల వివరాలను వారం రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశించారు. శాంక్షన్ పోస్టులలో పనిచేస్తున్నవారు, ఖాళీగా ఉన్న పోస్టులు, డిప్యుటేషన్‌పై ఉన్నవారు, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి వివరాలను తెలియజేయాలని కోరారు. కలెక్టర్ నుంచి ఈ ఆదేశాలు రావడంతో వీటిని సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. -
కేంద్రబడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగింది
-
ఏపీ మంత్రుల బాధ్యతల స్వీకరణ
-
‘వైఎస్ జగన్.. వైఎస్సార్ పాలనను గుర్తు చేస్తున్నారు’
సాక్షి, అమరావతి : దివంగత నేత వైఎస్సార్ పాలనను ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేస్తున్నారని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారని, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. మంత్రి వర్గంలో అన్ని వర్గాలవారికి సముచిత స్థానం కల్పించారన్నారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చరిత్ర అని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ అత్యంత కీలకమైనవని, అందరినీ కలుపుకుని పనిచేస్తానని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ రోడ్డుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అవంతి శ్రీనివాస్ అన్నారు. పర్యాటక శాఖమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలను తెలిపారు. రాబోయే రోజుల్లో టూరిజాన్ని అభివృద్ది చేస్తానని హామి ఇచ్చారు. అతిథి దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. 13జిల్లాలో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ది చేస్తామని తెలిపారు. సింగిల్ విండో పద్దతిలో అనుమతులిస్తామని వివరించారు. ఏపీ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమిస్తామన్నారు. ఏపీకి వచ్చే టూరిస్టులకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేవు పార్టీలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎర్రచందనం అక్రమరవాణా అరికడతాం.. విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమరవాణాను అరికడతామన్నారు. పగటి పూట రైతులకు విద్యుత్ సరఫరా చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ రాయితీలను పొడగిస్తున్నామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లను ఉచితంగా ఇస్తామని హామి ఇచ్చారు. ఐదువేల ఎర్ర చందనం వేలం వేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ టారిఫ్‌లు, పీపీఏలను సమీక్షిస్తామని అన్నారు. కేంద్రం సమీక్షించవద్దన్న విషయాన్ని సీఎం జగన్.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. తప్పులుంటే సమీక్షిస్తామని ప్రధానికి సీఎం వివరించినట్లు తెలిపారు. ఫిట్నెస్ లేకుంటే.. బస్సులు సీజ్ బస్సుల ఫిట్నెస్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారని, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. గురువారం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులకు ఇవాళ సాయంత్రం వరకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇదొక సూచనలాంటి హెచ్చరిక అని, సాయంత్రంలోగా ఫిట్నెస్ సర్టిఫికేట్‌ను తీసుకోకుంటే.. బస్సులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఫిట్నెస్ లేకుండా బస్సులను నడుపుతామంటే సహించేంది లేదని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిట్నెస్ లేని బస్సల వివరాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచిపేరు తెచ్చేలా పనిచేస్తా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి మంత్రి బాధ్యతలు అప్పగించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో గ్రామీణ, పంచాయతీ రాజ్, మైనింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు, ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని అన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్
-
బాధ్యతలు చేపట్టిన ధర్మాన, అవంతి, బాలినేని
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ధర్మాన కృష్ణప్రసాద్, అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణప్రసాద్, పర్యాటక శాఖ మంత్రిగా అవంతి శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి ధర్మాన తెలిపారు. గతంలో వైఎస్సార్ దగ్గర పనిచేయడం.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ దగ్గర మంత్రిగా పనిచేయడం ఆనందంగా ఉందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. -
దాసన్నకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గార మండలాన్ని పోలాకి మండలాన్ని కలుపుతూ వంశధారపై నిర్మించతలపెట్టిన భారీ వంతెన నిర్మాణం గురించి గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్మా న ప్రసాదరావు ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్నప్పుడు రూ.72 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంకా కొలిక్కిరాలేదు! ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులకు టీడీపీ ప్రభుత్వం అంచనాలు తగ్గించినా సకాలంలో పూర్తి చేయించలేకపోయింది. రూ.116 కోట్ల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి! శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ను కలుపు తూ నిత్యం రద్దీగా ఉండే సీఎస్పీ రోడ్డును రూ.33 కోట్లతో విస్తరించడానికి గతంలో కె.ధనంజయ్‌రెడ్డి జిల్లా కలెక్టరుగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసినా టీడీపీ ప్రభుత్వంలో జిల్లా నాయకులు ఎన్నికలకు ముందు హడావుడిగా శంకుస్థాపన చేసి వదిలేశారు! ఇలా దీర్ఘకాలంగా ముందుకు కదలని పెండింగ్ ప్రాజెక్టులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనమవుతున్నాయి. శనివారం ఆయన ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంలో జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌కు చోటు దక్కింది. అత్యంత ప్రాధాన్యం గల రోడ్లు–భవనాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా నత్తనడకనే సాగుతున్న, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి కృష్ణదాస్ హయాంలో మహర్దశ పడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా, ధర్మాన కృష్ణదాస్ ఆర్ అండ్ బీ మంత్రిగా జిల్లాలో పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించడమే గాక, కొత్త ప్రాజెక్టులనూ సాకారం చేస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సముచిత గుర్తింపు: జిల్లాలో తొలుత తనతో కలిసివచ్చిన కృష్ణదాసుకు జగన్ సముచిత గౌరవం కల్పించారు. ఆయన త్యాగాలకు గుర్తింపుగా మంత్రి పదవిని ఇచ్చారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసినప్పుడు కృష్ణదాస్ ఆయన బాటలో నడిచారు. తన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. సీఎం విజన్‌కు తగ్గట్టు రోడ్ల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు తగ్గట్టు జిల్లాలోని రోడ్లను అభివృద్ధి చేస్తానని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రజలతో సంబంధం ఉన్న రోడ్లు, భవనాల శాఖను అప్పగించడం ఆనందంగా ఉందని, ప్రాధాన్యతలు, నిధుల సమీకరణను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పెండిం గ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సామాజిక సమ తూకంతో మంత్రివర్గం కూర్పు చరిత్రలో నిలుస్తుందన్నారు.