
సాక్షి, విజయవాడ: ఉత్తరాంధ్ర వెనుకబాటుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిష్కారం చూపారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. శనివాకరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. విశాఖ పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం జగన్ ఉత్తరాంధ్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశారన్నారు. చంద్రబాబు ఒక్కరికే ఇది బ్లాక్ డే అని ధర్మాన పేర్కొన్నారు.