సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు తొలి సేవకుడిగా బాధ్యతగా వ్యవరించాను. అధికారం బాధ్యత ఇచ్చింది. 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాం. మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు ఏర్పాటు చేశామన్నారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం. పేదవాడి పార్టీ వైఎస్సార్‌సీపీ. పేదవాడు ఒక వైపు.. పెత్తందారు మరోవైపు. పేదవాళ్లు మొత్తం ఏకం కావాలి. అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలమన్నారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే ఈడీ, సీబీఐ నోటీసులు ఇచ్చాయి. చంద్రబాబుపై కక్షపూరితంగా చేసి ఉంటే కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీలో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. వారు స్పష్టమైన ఆధారాలు ఉన్నా చంద్రబాబును అరెస్ట్ చేయొద్దట. పచ్చ గజ దొంగలు చంద్రబాబు అరెస్ట్‌ను అన్యాయం అంటున్నాయి. బాబును సమర్థించడం అంటే పేదలను వ్యతిరేకించినట్టే. చంద్రబాబును సమర్థించడం అంటే పెత్తందారి వ్యవస్థను సమర్థించడమే.
రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా.. ఫలితం సున్నానే అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇంకెవరు కలిసి వచ్చినా సున్నానే. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్లకు లేదు. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే వారి లక్ష్యం. రాజకీయం అంటే చనిపోయాక కూడా బతికుండటం. మంచి జరిగితేనే అండగా ఉండాలని కోరుతున్నా. మన ధైర్యమంతా చేసిన మంచే. అందుకే వై నాట్ 175 అని ప్రజల్లోకి వెళ్తున్నాం.
ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళదాం. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుదాం. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా గ్రామస్థాయి నుంచే మమేకమవ్వాలి. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాలి. ఎన్నికల సంగ్రామంలో పొత్తు ప్రజలతోనే. మీ బిడ్డ పొత్తులపై ఆధారపడడు. దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నాను. సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన ప్రభుత్వం మనది. రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు సంక్షేమాన్ని అందించాం. ఎక్కడా లంచాలకు తావు లేదు. వివక్షకు చోటు లేదు. మనం అమలు చేసిన ప్రతీ కార్యక్రమం ఒక విప్లవం. ధైర్యంగా ప్రతీ ఇంటికి వెళ్లి అడగడం ఒక చరిత్ర. ఎక్కడా లంచాలు లేవు అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: వైఎస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment