
సాక్షి, శ్రీకాకుళం: పదవులు కోసం మనసును చంపుకునే రాజకీయాలు చేయనని.. మంచి, గౌరవం, అభిమానానికి తల వంచుతానని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులను ఉద్దేశించి తాను ఎలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలను కావాలనే ఒక వర్గం వక్రీకరించిందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు పాటు పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల యువత కృతజ్ఞతతో ఉండాలని కోరుకోవడంలో తప్పేముందని మంత్రి కృష్ణదాస్ పేర్కొన్నారు.