chanda babu
-
ఏపీలో మిన్నంటిన నిరసనలు..
విశాఖ జిల్లా: మూడు రాజధానులపై టీడీపీ వైఖరికి నిరసనగా ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో చింతపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామాల నుంచి భారీ సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, గిరిజనులు దహనం చేశారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని..ఎన్ని అవరోధాలు సృష్టించినా విశాఖ,కర్నూలు, అమరావతి కేంద్రాలుగా పాలన తథ్యమన్నారు. విశాఖ నగరంలో: వికేంద్రీకరణపై చంద్రబాబు తీరుకు నిరసనగా విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. మద్దిలపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమయింది. ఈ నిరసన ర్యాలీలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, కన్వీనర్లు మళ్ల విజయప్రసాద్, అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు. గుంటూరు: వికేంద్రీకరణపై చంద్రబాబు తీరు పట్ల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మతో విద్యార్థులు శవయాత్ర చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది. తాడిపత్రి యల్లనూరు కూడలిలో చంద్రబాబు దిష్టిబొమ్మను విద్యార్థి విభాగం నేతలు దహనం చేశారు. చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి: తన స్వార్థ ప్రయోజనాలు కోసం రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, గోకరాజు నరసింహరాజు, రామరాజు పాల్గొన్నారు. నల్లజర్లలో: మూడు రాజధానులపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ నల్లజర్లలో రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన యువజన విభాగంనేతలు..ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. తణుకులో: చంద్రబాబు వైఖరికి నిరసనగా తణుకు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో దళిత సంఘాలు, ప్రజలు భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సుమారు 45 అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. నిడదవోలులో మహిళా కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నచంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిత్తూరు: వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటున్న చంద్రబాబుపై కుప్పం ద్రవిడ యూనివర్శిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా ఆయన దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. -
‘మోసానికి రాజు చంద్రబాబు.. సేనాధిపతి యనమల’
సాక్షి, తాడేపల్లి: మోసానికి రాజు చంద్రబాబు అయితే.. సేనాధిపతి యనమల రామకృష్ణుడని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి యనమల అంటూ నిప్పులు చెరిగారు. మోసాలు, కుట్రలు చేసిన ఆయన ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారనే భ్రమలో యనమల ఉన్నారని దుయ్యబట్టారు. మంత్రులు తాగి వచ్చారని యనమల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దావోస్ వెళ్ళి చంద్రబాబు,యనమల ఏమి సాధించుకొచ్చారని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో విహార యాత్రలు చేశారని.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు, యనమల ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అతితక్కువ కాలంలోనే ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే నాలుగవ స్థానంలో నిలిచారన్నారు. అవినీతిలో చంద్రబాబు దేశంలో మొదటి స్థానంలో నిలిచారన్నారు. ‘మండలిలో ఏదో సాధించినట్లు తండ్రి కొడుకులు సన్మానాలు చేయించుకుంటున్నారు. మండలి రద్దు చేస్తే శాసనసభ ఎందుకని యనమల అంటున్నారు. గతంలో ప్రజా మద్దతు లేని మండలి అవసరం లేదని ఎన్టీఆర్ అన్నారు. 2004లో కౌన్సిల్ వల్ల ప్రజాధనం వృధా అని చంద్రబాబు విమర్శలు చేశారని’ అనిల్ గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ సహకరించక పోయినా పర్వాలేదని.. కానీ అడ్డుకుంటే సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారంటూ యనమల ఆరోపణలను మంత్రి అనిల్ తిప్పికొట్టారు. గతంలో వైస్రాయ్ హోటల్ లో జరిగిందేమిటో యనమల సమాధానం చెప్పాలన్నారు -
‘అలా కోరుకోవడంలో తప్పేముంది’
సాక్షి, శ్రీకాకుళం: పదవులు కోసం మనసును చంపుకునే రాజకీయాలు చేయనని.. మంచి, గౌరవం, అభిమానానికి తల వంచుతానని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులను ఉద్దేశించి తాను ఎలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలను కావాలనే ఒక వర్గం వక్రీకరించిందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు పాటు పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల యువత కృతజ్ఞతతో ఉండాలని కోరుకోవడంలో తప్పేముందని మంత్రి కృష్ణదాస్ పేర్కొన్నారు. -
‘చంద్రబాబుకు పిచ్చిపట్టింది’
సాక్షి, తిరుపతి: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసింది తామేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పు కోవడం సిగ్గుచేటని ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతిలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో గిరిజనులకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఐదు జీవోలు ద్వారా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. చంద్రబాబు చేసిన తప్పు వలన ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతుల్లో చనిపోయారని చెప్పారు. చంద్రబాబు అండ్‌కోకు పిచ్చి బాగా ముదిరిపోయిందని.. మెంటల్ ఆసుప్రతుల్లో చేర్పించాలని ఎద్దేవా చేశారు. (చదవండి: బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు: ఉత్తర్వులు జారీ) -
అవాస్తవాలు రాస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారు
సాక్షి, అనంతపురం: ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక సచివాలయం ఉద్యోగ పరీక్షల్లో అవినీతి జరిగిందని కట్టుకథలు అల్లారని ఎల్లోమీడియాపై మండిపడ్డారు. అవాస్తమని తేలడంతో గప్చిప్ అయ్యారన్నారు. ఇకనైనా వాస్తవాలు ప్రచురించాలని.. లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు మానుకోవాలి
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు మానుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి.. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను శనివారం మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తే సహించేదని లేదని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడే ఆ పార్టీ పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజాభీష్టం మేరకు నడుకోవాలని హితవు పలికారు. -
'టీడీపీ శ్రేణులు సరిగా స్పందించలేదు'
నెల్లూరు: వరద బాధితులను ఆదుకోవడంలో అధికారుల పనితీరు సరిగా లేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిపై శనివారం నెల్లూరులో చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నారని, వరద బాధితులకు తక్షణమే సాయం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వరద బాధితులకు సాయం చేయడంలో టీడీపీ శ్రేణులు కూడా సరిగా స్పందించడంలేదని అన్నారు.