
సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు మానుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి.. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను శనివారం మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తే సహించేదని లేదని అన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడే ఆ పార్టీ పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజాభీష్టం మేరకు నడుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment