Sankar Narayana
-
తాడిపత్రిలో టీడీపీ గూండాలు దాడులపై శంకర్ నారాయణ కామెంట్స్
-
చంద్రబాబు పాలనలో ప్రజలు కష్టాలు చూశారు
-
రాజకీయ మనుగడ కోసమే టీడీపీ నేతల విమర్శలు
-
ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం
-
ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం
సాక్షి, అనంతపురం: ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. డీఆర్డీవో, ఎన్హెచ్ఏఐ సహకారంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో వారం రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు. ప్లాంట్‌ను మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ, కరోనా కట్టడికి సీఎం వైఎస్ జగన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో మౌలిక సదుపాయాలు పెంచుతామని మంత్రి తెలిపారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం జగన్ అన్నిచర్యలు తీసుకుంటున్నారని ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడా లేదని హిందూపురంలో ఏర్పాటైన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ దేశంలోనే మొదటిదని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. చదవండి: పంటనష్టంపై చంద్రబాబు దుష్ప్రచారం: కన్నబాబు ఆనందయ్య మందు: నివేదిక సమర్పించిన టీటీడీ -
బాబు డైరెక్షన్లో ఎల్లో మీడియా పనిచేస్తోంది
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డైరెక్షన్లో ఎల్లో మీడియా పని చేస్తోందని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఏపీలో రహదారుల టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ పాలన చూసి చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. సీఎం జగన్ సర్కార్‌పై గోబెల్స్ ప్రచారం చేశారు. 3000 కోట్ల రూపాయల రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ 1 కావటం టీడీపీ, ఎల్లో మీడియాకు ఇష్టం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కుని ఏపీ సర్కార్‌పై అభాండాలు వేస్తున్నార’’ని అన్నారు. -
‘సీఎం జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది’
సాక్షి, అనంతపురం: కురుబ కులస్తుల ఆరాధ్య దైవం భక్త కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనంతపురం జిల్లా వాసులు, ముఖ్యంగా కురబ కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ ఏడాది జరగబోయే భక్త కనకదాస జయంతి వేడుకలు అధికారిక లాంఛనాలతో అంబరాన్నంటనున్నాయి. ఇక సీఎం కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడగానే మంత్రి శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కురుబ కులస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు అనంతపురంలోని కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. కురుబల మనోభావాలను గుర్తించి కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు కురుబలకు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని, కేవలం ఓటు బ్యాంక్ కోసం బీసీలను వాడుకున్నారని మంత్రి శంకర్ నారాయణ ధ్వజమెత్తారు. కాగా ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్‌కు కురుబ కులస్తులు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. సీపీఐ మనస్పూర్తిగా స్వాగతిస్తోంది కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ నిర్ణయాన్ని సీపీఐ మనస్పూర్తిగా స్వాగతిస్తోందన్నారు. కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోలేదని జగదీష్ విమర్శించారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం భక్త కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కురుబ సంఘం నేతలు వసికేరి లింగమయ్య, రాగే పరశురాం, తదితరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కులస్తుల మనోభావాలను గుర్తించారని, అంతేకాకుండా రాజకీయ ప్రాధాన్యత కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు మానుకోవాలి
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు మానుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి.. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను శనివారం మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తే సహించేదని లేదని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడే ఆ పార్టీ పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజాభీష్టం మేరకు నడుకోవాలని హితవు పలికారు. -
మంత్రి శంకర్ నారాయణ ఆకస్మిక తనిఖీలు
-
‘చంద్రబాబు నిర్వాకం వల్లే వలసలు’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకం వల్లే వలసలు పెరిగాయని వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శంకర్ నారాయణ, నదీం అహ్మద్ విమర్శించారు. ఆదివారం బెంగళూరు వలస కూలీలతో వైఎస్సార్సీపీ నేతలు ముఖాముఖి నిర్వహించారు. అనంతపురం జిల్లానుంచి బెంగళూరుకు వలస వెళ్లిన వారి స్థితిగతులను వారు ఆరా తీశారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. వలసలు పెరగటం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాలకు వేలాదిగా వలస వెళ్లారన్నారు. ఉపాది పనులు కల్పించనందుకే ఈ దుస్థితి వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వలస కూలీలంతా సొంత గ్రామాలకు తిరిగిరావాలని కోరారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బరోసా ఇచ్చారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని హామీ ఇచ్చారు. -
నేనున్నానని..
* నేటి నుంచి వైఎస్ జగన్ ఐదో విడత రైతుభరోసా యాత్ర * తాడిపత్రి, కదిరిలో పర్యటించనున్న ప్రతిపక్ష నేత * ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా * ఏర్పాట్లు పూర్తి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు * రైతు భరోసా యాత్ర ప్రారంభం * పెద్దవడుగూరు మండలం మిడుతూరు నుంచి సాక్షి ప్రతినిధి, అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా ఐదవ విడత యూత్ర బుధవారం జిల్లాలో ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆత్మహత్యలు చేసుకున్న 70 మంది రైతు, చేనేతల కుటుంబాలకు భరోసానిచ్చిన జగన్మోహన్రెడ్డి.. ఐదో విడతలో తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. భరోసాయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చే శాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనా, ప్రతిపక్ష నేతగా భరోసా కల్పించేందుకు వస్తున్న వైఎస్ జగన్‌ను జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు. అప్పుల బాధతోనే ‘అనంత’ ఆత్మహత్యలు అప్పులబాధ తాళలేక జిల్లాలో 145 మంది రైతులు, 26 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు తెగించారు. వీరంతా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతులే! నాలుగేళ్లుగా ‘అనంత’లో వరుస కరువులతో జిల్లా ైరె తాంగం తీవ్రంగా నష్టపోయారు. అప్పుల ఊభిలో కూరుకుపోయారు. ఈ క్రమంలో తాను అధికారంలోకి వస్తే రైతుల వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. దీంతో ఆశపడిన రైతులు చంద్రబాబును గద్దెనెక్కించారు. అయితే చంద్రబాబు మాత్రం అధికారం చేతిరాగానే రైతాంగాన్ని మరోసారి మోసం చేశారు. జిల్లాలో 10.24 లక్షల ఖాతాల్లో రూ. 6,817 కోట్ల రుణాలు బకాయిలున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తొలివిడతలో కేవలం రూ. 780.16 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఈ క్రమంలో గోరుచుట్టుపై రోకలిపోటులా 2013కు సంబంధించిన రూ.227 కోట్ల వాతావరణ బీమాను బ్యాంకర్లు పాతబకాయిల కింద జమ చేసుకున్నారు. అలాగే 2013-14కు సంబంధించి రూ. 643 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల వల్ల ఆత్మస్థైర్యం కోల్పోయిన రైతన్నలు ఆత్మహత్యలకు తెగించారు. తొలిరోజు పర్యటన ఇలా.. వైఎస్ జగన్ ఐదోవిడత రైతు భరోసా యాత్ర తొలిరోజు తాడిపత్రి నియోజకవర్గంలోని మిడుతూరు నుంచి మొదలవుతుంది. అనంతరం పెద్దవడుగూరు చేరుకుంటారు. అక్కడ రైతుసమస్యలపై ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి చిన్నవడుగూరు మీదుగా దిమ్మగుడి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు నాగార్జునరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆపై కండ్లగూడూరు మీదుగా చింతలచెరువు చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న జగదీశ్వరరెడ్డి, వెంకట్రామిరెడ్డి కుటుంబాలను పరామర్శిస్తారు. -
'అనంతలో రేపటి నుంచి వైఎస్ జగన్ పర్యటన'
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ‘అనంత’ రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా ఐదో విడత యాత్ర బుధవారం నుంచి మొదలవుతుందని ఆ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ తెలిపారు. తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్టు తెలిపారు. పెద్దవడుగురులో రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి అవుతారని చెప్పారు. అలాగే దిమ్మగుడిలో రైతు నాగార్జున కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శిస్తారు. చింతలచెరువులో రైతులు, వెంకట్ రాంరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని తలశిల రఘురాం, శంకర్ నారాయణ తెలిపారు. -
అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ఖరారు
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సోమవారం ఖరారు అయింది. ఈ నెల 6 నుంచి నాలుగో విడత రైతు భరోసాయాత్ర ప్రారంభం కానున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు శంకర్ నారాయణ, గుర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని వారు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత, కార్మిక కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. -
'జన్మభూమిలో నాయకులను నిలదీయండి'
-
'జన్మభూమిలో నాయకులను నిలదీయండి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకుని ప్రజల ముందుకు రావాలని సూచించారు. హామీలను తక్షణమే నెరవేర్చాలని జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు టీడీపీ నాయకులను నిలదీయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్ నారాయణ మాట్లాడుతూ..హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని జన్మభూమి కార్యక్రమం చేపడుతున్నారని చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. -
'జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం'
అనంతపురం : పెనుకొండ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా..తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మండిపడ్డారు. రైలు ప్రమాదంలో కర్నాటకకు చెందిన ఎమ్మెల్యే మరణించడం చాలా బాధాకరమన్నారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.10 లక్షలకు తక్కువ కాకుండా ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. కాగా అనంతపురం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే సహా అయిదుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
పార్టీ బలోపేతం కోసమే నూతన కమిటీలు
సోమందేపల్లి: జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ కోరారు. గురువారం మండల కేంద్రములోని గుడిపల్లి సర్పంచ్ వెంకటరత్నం కాంప్లెక్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు గతంలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నూతన కమిటీల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధ్యాన్యం ఉంటుందన్నారు. అందరి సహాయ సహకారాలతోనే నూతన కమిటీని ఎన్నుకొంటామన్నారు. ఎంపికైన సభ్యులు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. రుణమాఫీ, పింఛన్లపై పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సమన్వయ కర్త సానిపల్లి మంగమ్మ, మహిధర్, పార్టీ మండల కన్వీనర్ నాయకుడు నారాయణస్వామి, సర్పంచ్‌లు వెంకటరత్నం, నారాయణరెడ్డి, సింగిల్ విండో డైరక్టర్ కొల్లప్ప, నాయకులు అశ్వర్థమ్మ, సత్యనారాయణరెడ్డి, గజేంద్ర, నరేంద్రరెడ్డి, కంబాలప్ప, రామాంజినేయులు, నాగమణి, శ్రీరాములు, శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, ముత్యాలు, హరీష్, నారాయణరెడ్డి, తిమ్మారెడ్డి, కిష్టప్ప, సంజీవరాయుడు, సజ్జప్ప, ఆంజనేయులు, దామోదర్, ఆదినారాయణరెడ్డి, నాగరాజు, నజీర్, అంజినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షర భారత్ నిధులు స్వాహా
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలంలో సాక్షర భారత్ నిధులు స్వాహా అయ్యాయి. సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటరు శంకర్‌నారయణ దొంగ సంతకాలు చేసి సుమారు రూ.19,35,480లను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, గ్రామ కార్యదర్శులకు సంబంధం లేకుండానే నేరు చెక్కులను బ్యాంకులలో డ్రా చేసుకుని నిధులను స్వాహా చేసినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం సాక్షర భారత్ కో ఆర్డినేటర్‌గా శంకర్‌నారాయణ నియమితులయ్యారు. మొదట్లో ఇతని ప్రవర్తనపై అనుమానం రావడంతో జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఆ సమయంలో రూ. 1.45 లక్షలు స్వాహా చేసినట్లు బయటపడింది. ఆ డబ్బును అతని నుంచి రికవరీ చేశారు. మళ్లీ విచారణ చేయడంతో పెద్ద మొత్తంలో నిధులను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య కాలంలో శంకర్ నారాయణ సుమారు రూ.19,35,480లను డ్రా చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా రిక వరీ చేయాలని అధికారులు భావించారు. అంత డబ్బు తన వద్ద లేదని శంకర్‌నారాయణ చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. ఆడిట్ ఉందని చెప్పి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శుల నుంచి చెక్కు బుక్‌లు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచి చెక్కులను డ్రా చేస్తూ వచ్చాడు. ప్రభుత్వ చెక్కుల ద్వారా పది వేలు లోపు మాత్రమే డ్రా చేయాల్సి ఉంది. ఇతను మాత్రం ఒక్కొక్క చెక్కు నుంచి రూ.35వేలు కూడా డ్రా చేసినట్లు సమాచారం. ఎస్బీఐ అధికారులకు కూడా ఇందులో భాగం ఉన్నట్లు గ్రామ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా సాక్షర భారత్ నుంచి చెక్కులు డ్రా చేయాలంటే ఈఓపీఆర్డీ, గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ సంతకాలు ఉండాలి. వీరి సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామకార్యదర్శులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ జయసింహను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తాను ఇక్కడ లేనని ఆ సమయంలో ఇది జరిగిందన్నారు. -
‘సువర్ణ యుగం’ జగన్‌తోనే సాధ్యం
పామిడి,న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సువర్ణయుగం సాధ్యమని పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వీరా ఫంక్షన్‌హాలులో పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అధ్యక్షతన గుంతకల్ నియోజకవర్గ విస్త్రృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారన్నారు. ఆయన మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 50 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి వంతపాడడం ఆయన చేతకాని తనానికి నిదర్శనమన్నారు. సమైక్యాంధ్ర ముసుగులో ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు అశోక్‌బాబు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడంలో భాగంగా వారు రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. జననేత జగన్ మాత్రమే సమైక్యాంధ్రకోసం పోరాడుతున్నారన్నారు. ఆయనను సీఎం చేయాలన్నది జనం అభిమతమన్నారు. అధిష్టానికి తల్గొగి ప్రజావ్యతిరేకతను కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, మంత్రులతోపాటు, వారికి వంతపాడుతున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. వైఎస్ పాలన మళ్లీ చూడాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులనందరినీ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వైఎస్సార్సీపీ గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎం.వీరాంజనేయులు, బోయ తిప్పేస్వామి, లింగాల రమేష్ తదితరులు కోరారు.జగన్ సీఎం అయ్యాకేసమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. సమావేశంలో అనంత, కడప జిల్లాల సభ్యత్వ నమోదు సమన్వయకర్త చుక్కలూరు దిలీప్ రెడ్డి, పట్టణ, రూరల్ కన్వీనర్లు బొల్లు వెంకట్రామిరెడ్డి, చుక్కలూరు రామచంద్రారెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కణానికి ‘ఎల్’పై ప్రేమ ఎందుకు ?
అమినోయాసిడ్ల ఎంపిక గుట్టు ఛేదించిన సీసీఎంబీ సాక్షి, హైదరాబాద్: మనిషి దేహంలో దశాబ్దాల పరిశోధనల తరువాత కూడా తేలని మిస్టరీలు బోలెడు! హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఇటువంటి ఓ మిస్టరీని విజయవంతంగా ఛేదించి జీవశాస్త్రంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆ వివరాలు... జీర్ణక్రియ, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి రక్షణ, మన ఒడ్డూ, పొడవు, చర్మపు రంగు జన్యువులను నియంత్రించడం.. ఇలా మన శరీరంలో ప్రొటీన్లు చేసే పనులు ఎన్నో... ఎన్నెన్నో! ఈ ప్రొటీన్లు మూడు రసాయన మూలకాలతో కూడిన అమినోయాసిడ్లతో ఏర్పడతాయి. ఈ మూలకాల్లో ఏ ఒక్క మూలకం మారినా, ఉండాల్సిన స్థానంలో లేకపోయినా విపరీతాలు సంభవిస్తాయి. ఉదాహరణకు... ఒక అమినోయాసిడ్ మారిపోతే ఆ వ్యక్తికి థలసీమియా వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చే ప్రమాదముంది. కానీ ఇక్కడో చిక్కుంది. మన శరీరంలో రెండు రకాల అమినోయాసిడ్లు ఉంటాయి. వీటికి ఎల్, డీ అమినోయాసిడ్లుగా పేరు. మనిషికుండే రెండు చేతుల్లా ఇవీ ఒకే తీరుగా ఉంటాయి. కానీ ఒకదానికొకటి ప్రతిబింబం! దీన్నే కైరాలిటీ అంటారు. విచిత్రమైన విషయం ఏమిటంటే.. మన శరీర కణాలు ఎల్ అమినోయాసిడ్లను మాత్రమే ఉపయోగించుకుని దాదాపు 25 వేల ప్రొటీన్లను తయారుచేస్తూంటాయి. డీ అమినోయాసిడ్లను కణాలు ఎందుకు ఎంచుకోవు? బ్యాక్టీరియా కణాల నుంచి సంక్లిష్ట మానవ కణాల వరకూ ఎలాంటి తప్పుల్లేకుండా ఈ ఎంపిక ఎలా జరుగుతోంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సీసీఎంబీ శాస్త్రవేత్త శంకరనారాయణ సమాధానం కనుక్కున్నారు. ఒక్క ఎంజైమ్‌తో ‘డీ’లు మాయం: కణాల్లో ప్రొటీన్లను తయారు చేసే ఫ్యాక్టరీలుగా పిలిచే రైబోజోమ్లలో కేవలం ఎల్ అమినోయాసిడ్లను మాత్రమే ఎంచుకునే ఒక వ్యవస్థ ఉందన్న విషయం చాలాకాలం కిందటే తెలిసినప్పటికీ డీటీడీ అనే ఎంజైమ్ వల్ల ఇది సాధ్యమవుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే కణాల్లో ప్రొటీన్లు ఎలా తయారవుతాయో తెలుసుకోవాలి. మన సమాచారమంతా డీఎన్ఏలో దాగి ఉంటుందని మనకు తెలుసు. డీఎన్ఏ అమినోయాసిడ్లు, చక్కెరలతో తయారవుతుందనీ మనం చదువుకుని ఉంటాం. ప్రొటీన్లను తయారు చేసేందుకు అవసరమైన సమాచారం ఎంఆర్ఎన్ఏ అనే నిర్మాణం డీఎన్ఏ నుంచి కాపీ చేసుకుంటే... టీఆర్ఎన్ఏ దాన్ని మోసుకుని రైబోజోమ్లోకి చేరుతుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన అమినోయాసిడ్లు రైబోజోమ్లోకి వస్తాయన్నమాట. సరిగ్గా ఇక్కడే డీటీడీ ఎంజైమ్ పనిచేయడం మొదలవుతుంది. ఈ అమినోయాసిడ్లలో ఎల్, డీ రెండు రకాలూ ఉంటాయి. కానీ రసాయన నిర్మాణం, ఎంజైమ్‌లో అవి అతుక్కునే స్థానాలను బట్టి డీటీడీ ఏది ఎల్, ఏది డీ అన్నది గుర్తిస్తుంది. తదనుగుణంగా ఎల్లను మాత్రమే ఉంచుకుని డీలను కత్తిరించి పక్కకు తోసేస్తుంది. ఉపయోగమేమిటి?: జీవశాస్త్రంలో అత్యంత మౌలికమైన ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం లభించడం అన్నింటికంటే ముఖ్యమైన ఉపయోగం. అదేసమయంలో మన మెదడులో డీ అమినోయాసిడ్లను ఉపయోగించుకునే న్యూరోనల్ కణాలు ఎక్కువస్థాయిలో ఉంటాయి. ఈ తేడాతో ఉన్న లాభనష్టాలేమిటి? అన్నది ఇకపై తెలుసుకోవచ్చు. తద్వా రా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో కృత్రిమంగా తయారు చేసుకునే ప్రొటీన్లను మనం ఉపయోగిస్తుంటాం. వీటిల్లో ఏవి మనకు ఎక్కువ ఉపయోగడపడతాయో గుర్తించవచ్చు.