వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ‘అనంత’ రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా ఐదో విడత యాత్ర బుధవారం నుంచి మొదలవుతుందని ఆ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ తెలిపారు. తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్టు తెలిపారు.
పెద్దవడుగురులో రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి అవుతారని చెప్పారు. అలాగే దిమ్మగుడిలో రైతు నాగార్జున కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శిస్తారు. చింతలచెరువులో రైతులు, వెంకట్ రాంరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని తలశిల రఘురాం, శంకర్ నారాయణ తెలిపారు.