Talaseela raghuram
-
గొల్లపూడిలో సీఎం జగన్‌ను మద్దతుగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
-
రేపు నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ ఆధ్వర్యంలో యువభేరి జరగనున్నట్లు వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్‌లో యువభేరి ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు హాజరు కావాలని తలశిల రఘురాం పిలుపునిచ్చారు. -
నేనున్నానని..
* నేటి నుంచి వైఎస్ జగన్ ఐదో విడత రైతుభరోసా యాత్ర * తాడిపత్రి, కదిరిలో పర్యటించనున్న ప్రతిపక్ష నేత * ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా * ఏర్పాట్లు పూర్తి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు * రైతు భరోసా యాత్ర ప్రారంభం * పెద్దవడుగూరు మండలం మిడుతూరు నుంచి సాక్షి ప్రతినిధి, అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా ఐదవ విడత యూత్ర బుధవారం జిల్లాలో ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆత్మహత్యలు చేసుకున్న 70 మంది రైతు, చేనేతల కుటుంబాలకు భరోసానిచ్చిన జగన్మోహన్రెడ్డి.. ఐదో విడతలో తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. భరోసాయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చే శాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనా, ప్రతిపక్ష నేతగా భరోసా కల్పించేందుకు వస్తున్న వైఎస్ జగన్‌ను జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు. అప్పుల బాధతోనే ‘అనంత’ ఆత్మహత్యలు అప్పులబాధ తాళలేక జిల్లాలో 145 మంది రైతులు, 26 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు తెగించారు. వీరంతా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతులే! నాలుగేళ్లుగా ‘అనంత’లో వరుస కరువులతో జిల్లా ైరె తాంగం తీవ్రంగా నష్టపోయారు. అప్పుల ఊభిలో కూరుకుపోయారు. ఈ క్రమంలో తాను అధికారంలోకి వస్తే రైతుల వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. దీంతో ఆశపడిన రైతులు చంద్రబాబును గద్దెనెక్కించారు. అయితే చంద్రబాబు మాత్రం అధికారం చేతిరాగానే రైతాంగాన్ని మరోసారి మోసం చేశారు. జిల్లాలో 10.24 లక్షల ఖాతాల్లో రూ. 6,817 కోట్ల రుణాలు బకాయిలున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తొలివిడతలో కేవలం రూ. 780.16 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఈ క్రమంలో గోరుచుట్టుపై రోకలిపోటులా 2013కు సంబంధించిన రూ.227 కోట్ల వాతావరణ బీమాను బ్యాంకర్లు పాతబకాయిల కింద జమ చేసుకున్నారు. అలాగే 2013-14కు సంబంధించి రూ. 643 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల వల్ల ఆత్మస్థైర్యం కోల్పోయిన రైతన్నలు ఆత్మహత్యలకు తెగించారు. తొలిరోజు పర్యటన ఇలా.. వైఎస్ జగన్ ఐదోవిడత రైతు భరోసా యాత్ర తొలిరోజు తాడిపత్రి నియోజకవర్గంలోని మిడుతూరు నుంచి మొదలవుతుంది. అనంతరం పెద్దవడుగూరు చేరుకుంటారు. అక్కడ రైతుసమస్యలపై ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి చిన్నవడుగూరు మీదుగా దిమ్మగుడి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు నాగార్జునరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆపై కండ్లగూడూరు మీదుగా చింతలచెరువు చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న జగదీశ్వరరెడ్డి, వెంకట్రామిరెడ్డి కుటుంబాలను పరామర్శిస్తారు. -
'అనంతలో రేపటి నుంచి వైఎస్ జగన్ పర్యటన'
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ‘అనంత’ రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా ఐదో విడత యాత్ర బుధవారం నుంచి మొదలవుతుందని ఆ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ తెలిపారు. తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్టు తెలిపారు. పెద్దవడుగురులో రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి అవుతారని చెప్పారు. అలాగే దిమ్మగుడిలో రైతు నాగార్జున కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శిస్తారు. చింతలచెరువులో రైతులు, వెంకట్ రాంరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని తలశిల రఘురాం, శంకర్ నారాయణ తెలిపారు. -
నేటి నుంచి వైఎస్ జగన్ జలదీక్ష
♦ మూడ్రోజులు నిరాహారదీక్ష ♦ కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు ప్రతిఘటన.. కర్నూలు నుంచి సాక్షి ప్రతినిధి: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు కర్నూలులో నిరవధిక నిరాహారదీక్ష చేయడానికి రంగం సిద్ధం అయింది. నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో దీక్షా వేదికపై ఆయన సోమవారం ఉదయం తన నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తయితే తమ బతుకులు బుగ్గి పాలు అవుతాయనే ఆందోళన ఆంధ్రప్రదేశ్ రైతుల్లోనూ, ప్రజల్లోనూ నెలకొని ఉంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిఘటించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నిష్క్రియాపరత్వంపై నిరసనను వ్యక్తం చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా ప్రజల ఆక్రందనలను వినిపించేందుకు జగన్ ఈ నిరాహారదీక్షకు పూనుకుంటున్నారు. 16న జగన్ మూడు రోజుల నిరాహారదీక్ష ప్రారంభం కానుండగా మరుసటి రోజైన 17వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో జలదీక్ష చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఉదయానికి కర్నూలు చేరుకోనున్న జగన్ మూడు రోజుల నిరాహారదీక్ష చేయనున్న జగన్ సోమవారం ఉదయం 10.30 గంటలకు దీక్షా వేదికకు చేరుకుంటారు. దీక్షకు వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారమే కర్నూలుకు చేరుకుని జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డితో ఏర్పాట్లను సమీక్షించారు. ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు వై.ఐజయ్య, వై.విశ్వేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డి తదితరులు కూడా దీక్షాస్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
'వైఎస్ జగన్ జలదీక్షకు సర్వం సిద్ధం'
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ దీక్షను ప్రారంభిస్తారని చెప్పారు. కృష్ణా జలాల నీటి మళ్లింపు.. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ జలదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. మే 16 నుంచి మే 18 వరకు కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు వైఎస్ జగన్ జలదీక్ష కొనసాగనున్నట్టు చెప్పారు. వైఎస్ జగన్ జలదీక్షకు మద్దతుగా అన్ని మండల హెడ్‌క్వార్టర్స్‌లలో మే 17న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు జలదీక్ష చేపట్టనున్నట్టు తలశిల రఘురాం పేర్కొన్నారు. కర్నూలు వేదికగా మూడు రోజుల పాటు సాగే వైఎస్ జగన్ జలదీక్షకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు కర్నూలుకు చేరుకుంటున్నారు. వైఎస్ జగన్ జలదీక్షకు రాయలసీమ, కృష్ణా డెల్టా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే జలదీక్ష ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే విశ్వేశ్శర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, జయరాములు, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ఐజయ్య, గౌరు చరితారెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పర్యటించారు. -
మాచర్లలో వైఎస్ జగన్ ధర్నా: తలశిల రఘురామ్
గుంటూరు: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (సోమవారం) గుంటూరు జిల్లాలోని మాచర్లలో జరిగే ధర్నాలో పాల్గొననున్నట్టు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి రేపు ఉదయం 10 గంటలకు మాచర్లకు వైఎస్ జగన్ చేరుకోనున్నట్టు చెప్పారు. మాచర్ల ఎమ్మార్వో కార్యాలయం వద్ద వేలాది మంది ప్రజలతో కలిసి వైఎస్ జగన్ ధర్నా చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు, తాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వైఎస్ జగన్ ధర్నా చేపడుతున్నట్టు తలశిల రఘురామ్ పేర్కొన్నారు. -
గొట్టిపాటి నర్సయ్య విగ్రహావిష్కరణకు జగన్
సాక్షి, విజయవాడ బ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రకాశం జిల్లాలో దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి నర్సయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. జగన్ గురువారం ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా ప్రకాశం జిల్లా యద్దనపూడి గ్రామానికి వెళ్తారని, అక్కడ నర్సయ్య విగ్రహావిష్కరణలో పాల్గొంటారని చెప్పారు. తిరిగి సాయంత్రం గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ వెళతారన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతిలో జరిగే ఒక వివాహానికి హాజరవుతారని, ఆ రోజు రాత్రికి పులివెందులకు చేరుకుంటారని తెలిపారు. 13వ తేదీ స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని రఘురాం చెప్పారు. -
నేటి నుంచి ‘పశ్చిమ’లో వైఎస్ జగన్ పర్యటన
ఏలూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. శుక్రవారం సాయంత్రం నరసాపురంలో జనభేరి నిర్వహిస్తారని పేర్కొన్నారు. 15న పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలోను, 16న కొవ్వూరులో రోడ్‌షో నిర్వహిస్తారని వివరించారు.