గొట్టిపాటి నర్సయ్య విగ్రహావిష్కరణకు జగన్ | Ys jagan mohan reddy to inaugurate gottipati Narasaiah statute | Sakshi
Sakshi News home page

గొట్టిపాటి నర్సయ్య విగ్రహావిష్కరణకు జగన్

Published Wed, Dec 10 2014 2:20 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Ys jagan mohan reddy to inaugurate gottipati Narasaiah statute

సాక్షి, విజయవాడ బ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రకాశం జిల్లాలో దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి నర్సయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. జగన్ గురువారం ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా ప్రకాశం జిల్లా యద్దనపూడి గ్రామానికి వెళ్తారని, అక్కడ నర్సయ్య విగ్రహావిష్కరణలో పాల్గొంటారని చెప్పారు. తిరిగి సాయంత్రం గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ వెళతారన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతిలో జరిగే ఒక వివాహానికి హాజరవుతారని, ఆ రోజు రాత్రికి పులివెందులకు చేరుకుంటారని తెలిపారు. 13వ తేదీ స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని రఘురాం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement