
రేపు నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ ఆధ్వర్యంలో యువభేరి జరగనున్నట్లు వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్‌లో యువభేరి ప్రారంభమవుతుందన్నారు.
విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు హాజరు కావాలని తలశిల రఘురాం పిలుపునిచ్చారు.