
సాక్షి, విజయవాడ : యువభేరిపై ఏపీ మంత్రులు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఉన్న అవగాహన కూడా మంత్రులకు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. యువత కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తుంటే టీడీపీ భయపడుతోందని పార్థసారధి వ్యాఖ్యానించారు. దమ్ముంటే వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
కేంద్రంతో లాలూచిపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, అయితే ఇప్పటివరకూ ఎన్ని నిధులు వచ్చాయో చెప్పాలని పార్థసారధి డిమాండ్ చేశారు. కాగా అనంతపురంలో ఇవాళ వైఎస్ జగన్ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పలువురు విద్యార్థులు, మేథావులు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో తమను ఎలా మోసం చేశారో, తమలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఆగ్రహ రూపంలో వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment