yuvabheri
-
‘దమ్ముంటే జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి’
సాక్షి, విజయవాడ : యువభేరిపై ఏపీ మంత్రులు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఉన్న అవగాహన కూడా మంత్రులకు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. యువత కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తుంటే టీడీపీ భయపడుతోందని పార్థసారధి వ్యాఖ్యానించారు. దమ్ముంటే వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కేంద్రంతో లాలూచిపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, అయితే ఇప్పటివరకూ ఎన్ని నిధులు వచ్చాయో చెప్పాలని పార్థసారధి డిమాండ్ చేశారు. కాగా అనంతపురంలో ఇవాళ వైఎస్ జగన్ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పలువురు విద్యార్థులు, మేథావులు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో తమను ఎలా మోసం చేశారో, తమలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఆగ్రహ రూపంలో వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ఉత్సాహంగా ‘అనంత’ యువభేరి
-
జగన్ అన్నా నువ్వొస్తే తొలిసంతకం దానిమీదే పెట్టాలి?
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పలువురు విద్యార్థులు, మేథావులు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో తమను ఎలా మోసం చేశారో, తమలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఆగ్రహ రూపంలో వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన 'యువభేరి' సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన ప్రసంగం చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు చంద్రబాబు పరిపాలన తీరుపై, చేస్తున్న మోసాలపై నిప్పులు చెరిగారు. తాము ఇక చంద్రబాబును ముఖ్యమంత్రిగా భరించలేమని, ఎట్టి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ను ఆహ్వానించి తమ కలలను నెరవేర్చుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ముమ్మాటికీ వైఎస్ జగన్ వెంట నడుస్తామని, ఏ శక్తి తమను ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నలు, సందేహాల రూపంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం ఎలా జరిగిందంటే.. అంజు, ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజీ : ప్రజాస్వామ్య దేశం మనది మన నేతలను మనం ఎన్నుకుంటాం. వారిపై నమ్మకంతో ఉంటాం. ఒకసారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా మర్చిపోతారు? ప్రత్యేక హోదా 15ఏళ్లపాటు కావాలని అడిగిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మర్చిపోయారు? ప్రభుత్వాన్ని వెనక్కి పిలిచే అవకాశం ఉందా అన్న? తప్పుడు హామీలు ఇచ్చిన వారిని వెనక్కి పిలిచే అవకాశం ఉండాలి? మీలాంటి యంగ్ డైనమిక్ లీడర్ ఉంటే మమ్మల్ని ఎవరూ ఆపలేరు ప్రత్యేక హోదా సాధించి తీరుతాం. వైఎస్ జగన్ : 'విశ్వసనీయత అంటే ఏమిటో నీ ప్రశ్న చూసిన తర్వాతనైనా చంద్రబాబు తెలుసుకోవాలి. మీకున్న అవగాహన కూడా చంద్రబాబుకు లేదు. ఇలాంటి వారిని దింపాలంటే మళ్లీ ఎన్నికలు రావాల్సిందే. మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు' ప్రియాంక, ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజీ : ప్రత్యేక హోదా కోసం 10 నుంచి 15 ఏళ్లు అడిగిన చంద్రబాబు ఇప్పుడెందుకు వృధా అన్నారు. అప్పుడు ఈ ఆలోచన ఏమైంది. మనం ఏమన్నా పిచ్చోళ్లమా.. మీరే మాకు న్యాయం చేయాలి. వైఎస్ జగన్ : 'కచ్చితంగా మీకు న్యాయం చేస్తాను. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు చంద్రబాబు, జగన్ మొఖం చూసి పెట్టరు. వారికి కలిగే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు పెడతారు. ప్రత్యేక హోదా ఉందనే కారణంతో పలువురు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు ఆయా రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టారు, భూములు కొన్నారు. విజయ్ భాస్కర్, ప్రొగ్రెసివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ : అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు ఎన్నో దొంగ హామీలు ఇచ్చారు. కాపులను బీసీలు చేస్తానని అన్నారు, కురుమ, కురుబలను, వాల్మీకిలను ఎస్టీలను చేస్తానని చెప్పారు. 30 ఏళ్ల అనుభవం అని చెప్పిన దొంగబాబు అందరినీ మోసం చేశారు. దివ్యాంగులను మోసం చేశాడు. మాకోసం చంద్రబాబు ఏం చేయలేదు. నీకోసం ప్రాణాలు ఇచ్చయినా ప్రత్యేక హోదా కోసం మీతోపాటు సాగుతాను. వైఎస్ జగన్ : 'భాస్కర్ చెప్పింది ముమ్మాటికి నిజమే. ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. మోసం చేయడం తప్పనే విషయం భాస్కర్ ప్రశ్నతోనైనా తెలుస్తుందని ఆశిద్దాం శిరీష, బీఫార్మసీ థర్డ్ ఇయర్: మహిళలకు రక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు తన ప్రభుత్వంలోని ఓ ఎమ్మెల్యే ఓ ప్రభుత్వ ఉద్యోగి అయిన వనజాక్షిని నడిరోడ్డుపై జుట్టుపట్టుకొని కొడితే ఎలాంటి శిక్షను వేయలేదు. స్పీకర్ కోడెల శివప్రసాద్ కోడలిని చిత్రహింసలు పెడితే ఏం చర్యలు తీసుకోలేదు. కానీ, వైఎస్ఆర్ హయాంలో ఒకమ్మాయిపై వరంగల్ యాసిడ్ దాడి చేస్తే కుక్కల్ని కాల్చినట్లే కాల్చేశారు. అలాంటి భద్రత మీరు మాకు ఇవ్వాలి. భద్రత కావాలంటే బాబు రావాలన్నారు. బాబొచ్చాక భద్రత పోయింది.. మీరు వస్తేనే భద్రత వస్తుంది.. మీరు మాకు భద్రతను ఇవ్వాలి. వైఎస్ జగన్ : 'నేను వచ్చాక తప్పకుండా మీకు భద్రత ఉండి తీరుతుంది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా వనజాక్షిపై మీడియా చూస్తుండగా దాడి జరిగినా చంద్రబాబు చర్చలు తీసుకోలేదు. రిషితేశ్వరిపై జరిగినా చర్యలు లేవు. ఏ ఆడపడుచుకు ఇబ్బంది వచ్చినా ఫోన్ కొట్టండి చర్యలు తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కనీసం యాక్షన్ తీసుకోని పరిస్థితి ఉంది. త్వరలోనే చంద్రబాబుకు బుద్ధి చెబుదాం. ప్రీతి, ఇంజినీరింగ్ : అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదావల్ల లాభం లేదన్నప్పుడు బాధపడ్డాను. విద్యార్థులు, నిరుద్యోగులు నష్టం జరుగుతుందని తెలిసి కూడా చంద్రబాబు అర్థరాత్రి ప్యాకేజీని ఎలా స్వాగతించారు? వైఎస్ జగన్: వాస్తవానికి ప్యాకేజీ రాకపోయినా వచ్చినట్లు భ్రమలు కల్పిస్తూ చంద్రబాబు ఆరోజు అర్థరాత్రి మీటింగ్ పెట్టి చెప్పాడు. ఇప్పుడేమో కేంద్రం చెప్పిన ప్యాకేజీ ఏదీ కూడా ఇవ్వలేదని మరో కొత్త డ్రామా ఆడుతున్నారు. ఆరోజు అవసరానికి ఏం కావాలో అదే చంద్రబాబు మాట్లాడతారు.. అవసరం తీరాక వదిలేస్తారు. మీ ప్రశ్నలు విన్నాకైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుంటారేమో చూద్దాం. సంపత్, లాస్టూడెంట్ : ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ గజదొంగ చంద్రబాబు పక్క రాష్ట్రంలో నల్లడబ్బును లంచం ఇచ్చి దొరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? వైఎస్ జగన్ : ఒక ఎమ్మెల్సీని అక్రమంగా కొనేందుకు ప్రయత్నించి నల్లడబ్బును ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపుల్లో దొరికినా కూడా ఆ మనిషిపై ఏ కేసు లేదు.. యాక్షన్ లేదు. నిజంగా చిన్నా చితక ఉద్యోగి అయితే ఈపాటికే సస్పెండ్ చేసి జైలుకు పంపేవారు. దేశంలో ఈ ప్రశ్నను ప్రతి పౌరుడు ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అనేది అందరికీ సమానంగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. నేను కూడా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనే బలంగా కోరుతున్నాను. రవళి ఎస్ఆర్ఐటీ : ప్రత్యేక హోదావల్ల మనకు ఇండస్ట్రీలు వచ్చేవి.. కానీ, కోట్లు వృధా చేసి విదేశాలకు చంద్రబాబు ఎందుకు వెళ్తున్నారు? పెట్టుబడులు తీసుకురావడానికా లేక ఇక్కడ దోచుకుంది అక్కడ దాచుకోవడానికా? వైఎస్ జగన్ : చంద్రబాబు టూర్లు చేస్తేనో లేక జగన్ ముఖం చూసో పెట్టుబడులు రావు. ప్రత్యేక హోదాలాంటి వాటి వల్ల వారికి వచ్చే ప్రయోజనాలు చూసి వస్తాయి. వ్యక్తులను చూసి పెట్టుబడులు రావు. ఆ విషయం చంద్రబాబుకు అర్ధం అయ్యే ఉండాలి. చంద్రబాబు ఎక్కడికైనా వెళితే సాధారణంగా వెళ్లరు. ఆయనకు ప్రత్యేక విమానాలు కావాలి.. పైగా కోట్లు వృధా చేస్తారు. ఆ ప్రయత్నమేదో ప్రత్యేక హోదా కోసం చేసినా ఈ పాటికి వచ్చి ఉండేది. ఇక ఆయన పెట్టుబడులు తేవడానికి వెళుతున్నారో దోచుకుంది దాచుకోవడానికి వెళ్తున్నారో ఆయన మనస్సాక్షికే తెలియాలి. హనీషా, ఎస్ఆర్ఐటీ : మన రాష్ట్రంలో ఎంతోమంది ఎంతోమంది గొప్ప ఆర్కిటెక్ట్స్‌ను, ఇంజినీర్లు కాదని చంద్రబాబు సింగపూర్‌కు ఎందుకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడేమో రాజమౌళి అంటున్నారు. ఈ రాజధాని ఉంటుందా సినిమా సెట్టింగుల్లాగానే పోతుందా. నాకు భయం వేస్తుంది. వైఎస్ జగన్ : అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా చంద్రబాబు ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు. అసెంబ్లీ, సెక్రటేరియల్ ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడొస్తుందో తెలియదు. మన కర్మేంటంటే కేంద్రం నుంచి రూ.2వేల 500కోట్లు తీసుకున్నారు. కేంద్రం మరిన్ని నిధులు ఇవ్వాలంటే ఈయన బిల్లులు చూపించాలి. ఈయన బిల్లులు ఇవ్వరు వారు నిధులు ఇవ్వరు. సినిమాలు చూసి సినిమా సెట్లు బాగున్నాయని డైరెక్టర్లకు కాంట్రాక్టు ఇచ్చే ముఖ్యమంత్రులను మన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి చివర వరకైనా ఆయన ఏ బిల్డింగ్ కట్టడు ఒక సినిమా మాత్రం చూపిస్తాడు అంజి, విద్యార్థి : ఆధార్ కార్డు, పాన్ కార్డు వివిధ పేర్లతో ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా చంద్రబాబు చేస్తున్నారు. నాకు ఎంబీఏ చేయాలన్న కోరిక. కానీ, చంద్రబాబు రూ.35 వేలే ఇస్తున్నారు. మా అమ్మ కూలి చేస్తే వచ్చేది రూ.200 మాత్రమే. నేను ఆ కూలి పైసలతో ఎలా చదువుకోవాలి. వైఎస్ జగన్ : ఫీజులు చూస్తేనేమో ఏడాదికి ఇంజినీరింగ్ రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50వేలు, ఇలా ఒక్కో కాలేజీలో ఒక్కో ఫీజు ఉంది. చంద్రబాబు మాత్రం ఇస్తుంది 35వేలు మాత్రమే. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందో రాదో అని విద్యార్థులు భయపడుతున్నారు. దేవుడు దయతో మన ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతోపాటు రూ.20వేలు బోర్డింగ్ ఖర్చులు కూడా ఇచ్చుకుందాం. రేఖ, ఎస్ఆర్ఐటీ కాలేజ్ : ఒక పంట పోతేనే రైతులు ఆగమవుతారు. అలాంటిది వారి భూములు లాక్కుంటున్నారు. వారు ఎలా బతకాలి? అమరావతిలో ఎందుకు అన్ని భూములు లాక్కుంటున్నారు? రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారా? రాజధాని కట్టాలని అనుకుంటున్నారా? వైఎస్ జగన్ : మూడు నుంచి నాలుగు పంటలు పండే భూములను రైతులను బెదిరించి ప్రలోభాలుపెట్టి వేల ఎకరాలు తీసుకోవడం దారుణం. రాజధాని అక్కడ వస్తుంది.. ఇక్కడ వస్తుంది అని చెప్పి చివరకు అందరినీ మోసం చేసి పంటలు పండే ప్రాంతంలో రాజధాని అని ప్లాన్ చేశారు. రైతులను దారుణంగా దెబ్బకొట్టారు. గుర్రప్ప, ఆంగ్ల బోధకుడు : వైఎస్ఆర్ ఉన్నప్పుడు 104, 108 సర్వీసులు గొప్పగా సాగేవి. 2019లో మీరు పదవిలోకి రాగానే వైఎస్ఆర్ పథకాలన్నింటిపై తిరిగి సంతకం చేయాలి. వైఎస్ జగన్ : నిజంగానే ఆరోగ్య శ్రీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆస్పత్రికి వెళితే ఇంటికి తిరిగొస్తామా అని నమ్మకం లేని పరిస్థితి. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా జరిపిస్తాం. పేదవాడికి ఉచిత వైద్యం ఉంటుంది. మందుల ఖర్చు, విశ్రాంతి సమయంలో ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తాం. ప్రత్యేక హోదా సాధించేందుకు అందరం కలిసి కట్టుగా సాగుదాం. -
హోదాపై మోసం.. ప్రత్యేక ప్యాకేజీ అబద్ధం
-
హోదాపై మోసం.. ప్రత్యేక ప్యాకేజీ అబద్ధం
సాక్షి, అనంతపురం : పార్లమెంట్ సాక్షిగా హామీయిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయేది. కానీ.. అధికారంలో ఉన్నవారు మోసం చేయడంతో ఆ పరిస్థితిని మనం చూడలేకపోతున్నాం. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చగలదు. అందుకే మన హక్కును సాధించుకోవడానికి నిరంతరాయంగా, ఐక్యంగా పోరాడుదాం..’’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం అనంతపురం పట్టణంలోని ఎంవైఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జననేత జగన్ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే.. ‘‘హోదాకానీ, ప్యాకేజీకానీ లేదన్నది నిజం : ప్రత్యేక హోదా రాష్ట్రాల్లోని 6.2 శాతం జనాభాకు 1.58 లక్షల కోట్లిచ్చారు, మరి 4కోట్ల ఆంధ్రులకు ఏమిచ్చారు? ప్రత్యేక హోదా ఎంత అవసరమో ప్రజలందరికీ అర్థమైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం అర్థం కావడంలేదు. కేవలం తన స్వార్థం కోసం ఆయన హోదాని పణంగా పెట్టారు. మాట్లాడితే, 14 ఆర్థిక సంఘం ఇవ్వడం లేదని, హోదాను మించిన ప్యాకేజీ తీసుకొచ్చానని బొంకుతున్నారు. ఈ రెండూ అబద్ధాలే. దేశంలో 11 రాష్ట్రాలకు హోదా ఉన్నమాట వాస్తం. మనకు మాత్రం హోదాగానీ, ప్యాకేజీకానీ లేదన్నదీ నిజం. రాష్ట్రాలకు వివిధ రూపాల్లో కేంద్రం ఎన్ని నిధులిచ్చాయనే దానిపై 2017, ఏప్రిల్ 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల జనాభా 7.51 కోట్లు, అంటే దేశ జనాభాలో 6.2 శాతం. వీళ్లకు కేంద్రం 2016-17లో 1.58 లక్షల కోట్లు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తం(9.7 లక్షల కోట్లులో) ప్రత్యేక హోదా రాష్ట్రాలకే 14.06 శాతం నిధులు వెళ్లాయి. మరి దేశజనాభాలో 4.08 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేవలం 44 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. అదే హోదా ఉండి ఉంటే ఇంకా మెండుగా నిధులు వచ్చేవి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అంటున్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రాలకు నిధులిచ్చే విషయంలో తేడాలు ఎందుకు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. ఇటీవల జీఎస్టీని తెచ్చారు. అందులోనూ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు భారీగా మినహాయింపులు ఇచ్చారు. ప్రధాని సౌభాగ్య యోజన(కరెంట్ లేని ఇళ్లకు కనెక్షన్) పథకంలోనూ హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా వాస్తవమైతే, చంద్రబాబు తన దగ్గరున్న మీడియాతో హోదా వల్ల ప్రయోజనం లేదంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది దారుణం కాదా? ఇది 10వ యువభేరి : ఇవాళ అనంతపురంలో జరుగుతున్నది 10వ యువభేరి. గుంటూరులో 9వ యువభేరి తర్వాత విద్యార్థులకు పరీక్షలు, సెలవులు, తర్వాతి విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జరిగింది. విరామం తర్వాత తిరిగి పోరాటాన్ని పునఃప్రారంభించాం. గత మూడున్నర సంవత్సరాలుగా అందరం కలిసికట్టుగా పోరాడం. వైఎస్సార్సీపీ పార్టీ పరంగానూ గడిచిన కాలంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాలు చేశాం. రెండు నిరాహార దీక్షలు జరిగాయి. మంగళగిరిలో రెండు రోజులు, గుంటూరులో 7 రోజులు దీక్ష చేశాం. చంద్రబాబు పోలీసుల్ని పంపి గుంటూరు దీక్షను భగ్నం చేశారు. కనీసం ఆయనైనా మోదీగారిని ప్రత్యేక హోదా గురించి అడిగారా అంటే అదీ లేదు. ఇదే డిమాండ్ కోసం వైఎస్సార్సీపీ రెండు సార్లు రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చింది. ఆ బంద్‌లను విఫలం చేయడానికి చంద్రబాబు గారు బస్సులు తిప్పించారు. హోదా హామీ నెరవేర్చాలని ఢిల్లీ వెళ్లి ప్రధానిని మూడు,నాలుగు సార్లు కలిసి, వినతిపత్రాలిచ్చాం. చట్టసభలైన పార్లమెంట్, అసెంబ్లీల్లోనూ ప్రత్యేక హోదా అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టిగా పోరాటం చేశారు. ప్రతి బహిరంగ సభల్లో అంశాన్ని ప్రస్తావించాం. పార్టీ ప్లీనరీలో హోదాపై తీర్మానం చేయించాం. ఇవన్నీ చేసినా పాలకులు హోదా ఇచ్చారా?.. అధికారంలో ఉన్నవారి చెవులు మూసుకుపోయిన పరిస్థితిలోనూ మనం మాత్రం పోరాటాలు కొనసాగిస్తున్నాం. హైదరాబాద్ నగరాన్ని ఆధునికంగా మార్చుకోవడానికి 60 ఏళ్లు పట్టింది. విభజన తర్వాత అలాంటి నగరాన్ని మనం కోల్పోయాం. అందుకే పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ఐదుకోట్ల మంది ఆంధ్రులకు హామీ ఇచ్చారు. హోదా పేరుతో ఓట్లు పొంది, అధికారంలోకి వచ్చినవాళ్లు కొద్ది రోజుల్లోనే ప్లేటు ఫిరాయించారు. ఈ సందర్భంగా తిరుపతి సభలో నరేంద్ర మోదీ, చంద్రబాబులు చేసిన ప్రసంగాలను మనం ఒకసారి గుర్తుచేసుకుందాం. (ఆ తర్వాత చంద్రబాబు ‘బహునాలుక’ ప్రకటనలను విద్యార్థులకు చూపెట్టారు) 10 కాదు, 15 ఏళ్లు కావాలన్న మాటలు ప్రజలకు గుర్తే : ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఆస్పత్రులు, స్కూళ్లు వస్తాయి. అవి వస్తేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. హోదా ఉంటే పరిశ్రమలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. కొత్త పరిశ్రమలు పెట్టగోరేవారు చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి రారు.. పన్ను మినహాయింపులు ఉంటేనే ముందుకొస్తారు. ఇది నిజం కాబట్టే విభజన సమయంలో అధికార, ప్రతిపక్షాలు హోదాపై గట్టిగా మాట్లాడాయి. అంతటితో ఆగకుండా హోదా ఐదేళ్లు, 10 ఏళ్లు కాదు, 15 ఏళ్లు కావాలని అన్నారు. కానీ తీరా ఎన్నికలు అయిపోయి, అధికారంలోకి వచ్చాక ఏమంటున్నారు? ప్రత్యేకహోదా సంజీవనా? అని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా పెద్దలు ఇచ్చిన హామీ అమలు కాకుంటే ప్రజాస్వామ్యం పరిస్థితేంటి? అనంతపురం గోస కనబడదా? : అనంతపురం లాంటి జిల్లాకు ప్రత్యేక హోదా చాలా అవసరం. రాజస్థాన్‌లోని జైసల్మేర్ తర్వాత దేశంలో అతితక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురమే కావచ్చు. జిల్లాలోని అధికప్రాంతం ఎడారిగా మారుతుందేమోనని మనం భయపడుతున్నాం. ఇప్పటికీ ఏపీలో అతిపెద్ద జిల్లా అనంతపురమే. అత్యధికంగా వలసలు పోతున్న జిల్లా కూడా ఇదే. పంటలు పండక, పనులు లేక, అప్పులపాలై ఏటా కనీసం 4,5 లక్షల మంది వలసలు పోతున్నారు. చివరికి రైతుల ఆత్మహత్యలు సైతం ఎక్కువగా ఉన్న జిల్లా కూడా అనంతపురమే కావడం శోచనీయం. 2014లో అనంతపురం జిల్లా సాక్షిగా, అటుపై అసెంబ్లీలోనూ చంద్రబాబు చెప్పిందేంటి? అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం, స్మార్ట్ సిటీ, బెంగళూరు-చెన్నై కారిడార్, టెక్స్టైల్ పార్క్, ఫుడ్‌పార్క్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ క్టస్లర్, బీహెచ్ఈఎల్, పుట్టపర్తిని ఆథ్యాత్మిక నగరంగా మార్చి, విమాన నిర్వహణ కేంద్రం స్థాపన, స్టీల్ ప్లాంట్, హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి.. ఒక్కటేమిటి? నోటికొచ్చిన హామీలన్నీ చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ చెయ్యలేదు. నంబర్ 2 నుంచి పాదయాత్ర : నవంబర్ 2 నుంచి పాదయాత్ర మొదలవుతుంది. ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుంది. 6 నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర జరుగుతుంది. యువభేరి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గ కోఆర్డినేటర్లు.. కాలేజీలకు వెళ్లి, విద్యార్థులను కలుస్తారు. ప్రజల మద్దతును కూడగడుతూ, అవసరమైనప్పుడు చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం. పోరుబాటలో భాగంగా రాబోయే రోజుల్లో ఇవన్నీ జరుగుతాయి. పిల్లలకు పరీక్షలనే ఉద్దేశంతో హోదా ఉద్యమానికి విరామం ఇచ్చాం. ఈ ఆరు నెలల కాలంలో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా? జగన్ మాట్లాడితేనే ప్రత్యేకహోదా అనే పరిస్థితి మారాలి. పాలకులపై ఒత్తిడి పెరగాలి. ఆమేరకు మనం పోరాటాలు చేయాలి. అందుకోసం మీ అందరి తోడ్పాటు, సహకారం కావాలి. అప్పుడే మనం హోదాను సాధించుకుంటాం. ప్రత్యేక హోదా అంటే ఉద్యోగాల కోసం మన పిల్లలు ఎక్కడికో పోవాల్సిన పనిలేదు. చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అని గుర్తుంచుకోండి’’ అని జగన్ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. -
ఉత్సాహంగా ‘అనంత’ యువభేరి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ఏర్పాటు చేసిన యువభేరి కార్యక్రమం మంగళవారం అనంతపురంలో అశేష జనసందోహం నడుమ ప్రారంభమైంది. నగర శివారు బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో సభా ప్రాంగణం హోరెత్తింది. జై జగన్ అంటూ యువకులు నినదించారు. యువభేరికి యువత, మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీగా వచ్చిన జనంతో సభాప్రాంగణం కిక్కిరిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రొఫెసర్లు, మేధావులు ప్రత్యేక హోదా నొక్కి చెప్పారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు హోదాతోనే సాధ్యమన్నారు. ప్రత్యేక హోదా సాధనకు యువతకు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్లు మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్ ప్రసంగం మొదలు పెట్టారు. జననేత ప్రసంగం మొదలు పెట్టగానే యువత ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. -
'చంద్రబాబు ఐదుకోట్ల మందిని మోసం చేశారు'
సాక్షి, అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న 'యువభేరి' సదస్సులో పలువురు వక్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓట్ల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి, మాయలు చేసి ప్రత్యేక హోదా తెస్తామని వారి చెప్పి ఓట్లు వేయించుకొని అసెంబ్లీ సాక్షిగా ఐదుకోట్ల మంది తెలుగువారిని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో తామెవరం ప్రత్యేక హోదా కావాలని అనలేదని, నేడు అధికారంలో ఉన్న టీడీపీనే అడిగిందని, ఆ పేరుతోనే ఓట్లు వేయించుకుని మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేథావులు ఏమన్నారంటే.. 'గతంలో తొమ్మిది జిల్లాల్లో యువభేరి విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మన అనంతపురంలో 10 వ యువభేరిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనందరి తరుపున ధన్యవాదాలు. మనమంతా హాయిగా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ, ఒక్కొక్కరి తలమీద రూ.45 వేల అప్పుంది. లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఏపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పెట్టింది. రాయితీలు లేవు, పరిశ్రమలు లేవు, స్కాలర్ షిప్‌లు లేవు. వీటన్నింటి నుంచి బయటపడాలంటే మనకు ప్రత్యేక హోదా ఉండాల్సిందే' -డా సి రామాంజనేయులు, పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీ 'ప్రత్యేక హోదా కోసం అలుపు లేకుండా పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. మనందరికి ప్రత్యేక హోదా అవసరం. ప్రత్యేక హోదాతో ఎన్నో రాయితీలు ఎక్సౌజ్ డ్యూటీ, ప్రత్యేక గ్రాంట్స్, ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధివంటివన్నీ వస్తాయి. సాఫ్ట్వేర్ సంస్థల డెవలప్‌కు కారణం పన్ను రాయితీలే. ప్రత్యేక హోదా వస్తే ఆరు నెలల్లో ఏడాదిలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వస్తుంది.. ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా మన హక్కు మన సంజీవని. వైఎస్ జగన్‌తో కలిసి విద్యార్థులు పోరాడాలి. చంద్రబాబుకు ప్రత్యేక హోదా తెచ్చే ధైర్యం లేకుండా పోయింది. ఆఖరికి ప్యాకేజీ నిధులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు' ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పిన నిధులు కూడా రావడం లేదు' - ప్రొఫెసర్ రమణారెడ్డి, ఎస్కేయూ, అనంతపురం 'రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో మేం ఎవరం ప్రత్యేక హోదా కావాలని అడగలేదు. అడిగింది పాలక ప్రతిపక్ష పార్టీలు, ఈనాడు రాష్ట్రంలో ఉన్న పాలక పక్ష పెద్దలు(టీడీపీ ప్రభుత్వ నాయకులు). చంద్రబాబునాయుడు, ఆయన నేతలు ఊరూరా తిరిగి ప్రత్యేక హోదా పేరుతో ఓట్లు వేయించుకొని గెలిచి అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం కూడా ఆ తర్వాత ఐదుకోట్ల మంది ఆంధ్రులను మోసం చేశారు. అసెంబ్లీ పవిత్ర స్థలం. అక్కడ జిమ్మిక్కులు చేయొద్దు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా చేస్తోంది. ఆ నిద్ర మత్తు వదలాలంటే యువత మేల్కొనాల్సిందే. త్వరలోనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. తెలుగు యువత నేడు వైఎస్ జగన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆయన కచ్చితంగా యువత ఆశలను నెరవేరుస్తారు. - ప్రొఫెసర్ సదాశివారెడ్డి ప్రత్యేక హోదాతో చాలా ఉపయోగాలున్నాయి. యువత ముందుకు రావాలి. పోరాడంది సమస్య తీరదు. యువత మేల్కొని ప్రత్యేక హోదాకోసం పోరాడి. మిమ్మల్ని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు. అనంతపురంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్న, ఏపీ ప్రజలకు మేలు జరగాలన్న ప్రత్యేక హోదా కావాల్సిందే. - సోమశేఖర్ రెడ్డి -
'మేం ఏ పార్టీ కాదు.. వైఎస్ జగన్‌కు మద్దతు'
సాక్షి, అనంతపురం : తాము ఏపార్టీకి చెందిన వాళ్లం కాదని ప్రొఫెసర్ జమీల్ పాషా అన్నారు. ఏ పార్టీకో మద్దతివ్వాలనే ఉద్దేశంతో తాము ఇక్కడికి రాలేదని, ప్రత్యేక కేటగిరి హోదా కోసమే ఇక్కడి వచ్చామని ఆయన చెప్పారు. ప్రత్యేక కేటగిరి హోదాను సాధించే బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భుజాలకు ఎత్తుకున్నారని, అందుకే ఆయనకు మద్దతుగా వచ్చామని చెప్పారు. మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు, మేథావులతో 'యువభేరి' సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తన వంతు గొంతును వినిపించేందుకు వచ్చిన ప్రొఫెసర్ జమీల్ పాషా మాట్లాడుతూ.. 'మేం ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే ఇక్కడికి వచ్చాము. ప్రత్యేక హోదా వేరు. ప్రత్యేక కేటగిరి హోదా రాష్ట్రాలు వేరు. దేశంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం అది జమ్ముకశ్మీర్. ఇక ప్రత్యేక కేటగిరి హోదా ఉన్న రాష్ట్రాలు 11 ఉన్నాయి. ఏపీకి ఆ హోదా వస్తే మనది 12వ రాష్ట్రం అవుతుంది. అయినా ఇప్పటికీ చాలామంది ప్రత్యేక కేటగిరి హోదాపై అవగాహన లేకపోవడం బాధాకరం. అందుకే ప్రత్యేక కేటగిరి హోదాను తెప్పించే బాధ్యత భుజానికెత్తుకున్న వైఎస్ జగన్‌కు మేం మద్దతిస్తున్నాం. హోదా వస్తే నిరుద్యోగులకే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఎంతో లాభం ఉంటుంది. కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తాయి. వలసలు ఆగిపోతాయి. యువత ఈ విషయంలో ముందుండి పోరాడాలి' అని ఆయన చెప్పారు. -
యువభేరి: జననేతకు ఘనస్వాగతం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం యువభేరిలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అభిమాన జనసందోహం నడుమ వైఎస్ జగన్ యువభేరి ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనకు అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో ఎంవైఆర్ కళ్యాణ మండపం మార్మోగింది. సభా వేదికపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి జగన్ నివాళులర్పించారు. వేదికపై ఉన్న ప్రొఫెసర్లు, మేధావులను ఆయన పరిచయం చేసుకున్నారు. మరోవైపు యువభేరికి యువత పెద్ద ఎత్తున కదిలివచ్చింది. భారీగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, హోదా కోసం మూడున్నరేళ్లుగా రాజీలేని పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
10న అనంతలో యువభేరి
-
10న అనంతలో యువభేరి
-
10న అనంతలో యువభేరి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల సాధనకు ఈ నెల 10న అనంతపురంలో యువభేరి నిర్వహించనున్నారు. వైఎస్సా ర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమా నికి హాజరు కానున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మంగ ళవారం మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మె ల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం అర్బన్ సమన్వయకర్త నదీమ్ అహ్మద్, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకా ష్‌రెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త పెద్దా రెడ్డి, కదిరి సమన్వయకర్త సిద్దారెడ్డి, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగర శివారులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న యువభేరీని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే వేధింపులా?
-
డబ్బులిస్తూ దొరికిపోయినా చంద్రబాబుపై చర్యలుండవా?
‘యువభేరి’లో నిలదీసిన విద్యార్థిని గుంటూరు: ‘‘ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోతే అతడిని ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. ఒక విద్యార్థి పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోతే అతడిని డిబార్ చేస్తారు. మరి సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘ఓటుకు కోట్లు’ కేసులో సాక్ష్యాలతో సహా దొరికిపోతే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ వైఎస్సార్సీపీ గురువారం గుంటూరులో నిర్వహించిన యువభేరిలో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని శ్రీవిద్య సంధించిన ప్రశ్న ఇది. యువభేరి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు మైక్ ఇచ్చి మాట్లాడించారు. వివిధ అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు, ప్రత్యేక హోదా పోరాటం, ఓటుకు కోట్లు కేసు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ఆంక్షలు తదితర అంశాలపై ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట తప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తమ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని తేల్చిచెప్పారు. హోదా కోసం పోరాడేవారికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. హోదా ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. -
గుంటూరులో యువభేరి
-
కళ్లు పీకేసే దమ్ము సీఎంకు ఉండాలి: వైఎస్ జగన్
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను, తప్పిదాలను పలువురు విద్యార్థులు నిలదీశారు. తప్పుచేసిన సామాన్యులకు ఒక న్యాయం ముఖ్యమంత్రికి ఒక న్యాయమా అంటూ చంద్రబాబు తీరును నిలదీశారు. గురువారం గుంటూరులోని నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన (గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేసింది ఇక్కడే) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధనకై యువభేరి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత అభిప్రాయాలను అడిగి తెలుసుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి బయటపడింది. ఆయా విద్యార్థులు అడిగిన ప్రశ్నలు, వైఎస్ జగన్ ఇచ్చిన సమాధానాలు ఒకసారి పరిశీలిస్తే.. ప్రశ్న 1 మొన్న జరిగిన నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్‌కు ముందు స్పీకర్ కోడెలగారు మహిళలను అవమానించారు. ఆడవాళ్లు బయటకే రావొద్దని, వంటింట్లో ఉండాలని చెప్పారు. కానీ, సదస్సు అయ్యాక సీఎం చంద్రబాబు మాత్రం సదస్సు బాగా విజయవంతం అయిందని, ఓ నేషనల్ మీడియా మరో పార్టీకి పోయిందని ఆరోపించారు. ఇది ఎంతవరకు సమంజసం? కోడెల మహిళలకు చేసిన అవమానాన్ని ఆయన ఎలా సమర్థించాలన్నా? ------------- వినీలా.. బీటెక్ ఫైనలియర్.. యూనివర్సల్ కాలేజీ వైఎస్ జగన్ స్పందన సాధారణంగా స్పీకర్ స్థానంలో ఉన్న ఓ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి ఆయనను ప్రశ్నించాలి. సరిదిద్దాలి. కానీ చంద్రబాబు మాత్రం వత్తాసు పలికారు. వంట చేసుకుంటూ ఉంటే ఆడవాళ్లపై రేప్‌లు జరగవని అనడం దారుణం. రాత్రి 12 గంటలకు బయటకు వెళ్లినా రక్షిస్తానని ఒక ముఖ్యమంత్రి చెప్పగలగాలి. ఎవరైనా మహిళలను తప్పుగా చూస్తే కండ్లు పీకేస్తాం అని చెప్పే దమ్ము ముఖ్యమంత్రికి ఉండాలి. (ఈసమయంలో యువత చప్పట్లు, ఈలలు). కానీ, టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. సాక్షాత్తు ప్రభుత్వ అధికారిణిపై చేయి చేసుకున్నా పట్టించుకోలేదు. రిషితేశ్వరి విషయంలో ఒక్క కేసు పెట్టలేదు. విజయవాడలో ఉంటూ సెక్స్‌రాకెట్ వారికి అనుకూలంగా మాట్లాడారు. అంగన్ వాడీలకు తోడు ఉండాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు చేశారు. మొన్న ఏపీ పోలీసు బాస్ మహిళలపై 11శాతం నేరాలు పెరిగాయని చెప్పారు. అసలు ఇలా చెప్పడానికి ఏపీ ప్రభుత్వానికి సిగ్గుందా. నీ ప్రశ్న చూసైనా మహిళల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాను. ప్రశ్న2 ప్రత్యేక హోదా ఏపీకి అవసరం లేదంటూనే గల్లా జయదేవ్, సీఎం రమేశ్, సుజనా చౌదరీలాంటి నాయకులు ప్రత్యేక హోదా కలిగిన ఉత్తరాఖండ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా ఉంటే మనదగ్గరికి కూడా పెద్ద స్థాయిలో పెట్టుబడులు వస్తాయి కదాన్న? ............ వెంకట్, యూనివర్సల్ కాలేజీ, బీటెక్ విద్యార్థి వైఎస్ జగన్ స్పందన పెట్టుబడులు రావడమే కాదు.. మన దగ్గరే ఉద్యోగాలు వస్తాయి. మనమే పక్క రాష్ట్రాలకు కూడా ఇవ్వగలిగే ఉద్యోగాలను సృష్టించగలం కూడా. ప్రత్యేక హోదా వల్ల ఇలాంటి మేలులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ విషయం నీ ప్రశ్నతోనైనా చంద్రబాబుకు బోధపడుతుందని అనుకుంటున్నాను’ ప్రశ్న 3 లంచం తీసుకుంటే ఒక అధికారిని తొలగిస్తారు. అలాగే, కాపీ కొట్టిన విద్యార్థిని డిబార్ చేస్తారు. కానీ, ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నా? .... శ్రీ విద్య, బీటెక్థర్డ్ ఇయర్ వైఎస్ జగన్ స్పందన కోట్లలో నల్లడబ్బు అడ్డదారిలో ఇస్తూ ఓటుకు నోటు కేసులో ఆడియోలకు, వీడియోలకు దొరికిపోయినా ఆయనపై చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం. ఇలాంటి పరిస్థితి ఉన్నందుకు మనందరం బాధపడాలి. మీకు ఉన్న అవగాహన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదు. ఇలాంటి నేరం దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఒక ముఖ్యమంత్రి నల్లధనం ఇచ్చి ఆడియో, వీడియోలో దొరికినా అతను రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగడం దేశ చరిత్రలోనే తొలిసారి. -
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన వైఎస్ జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పడానికి గుంటూరులో నిర్వహిస్తున్న ‘యువభేరి’ లో వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన, గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేపట్టిన ప్రాంగణంలోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడతారు. -
నేడు గుంటూరుకు వైఎస్ జగన్
హాజరుకానున్న జగన్ సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పడానికి గుంటూరులో గురువారం నిర్వహిస్తున్న ‘యువభేరి’ లో ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. స్థానిక నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన, గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్. జగన్మోహన్రెడ్డి అమరణ దీక్ష చేపట్టిన ప్రాంగణంలోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటల కు జరిగే ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడతారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా గుంటూరులోని నల్లపాడు రోడ్డులో మిర్చియార్డు సమీపంలో యువ భేరి ప్రాంగణంలో విద్యార్థులతో ముఖా ముఖి నిర్వహిస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్యర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. -
16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి.
-
యువభేరి వేదిక ఖరారు
16న గుంటూరు మిర్చి యార్డు సమీపంలో నిర్వహణ వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డి వెల్లడి సాక్షి, అమరావతి బ్యూరో : గుంటూరులో ఈ నెల 16న జరగబోయే యువభేరి కార్యక్రమానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వేదికను ఖరారు చేశారు. గుంటూరులో నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో గల ఖాళీ ప్రదేశంలో యువభేరి నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికను ఖరారు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ప్రకటించారు. గతంలో పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోరుతూ నిరవధిక దీక్ష నిర్వహించిన ప్రాంగణంలోనే యువభేరి నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, తలశిల రఘురామ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు యువభేరి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డిలు సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులను చైతన్యపరచి, వారి మనోభావాలను తెలుసుకొని, హోదా వల్ల ఒనగూరే లబ్ధిని తెలియజేసేందుకే పార్టీ అధినేత యువభేరిని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజల ఆకాంక్షను వైఎస్ జగన్మోహన్రెడ్డి భుజాలకెత్తుకొని పోరాటం చేస్తున్నారని తెలిపారు. యువభేరి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. సదస్సుకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందించుకొని, వారిని చైతన్యపరచాలన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని నేతలకు సూచించారు. -
16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి
గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్ఆర్సీపీ నేతలు ఆదివారం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16న గుంటూరులో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువభేరి ద్వారా చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తామని నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేసిన నల్లపాడులోనే యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లడించారు. యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యువభేరిని విజయవంతం చేయాలని మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. -
16న గుంటూరులో యువభేరి
-
16న గుంటూరులో యువభేరి
వేదిక త్వరలో వెల్లడిస్తామన్న వైఎస్సార్సీపీ నేతలు పట్నంబజారు (గుంటూరు): ఈ నెల 16వ తేదీన గుంటూరు నగరంలో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని చెప్పారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం రాజశేఖర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యువభేరి జరిగే ప్రదేశం, సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని నేతలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని యువభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత పెద్దఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. -
16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి
-
16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16న గుంటూరులో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువభేరి ద్వారా చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తామని నేతలు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కోనా రఘుపతి శనివారం వెల్లడించారు. -
హోదాతోనే ఉద్యోగాల విప్లవం
అందరం కలసి ప్రత్యేక హోదా సాధిద్దాం విజయనగరం యువభేరిలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు - ఐదుకోట్ల ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు - ప్యాకేజీ, నిధులపై జైట్లీ, వెంకయ్య అబద్ధాలు - రాష్ట్రానికి అదనంగా ఏం మేలుచేశారో చెప్పాలి - ఎన్నికల ముందు ఓ మాట.. ఇప్పుడొక మాట - ప్రత్యేక హోదా అడిగితే పీడీ కేసులా? - హోదా అమ్మేసిన బాబుపై టాడా కేసు పెట్టవద్దా? - యువభేరిలో నిప్పులుచెరిగిన ఏపీ ప్రతిపక్షనేత విజయనగరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘చదువుల విప్లవం చూశాం.. కానీ నేడు మనకు కావాల్సింది ఉద్యోగాల విప్లవం.. ఆ విప్లవం ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యం. హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది’ అని ఏపీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా విజయనగరం శివారు నెల్లిమర్ల రోడ్డులోని జగన్నాథ్ ఫంక్షన్‌హాలు వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘యువభేరి’లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మనందరి జీవితాలు బాగు పడాలంటే ప్రత్యేక హోదా వస్తేనే సాధ్యమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే పీడీ కేసులు పెడుతున్నారని, అలాంటి చంద్రబాబు మీద టాడా కేసు ఎందుకు పెట్టకూడదని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. (విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదువుల విప్లవం చూశాం.. ఉద్యోగాల విప్లవం సాధిద్దాం.. ‘‘మన జీవితాలు బాగుపడాలంటే ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఒక విప్లవంలా, ఒక కెరటంలా ముందుకు కదిలించాలి. గతంలో నాన్నగారి హయాంలో చదువుల విప్లవం చూశాం. చదువుల కోసం, ఆస్పత్రుల కోసమే పేదవాళ్లు అప్పుల పాలవుతారు. అలా కాకుండా ఉండాలన్నా, వాళ్లు తమ జీవితాలు మార్చుకోవాలన్నా ఈ రెండు రంగాలకు భరోసా ఉండాలి అని దివంగత వైఎస్సార్ అనేవారు. ఆయన పాలన ఒక స్ఫూర్తి. అంతకుముందు ముఖ్య మంత్రులుగా పనిచేసినవాళ్లు ఎవరైనా పేదలు, బీసీల మీద ప్రేమను మాటలకే పరిమితం చేసేవారు. నాలుగు ఇస్త్రీపెట్టెలు, నాలుగు కులవృత్తుల పరికరాలు ఇచ్చి బీసీలకు మేలు చేశామని పబ్లిసిటీ చేసుకునేవారు. పేదరికం పోవాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా పెద్దచదువులు చదవాలని, అందుకు అప్పుల పాలు కాకూడదని రాజశేఖరరెడ్డి చదువుల విప్లవాన్ని తీసుకొ చ్చారు. ఆ విప్లవంతో ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ.. ఇలా ఏం చదవాలన్నా పేదరికం అడ్డురాకుండా ఉండేది. ఇంజనీరింగ్‌కు లక్షన్నర అవుతుందన్నా.. తానున్నా చదివిస్తా అనేవారు. డాక్టర్ చదవాలంటే రెండున్నర లక్షలవుతుందన్నా చదివించారు. అప్పట్లో అలా భరోసా ఉండేది. ఆ చదువుల విప్లవం ఇప్పుడు తెరమరుగు అవుతోంది. పిల్లలను అలా చదివించాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రులకు లేకుండా పోయింది. అలాంటి చదువుల విప్లవాన్ని ఇప్పుడు దిగజార్చే శారు. ఇంజనీరింగ్ చదవాలంటే ఏడాదికి 70 వేల నుంచి లక్ష పాతికవేల వరకు అవుతోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేసినట్లు 35 వేలు ఫీజు రీయింబర్స్ చేసి మిగిలింది మీరే కట్టుకుని, అప్పుల పాలు కండి అంటోంది. రాజశేఖరరెడ్డి హయాంలో చదువుల విప్లవం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల విప్లవం రావాలి. ప్రత్యేక హోదా వస్తేనే అది సాధ్యమౌతుంది. కేసుల భయంతోనే ప్రజలకు బాబు వెన్నుపోటు ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయా అని ఈమధ్య చంద్రబాబు అడుగుతున్నారు. అప్పట్లో అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాలని, అది కూడా ఐదేళ్లు ఇస్తే చాలదని.. పరిశ్రమలు కట్టడానికే రెండు మూడేళ్లు పడుతుందని, అది ప్రారంభమయ్యేలోపు హోదా అయిపోతే నష్టం జరుగుతుంది, కాబట్టి కనీసం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని మోదీ సాక్షిగా చెప్పారు. వెంకయ్య నాయుడు కూడా కనీసం 10 సంవత్సరాలైనా కావాలని అడిగారు. వాళ్లు ప్రతి సందర్భంలోనూ పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్లు ప్లేట్లు మార్చారు. వీళ్లను చూస్తే.. అసలు వీళ్లకు ప్రత్యేక హోదా మీద పూర్తి అవగాహన ఉందా అని అనుమానం వస్తుంది. అవగాహన ఉండి కూడా తమ స్వార్థం కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం ఇలా చేశారా అని అనుమానం వస్తుంది. చంద్రబాబు నల్లధనం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు గానీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనంతో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికేశారు. అంత జరిగినా ఆయన పదవికి రాజీనామా చేయకపోవడం, ఆయనను అరెస్టు చేయకపోవడం, పదవి నుంచి తొలగించకపోవడం బహుశా దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. ఇదే సీఎంగారికి ప్రత్యేక హోదా మీద అవగాహన ఉందా? అని ఒక్కోసారి అనిపిస్తుంది. అవగాహన ఉండి కూడా ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని అమ్మేశాడు. ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు చూస్తే దేన్నీ వదలలేదని అర్థమౌతుంది. రాజధాని భూములు, ఆలయాల భూములు వదల్లేదు. చివరకు అసైన్డ్ భూములు కూడా బలవంతంగా లాక్కున్నాడు. అవసరం లేకపోయినా ఎస్కలేషన్లు ఇప్పించి కాంట్రాక్టర్లు దండుకునేందుకు వీలు కల్పించారు. పట్టిసీమ నుంచి రాజధాని భూముల దాకా, బొగ్గు కొనుగోలు నుంచి ఇసుక దాకా, చివరకు డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు సర్వం అవినీతిమయం చేశారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు తన అవినీతిపై మోదీ గారు ఎక్కడ సీబీఐ ఎంక్వైరీ జరిపిస్తారోనన్న భయంతో ఐదున్నర కోట్ల మంది జనాభాకు వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు మీద టాడా యాక్టు పెట్టినా తప్పులేదు.. ప్రత్యేక హోదాను నీరుగార్చే వ్యవహారం గట్టిగా జరుగుతోంది. వాళ్ల స్వార్థం కోసం ఐదున్నర కోట్ల మంది ప్రజలను నడివీధిలో నిలబెడుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ 29 రాష్ట్రాల్లోనంబర్ వన్ అవుతుందనడంలో నాకు అనుమానం లేదు. హోదా వల్ల మాత్రమే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేది ఎవరూ నిరాకరించలేని సత్యం. ప్రత్యేక హోదా వస్తేనే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ బోర్డులు వస్తాయి. ఇలాంటి ప్రత్యేక హోదా మీద అబద్ధాలు చెబుతున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే, ఉద్యమిస్తే నిర్దాక్షిణ్యంగా పీడీ యాక్టులు పెడుతున్నారు. బంద్ పిలుపు ఇస్తే చంద్రబాబు స్వయంగా దగ్గరుండి బస్సులు తిప్పుతున్నారు. ప్రత్యేక హోదా అడిగితే మన మీద పీడీ యాక్టు పెట్టమంటున్న, ప్రత్యేక హోదాను అమ్మేసిన ఇలాంటి ముఖ్యమంత్రి మీద టాడా యాక్టు పెట్టినా తప్పుందా అని అడుగుతున్నా. కలసికట్టుగా పోరాడి సాధిద్దాం.. ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడుతున్న ఈ వ్యక్తులను చూసినప్పుడు.. ‘మూర్ఖులు అబద్ధాలను నిజాలుగా చెప్పి వాదిస్తుంటే మేధావులు మౌనంగా ఉండటమే సమాజంలో అనేక అనర్థాలకు కారణం’అని బెర్ట్రండ్ రసెల్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు నిజంగా అదే సమస్య. అందరం కలిసికట్టుగా గళం విప్పితే తప్ప హోదా సాధ్యమయ్యే విషయం కాదు. అందరం కలసికట్టుగా గట్టిగా నిలబడితే సాధ్యమౌతుంది. పక్కన అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మరి పార్లమెంటు సాక్షిగా మనకు మాట ఇచ్చినప్పుడు .. దాన్ని సాధించడానికి మనమంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని, ఇందులో మీరంతా తోడుగా రావాలని కోరుతున్నా.’’ అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిపై చంద్రబాబు అబద్ధాలు నిన్నటికంటే నేడు, నేటికంటే రేపు మనం బాగున్నామంటేనే అభివృద్ధి అంటారు. ప్రభుత్వం వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. మనం నిన్నటి కంటే నేడు బాగున్నామా.. నేటి కన్నా రేపు బాగుండే పరిస్థితి ఉందా అనేది ఆలోచించాలి. దేశంలో జీడీపీ వృద్ధిరేటు 7.20శాతం ఉంటే దాని కంటే 5% ఎక్కువగా 12.20% సాధించామని చెబుతున్నారు. జీడీపీ వృద్ధిరేటుకు మూడు కారకాలు చూస్తారు. వాటిలో మొదటిది వ్యవసాయ రంగం, రెండోది పారిశ్రామిక రంగం, మూడోది సేవారంగం. ఈ మూడింటిలో పురోగతి ఉంటే దాన్ని గ్రోత్ రేట్ అంటారు. జాతీయ సగటు కంటే ఎక్కువగా రాష్ట్రంలో వృద్ధి ఉందని చంద్రబాబు అంటున్నారు. వ్యవసాయ రంగం ఎలా ఉందో, రైతుల పరిస్థితి ఏంటో చూద్దాం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ మూడేళ్లలో వరసగా కరువులు లేదా అతివృష్టి. వ్యవసాయం బ్రహ్మాండంగా పెరిగిందా?.. 130 కోట్ల దేశ జనాభాలో 65 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. చంద్రబాబు సీఎం అవ్వకముందు.. రైతు రుణాలన్నింటినీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలన్నా చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఆయన సీఎం అయ్యేనాటికి రూ. 87,612 కోట్లుగా ఉన్న రైతు రుణాలు.. ఈ ఏడాది జూన్ నెలాఖరుకు రూ. 1,00,709 కోట్లకు చేరింది. రుణాలు మాఫీ కాకపోగా.. అపరాధ వడ్డీలతో తడిసి మోపెడయ్యాయి. రబీ పంటకు 24 లక్షల హెక్టార్లలో విత్తనం వేయాల్సి ఉంటే కేవలం 9 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. బ్యాంకులు రూ. 34 వేల కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 14% మాత్రమే ఇచ్చారు. రూ.24వేల కోట్ల రుణాలి వ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ. 10 వేల కోట్ల టెర్మ్ లోన్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే అందులో కేవలం 14 శాతం మాత్రమే రుణాలిచ్చారు. విశాఖపట్నం యువభేరి అవ్వగానే మంత్రులు టీవీల ముందుకు వచ్చి వాళ్ల ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పారు. సోషియో ఎకనమిక్ సర్వే నిజాలు చెబుతుంది. దాని ప్రకారం చూస్తే 2014–15లో పెద్ద పరిశ్రమలకు రూ. 1,875 కోట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 2,263 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం రూ. 4,138 కోట్లు వచ్చాయి. 2015–16లో పెద్ద పరిశ్రమలకు 3,969 కోట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 1,592 కోట్లు. కానీ చంద్రబాబు మాత్రం విశాఖపట్నంలో రూ. 4.67 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసేశామని డబ్బాలు కొట్టు కున్నారు. లేని జీడీపీ గ్రోత్‌రేటును చూపిస్తూ, కాస్తో కూస్తో వాళ్లు సానుభూతితో ప్రత్యేక హోదా ఇవ్వాలను కున్నా వాళ్లు వెనక్కుపోయే పరిస్థితికి చంద్రబాబు తీసుకొచ్చారు. ఇక సేవా రంగం.. విషయాన్ని చూద్దాం. చదువుకున్నవాళ్లంతా ఉద్యోగాల కోసం బయోడేటాలు పట్టుకుని తిరుగుతున్నారు ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయని అడుగుతున్నా. వచ్చింది పెద్ద సున్నా మాత్రమే. అయినా చంద్రబాబు మాత్రం తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. అసలు లెక్కలు మూడేళ్ల తర్వాతే వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం బొంకినా పర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారు. వైఎస్ హయాం స్వర్ణయుగం ఎలా అయ్యిందంటే.. చంద్రబాబు మైండ్‌సెట్‌లోనే ఉన్న ఆయన మంత్రులకు ఎకనమిక్స్ తెలుసా లేదా అని అనుమానం వస్తుంది. రగ్నర్ నరక్స్ అనే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త పేదరికం గురించి మంచి సూత్రీకరణ చేశారు. పేద దేశాలు, రాష్ట్రాలు అలాగే ఉండటానికి కారణమేంటో వివరించారు. సమాజం గానీ, రాష్ట్రంగానీ, దేశం గానీ అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం పెట్టుబడులకు కావల్సినంత డబ్బు అందుబాటులో లేకపోవడం. దీన్ని ‘లో కేపిటల్ ఫార్మేషన్’ అంటారు. దీనివల్ల జరిగే నష్టం ఏమిటంటే.. ఆదాయాలు తగ్గుతాయి, దానివల్ల పొదుపు తగ్గుతుంది. పొదుపు తగ్గితే పెట్టుబడులకు డబ్బులు తగ్గుతాయి. పెట్టుబడులు తగ్గితే ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం ఆదాయం మీద పడుతుంది. అలా ఇదంతా ఒక విషవలయం లాంటిది. ఇది సరఫరా వైపు విషవలయం. ప్రజల కొనుగోలు శక్తి ప్రభుత్వాలు పెంచకపోతే అభివృద్ధి సాధ్యం కాదని రగ్నర్ చెప్పారు. ఆదాయం తక్కువగా ఉంటే వస్తువులు, సేవలను కొనలేరు కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. దాంతో పరిశ్రమలపై పెట్టుబడులు తగ్గి, ఉత్పత్తి తగ్గుతుంది.. చివరకు ఉద్యోగావకాశాలు తగ్గి మళ్లీ ఆదాయం తగ్గిపోతుందని, దాంతో ప్రజలు వస్తువులు, సేవలు వేటినీ కొనలేరని ఆయన సూత్రీకరించారు. ఇది డిమాండ్ వైపు విషవలయం. రాజశేఖరరెడ్డి గారు ఈ సూత్రాన్ని గ్రహించి చక్కగా అమలు పరిచారు. అందుకే ఆయన హయాంను సువర్ణయుగంగా చెప్పుకుంటున్నాం. ప్రజల వాస్తవ ఆదా యాలను పెంచగలిగారు. రైతులకు, సామాన్యులకు సంపాదించే మార్గాలను ఎక్కువ చేయగలిగారు. జలయజ్ఞం ద్వారా రైతులకు శాశ్వతంగా ఆదాయం ఉండేలా దారి చూపించారు. అప్పట్లో ధాన్యం కనీస మద్దతుధర రూ. 530 నుంచి రూ. 1030 కు పెరిగింది. రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం ఉచితంగా కరెంటు ఇచ్చారు. దాంతో రైతులు, ప్రజల ఆదాయస్థాయిని పెంచగలిగారు. ప్రజలు ఖర్చుపెట్టగల ఆదాయాన్ని కూడా పెంచారు. వాస్తవ ఆదాయాలను మాత్రమే కాదు ఖర్చుపెట్టగలిగిన ఆదాయాలను కూడా ఆయన పెంచగలిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా ఇది సాధ్యమైంది. దీంతో వాళ్లకు ఖర్చు తగ్గి, ఇతర అవసరాలకు ఖర్చుచేయగల ఆదాయం పెరిగింది. మిగిలిన దేశం మొత్తం 47 లక్షల ఇళ్లు కడితే ఒక్క సమైక్యాంధ్రప్రదేశ్‌లో 48 లక్షల ఇళ్లు కట్టించారు. జలయజ్ఞానికి ఐదేళ్లలోరూ. 48వేల కోట్లు ఖర్చుచేశారు. అందువల్ల సిమెంటు, స్టీలు, లేబర్, ట్రాన్స్‌పోర్టు డిమాండ్ పెరిగింది. ఇలా డిమాండ్ పెరగడం వల్ల, ప్రజల ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఊపు వచ్చింది. వీటన్నిటివల్ల ఏపీలో ఐదేళ్లలో నమోదైన గ్రోత్ రేటు దేశంలో ఎక్కడా, ఎప్పుడూ నమోదు కాలేదు. ఇలాంటి ఆర్థిక విషయాలు గానీ, ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా, ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవాలన్నా ప్రత్యేక హోదా అవసరం అన్న విషయం గానీ మన పాలకులకు అర్థం కాని పరిస్థితి. అక్రమార్జనలో బాబు మూడంకెల గ్రోత్ రేట్ చంద్రబాబు పరిపాలన పుణ్యమాని రాష్ట్రంలో అంతా అరాచకం. గూండాయిజం, ఫ్యాక్షనిజం, అధికార వ్యవస్థల దుర్వినియోగం, అవినీతి, వ్యవస్థలను మేనేజ్ చేయడం, మీడియాను లొంగదీసుకోవడం, గ్రామ గ్రామాన దోపిడీ, అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఆ ఎమ్మెల్యే స్థానాలలో ఉప ఎన్నికలు లేకుండా చూడటం, గ్రామాల్లో ఇసుక నుంచి ప్రతీదీ దోపిడీ చేయడం. వీటిలో మాత్రం చంద్రబాబు గ్రోత్ రేటు త్రిబుల్ డిజిట్ చూపించారు. ఒక్క హోదాపై ఇన్ని అబద్ధాలా..? వీళ్లు చెబుతున్న కొన్ని ముఖ్యమైన అబద్ధాలకు సమాధానం చెబుతా. అరుణ్ జైట్లీ, వెంకయ్య, చంద్రబాబు చేసిన ముఖ్యమైన అబద్ధాలు ఇవీ. ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా 25 సంస్థలు ఏపీకి ఇచ్చామని, నిధులు ఇచ్చామని జైట్లీ అన్నారు. ఒక రాష్ట్రానికి ఇంత సాయం చేయడం ఎక్కడా చూడలేదని వెంకయ్య అన్నారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్ర సాయంలో 90 శాతం కేంద్రం భరించడం తప్ప వేరే ఉపయోగం లేదని అన్నారు. 1. వీరు చెబుతున్న ఐఐటీలు, ఐఐఎంల లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో ఉండాలని గతంలో యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. దేశంలో కోటి జనాభా దాటిన రాష్ట్రాలు 20 ఉన్నాయి. 22 ఐఐటీలు, 30 ఎన్ఐటీలు, 41 సెంట్రల్ యూనివర్సిటీలు, 19 ఐఐఎంలు, 19 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. కోటి జనాభా దాటిన అన్ని రాష్ట్రాలలోనూ ఇవి ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్‌కు మీరు ప్రత్యేకంగా చేసిందేమిటి?. ఏ యాక్టులో ఉందని ఇటీవల గుజరాత్లో రైల్వే యూనివర్సిటీని ఇచ్చారు? ఏ యాక్టులో ఉందని హైదరాబాద్‌లో ఐఐటీసీ, సీసీఎంబీ, బీహెచ్ఈఎల్, హెచ్ఐఎల్, హెచ్ ఎం టి, మిథాని, బీడీఎల్, డీఎంఆర్ఎల్, డీఆర్డీఎల్, డీఆర్డీఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కట్టారు? గుజరాత్ – మహారాష్ట్ర సరిహద్దుల్లో 60 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పెట్రో రిఫైనరీని ఎలా పెట్టారు? చట్టంలో ఉన్నా మనకు చేయాల్సినవి చేయడం లేదు, రైల్వే జోన్ ఇవ్వడం లేదు. యాక్టులో ఉన్నా పోలవరం కట్టరు. యాక్టులో లేకపోయినా మిగిలిన వాళ్లకు చేస్తూ, యాక్టులో ఉన్నా మనకు చేయడం లేదంటే మనకు ప్రత్యేకంగా ఏం ఫేవర్ చేస్తున్నట్లు? 2. ప్యాకేజీ పేరుతో రోజూ అబద్ధాలు ఆడుతున్నారు. అడుగడుగునా అబద్ధాలే. ఈ మధ్యకాలంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రణాళికా శాఖ నుంచి ఒక సమాధానం వచ్చింది. 2016 సెప్టెంబర్ 8న ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామని, దాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇచ్చామని, అందులో పేర్కొన్న అన్నింటినీ నెరవేర్చామని చెప్పారు. మనకు ఏ ప్యాకేజి రాకపోయినా, ఏ మేలు జరగకపోయినా ఆ పేరుతో రోజూ అబద్ధాలు ఆడుతున్నారు. 3. 12వ ఆర్థిక సంఘం రూ. 35 వేల కోట్లే ఇచ్చిందని, 13 వ ఆర్థిక సంఘం రూ. 69,298 కోట్లే ఇస్తే, కానీ 14వ ఆర్థిక సంఘంలో ఇప్పటికే 2,03,100 కోట్లు ఇచ్చిందని ఊదరగొట్టారు. ఇదేదో తమ ఘనతలా చెప్పుకుంటున్నారు. వీళ్లు అధికారంలోకి వచ్చేసరికి ఆర్థిక సంఘ నియామకం జరిగిపోయి.. రాష్ట్రాల అధ్యయనం కూడా పూర్తయింది. వీళ్లే కాదు.. ఎవరు అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్‌కు అందే సాయం ఒక ఫార్ములా ప్రకారం వచ్చేదే. పేదరికానికి 50శాతం మార్కులు, జనాభాకు 27.5శాతం మార్కులు, విస్తీర్ణానికి 15శాతం మార్కులు, అడవులకు 7.5శాతం మార్కులు వేసి ప్రతిరాష్ట్రానికి నిధులు కేటాయిస్తారు. అందులో భాగంగానే ఐదేళ్లలో రూ. 1,69,969 కోట్లను మనకు (కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నులు) ఇస్తున్నారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 42 శాతం మొత్తాన్ని రాష్ట్రాలకు ఇస్తారు. అందులో ఏపీ వాటా 4.31శాతం. మనకన్నాయూపీ, ఇతర రాష్ట్రాలకు ఎక్కువే ఇస్తున్నారు. రెవెన్యూ లోటును పూడ్చే గ్రాంటును కూడా అందరితోపాటు రూ. 22,113కోట్లు ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 1.94 లక్షల కోట్లు ఇచ్చారు. మనతోపాటు పశ్చిమబెంగాల్, కేరళ సహా 11 రాష్ట్రాలకు ఇచ్చారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలకు అన్ని రాష్ట్రాల్లాగే మనకు ఐదేళ్లలో రూ.12వేల కోట్లు ఇచ్చారు. ఈ మూడు కలిపితే రూ. 2.3 లక్షల కోట్లు. మిగిలిన రాష్ట్రాలతో పాటు కలిపి ఇవ్వాల్సింది ఇచ్చారే తప్ప ఒక్క రూపాయైనా అదనంగా ఇచ్చారా అని చంద్రబాబు, జైట్లీ, వెంకయ్య నాయుడులను అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, లేనివాటి మధ్య వనరుల గ్యాప్ విషయంలో తేడా చూపలేదని మాత్రం అన్నారు. 4. 14వ ఆర్థిక సంఘం చెప్పబట్టే తాము ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ప్రచారం చేశారు. కానీ ప్రత్యేక హోదా వద్దని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ లిఖితపూర్వకంగా చెప్పారు. 5. ప్రత్యేక హోదా వల్ల కేంద్ర పథకాల్లో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరించడం తప్ప వేరే ప్రయోజనాలు ఉండవని అంటున్నారు. వంద శాతం ఆదాయపన్ను మినహాయింపు, వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు, వంద శాతం రవాణా సబ్సిడీ లాంటివి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఎందుకు ఇచ్చారు.. వేరే రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. చివరకు ఉత్తరాంచల్ 2000లోనే ఏర్పడినా 2002లో ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత మాత్రమే పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. -
చంద్రబాబుపై టాడా కేసు ఎందుకు పెట్టకూడదు.?
-
‘చంద్రబాబు నాకు రూ.64వేలు అప్పున్నాడు’
-
యువభేరి పోస్టర్ ఆవిష్కరణ
-
యువభేరి పోస్టర్ ఆవిష్కరణ
విజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరంలో యువభేరి కార్యక్రమం నిర్వహించనున్నారు. పూల్‌బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఈ యువభేరికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆవిష్కరించారు. యువభేరి ఏర్పాట్లను శనివారం పార్టీ నేతలు రాజన్నదొర, పెన్మత్స సాంబశివరాజు, అప్పల నరసయ్య, అప్పల నాయుడు తదితరులు పరిశీలించారు. -
19న విజయనగరంలో యువభేరి
హాజరు కానున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి: కృష్ణదాస్ విజయనగరం మున్సిపాలిటీ: ప్రత్యేక హోదాపై విద్యార్థులు, యువత, మేధావులను చైతన్యపరిచే దిశగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా యువభేరి పేరిట సదస్సులు నిర్వహిస్తున్నారని విజయనగరం జిల్లా ఇన్చార్జి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన విజయనగరం పట్టణంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో యువభేరి సదస్సు జరుగుతుందని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. కృష్ణదాస్ గురువారం జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు నరసరావుపేటకు వైఎస్ జగన్ సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం నాలుగ్గంటలకు ఆయన జిల్లాలోని నరసరావుపేటకు చేరుకుంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు కాసు మహేశ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగసభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. -
జగన్ యువభేరితో ప్రభుత్వానికి ముచ్చెమట
* విద్యార్థి, యువజనులు కన్నెర చేస్తే ఉప్పెనే.. * ఫిబ్రవరి 11న బాపట్లలో యువభేరి * బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న యువభేరితో రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. బాపట్లలో ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించనున్న యువభేరి సదస్సుకు సమాయత్తంగా బాపట్ల నియోజకవర్గంలోని విద్యార్థి, యువజనుల సదస్సును శనివారం కోన ఛాంబర్లో నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థి, యువజనులు కన్రెర చేస్తే ఆ ఉప్పెనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకుపోతాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు విద్యార్థి, యువజనుల్లో చెరగని ముద్రవేసుకున్నాయని, వాటిని నిర్వీర్యం చేసేందుకు నేడు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ప్రత్యేక హోదాతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అందరూ ఆశగా ఎదురుచూస్తే, ప్రత్యేక ప్యాకేజీ అంటూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. కనీసం ప్యాకేజీ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోలేరు : బాలవజ్రబాబు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు వి.బాలవజ్రబాబు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాన్ని అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. కచ్ఛితంగా రాష్ట్రంలో వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వస్తుందని, జగనన్నను ముఖ్యమంత్రిగా చూసుకుందామని పేర్కొన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయా అంటూ కసిగా ఎదురుచూస్తున్నారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. యువభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, కోకి రాఘవరెడ్డి, దొంతిబోయిన సీతారామిరెడ్డి,షేక్. బాజీ, పార్టీ నాయకులు వడ్డిముక్కల డేవిడ్, కూనపురెడ్డి ఆవినాష్నాయుడు, చింతల రాజశేఖర్, చందు, నరీన్, మరియదాసు, మనోహర్, జయభారత్‌రెడ్డి, వాలి శివారెడ్డి, ఆట్ల ప్రసాద్‌రెడ్డి, కోకి పవన్‌కుమార్, కోదండం, కొక్కిలిగడ్డ చెంచయ్య, బడుగు ప్రకాశ్,నర్రావుల వెంకట్రావు,మారం రామకోటేశ్వరరావు, గొర్రుముచ్చు పుష్పరాజ్యం, శేఖర్, సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, చిన్నపోతుల హరి తదితరులు పాల్గొన్నారు. -
యువ గర్జన
-
కర్నూలులో వైఎస్ జగన్ యువభేరీ
-
యువభేరి విజయవంతం
– వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కర్నూలులోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన యువభేరి కార్యక్రమం విజయవంతం అయినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరికి యువతీ యువకుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చిందన్నారు. దాదాపు 8 నుంచి 10 వేల మంది హాజరై ప్రత్యేక హోదా కోసం నినదించడం గొప్ప విషయమని, ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు ఏపీకీ ప్రత్యేక హోదాను కల్పించాలని కోరారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలతోపాటు పెట్టబడులు రాష్ట్రానికి వరదలా వస్తాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని, ఇందుకు విద్యార్థులు, యువత తమక సాకారం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షుడు గోపీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. -
యువోత్సాహం
ప్రత్యేక హోదా కావాల్సిందే.. – నినదించిన యువత, విద్యార్థి లోకం – జగన్ ప్రతీ మాటకూ మద్దతు – కిక్కిరిసిన వేదిక – మద్దతు పలికిన మేధావులు ప్రత్యేక నినాదం హోరెత్తింది. ఉద్యమ శంఖారావం నలు దిశలా ప్రతిధ్వనించింది. యువతరం కదంతొక్కింది. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడని ఉవ్వెత్తున ఎగిసింది. పోరుబాటలో మేము సైతం అడుగులో అడుగు వేస్తామని.. కెరటాలై గర్జిస్తామని యువతీ యువకులు ప్రతిన బూనారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కో మాట.. ఉద్యమ తూటా కాగా, హోదా సాధనే లక్ష్యంగా ప్రభుత్వంపై పోరుబావుటా ఎగురవేశారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మేధావులు, యువత, విద్యార్థిలోకం డిమాండ్ చేసింది. కందనవోలుకు పూర్వవైభవం రావాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ముక్తకంఠంతో నినదించారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు తరలివస్తాయని.. తద్వారా తమకు ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో మేధావులతో పాటు యువత, విద్యార్థిలోకం కదం తొక్కింది. ప్రత్యేక హోదా సాధనలో వెనక్కి తగ్గేదిలేదని నినదించారు. కార్యక్రమాల్లో పాల్గొంటే పీడీ కేసులు పెడతామన్న ప్రభుత్వ పెద్దల మాటలను ఏమాత్రం లెక్కచేయక కదంతొక్కారు. హైదరాబాద్ నుంచి ఉదయమే కర్నూలుకు బయలుదేరిన వైఎస్ జగన్... పంచలింగాల చెక్‌పోస్టుకు 10 గంటల 20 నిమిషాలకు చేరుకున్నారు. ముందుగానే అక్కడికి చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు భారీఎత్తున స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించారు. అనంతరం సుమారు 50 నిమిషాల పాటు సాగిన జగన్ ప్రసంగానికి సభికుల నుంచి కేరింతలతో మద్దతు లభించింది. కాబోయే సీఎం జగనన్నే.. వైఎస్ జగన్ తన మొత్తం ప్రసంగంలో ప్రత్యేక హోదా ఆవశ్యకతను స్పష్టం చేశారు. హోదా వస్తే కలిగే లాభాలను వివరించే ప్రయత్నం చేశారు. హోదాతో ప్రతి జిల్లా హైదరాబాద్‌గా మారి.. ఉపాధి అవకాశాలు వస్తాయని, గతంలో జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత నేతల తీరు మారిన వైనాన్ని నిశితంగా ఎండగట్టారు. పార్లమెంట్‌నే సాక్షిగా చేసి ఇచ్చిన హామీలకే విలువ లేదని.. అందుకే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటన చేసిన సందర్భంగా అందరూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక హోదా కావాల్సిందేనని నినదించారు. కాబోయే ముఖ్యమంత్రి జగనన్నేనని ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా సాధనలో చివరి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాడతామని యువత, విద్యార్థులు ప్రకటించారు. జగన్ ప్రతీ అడుగులో కలిసి నడుస్తామని భరోసానిచ్చారు. పీడీ యాక్ట్‌పై పిడికిలి ప్రత్యేక హోదా సాధనలో పాల్గొనే విద్యార్థులపై పీడీ యాక్ట్‌లు పెట్టాలన్న ప్రభుత్వ పెద్దల మాటలపై విద్యార్థులు మండిపడ్డారు. కేసులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనలో ప్రాణాలైనా అర్పిస్తామని స్పష్టం చేశారు. సభలకు వెళ్లవద్దన్న సీఎం మాటలను ఏ మాత్రం లెక్కచేయక సభకు భారీగా విద్యార్థులు హాజరయ్యారు. జగన్ సభలకు పిల్లలను పంపవద్దని.. వారు చెడిపోతున్నారని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలేమో నడిరోడ్డుమీద తహసీల్దార్‌ను కొట్టవచ్చునా అని ఎంబీఏ పూర్తి చేసిన సుధ మండిపడ్డారు. ఆయన కొడుకేమో విదేశాల్లో మద్యం తాగుతూ అమ్మాయిలతో అసభ్యంగా తిరగొచ్చా? ఆయన మంత్రుల పిల్లలేమో నడిరోడ్డు మీద అమ్మాయిలను ఎడిపించి.. కుక్క అడ్డు వచ్చిందంటారని ఎద్దేవా చేశారు. మా ఓట్లు వేయించుకుని గెలిచిన ఆ నాయకులకు కనీసం కుక్కకు ఉన్న విశ్వాసం కూడా లేదంటూ విద్యార్థిని సుధ మాటలకు సభలోని విద్యార్థులు కేరింతలు కొట్టారు. మొత్తం మీద యువభేరి ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాంతో పాటు పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జీలు కాటసాని రామిరెడ్డి, చెరుకులపాడు నారాయణ రెడ్డి, హఫీజ్‌ఖాన్, రాజగోపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రామలింగారెడ్డి, బుడ్డా శేషారెడ్ది, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, మురళీ, పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం.. యువజన, విద్యార్థి విభాగాల రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, సలాంబాబు, జిల్లా అధ్యక్షులు రాజా విష్ణువర్దన్ రెడ్డి, అనిల్‌కుమార్, పార్టీ నేతలు వెంకట కృష్ణా రెడ్డి, సురేందర్ రెడ్డి, నరసింహులు యాదవ్, రాకేష్ రెడ్డి, నాగరాజు యాదవ్, కర్నాటి పుల్లారెడ్డి, ప్రదీప్ రెడ్డి, శ్రీరంగడు, విజయలక్ష్మి, సలోమి, పోచా శీలారెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, భరత్‌కుమార్ రెడ్డి, చంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, కాంతారెడ్డి, సత్యంరెడ్డి, డీకే రాజశేఖర్, రఘు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
'ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాటకం'
-
'ప్రత్యేక హోదా సంజీవిని కాదు అక్షయ పాత్ర'
-
నేడు కర్నూలులో వైఎస్ జగన్ యువభేరి
-
కర్నూలులో వైఎస్ జగన్ యువభేరి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం యువభేరి కార్యక్రమం నిర్వహించనున్నారు. కర్నూలు శివారు గుత్తి జాతీయ రహదారిలోని వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. 10వేల మంది సామర్థ్యం కలిగిన కన్వెన్షన్ హాలులో ఇందుకోసం సుమారు ప్రత్యేక వేదిక ఇప్పటికే రూపుదిద్దుకుంది. సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డితో కలిసి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ సభాస్థలి, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ యువభేరిలో పాల్గొనేందుకు యువత పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నందున విద్యార్థులు, యువకులతో పాటు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఏర్పాట్ల పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కార్యదర్శి పోచం శీలారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, ఆ విభాగం నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
యువభేరి
ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ జగన్ పోరు - కర్నూలు వేదికగా యువతకు దిశా నిర్దేశం – నేటి ఉదయం 10 గంటలకు వీజేఆర్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం - హోదా ఆకాంక్షను చాటాలని వైఎస్ఆర్సీపీ నేతల పిలుపు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నేడు(25వ తేదీ) కర్నూలులో యువభేరి జరగనుంది. నేటి ఉదయం 10 గంటలకు గుత్తిరోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అంతేకాకుండా వారితో మాటామంతీ నిర్వహిస్తారని పార్టీ నేతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉదయమే బయలుదేరి పంచలింగాల చెక్‌పోస్టు వద్దకు 9 గంటలకు చేరుకుంటారని పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. అక్కడి నుంచి నేరుగా వేదికకు చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. హోదాతోనే జిల్లాకు పరిశ్రమలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే మొత్తంగా రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి జిల్లాలో భారీ భూ బ్యాంకుతో పాటు నీటి వసతి కూడా ఉండటంతో పరిశ్రమలకు జిల్లా కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఉన్న సహజ వనరులన్నీ పూర్తిగా వినియోగంలోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంటున్నారు. పత్తి సాగు ఎక్కువగా ఉన్నందున టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలంగా ఉంటుందని.. సున్నపురాయి గనుల అపార నిల్వల నేపథ్యంలో సిమెంటు పరిశ్రమలు మరిన్ని క్యూ కడతాయని పరిశ్రమలశాఖ అధికారులే అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్, అటు బెంగళూరుతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతికి కర్నూలు జిల్లా మధ్యలో ఉండటం వల్ల అభివృద్ధికి కేంద్రంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశ్రమలశాఖ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. తద్వారా జిల్లాలో ఉపాధి లేక వలసలు లేకుండా పోతాయని.. ప్రధానంగా చదువుకున్న యువత ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు(మేథోవలస) వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని వాదిస్తున్నారు. ఊరిస్తున్నా....! జిల్లాలో భారీ భూబ్యాంకు నేపథ్యంలో అనేక పరిశ్రమలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చాయి. అయితే, ఇప్పటివరకు పెద్దగా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. వస్తామని ఊరిస్తూనే ఉన్నప్పటికీ పెద్దగా పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా వస్తే జిల్లాకు పెట్టుబడుల వరద పారుతుందని నిపుణులు అంటున్నారు. యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సిమెంటు కంపెనీలతో పాటు డీఆర్డీవో, ఎన్ఎఫ్సీతో పాటు ఇతర ప్రైవేటు సంస్థలు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా తమ యూనిట్లను నెలకొల్పుతాయని అధికారవర్గాలూ పేర్కొంటున్నాయి. తద్వారా కేవలం కర్నూలు జిల్లాలోనే లక్ష కోట్లకు పైబడి పెట్టుబడులు తరలివచ్చి.. 4–5 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఈ వర్గాల ప్రాథమిక అంచనా. అంతేకాకుండా 65 రకాల సబ్సిడీలు రైతాంగానికి కూడా అందుతాయని ఈ వర్గాలు తెలిపాయి. మొత్తంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా కీలకమనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. -
రేపు కర్నూలుకు వైఎస్ జగన్ రాక
– యువభేరికి ముమ్మర ఏర్పాట్లు కర్నూలు: ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం కర్నూలు రానున్నారు. కర్నూలు నగర శివార్లలోని వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే యువభేరి కార్యక్రమానికి హాజరుకానున్నారు. విద్యార్థులు, యువకులతో ముఖాముఖి నిర్వహించి హోదా ఆవక్యతను తెలియజెప్పనున్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టనున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు యువభేరి ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కన్వెక్షన్ హాల్లో వేదిక నిర్మాణం సాగుతోంది. హాజరయ్యే ప్రజలు, అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మైకుల ద్వారా కార్యక్రమ వివరాలను ప్రకటిస్తున్నారు. కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో యువభేరికి సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. జిల్లా నలుమూలల నుంచి యువకులు, విద్యార్థులు భారీగా తరలివచ్చి..కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. -
యువభేరిని విజయవంతం చేద్దాం
-వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న యువభేరి కార్యక్రమాన్ని విజయవంత చేద్దామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు తెలుగు అనిల్‌కుమార్ అధ్యక్షతన వలంటీర్ల సమావేశం నిర్వమించారు. గౌరు వెంకటరెడ్డితో పాటు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి. రాజా విష్ణు వర్ధన్రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.యువభేరిలో వలంటీర్లు నిర్వర్తించాల్సిన విధుల గురించి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు మారుపేరనేది ప్రతి వలంటీర్ గుర్తించుకోవాలన్నారు. కేటాయించిన చోటనే విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకంతోనే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ అధినేత వైఎస్జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక ఉద్యమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారన్నారు. యువకులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని యువభేరిని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రఘు, నాయకులు సంజు, షాలి, భానుప్రకాశ్, వినోద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
హోదాను తాకట్టు పెట్టిన బాబు
- ప్యాకేజి పేరిట మోసం - ప్రత్యేక హోదాతోనే భవిష్యత్ - 25 కర్నూలులో యువభేరి - వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు(ఓల్డ్‌సిటీ): స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. హోదా వస్తే పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుందన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. హోదా ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై యువకులు, విద్యార్థులు.. ప్రజలను చైతన్య వంతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే కర్నూలులో ఈనెల 25న గుత్తి జాతీయ రహదారిలో వీజేఆర్ కన్వెషన్ సెంటర్లో యువభేరి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విద్యార్థులు, యువకులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పార్టీలకు అతీతంగా పాల్గొని యువభేరిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువభేరి ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా పరిశీలకుడు అనంతవెంకట్రామిరెడ్డి, అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, ఎమ్మెల్యేలు ఐజయ్య, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, నియోజకవర్గ ఇన్చార్జీలు హఫీజ్ ఖాన్, చెరుకులపాడు నారాయణరెడ్డి, కాటసాని రామిరెడ్డి, బుడ్డా శేషారెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్, దొడ్డిపాడు మాబ్బాష తదితరులు పాల్గొన్నారు. అదేం కోరిక నెల్లూరు జిల్లాలో పుట్టిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చిత్తూరు జిల్లాలో పుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..అమెరికాలో పుట్టింటే బాగుండునని కోరుకుంటూ ఇటీవల చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందని పీఏసీ ఛైర్మన్, డోన్ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దీన్నిబట్టి వారికి ఇక్కడి అభివృద్ధి గురించి చిత్తశుద్ధి లేదని తెలుస్తోందన్నారు. హోదాను విస్మరించి.. ప్యాకేజీతో పార్టీని పటిష్టం చేసుకునే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబుకు ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. హోదా అంశాన్ని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టాల్సిన అవసరమేలేదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని, ప్రత్యేక హోదా ప్రాధాన్యతను గ్రామగ్రామాన చాటాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ప్రత్యేక హోదా నినాదంతో మొదట్నుంచీ వైఎస్ఆర్సీపీ పోరాడుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానని, పీడీయాక్టు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించడం అప్రజాస్వామికమన్నారు. కర్నూలులో 25న జరిగే యువభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హోదా వస్తేనే విద్యార్థుల భవిష్యత్తు: సలాంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రానికి హోదా వస్తేనే విద్యార్థులు, యువకుల భవిష్యత్తు బాగు పడుతుందనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా హోదా తేలేకపోగా, ప్యాకేజీకి సీఎం చంద్రబాబు వెంపర్లాడుతుండటం మోసపూరితమన్నారు. హోదా సాధనలో విద్యార్థులదే కీలకపాత్ర అన్నారు. కర్నూలులో యువభేరిని విద్యార్థులు విజయవంతం చేయాలన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా యువభేరి పోస్టర్ విడుదల చేశారు. -
హోదా కోసం.. సింహనాదం
‘ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించడానికి ఆయన ఎవరు. రాష్ట్రం చంద్రబాబు నాయన సొత్తా లేక ఆయన అత్తగారి ఆస్తి అనుకున్నారా. ఐదు కోట్ల అంధ్రుల భవిష్యత్‌ను కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. వెంకయ్యనాయుడు ఐదు కాదు పదేళ్లు అన్నారు. పదిహేనేళ్లు హోదా కావాలన్న చంద్రబాబు మాట మార్చారు. అర్ధరాత్రి నిర్ణయాలను స్వాగతించడానికి బాబు ఎవరు’ అని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. ‘అధికారం కోసం సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిగిచిన వ్యక్తి.. ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడవడానికీ వెనుకాడలేదు’ అంటూ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను నిండా ముంచేసిన చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. ‘వెంకయ్యనాయుడు ప్లేట్ మార్చాడు. మేక మెడకు ఇలా వేలాడుతాయ్ కదా అదే ప్రత్యేక హోదా అని వెంకయ్య అంటాడు’ అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి తీరుపై ధ్వజమెత్తారు. ‘జైట్లీ ప్యాకేజీలో పేర్కొన్న పరిశ్రమల రాయితీలు శనగలు.. బెల్లాలకు సరిపోవు. మనం అడగడం మానేస్తే.. పోరాటం ఆపేస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా మన హక్కు. దాని కోసం పోరాటం చేద్దాం’ అంటూ యువతకు, విద్యార్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : వెల్లువలా తరలివచ్చిన విద్యార్థులతో ఏలూరు నగరం కిటకిటలాడింది. ప్రత్యేక హోదా నినాదాలతో మార్మోగింది. ఆటంకాలను అధిగమించి విద్యార్థి లోకం కదం తొక్కింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో తెలుగుదేశం, బీజేపీ ఆడుతున్న కపట నాటకాలపై యువతను చైతన్యపరిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఏలూరులో నిర్వహించిన యువభేరి కార్యక్రమం విజయవంతమైంది. వరుణుడు ఆటంకం కలిగిస్తాడని భావించినా చివరకు కరుణించాడు. వర్షం కురుస్తున్నా ఉదయం 9 గంటల నుంచే జిల్లా నలుమూలల నుంచి విద్యార్థి లోకం ఏలూరు తరలివచ్చింది. సీఆర్ రెడ్డి మహిళా కళాశాల సమీపంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లోని రెండు అంతస్తులు విద్యార్థులు, యువతతో కిక్కిరిసిపోయాయి. హాల్ బయట వేలాదిమంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఉండిపోయారు. వారంతా యువభేరి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్క్రీన్స్‌లో చూశారు. తమ భవిష్యత్‌ను కాపాడేందుకు పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. సంజీవని అన్నారు.. ప్లేటు ఫిరాయించారు విద్యార్థులను, నిరుద్యోగ యువతను ఉద్దేశంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సంజీవని అని ఆనాడు చెప్పిన నాయకులు ప్రస్తుతం సంజీవని కాదని ప్రస్తుతం మాట మారుస్తున్నాయని విమర్శించారు. తెలుగుదేశం, బీజేపీలు మేనిఫెస్టోల్లో ప్రత్యేక హోదా ఇస్తామని ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్లేటు ఫిరాయించాయని ధ్వజమెత్తారు. ‘ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతిస్తున్నారట. అర్ధరాత్రి నిర్ణయాలను స్వాగతించడానికి చంద్రబాబు ఎవరు. రాష్ట్రం చంద్రబాబు నాయన సొత్తా లేక ఆయన అత్తగారి ఆస్తి అనుకున్నారా’ అని వైఎస్ జగన్ నిలదీశారు. ఐదు కోట్ల అంధ్రుల భవిష్యత్‌ను కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు హోదా ఐదు కాదు పదేళ్లు అన్నారని, పదిహేనేళ్లు హోదా కావాలన్న చంద్రబాబు మాట మార్చారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిగిచిన చంద్రబాబు ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి వెనుకాడలేదని చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. ‘వెంకయ్యనాయుడు ప్లేట్ మార్చాడు. మేక మెడకు ఇలా వేలాడుతాయ్ కదా అదే ప్రత్యేక హోదా అని వెంకయ్య అంటాడు’ అంటూ ధ్వజమెత్తారు. జైట్లీ ప్యాకేజీలో పేర్కొన్న పరిశ్రమల రాయితీలు శనగలు.. బెల్లాలకు సరిపోవన్నారు. ‘మనం అడగడం మానేస్తే.. పోరాటం ఆపేస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా మన హక్కు. దాని కోసం పోరాటం చేద్దాం’ అంటూ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కదిలించిన విద్యార్థుల మాటలు ముఖాముఖిలో భాగంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విద్యార్థులు చెప్పిన మాటలు వైఎస్ జగన్‌ను కదలించాయి. బీ ఫార్మసీ విద్యార్థిని మౌనిక వైఎస్ జగన్‌తో మాట్లాడుతూ ‘అన్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో చాలా కండిషన్స్ పెడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఇలా కండిషన్స్ లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలన్నా’ అని విజ్ఞప్తి చేయగా.. ‘దివంగత నేత, ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు నిజంగా గొప్ప నాయకులు. ఆయన పథకాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ప్రధానమైంది. దానిని ఒక పద్ధతి ప్రకారం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. పేదవాళ్లు ఎవరైనా ఇంజినీరింగ్, డాక్టర్ చదివించేందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఫీజులు కట్టేందుకు పేదవారు అప్పులు చేసుకుని, ఇళ్లలో ఉన్నవి అమ్ముకుని చదువుకోవాల్సిన దుస్థితి దాపురించింది. నేను అధికారంలోకి వచ్చాక ఫీజు పథకాన్ని పూర్తిస్థాయిలో రీయింబర్స్ చేస్తాను. పేద పిల్లల్ని చదివించేందుకు అన్నగా.. ముఖ్యమంత్రి హోదాలో ప్రతి పిల్లాడికీ మెస్‌కు నెలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.24 వేలు ఇస్తాను. నేను ఎప్పుడైనా చనిపోతే నా ఫొటో నాన్న ఫొటో పక్కన ప్రతి ఇంట్లో పెట్టుకునే స్థాయిలో పథకాలు అమలు చేస్తాను’ అని వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ చంద్రబాబుకు, సింగపూర్‌కు లింకేంటని, ఈ నాయకుల మాటల్ని ఎలా నమ్మాలని, అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి మనకు అవసరమా అని, పరిశ్రమలు తెస్తానంటూ విదేశీ పర్యటనలు చేస్తున్న చంద్రబాబు రెండేళ్లలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారని, ఏ మేరకు పెట్టుబడులు ఆకర్షించారని ప్రశ్నించారు. రైతులను, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తున్న వాళ్లను జైలులో పెట్టే చట్టాలు లేవా అని ఓ విద్యార్థి అడిగితే.. హోదా అడుగుతుంటే తప్పుడు కేసులు పెడుతున్నారని మరో విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాధానం ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఎప్పటికైనా హోదా సాధిద్దాం విద్యార్థులను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రైతులను, డ్వాక్రా మహిళలను, ఉద్యోగాలు చేస్తున్న వారిని, ఉద్యోగాలు రాని వారిని, యువతను ప్రతి ఒక్కరినీ మోసం చేశారని వివరించారు. హోదా వస్తే రాయితీలు వస్తాయని, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రం ఇంపాజిబుల్ అనుకున్నదే వాళ్లు సాధించారు. మనం ప్రత్యేక హోదా సాధించలేమా. ఒక్కరోజు, ఒక సంవత్సరంలో కాకపోయినా ఏదో రోజు సాధించే తీరుతాం. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మనం ఓట్లు వేసి గెలిపిద్దాం. అలాగైనా వీళ్లకు బుద్ధి వస్తుంది’ అంటూ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. తొలుత వెల్లువలా తరలివచ్చిన విద్యార్థులు, యువతను చూసి జగన్మోహనరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడకు వచ్చిన ప్రతి చెల్లెమ్మకు, సోదరుడికి.. కింద హాలులో ఉన్నవారికి, బయట వేసిన టెంట్లలో ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. విద్యార్థులతో వైఎస్ జగన్ భేటీ కావడానికి ముందు జిల్లాకు చెందిన పలువురు విద్యావేత్తలు, మేధావులు ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రసంగించారు. డెంటల్ కాలేజీ హెచ్ఓడీ మహబూబ్ షేక్, ఏయూ ప్రొఫెసర్ సాంబిరెడ్డి, సీఆర్ఆర్ కాలేజీ రిటైర్ ప్రొఫెసర్ బి.పద్మవాణి, రిటైర్డ్ ప్రొఫెసర్, పాలిటెక్నికల్ ప్రిన్సిపల్ ఎం.సంపతరావు, డాక్టర్ ఎస్.కృష్ణ భగవాన్, ప్రముఖ న్యాయవాది బీవీ కృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్ అబ్రహం తదితరులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్ సీపీలో నూతనోత్సాహం యువభేరి కార్యక్రమంలో విద్యార్థులు, యువత నుంచి లభించిన స్పందన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నాయకత్వంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, విద్యార్థి, యువజన నేతలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు కృషి చేశారు. యువభేరి ముగిసిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఇంటికి వెళ్లి కొద్దిసేపు ఉన్నారు. తరలి వచ్చిన నాయకులు.. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఏలూరులో నిర్వహించిన యువభేరి కార్యక్రమం విజయవంతం కావడానికి పార్టీ జిల్లా నాయకులు విశేష కృషి చేశారు. నాయకులంతా యువభేరి కార్యక్రమానికి హాజరైనప్పటికీ.. విద్యార్థులు, యువత కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి వారిని మాత్రమే వేదికపై కూర్చోబెట్టారు. నాయకులంతా వేదిక దిగువన కూర్చున్నారు. కాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని జిల్లా నాయకులను సమన్వయం చేసుకుంటూ శ్రీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మేకా ప్రతాప అప్పారావు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, విద్యార్థి విభాగం నాయకుడు సలాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, సీఈసీ సభ్యుడు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ఘంటా మురళి, తానేటి వనిత, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, కొట్టు సత్యనారాయణ, తెల్లం బాలరాజు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాస్, దయాల నవీన్‌బాబు, ఎస్.రాజీవ్‌కృష్ణ, పార్టీ రాష్ట్ర నాయకులు తోట గోపి, గుణ్ణం నాగబాబు, కొయ్యే మోషేన్‌రాజు, మేరుగ నాగార్జున, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, చీర్ల రాధయ్య, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, నాయకులు దిరిశాల కృష్ణ శ్రీనివాస్, ఊదరగొండి చంద్రమౌళి, జక్కంపూడి రాజా, బొద్దాని శ్రీనివాస్, కారుమంచి రమేష్, డేవిడ్ లంకపల్లి, బాలిబోయిన నవహర్ష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఏలూరు యువభేరి పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 22న నిర్వహించనున్న యువభేరి కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈనెల 22న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శ్రీకన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున యువభేరి నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పార్టీ రాష్ట్ర నాయకులు పుత్తా ప్రతాపరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మేరుగ నాగార్జున పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మల్లాది సందీప్ కుమార్, బి.సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యువభేరిని విజయవంతం చేద్దాం
తణుకు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న ఏలూరులో నిర్వహించనున్న యువభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు. సోమవారం తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగం నాయకులతో భేటీ అయ్యారు. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రణాళికలు చేయాలన్నారు. మండల, జిల్లాస్థాయిల్లో విద్యార్థి సంఘాల నాయకులను సమీకరించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం ద్వారానే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు. గ్రామస్థాయిలో విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలను కోరారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లంకపల్లి డేవిడ్, పి.అఖిల్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కె.దినేష్‌రెడ్డి, డి.రవీంద్ర పాల్గొన్నారు. -
22న ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో యువభేరి జరగనున్నట్లు కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం శుక్రవారం వెల్లడించారు. యువభేరి ఏర్పాట్లపై నియోజకవర్గాల కన్వీనర్లతో ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, పార్టీ నేతలు ఆళ్ల నాని తదితరులు చర్చించారు. అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు ...బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టారన్నారు. కేంద్ర సాయంతో సంతృప్తి చెంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. -
యువభేరి సభలో వైఎస్ జగన్
-
యువభేరికి ప్రభుత్వం ఆటంకాలు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులో ఏర్పాటుచేసిన యువభేరి కార్యక్రమానికి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. యువభేరి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివస్తున్న విద్యార్థులను అధికారులు అడ్డుకుంటున్నారు. పలుచోట్లు ఆర్టీఏ అధికారులు విద్యార్థుల బస్సులను అడ్డుకున్నారు. బస్సులను వదలకపోతే ధర్నాకు దిగుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. -
రేపు నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ ఆధ్వర్యంలో యువభేరి జరగనున్నట్లు వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్‌లో యువభేరి ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు హాజరు కావాలని తలశిల రఘురాం పిలుపునిచ్చారు. -
4న నెల్లూరులో వైఎస్ జగన్ యువభేరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 4న నెల్లూరులో యువభేరి జరగనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు. యువభేరి ఏర్పాట్ల గురించి మంగళవారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. గురువారం ఉద యం 10 గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్‌లో యువభేరి ప్రారంభమవుతుందన్నారు. యువకులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
4న నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 4వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కస్తూరిదేవి గార్డెన్స్‌లో యువభేరి సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈనెల 1వ తేదీనే వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆ పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. -
1 నుంచి నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన
-
1 నుంచి నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన
1, 2 తేదీల్లో నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు.. 3న యువభేరి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 1 నుంచి 3 వరకూ నెల్లూరులో పర్యటిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్ యాదవ్‌తో కలసి బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1న, అలాగే 2వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నగరంలోని అనిల్ గార్డెన్స్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. 3వ తేదీన కస్తూరి దేవి గార్డెన్స్‌లో యువభేరి కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గాల సమీక్షకు పార్టీ ముఖ్య నేతలు మాత్రమే హాజరవుతారని, యువభేరికి విద్యార్థులు, ప్రజలు హాజరుకావాలని వారు కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ తొలినుంచీ పోరాటం చేస్తున్నార న్నారు. కాగా అనిల్ గార్డెన్స్‌లో ఏర్పాట్లను నేతలు పరిశీలించారు. అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిశీలకురాలిగా గిడ్డి ఈశ్వరి సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అరకు లోక్‌సభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ
అది చూసి ఓర్వలేకే టీడీపీ నాయకుల విమర్శలు వైఎస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులందరూ విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువభేరి ఎంతో విజయవంతమైందన్నారు. ఇందుకుగాను ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. జగన్మోహన్రెడ్డి ప్రజానేతగా ఎదిగారని, ఆయనను చూసి టీడీపీ నాయకులు భయపడుతున్నారని, అందువల్లే ఆయనపై ప్రతి నిమిషమూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడిగితే అది పెడదోవ పట్టించడమా అని ప్రశ్నించారు. తప్పులన్నీ టీడీపీ నాయకులే చేసి అది ప్రతిపక్షంపై నెట్టడం ఎంత వరకూ సమంజసమని అడిగారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కాల్‌మనీ వ్యవహారం తదితర అవి నీతి పనులన్నీ చేస్తున్న టీడీపీ నాయకుల కు జగన్‌ను విమర్శించే అర్హతే లేదన్నారు. జిల్లా పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్నాయుడు చిన్నపిల్లాడిలా వ్యవహరించడం తగదన్నారు. రజల సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్రకార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి మండవిల్లి రవి, పార్టీ యువ జన విభాగం నగర అధ్యక్షుడు కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌కు ఘన స్వాగతం
అభిమానులకు ఆప్యాయంగా పలకరింపు అంబేడ్కర్ విగ్రహానికి నివాళి తుని : శ్రీకాకుళం యువభేరి సదస్సుకు హాజరైన వైస్సార్ సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ వెళుతూ మంగళవారం సాయంత్రం పాయకరావుపేట తాండవ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగి నాయకులు, కార్యకర్తలను కలిశారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జగ్గంపేట ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, తుని, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పెండెం దొరబాబు, కురసాల కన్నబాబు, ముత్తా శశిధర్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అత్తిలి సీతారామస్వామి తదితరులు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. తుని, పాయకరావుపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
జగనన్నకు నీరాజనం
జననేతను చూసిన వారి కళ్లు ఆనందంతో మెరిశాయి. ఆయనతో కరచాలనం చేసిన వారి తనువులు నిలువెల్లా పులకించాయి. తమ బాధలు విని అండగా నిలుస్తానన్న జగనన్న భరోసా వారి మనసుల్లో ఆనందాన్ని నింపింది. శ్రీకాకుళంలో జరిగే యువభేరికి వెళ్తూన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి మార్గమధ్యలో జిల్లాలోని రహదారి పొడవునా జనం నీరాజనాలు పలికారు. నినాదం ఆగిపోలేదు... నలుదిక్కులా ప్రతిధ్వనించేలా కొత్త ఊపిరి పోసుకుంది. ఉద్యమం వీగిపోలేదు... ఊరుఊరునా ఉవ్వెత్తున ఎగసిపడడానికి జవసత్వాలు నింపుకుంది. ఉద్యోగాలు ఇవ్వలేని సర్కారు చేతకానితనాన్ని ప్రశ్నించేందుకు, హామీలు నిలబెట్టుకోలేని నేతల నిర్లక్ష్య వైఖరిని నిలదీసేందుకు యువత చేతికి సరైన ఆయుధం దొరికింది. శ్రీకాకుళంలోని టౌన్ హాల్లో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తలపెట్టిన ‘యువభేరి’ ప్రత్యేక హోదా పోరు ఎగసిపడుతోందన్న సంగతి తేల్చి చెప్పింది. యువత గుండెల్లో నివురు గప్పిన నిప్పులా ఉన్న ప్రత్యేక ఉద్యమ స్ఫూర్తిని నినాదాల రూపంలో గొంతు వరకు తెచ్చింది. వారి మనసులో గూడుకట్టుకుపోయిన కోపాన్ని గాల్లోకి లేచిన పిడికిళ్ల రూపంలో ప్రభుత్వానికి చూపించింది. -
'సింగపూర్‌లో బాబు ఇల్లు కట్టుకున్నాడట'
శ్రీకాకుళం: ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరును యువత ఎండగట్టింది. శ్రీకాకుళం టౌన్ హాల్లో మంగళవారం యువభేరీ సదస్సులో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విద్యార్థులు.. చంద్రబాబు ప్రభుత్వం పనితీరును, మోసపూరిత వాగ్దానాలపై గళమెత్తారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిచ్చారు. చంద్రబాబు సర్కార్‌ను విద్యార్థులే బంగాళాఖాతలో కలుపుతారని వైఎస్ జగన్ అన్నారు. యువభేరీలో విద్యార్థుల ప్రశ్నలకు జగన్ సమాధానాలు... యోగి, విద్యార్థి: బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మరచిపోయారు. ప్రత్యేక హోదా విషయాన్ని కూడా మరచిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పులపాలు చేసి చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లిపోరని గ్యారెంటీ ఏమిటి? జగన్: చంద్రబాబు సింగపూర్‌కు పోతాడని నాకూ సందేహంగా ఉంది. సింగపూర్‌లో బాబు ఇల్లు కట్టుకున్నాడని ఈ మధ్యే ఎవరో చెప్పారు. హిమలక్ష్మి, ఎంకామ్: చంద్రబాబు స్మార్ట్ సిటీలు అంటున్నారు. ఆ మాట పక్కన పెడితే కనీసం విద్యార్థుల్లో ఉన్న స్మార్ట్‌నెస్‌ను గుర్తించే ప్రయత్నం అయినా చేయాలి. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా కనీసం కాలేజీలు, యూనివర్సిటీల్లో సౌకర్యాల గురించి పట్టించుకోలేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య కావాలి. చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. మీరు అండగా ఉండి పోరాడాలి. జగన్: ఈ విషయమై చంద్రబాబును నిలదీద్దాం. అందరం కలసి పోరాడుతాం. దేవి, డిగ్రీ ఫైనలియర్: రుణమాఫీ చేస్తామని చెయ్యలేదు. దీనివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాం. డ్వాక్రా రుణం తీసుకున్న మా అమ్మ చాలా కష్టపడుతోంది. జగన్: నీ మాటలు ఇప్పటికైనా చంద్రబాబుకు అర్థమవుతాయి. జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నా. ఈ విషయంపై పోరాడుతాం. సౌజన్య, బీడీఎస్ విద్యార్థిని: మేకిన్ ఇండియా అంటున్నారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం ఎందుకు? ఏపీలో ఇంజనీర్లు లేరా? జగన్: మీరడిగిన ప్రశ్నలతో బాబుకు జ్ఞానోదయం కావాలి. మన దేశంలో ఎందరో గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. భూములను అడ్డగోలుగా కంపెనీలకు ఇస్తున్నారు. గాయత్రి: ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు. జగనన్నా.. ఇలాంటి వ్యక్తికి నైతికంగా పాలించే అర్హత ఉందా? జగన్: చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. లేకుంటే ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నిలదీస్తున్నారు. మీ మాట నిజమే తల్లీ. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి. చంద్రబాబుకు పాలించే నైతిక హక్కులేదు. ఆయన రాజీనామా చేయాలి. సాయి సందీప్, ఇంజనీరింగ్ విద్యార్థి: ఎన్నికల సమయంలో ఉద్యోగాలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లయినా నోటిఫికేషన్ రాలేదు. జగన్: రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా చంద్రబాబు ఆ ఖాళీలను భర్తీ చేయకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక హోదా అన్నది మరచిపోలేని విషయం. ప్రభుత్వాలపై గట్టిగా ఒత్తిడి తీసుకువస్తాం. -
'అందువల్లే.. ఏపీ లోటు రాష్ట్రంగా ఏర్పడింది'
శ్రీకాకుళం: రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్ వంటి విశ్వనగరంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలు, సినీ పరిశ్రమ, మౌలిక వసతులు కోల్పోయిందని ప్రొఫెసర్ రామకృష్ణారావు అన్నారు. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ వాటా 22 శాతం ఉండేదని, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పారు. దీంతో ఏపీ లోటు రాష్ట్రంగా, తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం శ్రీకాకుళం టౌన్హాల్లో ఏర్పాటు చేసిన యువభేరీలో రామకృష్ణారావు మాట్లాడారు. ఈ సభలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే అధికంగా నిధులు వస్తాయని, ఎన్నో లాభాలు కలుగుతాయని రామకృష్ణారావు చెప్పారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానాలు చేసిన పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని విమర్శించారు. బీజేపీ నేతలు ఇందుకు పలు కారణాలు చెబుతున్నారని అన్నారు. -
'నాకేం.. మా రాజశేఖరరెడ్డి ఉన్నాడన్నాడు'
-
కాకినాడలో వైఎస్ఆర్ సీపీ యువభేరి
-
21న కాకినాడలో వైఎస్ జగన్ యువభేరీ
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న కాకినాడలో యువభేరీ నిర్వహించనున్నారు. కాకినాడలో మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో యువభేరీ ఏర్పాట్లపై సమావేశం జరిపారు. వైఎస్ జగన్ యువభేరీ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన నాయకులను కోరారు. -
’ప్రత్యేకహోదా వచ్చిన వెంటనే ఏపీ నెం.1గా ఉంటుంది’
-
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం త్వరగా అభివృద్ధి
-
నేడు విశాఖలో యువభేరీ
-
విశాఖలో రేపు వైఎస్ జగన్ యువభేరి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. ఈ పోరాటంలో విద్యార్థులను భాగస్వామ్యం చేసి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మంగళవారం విశాఖపట్నంలో ఏయూ విద్యార్థులతో నిర్వహించే యువభేరి సదస్సులో వైఎస్ జగన్ పాల్గొంటారు. విద్యార్థులతో వైఎస్ జగన్ సమావేశమై చర్చిస్తారు. విశాఖపట్నం కళావాణి పోర్టు స్టేడియంలో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సదస్సుకు విద్యార్థులతో పాటు పలువురు విద్యావేత్తలు హాజరవుతారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి వైఎస్ జగన్ బయల్దేరి విశాఖ చేరుకుంటారు. ఇటీవల తిరుపతిలో జరిగిన యువభేరి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
'ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలో విద్యార్థులతో నిర్వహించిన యువభేరి సదస్సు విజయవంతమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో సదస్సు నిర్వహించడానికి అధికారులు అనుమతి నిరాకరించినా విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ప్రత్యేక హోదా అంశం ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవివేకంగా వ్యవహరించడం మానుకుని ఈ సదస్సు నుంచైనా గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. తిరుపతిలో జరిగిన యువభేరి సదస్సుకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సుకు విద్యావేత్తలతో పాటు వేలాదిమంది విద్యార్థులు తరలివచ్చారు. -
పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కులేదు
-
పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కులేదు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై విషయంపై కొందరు మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలో విద్యార్థుల యువభేరిలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో యువభేరి సదస్సు నిర్వహించాలని భావిస్తే.. నిబంధనల పేరిట చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుందని వైఎస్ జగన్ విమర్శించారు. ఎస్వీయూలో అనుమతి నిరాకరించినా.. సదస్సుకు తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులను అభినందించారు. యూనివర్సిటీల్లో మీటింగ్‌లు పెట్టరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించిందని, ఇదే యూనివర్సిటీల్లో టీడీపీ నాయకులు, చంద్రబాబు సమావేశాలు పెట్టలేదా అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నామని వైఎస్ జగన్ చెప్పారు. సభలో వైఎస్ జగన్ ఇంకా మాట్లాడారంటే.. కాంగ్రెస్‌తో కలసి చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విభజించారు రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రధాని హామీ ఇచ్చారు పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కు లేదు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ కూడా డిమాండ్ చేసింది అధికారంలోకి వచ్చాక బీజేపీ పెద్దలు హామీ నిలబెట్టుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా మాటే ఎత్తడం లేదు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు? హోదా ఇవ్వకుంటే కేంద్రంలో తమ మంత్రులు రాజీనామా చేస్తారని ఎందుకు చెప్పడం లేదు? అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కమిషన్ల రూపంలో లంచాలు తీసుకుంటున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్రం దగ్గర సాగిలపడ్డారు ప్రత్యేక హోదా గురించి రకరకాల అబద్ధాలు చెబుతున్నారు ప్రత్యేక హోదా కోసం మేం ఢిల్లీలో పోరాడాం చంద్రబాబు అందర్నీ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు.. ఏపీకి ఎందుకు ఇవ్వరు? హోదా ఇవ్వడం వల్లే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.. పరిశ్రమలు వస్తాయి ఈ విషయాలన్నీ తెలిసినా చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల వేలాది పరిశ్రమలు వచ్చాయి ప్రత్యేక హోదా గురించి ప్రతి విద్యార్థికి తెలియాలి ఏపీకి ప్రత్యేక హోదా మన హక్కు ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నాం మంగళగిరి, ఢిల్లీలో దీక్షలు చేశాం, రాష్ట్ర బంద్ చేపట్టాం హోదా కోసం 26 నుంచి నిరవధిక దీక్ష చేపడుతున్నా బీజేపీ, చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి గతంలో చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయి నాపై అక్రమ కేసులు పెట్టించారు వైఎస్ఆర్ బతికున్నంత వరకు మంచివాడన్నారు.. మరణించాక బురదజెల్లారు ప్రత్యేక హోదా కోసం అందరం కలసి పోరాడుతాం: వైఎస్ జగన్ -
'మోసగాడి పాలనలో మోసపోయాం'
తిరుపతి:తిరుపతి: ఓ మోసగాడి పాలనలో మోసపోయామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి ఓ యువ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రత్యేక హోదాపై యువభేరి సభలో తేజేస్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని విస్మరించి మోసం చేశారని ఆరోపించాడు. ఆయన మాటలు విని.. తనలాంటి విద్యార్థులు, తమ కుటుంబ సభ్యులు, రైతులు ఇలా రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని అన్నాడు. రైతుల రుణమాఫీలు చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని, యువకులకు ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని మోస పూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు విద్యార్థి లోకం విశ్రమించదని స్పష్టం చేశాడు. -
'మోసగాడి పాలనలో మోసపోయాం'
-
'ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి'
తిరుపతి: ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనం కోసం తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సులో వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు విద్యావేత్తలు, వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. -
తిరుపతిలో యువభేరి సదస్సు ఆరంభం
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనం కోసం తిరుపతిలో యువభేరి సదస్సు ఆరంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పీఎల్ఆర్ కన్వెన్షన్‌లో ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వేలాదిమంది విద్యార్థులు తరలివచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతు పలికారు. యువభేరి సదస్సుకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ రోజు ఉదయం విమానంలో రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్‌కు వెళ్లారు. -
కాసేపట్లో యువభేరి ప్రారంభం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రేణిగుంట చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. తిరుపతికి వెళ్లి అక్కడ జరిగే యువభేరి సదస్సులో పాల్గొంటారు. కాసేపట్లో పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో సదస్సు ప్రారంభంకానుంది. ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అంశాలపై అంశంపై విద్యార్థులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతు పలికారు. తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. -
యువభేరికి పోటెత్తిన విద్యార్థులు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతుగా నిలిచారు. తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సుకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు. వైఎస్.జగన్ కాసేపట్లో తిరుపతికి రానున్నారు. విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తనపల్లె క్రాస్ వద్ద ఉన్న పీఎల్ఆర్ గార్డెన్స్‌లో జరగనున్న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో పాల్గొంటారు. -
‘యువభేరి’ సైడ్‌లైట్స్..
అబిడ్స్/దత్తాత్రేయనగర్/కలెక్టరేట్, న్యూస్‌లైన్ :నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘నవభారత యువభేరి’ బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభకు గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార సారథి నరేంద్రమోడీ రావడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 12 గంటల నుంచే ప్రజలు తరలివచ్చారు. ఎల్బీ స్టేడియం జనంతో కిక్కిరిసిపోవడంతో ఆలస్యం గా వచ్చిన వేలాది మంది బయటే ఉండిపోయారు. పబ్లిక్‌గార్డెన్, ఎఫ్ఎంసీ, నిజాం కాలేజీ, గన్‌పార్కు ప్రాంతాలలో ఎల్సీడీలను ఏర్పాటు చేసి మోడీ ప్రసంగాన్ని ప్రసారం చేశారు. జనం రాకతో ఎల్బీ స్టేడియం నుంచి నాంపల్లి రోడ్డు, బషీర్‌బాగ్, లక్డీకాపూల్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. మహిళలు స్టేడియం వీఐపీ గేటు వద్దకు తరలిరావడంతో పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో వారు నినాదాలు చేశారు. వీఐపీ గేటు, ప్రెస్ గ్యాలరీలలోకి మీడియా ప్రతినిధులను అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. ప్రధాన వేదిక వద్ద స్వామి వివేకానంద, సర్దార్ వల్లాభాయ్ పటేల్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. నరేంద్రమోడీ తెలుగులో చేసిన ప్రారంభ ప్రసంగం సభలోనివారిని ఆకట్టుకుంది. మోడీ ప్రసంగించినప్పుడు వేదికపై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి తీగల నుంచి పొగ వెలువడింది. కొంత మంది కేకలు వేయడంతో వెంటనే పోలీసులు సరిచేశారు. అమెరికా, లండన్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యువత సభకు హాజరయ్యారు. వివేకానందుడి వేషధారణలో సభకు వచ్చిన బాలుడు ఆకట్టుకున్నాడు. సభకు ప్రవేశ రుసుంగా వసూలు చేసిన రూ.10 లక్షలను కిషన్‌రెడ్డి బీజేపీ కేంద్ర కోశాధికారికి అందజేశారు. హైదరాబాద్‌కు, గుజరాత్‌కు ఎంతో సంబంధం ఉందని, గుజరాత్‌గడ్డపై పుట్టిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి హైదరాబాద్‌తో కూడిన రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేశారని గుర్తు చేశారు. జెతైలంగాణ, జై సీమాంధ్ర అంటూ నరేంద్రమోడీ సభలో ఉన్న వారితో అనిపించారు. గుజరాత్లో కూడా లక్షలాది మంది తెలుగువారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని గుర్తు చేశారు. నవభారత్ నిర్మాణ్‌లో భాగంగా 100 సభలు నిర్వహించ తలపెట్టగా మొదటి సభ హైదరాబాద్‌లోనే నిర్వహించడం గర్వకారణమని మోడీ పేర్కొన్నారు.