యువభేరి విజయవంతం
– వైఎస్‌ఆర్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కర్నూలులోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన యువభేరి కార్యక్రమం విజయవంతం అయినట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరికి యువతీ యువకుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చిందన్నారు. దాదాపు 8 నుంచి 10 వేల మంది హాజరై ప్రత్యేక హోదా కోసం నినదించడం గొప్ప విషయమని, ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు ఏపీకీ ప్రత్యేక హోదాను కల్పించాలని కోరారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలతోపాటు పెట్టబడులు రాష్ట్రానికి వరదలా వస్తాయన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని, ఇందుకు విద్యార్థులు, యువత తమక సాకారం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షుడు గోపీనాథ్ యాదవ్ పాల్గొన్నారు.