
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన వైఎస్ జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పడానికి గుంటూరులో నిర్వహిస్తున్న ‘యువభేరి’ లో వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన, గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేపట్టిన ప్రాంగణంలోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడతారు.