సాక్షి, అనంతపురం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న 'యువభేరి' సదస్సులో పలువురు వక్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓట్ల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి, మాయలు చేసి ప్రత్యేక హోదా తెస్తామని వారి చెప్పి ఓట్లు వేయించుకొని అసెంబ్లీ సాక్షిగా ఐదుకోట్ల మంది తెలుగువారిని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో తామెవరం ప్రత్యేక హోదా కావాలని అనలేదని, నేడు అధికారంలో ఉన్న టీడీపీనే అడిగిందని, ఆ పేరుతోనే ఓట్లు వేయించుకుని మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేథావులు ఏమన్నారంటే..
'గతంలో తొమ్మిది జిల్లాల్లో యువభేరి విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మన అనంతపురంలో 10 వ యువభేరిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ పనిచేస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మనందరి తరుపున ధన్యవాదాలు. మనమంతా హాయిగా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ, ఒక్కొక్కరి తలమీద రూ.45 వేల అప్పుంది. లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఏపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పెట్టింది. రాయితీలు లేవు, పరిశ్రమలు లేవు, స్కాలర్ షిప్లు లేవు. వీటన్నింటి నుంచి బయటపడాలంటే మనకు ప్రత్యేక హోదా ఉండాల్సిందే'
-డా సి రామాంజనేయులు, పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీ
'ప్రత్యేక హోదా కోసం అలుపు లేకుండా పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. మనందరికి ప్రత్యేక హోదా అవసరం. ప్రత్యేక హోదాతో ఎన్నో రాయితీలు ఎక్సౌజ్ డ్యూటీ, ప్రత్యేక గ్రాంట్స్, ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధివంటివన్నీ వస్తాయి. సాఫ్ట్‌వేర్ సంస్థల డెవలప్‌కు కారణం పన్ను రాయితీలే. ప్రత్యేక హోదా వస్తే ఆరు నెలల్లో ఏడాదిలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ వస్తుంది.. ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా మన హక్కు మన సంజీవని. వైఎస్ జగన్‌తో కలిసి విద్యార్థులు పోరాడాలి. చంద్రబాబుకు ప్రత్యేక హోదా తెచ్చే ధైర్యం లేకుండా పోయింది. ఆఖరికి ప్యాకేజీ నిధులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు'
ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పిన నిధులు కూడా రావడం లేదు'
- ప్రొఫెసర్ రమణారెడ్డి, ఎస్కేయూ, అనంతపురం
'రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో మేం ఎవరం ప్రత్యేక హోదా కావాలని అడగలేదు. అడిగింది పాలక ప్రతిపక్ష పార్టీలు, ఈనాడు రాష్ట్రంలో ఉన్న పాలక పక్ష పెద్దలు(టీడీపీ ప్రభుత్వ నాయకులు). చంద్రబాబునాయుడు, ఆయన నేతలు ఊరూరా తిరిగి ప్రత్యేక హోదా పేరుతో ఓట్లు వేయించుకొని గెలిచి అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం కూడా ఆ తర్వాత ఐదుకోట్ల మంది ఆంధ్రులను మోసం చేశారు. అసెంబ్లీ పవిత్ర స్థలం. అక్కడ జిమ్మిక్కులు చేయొద్దు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా చేస్తోంది. ఆ నిద్ర మత్తు వదలాలంటే యువత మేల్కొనాల్సిందే. త్వరలోనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. తెలుగు యువత నేడు వైఎస్ జగన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆయన కచ్చితంగా యువత ఆశలను నెరవేరుస్తారు.
- ప్రొఫెసర్ సదాశివారెడ్డి
ప్రత్యేక హోదాతో చాలా ఉపయోగాలున్నాయి. యువత ముందుకు రావాలి. పోరాడంది సమస్య తీరదు. యువత మేల్కొని ప్రత్యేక హోదాకోసం పోరాడి. మిమ్మల్ని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు. అనంతపురంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్న, ఏపీ ప్రజలకు మేలు జరగాలన్న ప్రత్యేక హోదా కావాల్సిందే.
- సోమశేఖర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment