
ఏలూరు యువభేరి పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 22న నిర్వహించనున్న యువభేరి కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు.
ఈనెల 22న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శ్రీకన్వెన్షన్ హాల్‌లో పెద్ద ఎత్తున యువభేరి నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పార్టీ రాష్ట్ర నాయకులు పుత్తా ప్రతాపరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మేరుగ నాగార్జున పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఏపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మల్లాది సందీప్ కుమార్, బి.సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.