ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.
తిరుపతి: ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధనం కోసం తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సులో వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు విద్యావేత్తలు, వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.