tirupathi tour
-
పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కులేదు
-
పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కులేదు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై విషయంపై కొందరు మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలో విద్యార్థుల యువభేరిలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో యువభేరి సదస్సు నిర్వహించాలని భావిస్తే.. నిబంధనల పేరిట చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుందని వైఎస్ జగన్ విమర్శించారు. ఎస్వీయూలో అనుమతి నిరాకరించినా.. సదస్సుకు తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులను అభినందించారు. యూనివర్సిటీల్లో మీటింగ్‌లు పెట్టరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించిందని, ఇదే యూనివర్సిటీల్లో టీడీపీ నాయకులు, చంద్రబాబు సమావేశాలు పెట్టలేదా అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నామని వైఎస్ జగన్ చెప్పారు. సభలో వైఎస్ జగన్ ఇంకా మాట్లాడారంటే.. కాంగ్రెస్‌తో కలసి చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విభజించారు రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రధాని హామీ ఇచ్చారు పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కు లేదు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ కూడా డిమాండ్ చేసింది అధికారంలోకి వచ్చాక బీజేపీ పెద్దలు హామీ నిలబెట్టుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా మాటే ఎత్తడం లేదు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు? హోదా ఇవ్వకుంటే కేంద్రంలో తమ మంత్రులు రాజీనామా చేస్తారని ఎందుకు చెప్పడం లేదు? అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కమిషన్ల రూపంలో లంచాలు తీసుకుంటున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్రం దగ్గర సాగిలపడ్డారు ప్రత్యేక హోదా గురించి రకరకాల అబద్ధాలు చెబుతున్నారు ప్రత్యేక హోదా కోసం మేం ఢిల్లీలో పోరాడాం చంద్రబాబు అందర్నీ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు.. ఏపీకి ఎందుకు ఇవ్వరు? హోదా ఇవ్వడం వల్లే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.. పరిశ్రమలు వస్తాయి ఈ విషయాలన్నీ తెలిసినా చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల వేలాది పరిశ్రమలు వచ్చాయి ప్రత్యేక హోదా గురించి ప్రతి విద్యార్థికి తెలియాలి ఏపీకి ప్రత్యేక హోదా మన హక్కు ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నాం మంగళగిరి, ఢిల్లీలో దీక్షలు చేశాం, రాష్ట్ర బంద్ చేపట్టాం హోదా కోసం 26 నుంచి నిరవధిక దీక్ష చేపడుతున్నా బీజేపీ, చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి గతంలో చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయి నాపై అక్రమ కేసులు పెట్టించారు వైఎస్ఆర్ బతికున్నంత వరకు మంచివాడన్నారు.. మరణించాక బురదజెల్లారు ప్రత్యేక హోదా కోసం అందరం కలసి పోరాడుతాం: వైఎస్ జగన్ -
'మోసగాడి పాలనలో మోసపోయాం'
తిరుపతి:తిరుపతి: ఓ మోసగాడి పాలనలో మోసపోయామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి ఓ యువ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రత్యేక హోదాపై యువభేరి సభలో తేజేస్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని విస్మరించి మోసం చేశారని ఆరోపించాడు. ఆయన మాటలు విని.. తనలాంటి విద్యార్థులు, తమ కుటుంబ సభ్యులు, రైతులు ఇలా రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని అన్నాడు. రైతుల రుణమాఫీలు చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని, యువకులకు ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని మోస పూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు విద్యార్థి లోకం విశ్రమించదని స్పష్టం చేశాడు. -
'మోసగాడి పాలనలో మోసపోయాం'
-
'ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి'
తిరుపతి: ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనం కోసం తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సులో వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు విద్యావేత్తలు, వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. -
తిరుపతిలో యువభేరి సదస్సు ఆరంభం
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనం కోసం తిరుపతిలో యువభేరి సదస్సు ఆరంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పీఎల్ఆర్ కన్వెన్షన్‌లో ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వేలాదిమంది విద్యార్థులు తరలివచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతు పలికారు. యువభేరి సదస్సుకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ రోజు ఉదయం విమానంలో రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్‌కు వెళ్లారు. -
కాసేపట్లో యువభేరి ప్రారంభం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రేణిగుంట చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. తిరుపతికి వెళ్లి అక్కడ జరిగే యువభేరి సదస్సులో పాల్గొంటారు. కాసేపట్లో పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో సదస్సు ప్రారంభంకానుంది. ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అంశాలపై అంశంపై విద్యార్థులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతు పలికారు. తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. -
యువభేరికి పోటెత్తిన విద్యార్థులు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతుగా నిలిచారు. తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సుకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు. వైఎస్.జగన్ కాసేపట్లో తిరుపతికి రానున్నారు. విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తనపల్లె క్రాస్ వద్ద ఉన్న పీఎల్ఆర్ గార్డెన్స్‌లో జరగనున్న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో పాల్గొంటారు. -
కాసేపట్లో తిరుపతికి వెళ్లనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో తిరుపతికి వెళ్లనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ సాగిస్తున్న సమరభేరిలో భాగంగా విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అనే అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తనపల్లె క్రాస్ వద్ద ఉన్న పీఎల్ఆర్ గార్డెన్స్‌లో జరగనున్న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. వైఎస్.జగన్ ఈ రోజు ఉదయం రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో విద్యార్థులు నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో పాల్గొంటారు.