'మోసగాడి పాలనలో మోసపోయాం' | we are all cheat by cm chandrababu: tejesh | Sakshi
Sakshi News home page

'మోసగాడి పాలనలో మోసపోయాం'

Published Tue, Sep 15 2015 12:46 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

we are all cheat by cm chandrababu: tejesh

తిరుపతి:తిరుపతి: ఓ మోసగాడి పాలనలో మోసపోయామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి ఓ యువ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రత్యేక హోదాపై యువభేరి సభలో తేజేస్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని విస్మరించి మోసం చేశారని ఆరోపించాడు.

ఆయన మాటలు విని.. తనలాంటి విద్యార్థులు, తమ కుటుంబ సభ్యులు, రైతులు ఇలా రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని అన్నాడు. రైతుల రుణమాఫీలు చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని, యువకులకు ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని మోస పూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు విద్యార్థి లోకం విశ్రమించదని స్పష్టం చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement