వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట చేరుకున్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ జగన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. తిరుపతికి వెళ్లి అక్కడ జరిగే యువభేరి సదస్సులో పాల్గొంటారు. కాసేపట్లో పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో సదస్సు ప్రారంభంకానుంది. ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అంశాలపై అంశంపై విద్యార్థులతో చర్చించనున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతు పలికారు. తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు.