పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కులేదు | ys jagan demands special status to andhra pradesh | Sakshi
Sakshi News home page

పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కులేదు

Published Tue, Sep 15 2015 12:51 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కులేదు - Sakshi

పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కులేదు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై విషయంపై కొందరు మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలో విద్యార్థుల యువభేరిలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఎస్వీ యూనివర్సిటీలో యువభేరి సదస్సు నిర్వహించాలని భావిస్తే.. నిబంధనల పేరిట చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుందని వైఎస్ జగన్ విమర్శించారు. ఎస్వీయూలో అనుమతి నిరాకరించినా..  సదస్సుకు తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులను అభినందించారు. యూనివర్సిటీల్లో మీటింగ్లు పెట్టరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించిందని, ఇదే యూనివర్సిటీల్లో టీడీపీ నాయకులు, చంద్రబాబు సమావేశాలు పెట్టలేదా అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నామని వైఎస్ జగన్ చెప్పారు. సభలో వైఎస్ జగన్ ఇంకా మాట్లాడారంటే..

  • కాంగ్రెస్తో కలసి చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టారు
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విభజించారు
  • రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రధాని హామీ ఇచ్చారు
  • పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కు లేదు
  • ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ కూడా డిమాండ్ చేసింది
  • అధికారంలోకి వచ్చాక బీజేపీ పెద్దలు హామీ నిలబెట్టుకోలేదు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా మాటే ఎత్తడం లేదు
  • ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు?
  • హోదా ఇవ్వకుంటే కేంద్రంలో తమ మంత్రులు రాజీనామా చేస్తారని ఎందుకు చెప్పడం లేదు?
  • అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కమిషన్ల రూపంలో లంచాలు తీసుకుంటున్నారు
  • తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు
  • కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్రం దగ్గర సాగిలపడ్డారు
  • ప్రత్యేక హోదా గురించి రకరకాల అబద్ధాలు చెబుతున్నారు
  • ప్రత్యేక హోదా కోసం మేం ఢిల్లీలో పోరాడాం
  • చంద్రబాబు అందర్నీ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు
  • గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు.. ఏపీకి ఎందుకు ఇవ్వరు?
  • హోదా ఇవ్వడం వల్లే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.. పరిశ్రమలు వస్తాయి
  • ఈ విషయాలన్నీ తెలిసినా చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు
  • హిమాచల్ ప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల వేలాది పరిశ్రమలు వచ్చాయి
  • ప్రత్యేక హోదా గురించి ప్రతి విద్యార్థికి తెలియాలి
  • ఏపీకి ప్రత్యేక హోదా మన హక్కు
  • ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నాం
  • మంగళగిరి, ఢిల్లీలో దీక్షలు చేశాం, రాష్ట్ర బంద్ చేపట్టాం
  • హోదా కోసం 26 నుంచి నిరవధిక దీక్ష చేపడుతున్నా
  • బీజేపీ, చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి
  • గతంలో చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కయి నాపై అక్రమ కేసులు పెట్టించారు
  • వైఎస్ఆర్ బతికున్నంత వరకు మంచివాడన్నారు.. మరణించాక బురదజెల్లారు
  • ప్రత్యేక హోదా కోసం అందరం కలసి పోరాడుతాం: వైఎస్ జగన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement