
తిరుపతిలో యువభేరి సదస్సు ఆరంభం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి చేరుకున్నారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనం కోసం తిరుపతిలో యువభేరి సదస్సు ఆరంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పీఎల్‌ఆర్ కన్వెన్షన్లో ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వేలాదిమంది విద్యార్థులు తరలివచ్చారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతు పలికారు. యువభేరి సదస్సుకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ రోజు ఉదయం విమానంలో రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్కు వెళ్లారు.