
యువభేరికి పోటెత్తిన విద్యార్థులు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతుగా నిలిచారు. తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సుకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు.
వైఎస్.జగన్ కాసేపట్లో తిరుపతికి రానున్నారు. విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. ప్రత్యేక హోదా-ఉద్యోగ అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తనపల్లె క్రాస్ వద్ద ఉన్న పీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో జరగనున్న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో పాల్గొంటారు.