16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి | ys jaganmohanreddy Yuvabheri in guntur over ap special status | Sakshi
Sakshi News home page

16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి

Published Sun, Feb 12 2017 4:16 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి - Sakshi

16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి

గుంటూరు:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్‌ఆర్సీపీ నేతలు ఆదివారం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16న గుంటూరులో పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువభేరి ద్వారా చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తామని నేతలు మర్రి రాజశేఖర్‌, లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేసిన నల్లపాడులోనే యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్‌ఆర్సీపీ నేతలు వెల్లడించారు. యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యువభేరిని విజయవంతం చేయాలని మర్రి రాజశేఖర్‌, లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement