
19న విజయనగరంలో యువభేరి
హాజరు కానున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి: కృష్ణదాస్
విజయనగరం మున్సిపాలిటీ: ప్రత్యేక హోదాపై విద్యార్థులు, యువత, మేధావులను చైతన్యపరిచే దిశగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా యువభేరి పేరిట సదస్సులు నిర్వహిస్తున్నారని విజయనగరం జిల్లా ఇన్‌చార్జి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన విజయనగరం పట్టణంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో యువభేరి సదస్సు జరుగుతుందని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. కృష్ణదాస్ గురువారం జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నేడు నరసరావుపేటకు వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం నాలుగ్గంటలకు ఆయన జిల్లాలోని నరసరావుపేటకు చేరుకుంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు కాసు మహేశ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగసభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.