
16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్‌ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16న గుంటూరులో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువభేరి ద్వారా చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తామని నేతలు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కోనా రఘుపతి శనివారం వెల్లడించారు.