విశాఖలో రేపు వైఎస్ జగన్ యువభేరి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. ఈ పోరాటంలో విద్యార్థులను భాగస్వామ్యం చేసి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మంగళవారం విశాఖపట్నంలో ఏయూ విద్యార్థులతో నిర్వహించే యువభేరి సదస్సులో వైఎస్ జగన్ పాల్గొంటారు. విద్యార్థులతో వైఎస్ జగన్ సమావేశమై చర్చిస్తారు. విశాఖపట్నం కళావాణి పోర్టు స్టేడియంలో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సదస్సుకు విద్యార్థులతో పాటు పలువురు విద్యావేత్తలు హాజరవుతారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి వైఎస్ జగన్ బయల్దేరి విశాఖ చేరుకుంటారు.
ఇటీవల తిరుపతిలో జరిగిన యువభేరి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.