
16న గుంటూరులో యువభేరి
వేదిక త్వరలో వెల్లడిస్తామన్న వైఎస్సార్‌సీపీ నేతలు
పట్నంబజారు (గుంటూరు): ఈ నెల 16వ తేదీన గుంటూరు నగరంలో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం రాజశేఖర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
యువభేరి జరిగే ప్రదేశం, సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని నేతలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని యువభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత పెద్దఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.